Comment navigation


15547

« 1 ... 95 96 97 98 99 ... 1555 »

  1. పురూరవ గురించి సురేశ్ కొలిచాల గారి అభిప్రాయం:

    04/27/2023 10:38 am

    ఇన్ వాలిడ్ యూ.ఆర్.ఎల్. అని వస్తోంది. పురూరవ నాటకం పి.డి.ఎఫ్ కోసం ఏదైనా లింక్ ఉంటే పెట్టండి దయచేసి!

    అసౌకర్యానికి చింతిస్తున్నాం. పిడిఎఫ్ లింకు ఇప్పుడు సరి చేశాం. మళ్ళీ ఒకసారి చెక్ చేయండి.

  2. సా విరహే తవ దీనా గురించి Sai Brahmanandam గారి అభిప్రాయం:

    04/25/2023 11:53 pm

    దర్బారు, కానడ, దర్బారి కానడ రాగాల్లో నిర్వహించిన సినిమా పాటల కార్యక్రమం.
    తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమా పాటల కూర్పు. సంగీతం ఇష్టమున్న వారు వింటారని:

  3. పురూరవ గురించి Angara Venkata Satya Gopala Swamy గారి అభిప్రాయం:

    04/25/2023 10:30 am

    ఇన్ వాలిడ్ యూ.ఆర్.ఎల్. అని వస్తోంది. పురూరవ నాటకం పి.డి.ఎఫ్ కోసం ఏదైనా లింక్ ఉంటే పెట్టండి దయచేసి!

  4. హలాల్‌ గురించి G S BADRI NATH గారి అభిప్రాయం:

    04/21/2023 9:03 am

    చక్కని భాష. మానవ స్వభావం, కడప ప్రజల సంస్కృతి సొగసుగా ఉలితో చెక్కడం షరీఫ్ గారి స్వంతం.

  5. నాకు నచ్చిన పద్యం: లాక్షణికులు గుర్తించని అనురాగభేదము గురించి Lyla yerneni గారి అభిప్రాయం:

    04/19/2023 9:21 am

    “అంతేకాదు, ఈ కవితకు కవిగారుంచిన శీర్షిక అనురాగభేదము. ‘కలిగెను భేదమొక్కటిదె’ అన్న ఎత్తుగడ ఏతదనుగుణమైనదే. భేదమంటే ఒక విశేషము.”

    పరిమి గారు:

    ఇక్కడ కవి ఉద్దేశించింది అది కాదు. ‘భేదము’ పదం ఇక్కడ వాడుక చిన్నయ సూరి మిత్రలాభము, మిత్రభేదము లో వలె. అనురాగలాభము. అనురాగభేదము. పద్యం లోని నాయకుడికి ముందు కొంతకాలం లభించిన అనురాగం. తర్వాత చెడిన అనురాగము అని. Paradise lost; Paradise regained titles లాగా. పోగొట్టుకున్న స్వర్గం, తిరిగి లభించిన స్వర్గం లాగా.

    మీ వ్యాసం అర్ధం చేసుకోవటానికి నేను చదువుతున్నవి, ఈ క్రిందివి.
    1. Bhoja’s Sringara Prakasa Raghavan V 1978 by Manish Dutta, (Detailed notice of contents, page 41.)
    2. Bhoja’s Sringara Prakasa, Sheldon Pollock.

    Thanks to you, As I was reading and thinking about your essay, I read about V. Raghavan, and there after I also listened to M.S. Subbulakshmi singing Chandrasekharam Ashraye – a carnatic musical piece written by Raghavan.

    All new and pleasurable to me
    -లైలా.

  6. హలాల్‌ గురించి Imran గారి అభిప్రాయం:

    04/18/2023 3:38 pm

    చాలా మంచి సందేశం ఇచ్చారు.

  7. ఊహల ఊట – 23 గురించి sumanaspati reddy గారి అభిప్రాయం:

    04/18/2023 4:09 am

    ఊరంతటితో కలిసి ఉత్సవ సంబురం జరుపుకొనే తీర్లు, సంప్రదాయాలు చాలా మట్టుకు పోగొట్టుకున్న కాలంలో, విజయనగరం వంటి గొప్ప సాంస్కృతిక ఆవరణం, గొప్ప కళాకారులు, పండితులు, నైశిత్యం ఉన్న ఊర్లో 70, 80 ఏళ్ల క్రితపు దసరా పండుగ రోజుల తిరుగాడే అనుభవాన్ని అనేక పాత్రలు, తావులు, డృష్టికోణాల మధ్య లంకెలు వేస్తూ నిండుగా, సకలేంద్రియ సమాహారంగా అవిష్కరించి పెట్టారు ఈ గల్పికలో తులసి గారు.

    వయసుతో వచ్చే శారీరక ఇబ్బందులు ఎన్ని పైబడుతున్నా, తులసి గారి కథన సృజన సంవిధానం సరికొత్త సొగసులతో దిట్టంగా సాగుతున్న తీరులో ఎంతటి జీవనోల్లాసం! అదొక కొండ ఊట నీటి తీపి! అడవి కొండ శిఖరం చేరుకొన్నప్పుడు ఎగసి వచ్చే నిండైన ఊపిరి కలిగించే ఉన్మత్త భావన!

