ఓర్పు

నీడలా వెంటాడే నిశ్శబ్దమే జీవితం
నవ్వుల మధ్య నిట్టూర్పుల సవ్వడులే సాక్ష్యం
పొడిచే పొద్దు అంచులకు పొడిపొడిగా రాలుతున్న చీకటి
మనసు అద్దంలో నిజాలను మాత్రమే చూపించదు

కన్నీటి చుక్కల్లో కథలు ఎవరికీ వినబడవు
గాలికెగిరిపోతున్న కొత్త కొత్త ఆశలు
విరిగిన స్వప్నాలను దాచుకున్న చిరునవ్వు
మనసులోని మాట కోసం కొట్టుకులాడతాయి

మనల్ని ఎవరో అర్థం చేసుకోవాలని
మనల్ని మనమే మర్చిపోతుంటాం
దూరమైన స్నేహం, కోల్పోయిన ప్రేమ కూడా
ఏవో దారులను మిగిల్చే వుంటాయి
సిగ్నల్ పడేవరకూ నిరీక్షించాలి.


దేశరాజు

రచయిత దేశరాజు గురించి:

సుప్రసిద్ధ కవి, రచయిత, జర్నలిస్టు దేశరాజు ఆధునిక జీవితంలోని వైరుధ్యాలను, మనుషుల జీవన శైలిని, విషాదాలను తన రచనల్లో సరళంగా, మనసుకు హత్తుకునే శైలిలో వ్యక్తీకరిస్తారు. 18 కథలతో కూడిన “బ్రేకింగ్ న్యూస్” ద్వారా మంచి కథకుడిగా గుర్తింపు పొందారు.”దుర్గాపురం రోడ్” నవలతో సహా కొన్ని ఇతర కవితా సంపుటాలు కూడా వెలువరించారు.

 ...