రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

స్వప్నసంచారం

రచన: పద్మావతి రాంభక్త
ఏప్రిల్ 2021

రెప్పల ఊడలు పట్టుకుని
ఒక స్వప్నం
నిద్ర పొత్తిళ్ళలోకి
నెమ్మదిగా చేరుకుంటుంది.

లోపలి గదులలో ఇంకిన భయాలు
మెల్లగా పడగ విప్పుతాయి
తడారని దుఃఖాలన్నీ
తెరపై తాండవం మొదలెడతాయి.

గతపు పాదముద్రలు
కుబుసం విడిచేవేళకి
ఉన్నట్టుండొక ఉలికిపాటు
గట్టిగా కుదిపేస్తుంది.

మరపు పొదలలో
దాగిన ఆత్మీయులు
హఠాత్తుగా వెలికివస్తారు
ఆరిపోయిన నెగళ్ళలాంటి
తీరని కోరికలను భ్రమలవల
నిజంలా చూపెడుతుంది.

ఎన్నడో వదలి వెళ్ళిన ప్రేమ
వాకిట్లోకి వచ్చి ప్రేమగా
తలుపుతట్టి పిలుస్తుంది
పెదవికొమ్మపై నవ్వుపూవు
సుతారంగా పూస్తుంది.

తెల్లవారుఝామున
వెలుగుకిరణమొకటి
కిటికీకంతలోంచి
చీమలా దూరి
కనులపై మెలకువ నీళ్ళు
చల్లుతుంది.

    
   

2అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    Divakar April 1, 2021 10:27 pm

    ఆరిపోయిన నెగళ్ళలాంటి
    తీరని కోరికలను భ్రమలవల
    నిజంలా చూపెడుతుంది

    ఇలా ఈమె మాత్రమే వర్ణించగలరు!!!

  2. 2
    పార్థసారధి పోడూరు April 1, 2021 10:46 pm

    చాలా బాగుంది. రెప్పల ఊడలు, పెదవికొమ్మ, ఇంకినభయాలు మొదలైన గమ్మత్తు పదప్రయోగాలతో అసాధారణ భావవ్యక్తీకరణ చేశారు. రచయితకి అభినందనలు. మంచి కవితను చదివిన తృప్తినిచ్చినందుకు ధన్యవాదాలు.

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • రెండు తీరాలు
  • చదవాలి
  • వెన్నెల దిగులు
  • అశాంతి
  • కొన్ని సందర్భాలు

ఇటువంటివే…

  1. తారామతి బిరాదరి
  2. దీపాన్ని చూస్తున్నా
  3. అవ్యయ: కృష్ణచూడా
  4. ప్లవకు స్వాగతం
  5. విమాన-మనం

ఏప్రిల్ 2021 సంచికలో ...

  • 1808-1843 నాటి నిజాం రాజ్య చరిత్రలోని చిత్రకథలు 5
  • అట్రిబ్యూట్
  • అలా ఎలా
  • ఆకుపచ్చ పిట్ట
  • ఏప్రిల్ 2021
  • కేతన ఆంధ్రభాషాభూషణము: ఒక పర్యాలోకనం – 3
  • కొన్ని నిర్ఘాంతాలు
  • గడినుడి – 54
  • ఛందస్సులో గణితాంశములు – 4: అంత్యప్రాస
  • టి. ఎస్. ఎలియట్ కవితాశిల్పం
  • డయాస్పోరా రచనలకి ఆహ్వానం
  • నడిచిన పుస్తకం మా నాన్నగారు
  • నాలుగో వరం
  • పద్య పదార్థ విజ్ఞానం
  • ప్లవకు స్వాగతం
  • ముడతలమీద వాన
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 54
  • స్వప్నసంచారం
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

ప్లవకు స్వాగతం
కొన్ని నిర్ఘాంతాలు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.