గౌరి కృపానందన్
జీవిత విశేషాలు
గౌరి కృపానందన్ మాతృభాష తమిళం. తండ్రి ఉద్యోగరీత్యా తెలంగాణాలో స్థిరపడినా, వివాహానంతరం చెన్నైకి వెళ్ళిన తరువాతే తమిళ సాహిత్యం చదవడానికి అవకాశం లభించింది. సాహిత్యం అంటే మక్కువ. తెలుగులో తనకి నచ్చిన నవలలు, కధలు తమిళ పాఠకులకు, అలాగే తమిళంలో మనసుకు దగ్గరగా ఉన్న సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు అందించాలనే కోరికతో, ఆశయంతో అనువాద ప్రక్రియను ఎంచుకున్నారు. 1995లో మొదటి అనువాద కధ యండమూరి వీరేంద్రనాథ్ గారి “ది బెట్’ తమిళంలో ప్రచురం అయ్యింది. దాదాపు ఎనబై తెలుగు నవలలు తమిళంలో వెలువడి ఉన్నాయి. (యండమూరి వీరేంద్రనాథ్, యద్దనపూడి సులోచనారాణి, D. కామేశ్వరి, ఓల్గా) తెలుగులో పెరుమాళ్ మురుగన్ గారి “పూనాచ్చి ఒక మేకపిల్ల కధ” ఈ మధ్యే వెలువడింది. 2015లో ఓల్గాగారు “విముక్త” కధా సంకలనానికి సాహిత్య అకాడమి అవార్దు అందుకున్న అదే ఏడాది, విముక్త తమిళ అనువాదం “Meetchi”కి గౌరీ కృపానందన్ సాహితి అకాడమి అనువాద పురస్కారం అందుకున్నారు. మూలానికీ, అనువాదానికీ ఒకే ఏడాది సాహిత్య అకాడమి అవార్డులు రావడం ఇదే తొలిసారి.
గౌరి కృపానందన్ రచనలు
- వదిన అనువాదాలు » కథలు » మే 2013
- మరియ అనువాదాలు » కథలు » మార్చి 2013
- కొత్త మలుపు అనువాదాలు » కథలు » జనవరి 2013
- నిష్కృతి అనువాదాలు » కథలు » నవంబర్ 2012
- తథాస్తు అనువాదాలు » కథలు » సెప్టెంబర్ 2012
- బింబం అనువాదాలు » కథలు » జులై 2012
- జాతర అనువాదాలు » కథలు » మే 2012
- విధ్వంసం అనువాదాలు » కథలు » మార్చి 2012
- మారిన కాలం మారిన మనుషులు అనువాదాలు » కథలు » జనవరి 2012
- పులి వేషగాడు అనువాదాలు » కథలు » నవంబర్ 2011
- మాతృత్వానికి మరో ముడి: కథ నచ్చిన కారణం కథలు » సెప్టెంబర్ 2011
- ఒక కప్పు కాఫీ అనువాదాలు » కథలు » సెప్టెంబర్ 2011