యూట్యూబ్ లో ఈమాట: జూలై 2026

ఈమాటలో మొదటినుండీ శబ్దతరంగాలనే శీర్షిక కింద ఎన్నో అపురూపమైన ఆడియోలు ప్రచురించాం. ఇవి పాఠకులను ఎంతగానో అలరించాయి కూడా. అయితే, కాలం గడిచేకొద్దీ పాత సంచికల రచనలు మరుగున పడడం సహజం. అలా మరుగున పడిన వాటిని వెలికితీసి అందరికీ అందుబాటులో ఉంచాలనేది మా కోరిక. మారుతున్న కాలంతోపాటు సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఈమధ్య కాలంలో తెలుగులో ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్యవేదిక. ఇది ఇప్పుడు అందరూ వాడుతున్నది, అందరూ తేలిగ్గా కావలసినవి వెదుక్కుని ఆనందించగలిగినదీ కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. ఈ సందర్భంగా, పాఠకులనుంచి కూడా కంటెంట్ ఆహ్వానిస్తున్నాం. ఈమాట నియమావళికి అనుగుణమైన శబ్ద-దృశ్య-రచనలను ఈ ఛానల్ ద్వారా ప్రచురించగలం. ఈ ఛానల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసి మా ప్రయత్నాన్ని విజయవంతం చేయమని ఈమాట పాఠకులకు మనవి.

గతనెలలో కొత్తగా:

1. ధర్మోదకాలు – ఆడియో కథ, రచన: తుమరాడ నరసింహమూర్తి, స్వరం – శ్రీనివాస్ బందా

రావు బాలసరస్వతీ దేవి లలితగీతాలు –
సంగీతం: సాలూరి హనుమంతరావు

1. సరగున రారా సమయమిదేరా
2. గోపాలకృష్ణుడు నల్లన
3. ఈ ప్రేమా ఏల కలిగెను