నిదురపొత్తిళ్ళలో
కనురెప్పల కింద
గుచ్చుకుంటున్న కలలు
కలవరపు ముద్రలన్నీ
కట్టగట్టుకుని
క్రూరమృగాలై కదలాడుతూ
లోతుల్లోని కలతలన్నీ
విచ్చుకున్న ఉలికిపాటు
పదునైన దృశ్యాలు
పాముల్లా పడగవిప్పి
బుసకొడుతున్న గగుర్పాటు
వికృత శబ్దాలకు
గుండెనదిలో పెరుగుతున్న
భయపు నీటిమట్టం
పీడకలల రాయి కింద
మనసు కాగితం
హోరున వీస్తున్న గాలులకు
వణికిపోతూ
గాఢంగా ఇంకిన భయాలన్నీ
కుబుసం విడిచి
దుస్స్వప్నాలై దాడి చేస్తూ
కదలని దేహానికి
ముచ్చెమటలు పోస్తూ
గిలగిలా కొట్టుకుంటూ
ఎగిరిపోతున్న ఊపిరిపిట్ట
కాసేపు గుండెను
గుప్పెట్లో నలిపేస్తూ