ఎంవివి సత్యనారాయణ స్మారక సాహితీ పురస్కారం

ప్రముఖ కథా, నవలా రచయిత శ్రీ ఎంవివి సత్యనారాయణగారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్న “ఎంవివి సత్యనారాయణ స్మారక సాహితీ పురస్కారం”కు 2026 సంవత్సరానికిగాను ఇరువురు రచయితలను ఎంపిక చేశాము. వారి వారి సాహిత్యసేవలను గుర్తించి కమిటీ శ్రీ శేఖరమంత్రి ప్రభాకర్‌రావుగారిని, శ్రీ వెంకటమణిగారిని పురస్కారాలకు ఎంపిక చేయడం జరిగింది.

పబ్లిక్ లైబ్రరీ, ద్వారకా నగర్‌, విశాఖపట్నంలో ఆగస్ట్ 5, 2026 బుధవారంనాడు జరిగే సాహితీ పురస్కార ప్రదాన సభలో ఒక్కొక్కరికి రూ. 5000/- నగదుతోపాటు అభినందన పత్రం సమర్పిస్తాము.

పురస్కార ప్రదాన కమిటీ తరఫున
ద్విభాష్యం రాజేశ్వరరావు
విశాఖపట్నం (సెల్: 94403 18415)