లక్షల భావాలతో అనునిత్యం చెరచబడ్డ నేను
నువ్వనుకున్న పవిత్రతకు ఓటెయ్యలేను
నా కన్నీళ్ళూ,నా రక్తమూ అనుక్షణం మారుస్తూ
నీ కోసం ఓ కొత్త ఏడుపెత్తుకోలేను
నేనేమో తెలియని దండకారణ్యంలో
ఆకుపచ్చగీతానికి పిట్టరుపులరవలేను
ఒక గొంతేదీ తెమలని బహుళరేవులలో
ఏ జెండానూ ఊపలేను
లక్షరంగులతో ఓ దేహం తయారయేందుకు
పుడమే ఇంకా సిద్ధం కాలేదు
వొచ్చే బండేదో ఎక్కి
ఏదో ప్రయాణం కట్టేయడానికి
ఝండా ఊఁచా రహే హమారా
అవసరం లేదు
ఏ సందులో ఆ పాటే
నీ దేహభక్తి గీతం
దేశం విసిరిన విస్తరిలో!