Humoresque (హుమొరెస్క్యు) అంటే పాత్రల మానసిక స్థితిని తెలియజేసే కల్పిత హాస్యంతో కూడిన (చపలచిత్తమైన తెలివి ప్రదర్శన కాని) శృంగార సంగీత కళా ప్రక్రియగా వర్ణించవచ్చు అని గూగులమ్మ చెపుతోంది†.
ఆవిధంగా హుమొరెస్క్యు అనే పేరు యీ కధలోని అంతర్ సూత్రానికి (నిసి షామల్, పీటర్ కాన్రాయ్‌ల చెర్లాటలకి) చక్కగా సరిపోతున్నదేమో కదా ప్రియమైన తః తః గారూ?!
†Humoresque is a genre of romantic music characterized by pieces with fanciful humor in the sense of mood rather than wit.
“ఏనుగు డాక్టర్” అనాది తాత్వికతను ప్రస్థావించిన ఓ గొప్ప కధ… మీ మరో గొప్ప అనుసృజన. ప్రకృతితో మమేకం కాకుండా, ప్రకృతిలోని అన్ని జీవజాలాల ఉనికిని అర్ధంచేసుకోకుండా, వాటిని ప్రేమించకుండా మనిషి ఆదర్శవంత జీవిత మార్గం లోకి మళ్లలేడని తెలియజేస్థున్న కధను అందించిన మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
అడవి మృగాలకూ ఇతర పెంపుడు జంతువులకూ వైద్యం చేస్తూ క్రమేణా ఏనుగుల స్పెషలిస్టుగా మారిన అటవీశాఖ జంతువైద్యుడు డాక్టర్ వి. కృష్ణమూర్తి గారి మౌలిక విలువల తాత్వికతని అడవితల్లి వొడిలో సేదతీర్చుకునే జయతి తల్లి (జయతి లోహితాక్షన్) బాగా అర్ధం చేసుకుంటారు.
అడవితల్లి వొడిలో సేదతీర్చుకోవాలనే ధ్యాసే కాని, పురుగూ పుట్రా ఉంటాయ్ అంటే …. అదంతా మనమేర్పరచుకున్న భయాందోళనల తప్పు అభిప్రాయాలు అంటూ నవ్విన; ఉదయ సంధ్య, సాయంసంధ్య, అసుర సంధ్య, గోధూళివేళ వంటి సంధ్యలను ప్రకృతి వొడిలోనుండి వీక్షణానందజనిత తన్మయత్వంతో చూసే… ఎంతో మహోన్నతమైన సంతోషాలు ఈ భూమ్మీద అడవితల్లి ఒడిలో ఉన్నాయని తెలిసిన జయతి తల్లి (అడవి నుండి అడవికి జయతి లోహితాక్షన్) “ఏనుగు డాక్టర్” ను సాధికారికంగా బాగా అర్ధం చేసుకుంటారు.
ఆర్. శర్మ దంతుర్తిగారు కథలోంచి quote చేసిన వాక్యం నిస్సంశయంగా గొప్ప హైలైట్ ఈ కథకి.
దేవుడిని ఒక పక్క నిరాకారుడంటూనే, మరోపక్క నాలుగు చేతులు, ఆరు ముఖాలూ చేర్చి పేర్చి మనిషి ఆకృతినివ్వడం మనందరికీ తెలిసిందే. ఆ పద్ధతిలోనే, జంతువులకి కూడా మనిషిలోని అవగుణాలనీ సద్గుణాలనీ ఆపాదించడం, ప్రశ్నించదగ్గ ఆనవాయితీ. ఏనుగుల గురించి ఎన్ని విషయాలు కొత్తగా తెలిశాయీ అన్నది అలా ఉంచితే, మనుషుల గురించి ఎన్నో విషయాలని బోధించిన కథ. అమరేంద్రగారన్నట్లు, గొప్ప కథ. “ఇంత దూరం మిమ్ముల్ని వెతుక్కునా వచ్చాడు?” అన్న ఒక్క చోటనే తమిళ ధోరణి కనపడింది. (“మిమ్మల్ని వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చాడా? or “వాడు ఇంత దూరం వచ్చింది – మిమ్మల్ని వెతుక్కుంటూనా?” అనాల్సిందేమో!) మిగిలిన కథంతా చక్కటి తెలుగుదనంతో అలరించింది. మూలకథా రచయిత జయమోహన్ గారికి, అనువదించిన అవినేని భాస్కర్ గారికి, చక్కటి కథను ప్రచురించిన “ఈమాట”కు ధన్యవాదాలు, అభినందనలు.