    బతుకు సంగతుల్నన్నింటినీ ఆవురావురుమని అనుభవించి ఆకళింపు చేసుకొందామని ఉరకలేస్తున్న చిట్టి అమ్మాయికి సమాజం, ఇతరులు ఎన్ని అందించినా “ఒసే జడ్డీ! మనం ఎవరినీ కాపీ కొట్టకూడదే మనమే కొత్తగా ఆలోచించి కొత్తకొత్తగా చెయ్యాలి” అని సుబ్బులత్తయ్య చిట్టి చురక వేయడంలో రక్తపుటెరుకలాంటి విజ్ఞతను తళుక్కుమనిపించారు.

    సంతస సమయం ఇది చేసుకుంటే అని మాటి మాటికీ బోధపరచడమే పనిగా ఉబికి వస్తున్నాయి ఊహల ఊట గల్పికలు!! వాటితో కలిసి ప్రవహించడమే పని!

  8. దానవోద్రేక స్తంభకుడు గురించి Haribabu గారి అభిప్రాయం:

    04/17/2023 9:05 am

    మీరూ చెప్పిన విధం చాలా బావుంది. కానీ ఇది ఒక ఇతిహాసం ఒక చరిత్ర. ఈ చరిత్రలో రహస్యంగా దాగి ఉన్న భౌగోళిక స్థితులను కూడా గమనికలో చేర్చి ఉంటే బావుణ్ణు అనిపిస్తుంది. ఇంద్రలోకం గురించి ఈ భూమండలం కాదు అని అంటారు. అది నిజమో కాదో నాకు తెలియదు. కానీ ఒక చారిత్రక సంఘటనల ఆధారంతో రూపొందించిన రామాయణ చిత్రీకరణలో రావణుడు యమలోకంపై దండయాత్రకు వెళ్లకుండా రావణున్ని, అతని గురువు ఆపినట్టుగా ఉంది. ఇక్కడ కూడా పుట్టినవారు గిట్టక మానరు అని చెప్పిన చందంలో యముడంటే మృత్యువే. కోరుకుంటూ మృత్యువును ఆహ్వానిస్తావా? అని ఆపినట్టుగా ఉంది. అది సమంజసం అనిపించింది. కారణం రావణుడి కోరిక చిరంజీవిగా ఉండాలని. కానీ రావణుడు అందుకు అనర్హుడు అని కొన్ని మెలికలతో ఆయన మృత్యువుకు ముడి వేశారు. ఇంతవరకూ చరిత్ర. బావుంది.నేను ఒక చోట చదివాను, పాతాళం అంటే భారత దేశంకు దిగువ అని. ఇక్కడ పగలు అయితే అక్కడ రాత్రి. అలాగే అక్కడ రాత్రి అయితే ఇక్కడ పగలు అని. పాతాళం అనే ప్రదేశంకు శ్రీమహావిష్ణువు రక్షకుడుగా ఉంటాడు. మీరూ రాసారు. ఇదే విషయం నేటి భౌగోళిక స్థితులను పోల్చితే అమెరికాకు మన దేశంకు మధ్య రాత్రి పగలు వేళల్లో దాదాపు 12 గంటలు వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసంను పోల్చితే నేటి అమెరికాయే ఆనాటి పాతాళం అని అనిపిస్తుంది. అలానే శ్రీమహవిష్ణువు రక్షకుడుగా అంటే ఆయన వాహనం గరుడుడు ఎక్కడుంటే అక్కడే శ్రీహరి. నేటి అమెరికా ఈ భూమండలంలో ఎదురు లేని శక్తిగా ఉంది. దాని లోగో గుర్తు కూడా గరుడ పక్షి. ఇలా అన్వేషణ చేస్తే చరిత్రకు న్యాయం. మానవుల మధ్య సామరస్యం నెలకొంటానికి పరిస్థితులు ఏర్పడవచ్చు. అలాగే ఉత్తర కొరియా వాసులకు, సీతామాత వారసులతో సంబంధం ఉన్నట్టు చదివాను. అలానే ఉత్తర కొరియా వాసులు సీతామాత జననస్థలంను వారు పవిత్ర స్థలంగా ఎంచి వస్తుంటారు, నాకు తెలిసినంతలో. తప్పులుంటే మన్నించగలరు. 🙏

  9. మనోధర్మపరాగం: ఒక మంచి నవల గురించి madhuranthakam narendra గారి అభిప్రాయం:

    04/17/2023 12:03 am

    ఈమాటలో ఈ పోస్టింగును ఆలస్యంగా చూసాను.
    మనోధర్మ పరాగం నవలకు ఆటా వాళ్ళ బహుమతిని ప్రకటించిన తర్వాత ఒక వాక్యమైనా చేర్చలేదు. రెండవ ముద్రణలో మొదటి ముద్రణలో దొర్లిన రెండు పదాలను మాత్రం సవరించడం జరిగింది.

  10. యాత్ర గురించి అ. హరిమోహన్ గారి అభిప్రాయం:

    04/15/2023 5:50 am

    ఊహా ప్రపంచం ఎక్కడ ఉందో తెలుసుకోవడం ఒక సత్యం ఐతే, దాన్ని శారీరకాతీత స్థితిలో అనుభవించడం, మీరనుభవిస్తున్నారని మీచుట్టూవున్న వారు ఆభావాతీతస్థితిలో తన్మయులవడం – ఇది కాదా సత్యం శివం సుందరం! భగవాన్ రమణుల జీవన చరమాంక ప్రభావం స్పష్టంగా కనపడుతోంది.

« 1 ... 95 96 97 98 99 ... 1555 »