తల నిండుగా చీకటి – శిరోజాల మీద నుంచి
చినుకుల వలే
ఒళ్ళంతా రాలే
చిక్కటి చీకటి-తల ఎత్తి చూస్తే
ఏ కనులలోనూ కాంతి కనిపించని
చీకటి-నిన్ను నువ్వే హత్తుకుని
భయంతో
ముడుచుకుని పడుకునే చీకటిలేని బాహువుల
బావురుమనే చీకటి
నీ అంత ఎత్తూ
పొడవూ ఉండే
చీకటినీ వాసన వేసే చీకటి
నీ ఒంటరితనపు
మేలి ముసుగు కప్పుకుని
నీ ముందు
కూర్చున్న చీకటి
చిన్న చీకటికడుపంతా తరుక్కుపోయే చీకటి
సమాధి వంటి చీకటిఒక మనిషి లేని చీకటి
ఒక చేయి లేని చీకటి
కళ్ళు పోయి తడుముకునే చీకటి
చిక్కటి
చిన్నటి
కంపించే చీకటి –
కరగని చీకటి
మూలిగలోకి చొచ్చుకుపోయి రోదించే చీకటిదయ లేని
దాహం తీర్చని చీకటి
మరచి పోనివ్వని చీకటి
మరపు రానివ్వని చీకటిమరి ఇంతకూ
నువ్వు ఎక్కడ?
(28-12-2013)