సంవత్సరాల స్నేహం. ఎండా వానా, చలీ మంచూలో కలిసి పయనించారు కేన్సర్ ఫీల్డ్ ( ఆంకాలజీ ) డా. నిసి షామల్, ఆర్కిటెక్చర్ పీటర్ కాన్రాయ్ ( ఐరిష్ అండ్ మోర్ లైక్ హవర్డ్ రోర్క్ ఫ్రమ్ ఫౌంటెన్హెడ్ నావెల్ ).
పదిహేను, ఇరవై సంవత్సరాల క్రితం విడిపోయిన నిసి షామల్, పీటర్ కాన్రాయ్ ఇద్దరూ మళ్లీ వేరు దిశల నుండి నడిచి వచ్చి న్యూయార్క్ సిటీలో వల్డ్ ఆంకాలజీ ఫ్యూచర్ అప్రోచెస్ మీటింగ్ లో కలుసుకుని మారే సీజన్స్ కలిసి అనుభవించారు. వారికి ఒకరి స్వభావం మరొకరికి బాగా తెలుసు. ఆకస్మికంగా ఇప్పుడు కొత్తరకం చెర్లాటం మొదలయింది.
ఏ రిలేషన్షిప్ కాంట్రాక్ట్స్ ఏమీ లేని స్వతంత్రులు వాళ్లు. చెట్టాపట్టాలు వేసుకుని, ఆ క్రిస్మస్ ఫెస్టివ్ సీజన్ నైట్‌లో కోరిన కోరికలెన్నో తీర్చుకుంటూ తిరిగారు.
కెనెడీ ఎయిర్ పోర్ట్ లో నిసి షామల్ కి వీడ్కోలు చెపుతూ “షామల్! నీకు దణ్ణం పెడతా. నువ్వొచ్చి నాతోపాటు నివసించవూ. నీకు ఎంతకాలం వీలైతే అంతకాలం, ఎంత త్వరగా వీలైతే అంత! రావూ!” అని పీటర్ కాన్రాయ్ నిసిని ఆర్తితో వేడుకోవటం… “తప్పకుండా. పీటర్! మై అపాసెల్!” అని నిసి బదులివ్వటం. ఆపుకోలేని ఉత్కంఠత కు ఓ అద్భుత ముగింపు.
మోజార్ట్ మ్యూజిక్‌లో ఉండే ‘ఛైల్డ్ లైక్’ క్వాలిటీ, ప్యూరిటీని నిసి షామల్, పీటర్ కాన్రాయ్ రిలేషన్షిప్ లో ఆవిష్కరించిన రచయిత్రి డా. లైలా యెర్నేని గారికి నెనర్లు.
రత్తి పాటలు గురించి మంచెం విజయలక్శ్మి – రచయిత కుమార్తె అభిప్రాయం:
12/04/2021 3:01 pm
రచయిత : కీ.శే. మంచెం బి జనార్దన రావు(1955-2021)
రచనా కాలం: 1974
స్వస్థలం: కాకినాడ
ఇతర రచనలు: ప్రత్యూష, హిమసుమాలు, సిరిమువ్వల చిరుసవ్వడి
Humoreske గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
12/04/2021 11:34 am
Humoresque (హుమొరెస్క్యు) అంటే పాత్రల మానసిక స్థితిని తెలియజేసే కల్పిత హాస్యంతో కూడిన (చపలచిత్తమైన తెలివి ప్రదర్శన కాని) శృంగార సంగీత కళా ప్రక్రియగా వర్ణించవచ్చు అని గూగులమ్మ చెపుతోంది†.
ఆవిధంగా హుమొరెస్క్యు అనే పేరు యీ కధలోని అంతర్ సూత్రానికి (నిసి షామల్, పీటర్ కాన్రాయ్‌ల చెర్లాటలకి) చక్కగా సరిపోతున్నదేమో కదా ప్రియమైన తః తః గారూ?!
