Comment navigation


15547

« 1 ... 94 95 96 97 98 ... 1555 »

  1. ఊహల ఊట 24 గురించి Rama Rao Mallapragada గారి అభిప్రాయం:

    05/01/2023 10:54 pm

    ఊహల ఊట 24 నెయ్యి వేసుకు బూర్లు తిన్నంత కమ్మని రుచి!

  2. స్ఫూర్తినిచ్ఛే కథలు: శ్యామ్‌యానా గురించి వై ఎస్ పంతులు గారి అభిప్రాయం:

    05/01/2023 10:41 pm

    పరిచయం అంతగా అవసరం లేని పేరు మెడికో శ్యామ్ గురించి రచయిత్రి చాగంటి తులసిగారు చెప్పిన విధానం, పోలిక, వారి రచనా వ్యాసంగంలో వైవిథ్యం బాగుంది.

  3. కచ్చేరీ గురించి A V S Satakarny గారి అభిప్రాయం:

    05/01/2023 10:27 pm

    కధ అద్భుతంగా ఉంది!

  4. ఊహల ఊట 24 గురించి Srilakshmi Chivukula గారి అభిప్రాయం:

    05/01/2023 9:54 pm

    డా. తులసి మేడమ్ నమస్తే 🙏🌹 కార్తీక మాసం విశిష్టత అంతా దీపాలదే అంటూ కనపడే దీపాలు మధ్యగల తేడాలను సున్నితమైన చిన్నారి మనసులో చక్కగా వివరించారు. నాలుగు తరాల స్త్రీ మూర్తులు ఎంతో శ్రద్ధతో ఆలయానికి వెళ్ళడం కార్తీక సోమవారం వండిన బూరెలు, చద్ది (పులిహోర) పరమాన్నం దద్ధోజనం అంతకంటే కమ్మని తేనెలూరు తెలుగులో అందించిన మీకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, మీ చిన్న నాటి మరొక అనుభవం కోసం ఎదురు చూస్తూ…

    శ్రీలక్ష్మి చివుకుల

  5. కచ్చేరీ గురించి v.srinivasa rao గారి అభిప్రాయం:

    05/01/2023 8:43 pm

    కచ్చేరీ కనుల ముందు నిలిపేరు, చిన్నపాటి కదలికలతొ సహా, ధన్యవాదాలు సర్.

  6. స్ఫూర్తినిచ్ఛే కథలు: శ్యామ్‌యానా గురించి వంగూరి చిట్టెన్ రాజు గారి అభిప్రాయం:

    05/01/2023 1:10 pm

    2010లో శాయి రాచకొండ ప్రోద్బలంతో ఈ శ్యామ్‌యానా అనే పేరిట మెడికో శ్యామ్ కథలు ప్రచురిద్దాం అనుకున్నప్పుడే అసలు వీటిని కథలు అనాలా, రచనలు అనాలా – మనం ఏమీ అనక్కర లేదు, పాఠకులు వారికి తోచినది వారే అనేసుకుంటారులే అనుకున్నా. మొత్తానికి మెడికో శ్యామ్ కథలు అనే నిర్ణయించాం. ఇప్పుడు మీరు వాటిని కూలంకషంగా విశ్లేషించడం చాలా ఆనందంగా ఉంది. అందుకు మీకూ, మీ వ్యాసాన్ని ప్రచురించిన ఈమాట వారికీ ధన్యవాదాలు. ప్రతుల కోసం మీరు చివర ఇచ్చిన మా ఇమైల్ చిరునామా vangurifoundation@gmail.com గా సరిదిద్దుకోమని పాఠకులని కోరుతున్నాను.

    అమెరికాలో ఆ గ్రంధం ప్రతులకి ఈ క్రింది ఇమైల్‌లో కానీ, వాట్సప్‌లో కానీ సంప్రదించండి. భారత దేశంలో దొరికే చోటు: అచ్చంగాతెలుగు.

    భవదీయుడు,

    వంగూరి చిట్టెన్ రాజు
    వాట్సప్: 1 832 594 9054
    vangurifoundation@gmail.com

  7. సోల్జర్ చెప్పిన కథలు: బాటిల్ పెరేడ్ గురించి Pathakudu గారి అభిప్రాయం:

    05/01/2023 8:58 am

    చిన్న పిల్లాడెవరో వజ్రాల బస్తాని తన్నేసి విరజిమ్మేసినట్లు నల్లని ఆకాశం నిండా మిలమిలా మెరుస్తున్నాయి నక్షత్రాలు – Great Poetic expression! kudos!

  8. అహం మిగిల్చేది గురించి Rama Rao గారి అభిప్రాయం:

    04/30/2023 12:51 am

    మీ భావ కవిత “అహం మిగిల్చేది” చాల బాగుంది. అభినందనలు.

  9. వెంపరాల వారి సాహిత్య యాత్ర గురించి తటవర్తి రాజగోపబాలం ‌‌ గారి అభిప్రాయం:

    04/29/2023 7:37 pm

    మురళి గారు. నమస్తే.

    సుమారు నలబై ఏళ్ళ క్రితం నేను మహామహులు శ్రీ వెంపరాల సూర్యనారాయణ శాస్త్రిగారిని కాకినాడలో వారింటికి వెళ్లి దర్శనం చేసికొని ఒకగంటసేపు వారి సలహాలను (అప్పుడు నేను Ph.D కోసం చేస్తున్న యస్వి.జోగారావుగారి ప్రసన్న కుసుమాయుధ‌‌‌ కావ్యం గురించి) సూచనలను వినిన మహద్భాగ్యాన్ని పొందినాను.జనని భారతీదేవిని కనులార గాంచిన దివ్యానుభూతి అది.

    ఇప్పుడు మీరు పంపిన ఈ లంకెవలన వారి మాటలలో వారి సాహిత్య స్వీయచరిత్రను వినే భాగ్యం కలిగింది. ఎంత కఠోరపరిశ్రమ, ఎంత తపస్సు చేశారో! ఇట్టి మహానుభావుల అవిశ్రాంతతపఃఫలాలనే నాలాంటి వారం ఆస్వాదిస్తున్నాం. వారల ఋణం తీరేది, తీర్చగలిగేదీ కాదు.

    శతాధిక కృతజ్ఞతలతో
    రాజగోపబాలం 🙏

  10. సి. ఎస్. ఆర్. ఆంజనేయులు: కొన్ని పాటలు, పద్యాలు గురించి Rajendra Prasad Maheswaram గారి అభిప్రాయం:

    04/27/2023 9:23 pm

    తెలుగునాట అటు రంగస్థలం లోనూ ఇటు సినిమాల్లోనూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాయించకున్న విలక్షణ నటుడు వీరు. ఈ తరం వారికి వారిని గురించి పరిచయం చేయటం వారు పాడిన పద్యాలు పాటలు పరిచయం చేయటం నిజంగా ఒక గొప్ప పని. మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు. 🙏👏

« 1 ... 94 95 96 97 98 ... 1555 »