ఊ!

స్వప్నాల్లోని లోకాల పైకి
కొత్త రంగులు చిమ్మి
హద్దుల్లేని దేశాలని
కనుగొంటున్న నావికులెవ్వరు? 

కలల తీరాలమీద
కదలాడుతున్న రూపాలకి
జ్ఞాపకాలనుంచి
ఆనవాళ్ళిస్తున్నది ఎవరు?

మనోరోదసిలో
సూర్యుడికి వెలుతురు తాపమని
చంద్రుడికి సాంబ్రాణి వేయమని
పురమాయిస్తున్నది ఎవరు?

నిద్రాలోకాల సంగీతంలో
ఎన్ని స్వరాలో
ఎవరికైనా తెలుసా ఇక్కడ?

అంతర్ముఖమై
అద్దమే కనపడితే
మోము నిండా
విస్మయమా వైరాగ్యమా?