రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

చీకటి కలలు

రచన: పద్మావతి రాంభక్త
ఏప్రిల్ 2022

నిదురపొత్తిళ్ళలో
కనురెప్పల కింద
గుచ్చుకుంటున్న కలలు

కలవరపు ముద్రలన్నీ
కట్టగట్టుకుని
క్రూరమృగాలై కదలాడుతూ
లోతుల్లోని కలతలన్నీ
విచ్చుకున్న ఉలికిపాటు

పదునైన దృశ్యాలు
పాముల్లా పడగవిప్పి
బుసకొడుతున్న గగుర్పాటు
వికృత శబ్దాలకు
గుండెనదిలో పెరుగుతున్న
భయపు నీటిమట్టం

పీడకలల రాయి కింద
మనసు కాగితం
హోరున వీస్తున్న గాలులకు
వణికిపోతూ

గాఢంగా ఇంకిన భయాలన్నీ
కుబుసం విడిచి
దుస్స్వప్నాలై దాడి చేస్తూ
కదలని దేహానికి
ముచ్చెమటలు పోస్తూ

గిలగిలా కొట్టుకుంటూ
ఎగిరిపోతున్న ఊపిరిపిట్ట
కాసేపు గుండెను
గుప్పెట్లో నలిపేస్తూ

    
   

1అభిప్రాయం

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    దివాకర్ April 2, 2022 9:55 pm

    కవిత మొదలు, దాని నిడివి, నడత, ముగించిన విధానము ప్రత్యేకముగా వున్నది.

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • మూతబడ్డ పుస్తకం
  • ఒక క్షణమైనా
  • బాల్కనీ అతిథులు
  • చదవాలి
  • అదేమిటో

ఇటువంటివే…

  1. చీకటి పరచుకున్న ఆకాశంలో….
  2. కలలు కోతకొచ్చాయి
  3. లిఖిత: నా చీకటి
  4. కలలు ఇచ్చిన బలిమి
  5. స్వప్నసంచారం

ఏప్రిల్ 2022 సంచికలో ...

  • Sensuous by the Sea
  • ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 6
  • ఉత్తర మొరాకో శోధనలు 5
  • ఊహల ఊట 11
  • ఏప్రిల్ 2022
  • కేశం
  • గడినుడి – 66
  • చీకటి కలలు
  • తిష్యరక్షిత
  • నాలుగు కవితలు
  • నూట పాతికేళ్ళ యువకుడు: దామెర్ల
  • నెచ్చెలి కథల పోటీ 2022
  • పీడకల
  • మనం మరిచిన మాణిక్యం
  • మొల్ల రామాయణం: కవిత, వర్ణనా మాధుర్యాలు
  • వంతెన
  • విన్సెంట్ జీవన లాలస
  • విశ్వనాథ సమాధానం
  • విశ్వమహిళానవల 16: మేరీ షెలీ
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 66
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

పీడకల
ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 6

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.