పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. ఏనుగు డాక్టర్ గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    12/01/2021 12:53 pm

    నక్క ఇలాంటివి చెయ్యదురా

    ఈ ఒక్క వాక్యం చాలు కదా. ఈ మధ్య కాలంలో ఇటువంటి మహాద్భుతమైన కథ చదవలేదు. కన్నీళ్ళు ఆపుకోవడం కష్టం. ఈ ఏనుగుల గురించి, మిగిలిన వన్యప్రాణుల గురించీ డేవిడ్ అటెన్ బరో కొన్ని దశాబ్దాలుగా తలకొట్టుకుంటున్నాడు. అలాగే జేన్ గుడాల్ అనే ఆవిడ చింపాంజీల గురించీను. వాళ్ళకి ఎన్ని బిరుదులిచ్చినా, టైటిళ్ళు కట్టబెట్టినా జంతువులనీ వన్యప్రాణులనీ కాపాడుకోనంతకాలం మన జీవితాలు హీనాతిహీనమైనవి. ఆఖరికి బాపూకి కూడా ఈ పనికిమాలిన పద్మశ్రీ జీవితం చివర్లో ఇచ్చారు. అది ఆయనకి ఇస్తే ఎంత ఇవ్వకపోతే ఎంత? ఛీ ఛీ. ఆయన నిగర్వి కనక వెళ్ళి తీసుకున్నాడు. మరొకరైతే వెళ్ళి అదిచ్చే అధ్యక్షుడి మీద ఖాండ్రించి ఉమ్మేవాడేమో?

    రచయితకీ అనువాదకుడికీ ధన్యవాదాలు.

  2. ఉత్తర మొరాకో శోధనలు 1 గురించి Krishna అభిప్రాయం:

    12/01/2021 5:55 am

    ఆందమైన దేశం. చూడాల్సిన ప్రదేశం.
    చక్కని మనుషులు, ఆతిథ్యం.
    అనుభూతులు మూటగట్టుకోవచ్చు.

    మళ్ళీ ఫెజ్‌లో వున్నామనిపిస్తోంది చదువుతుంటే!

    చక్కని రచన.

  3. ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 1 గురించి Gowri Kirubanandan అభిప్రాయం:

    11/30/2021 1:21 am

    మనసుకు హత్తుకునేలాగా ఉంది రచన. బొమ్మలు వేసేవాళ్ళంటే నాకు మరీ మరీ యిష్టం. అలవోకగా సజీవంగా బొమ్మలు రూపొందించే అన్వర్ బాబుకి అనేకానేక ఆశీస్సులు మరియు అభినందనలు.

  4. ఊహల ఊట 6 గురించి Chaganti Tulasi అభిప్రాయం:

    11/28/2021 2:24 am

    భువనచంద్రగారికి, దేవరకొండ సహదేవరావుగారికి, కొంకేపూడి అనూరాధగారికి, చిట్టత్తూరు మునిగోపాల్‌గారికి, ప్రకాష్‌గారికి ఊహల ఊటపై తమ తమ అభిప్రాయాలు తెలియచేసినందుకు మీ అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
    మీ
    చాగంటి తులసి.

  5. వరద గురించి చిట్టత్తూరు మునిగోపాల్ అభిప్రాయం:

    11/27/2021 8:42 am

    కుక్క కరుస్తుంది… యజమాని సొత్తును కాస్తున్నపుడు, తనకు ఆపద ముంచుకొస్తున్నదని అనుకున్నపుడూ.

    మనిషి ఆదరిస్తాడు… సొంత లాభం చూసుకుంటు, సుంత స్వార్థపు లెక్కలేసుకుంటూ.

    ఈ కథ కన్నీటి వరద… మనిషిని నమ్ముకున్న మూగజీవి వ్యథ.

  6. ఊహల ఊట 6 గురించి చిట్టత్తూరు మునిగోపాల్ అభిప్రాయం:

    11/27/2021 7:55 am

    బాల్యం ఎప్పుడైనా, ఎవరికినా మధురమే. చిన్నప్పుడు మావూర్లో పూరింటి వసారాలో చూరుకింద తిన్నెమీద కూచుని బోదపుల్లల చూరునుంచి కారుతున్న వాన నీటి ధారల్లోకి అరచేతులను- అమ్మ, నాన్నమ్మ చూడకుండా చాపడం గుర్తుకొచ్చింది. అదే చూరుకింద నీళ్ళు కారికారి ఏర్పడ్డ చిన్నపాటి కాలువలో చిన్నచిన్న కాగితపు పడవలు చేసి వదలడం… క్షణకాలం మాత్రమే నిలిచే నీటిబుడగలను చేతులతో తాకాలని చూడడం… చిరు కప్పలను పట్టుకుని ఆడుకోవడం… బాల్యంలో తడిసిన ఎన్నేసి జ్ణాపకాలో. మీ కథ చదువుతుంటే, గోతాము పట్టా నెత్తినేసుకుని వానలో నిలబడినట్లు… అవ్వ రగిలించిన బొగ్గుల కుంపటి ముందు కూచుని చలికాగినట్టూ… ఏవేవేవో బాల్యపు మధురానుభూతులు వరుస కట్టాయి.

  7. వేణునాదం ఆగింది! గురించి Ajay Kumar Vellanki అభిప్రాయం:

    11/26/2021 1:50 pm

    “సృష్టిలో తీయనిది స్నేహమేనోయీ” ఈ పాట ఆడియో కూడా పంచుకొనగలరు.

  8. కాల్వీనో కథల నుంచి – 9 గురించి Kiran అభిప్రాయం:

    11/25/2021 12:42 am

    కథ బాగుందండీ! different గా ఉంది.

  9. భౌతికశాస్త్రంలో ప్రభంజనాలు: ఒక విహంగావలోకనం 2 గురించి Rao Vemuri అభిప్రాయం:

    11/23/2021 11:02 pm

    శ్రీనివాస్ గారికి, వీరారావు గారికి, దేశికాచారి గారికి:

    మీ అభిప్రాయాలకి ధన్యవాదాలు. ఈ వ్యాసం రాయడానికి నేను ఆరు నెలలపాటు పడ్డ శ్రమకి ఫలితం దక్కినట్లే!

  10. ఒక అనువాదకుని అంతరంగం గురించి కొ o కే పూడి అనూరాధ అభిప్రాయం:

    11/23/2021 7:00 pm

    శ్రీ దాసరి అమరేంద్రగారు రాసిన అనువాదకుని అంతరంగం చదివాను, చాలా బాగుంది.
    అనువాదం చేసేటప్పుడు జరిగే మనోమథనం
    అరటిపండు వలిచి తినిపించినట్లు చెప్పారు;
    నిజంగా అనువాదం చేయడం ఎంత కష్టమో
    అర్థం అయ్యింది.
    యాత్రా విశేషాలు కాకుండా అనువాద రచనలలో
    లోతుపాతులను వివరించడం ముందు తరాలకు మార్గదర్శకంగా ఉంది.
    ఇంత మంచి అనుభవ రచనను అందించిన
    శ్రీ దాసరి అమరేంద్రగారికి ఎంతగానో కృతజ్ఞతలు.