†Humoresque is a genre of romantic music characterized by pieces with fanciful humor in the sense of mood rather than wit.
ఏనుగు డాక్టర్ గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
12/03/2021 2:07 pm
ప్రియమైన అవినేని భాస్కర్ గారూ…
“ఏనుగు డాక్టర్” అనాది తాత్వికతను ప్రస్థావించిన ఓ గొప్ప కధ… మీ మరో గొప్ప అనుసృజన. ప్రకృతితో మమేకం కాకుండా, ప్రకృతిలోని అన్ని జీవజాలాల ఉనికిని అర్ధంచేసుకోకుండా, వాటిని ప్రేమించకుండా మనిషి ఆదర్శవంత జీవిత మార్గం లోకి మళ్లలేడని తెలియజేస్థున్న కధను అందించిన మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
అడవి మృగాలకూ ఇతర పెంపుడు జంతువులకూ వైద్యం చేస్తూ క్రమేణా ఏనుగుల స్పెషలిస్టుగా మారిన అటవీశాఖ జంతువైద్యుడు డాక్టర్ వి. కృష్ణమూర్తి గారి మౌలిక విలువల తాత్వికతని అడవితల్లి వొడిలో సేదతీర్చుకునే జయతి తల్లి (జయతి లోహితాక్షన్) బాగా అర్ధం చేసుకుంటారు.
అడవితల్లి వొడిలో సేదతీర్చుకోవాలనే ధ్యాసే కాని, పురుగూ పుట్రా ఉంటాయ్ అంటే …. అదంతా మనమేర్పరచుకున్న భయాందోళనల తప్పు అభిప్రాయాలు అంటూ నవ్విన; ఉదయ సంధ్య, సాయంసంధ్య, అసుర సంధ్య, గోధూళివేళ వంటి సంధ్యలను ప్రకృతి వొడిలోనుండి వీక్షణానందజనిత తన్మయత్వంతో చూసే… ఎంతో మహోన్నతమైన సంతోషాలు ఈ భూమ్మీద అడవితల్లి ఒడిలో ఉన్నాయని తెలిసిన జయతి తల్లి (అడవి నుండి అడవికి జయతి లోహితాక్షన్) “ఏనుగు డాక్టర్” ను సాధికారికంగా బాగా అర్ధం చేసుకుంటారు.
బీబీ తోరీ కల గురించి Kiran Kumari అభిప్రాయం:
12/03/2021 9:00 am
కథ చాలా బాగుంది. జానపద కథను పోలి ఉంది. మంచికథను అనువదించి పరిచయం చేసినందుకు రచయిత్రికి కృతజ్ఞతలు!
ఏనుగు డాక్టర్ గురించి Kiran Kumari అభిప్రాయం:
12/03/2021 8:30 am
ఎంత మంచి కథనో! హృద్యంగా సాగింది. రచయితకి, అనువాదకులకు కృతజ్ఞతలు!
పుస్తక పరిచయాలు గురించి annapurna appadwedula అభిప్రాయం:
12/03/2021 3:09 am
మీ సంపాదకీయము చాలా బాగుంది.
ఏనుగు డాక్టర్ గురించి శ్రీనివాస్ బందా అభిప్రాయం:
12/03/2021 1:06 am
ఆర్. శర్మ దంతుర్తిగారు కథలోంచి quote చేసిన వాక్యం నిస్సంశయంగా గొప్ప హైలైట్ ఈ కథకి.
