జంపాల చౌదరి


సొంత ఊరు:
దుగ్గిరాల
ప్రస్తుత నివాసం:
వృత్తి:
సైకియాట్రీ ప్రొఫెసర్, చికాగో మెడికల్ స్కూల్‌
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

డా. జంపాల చౌదరి వృత్తిరీత్యా మానసిక విద్యానిపుణులు. తెలుగు, సాహిత్యం, కళలు, సినిమాలు అంటే అభిమానం. తెలుగు సాహిత్య చర్చల్లో ఉత్సాహంగా పాల్గొంటుంటారు. తానా పత్రిక, తెలుగు నాడి పత్రికలకు, మూడు తానా సమావేశపు సావెనీర్లకు, రెండు దశాబ్దాలు, కథ-నేపథ్యం కథాసంపుటాలకు సంపాదకత్వం వహించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)కు అధ్యక్షుడిగా పనిచేశారు. గత మూడున్నర దశాబ్దాలుగా తానా సంఘం, తానా ప్రచురణలు తెలుగు భాషకు, సాహిత్యానికి చేస్తున్న అనేక సేవల వెనుక ప్రధానపాత్ర వహిస్తున్నారు.


 

‘మనిషైతే మనసుంటే, కనులు కరగాలిరా! కరిగి, కరుణ కురియాలిరా! కురిసి, జగతి నిండాలిరా!’ అన్న మానవతావాదం ఆ కలానిది. ‘వాడ వాడల వాడే! జాడలన్నిట వాడే! ఇంటి ముంగిట వాడే! ఇంటింటిలో వాడే!’ అని దైవాన్ని అన్నిచోట్లా చూస్తూ ‘అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది’ అని విశదీకరించింది ఆ కలమే.

బైరాగి కథ చెప్పే తీరు విలక్షణంగా ఉంటుంది. ఎత్తుగడ ఎటు దారి తీస్తుందో చెప్పలేము. కథాలోకంలోకి, నాయకుడి మనసులోకి మనల్ని తొందరగా తీసుకువెళతాడు. చిన్న చిన్న వాక్యాలతో కథ వడిగా నడుస్తుంది. కీలక సన్నివేశాలలో అతని అద్భుత పదవిన్యాసం మనల్ని మైకంలా కమ్మేస్తుంది.

పై చదువులకి, ఉద్యోగాలకి, విహారయాత్రలకి… ఇలా ఎన్నో రకాలుగా అమెరికా వెళ్ళడం అంటే తెలుగువారికి ప్రీతి. అమెరికా సురక్షితమైన దేశమే. కానీ గత కొద్ది […]

ఈ రచయిత ప్రతిభ అన్నింటికన్నా ఎక్కువ వ్యక్తం అయ్యేది ఈ కథకు ఆయువుపట్టు, కథ శీర్షిక, ఆఖరు పంక్తి అయిన “ఎందుకు పారేస్తాను నాన్నా?” అన్న కృష్ణుడి ప్రశ్నలో. అవును, ఎందుకు పారేస్తాడు?

సమకాలీనత పాఠకుడిలో ఉత్సుకత రేపుతుంది. రచయిత దృక్పథం, శైలి, సమర్థత సమకాలీన వస్తువుని మంచికథగా మలచవచ్చు. ఆ కథలు గొప్ప కథలు కావాలన్నా, నాలుగు కాలాలు నిలవాలన్నా ఆ కథల్లో సార్వజనీనత, సార్వకాలికత కూడా ఉండాల్సిందే.

(తానా పత్రికకు చిరకాలంగా సంపాదకత్వం వహిస్తూ, తెలుగు సాహిత్యానికి సంబంధించిన అన్ని చర్చల్లోనూ విరివిగా పాల్గొనే జంపాల చౌదరి గారికి పరిచయం అక్కర్లేదు జగమెరిగిన […]