దేవుడిని ఒక పక్క నిరాకారుడంటూనే, మరోపక్క నాలుగు చేతులు, ఆరు ముఖాలూ చేర్చి పేర్చి మనిషి ఆకృతినివ్వడం మనందరికీ తెలిసిందే. ఆ పద్ధతిలోనే, జంతువులకి కూడా మనిషిలోని అవగుణాలనీ సద్గుణాలనీ ఆపాదించడం, ప్రశ్నించదగ్గ ఆనవాయితీ. ఏనుగుల గురించి ఎన్ని విషయాలు కొత్తగా తెలిశాయీ అన్నది అలా ఉంచితే, మనుషుల గురించి ఎన్నో విషయాలని బోధించిన కథ. అమరేంద్రగారన్నట్లు, గొప్ప కథ. “ఇంత దూరం మిమ్ముల్ని వెతుక్కునా వచ్చాడు?” అన్న ఒక్క చోటనే తమిళ ధోరణి కనపడింది. (“మిమ్మల్ని వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చాడా? or “వాడు ఇంత దూరం వచ్చింది – మిమ్మల్ని వెతుక్కుంటూనా?” అనాల్సిందేమో!) మిగిలిన కథంతా చక్కటి తెలుగుదనంతో అలరించింది. మూలకథా రచయిత జయమోహన్ గారికి, అనువదించిన అవినేని భాస్కర్ గారికి, చక్కటి కథను ప్రచురించిన “ఈమాట”కు ధన్యవాదాలు, అభినందనలు.
Humoreske గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
12/02/2021 12:34 pm
సంవత్సరాల స్నేహం. ఎండా వానా, చలీ మంచూలో కలిసి పయనించారు కేన్సర్ ఫీల్డ్ ( ఆంకాలజీ ) డా. నిసి షామల్, ఆర్కిటెక్చర్ పీటర్ కాన్రాయ్ ( ఐరిష్ అండ్ మోర్ లైక్ హవర్డ్ రోర్క్ ఫ్రమ్ ఫౌంటెన్హెడ్ నావెల్ ).
పదిహేను, ఇరవై సంవత్సరాల క్రితం విడిపోయిన నిసి షామల్, పీటర్ కాన్రాయ్ ఇద్దరూ మళ్లీ వేరు దిశల నుండి నడిచి వచ్చి న్యూయార్క్ సిటీలో వల్డ్ ఆంకాలజీ ఫ్యూచర్ అప్రోచెస్ మీటింగ్ లో కలుసుకుని మారే సీజన్స్ కలిసి అనుభవించారు. వారికి ఒకరి స్వభావం మరొకరికి బాగా తెలుసు. ఆకస్మికంగా ఇప్పుడు కొత్తరకం చెర్లాటం మొదలయింది.
ఏ రిలేషన్షిప్ కాంట్రాక్ట్స్ ఏమీ లేని స్వతంత్రులు వాళ్లు. చెట్టాపట్టాలు వేసుకుని, ఆ క్రిస్మస్ ఫెస్టివ్ సీజన్ నైట్‌లో కోరిన కోరికలెన్నో తీర్చుకుంటూ తిరిగారు.
కెనెడీ ఎయిర్ పోర్ట్ లో నిసి షామల్ కి వీడ్కోలు చెపుతూ “షామల్! నీకు దణ్ణం పెడతా. నువ్వొచ్చి నాతోపాటు నివసించవూ. నీకు ఎంతకాలం వీలైతే అంతకాలం, ఎంత త్వరగా వీలైతే అంత! రావూ!” అని పీటర్ కాన్రాయ్ నిసిని ఆర్తితో వేడుకోవటం… “తప్పకుండా. పీటర్! మై అపాసెల్!” అని నిసి బదులివ్వటం. ఆపుకోలేని ఉత్కంఠత కు ఓ అద్భుత ముగింపు.
మోజార్ట్ మ్యూజిక్‌లో ఉండే ‘ఛైల్డ్ లైక్’ క్వాలిటీ, ప్యూరిటీని నిసి షామల్, పీటర్ కాన్రాయ్ రిలేషన్షిప్ లో ఆవిష్కరించిన రచయిత్రి డా. లైలా యెర్నేని గారికి నెనర్లు.
గడినుడి – 62 గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:
12/02/2021 12:12 pm
గడినుడి కూర్చేటప్పుడు ఒక పొరపాటు దొర్లింది. 47 అడ్డానికి సమాధానంగా దంత్య -న- బదులుగా గడిలో నేను మూర్ధన్య -ణ- వాడుకొన్నాను. పొరబాటుకు క్షంతవ్యుణ్ణి.
దానికి పరిహారంగా ఇప్పుడు 37 నిలువు మార్చాను. ఆధారాలు మళ్ళీ చూసుకోండి.
ఏనుగు డాక్టర్ గురించి Amarendra Dasari అభిప్రాయం:
12/01/2021 7:31 pm
గొప్ప కథ
గొప్ప అనువాదం