పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16393

  1. తెలుగు సినిమా పాట గురించి వేంకటేశ్వర రామిశెట్టి అభిప్రాయం:

    10/27/2024 1:37 pm

    ఎంతో చక్కగా తెలుగు పాట పూర్వఫలాలు నాటి నుంచి నేటిదాక వివరించారు సోదరా అభినందనలు 💐💐💐💐👌🏽👌🏽👍🏽
    నేను కూడా పాట రాయడం లో ప్రయత్నం చేస్తున్న వాణ్ణే

  2. నాకు నచ్చిన పద్యం: అర్జునుడి ఎత్తిపొడుపు గురించి తుర్లపాటి సత్య ప్రకాశ వేంకటచలం అభిప్రాయం:

    10/27/2024 6:03 am

    అయ్యా! పద్యమెంత ఇంపుగా ఉందో అంతకు మించి మీ వ్యాఖ్యానమూ, వివరణ అంతే సొంపుగాను ఉన్నాయి. మీ భాష చాలా బాగుంది. మీరన్నట్లు ఈ దృశ్యకావ్యాన్ని తిలకిస్తున్నంతసేపూ నన్ను నేను మరిచిపోతాను మైమరపుతో. “గలదె” అన్న పదప్రయోగం “ఆ పని చేసుకోకూడదా” లేక “అలా చెయ్యి” ని అర్థం వచ్చేలా వ్రాసారేమో అనుకుంటున్నాను ఇప్పటి వరకు. దీనిని తెలంగాణాలో ఆ ఆర్థంతోనే వాడతారు. చేయరాదె, పోరాదె అని. అలా అన్వయించుకున్నా అర్థం మారదేమో. మీ వివరణ భూతకాలమైతే, నేనంటున్నది భవిష్యత్కాలం.

  3. కొన్ని లలితగీతాలు గురించి విజయ్ మోహన్‌రాజు అభిప్రాయం:

    10/26/2024 11:21 am

    అలనాటి ఆ పాత మధుర లలిత గీతాలు వినిపించారు. ధన్యవాదాలండి
    నేను విజయ్, స్వర్గీయ కెబికె మోహన్‌రాజు గారి కనిష్ఠ పుత్రుడను.
    ఈమని శంకరశాస్త్రి గారు స్వరపరచిన రెండు పాటలు
    1. నీవే సురుచిర సుమధుర గానం రచన: కోపల్లె శివరాం గానం: కెబికెమోహన్‌రాజు, బి.వసంత
    2.నీలోని ఆశయాల రాగాల సరాగమే రచన:కోపల్లె శివరాం
    గానం: కెబికె మోహన్‌రాజు, వేదవతి ప్రభాకర్

  4. నాకు నచ్చిన పద్యం: పొలయలుక గురించి Nagaraju Kesari అభిప్రాయం:

    10/24/2024 2:20 am

    చాలా బాగున్నది.

  5. పరకాల కాళికాంబ స్వీయచరిత్ర గురించి బొల్లాప్రగడ వెంకట పద్మ రాజు అభిప్రాయం:

    10/22/2024 12:41 pm

    పరకాల కాళికాంబగారి స్వీయ చరిత్రపై శాంతిశ్రీ బెనర్జీగారి సమీక్ష చాలా బాగుంది. వారికీ, అందించిన ఈమాటకూ ధన్యవాదాలు! ఈ మాట మనసులోంచి వచ్చింది సుమండీ. నరసాపురానికి కొంగు చివరలా ఉండే కొప్పర్రు వాడిని కావటం వల్లనూ, మా ఊరు కమ్యూనిస్టు గడ్డ కావటం వల్లనూ పరకాల కుటుంబం గురించి చిన్నప్పటి నుంచీ బాగా విని ఉండటం వలన వారి ప్రస్తావన చాలా… ఆనందం కలిగించింది.

    కాళికాంబగారు ధీరమహిళ. పేదలకి ఎంతో అందుబాటులో ఉండేవారు. ఈ మాటలు ఇప్పటికీ వారి ఇల్లు ఉన్న పంజా సెంటర్ చుట్టు ప్రక్కల ఆ కాలంలో నివసించిన వాళ్ళు చెబుతూ ఉంటారు. నిజంగానే, మేధావిగా ప్రభాకర్‌గారి ఎదుగుదల గురించి ఆమె మాటల్లో వింటే ఇంకా బాగుండేది.

    ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన మహిళ కూడా భర్త ఎదుగుదలకి ఏమి చేయగలదో, తను ఎంత వరకూ ఎదగగలదో చూపించిన గొప్ప వ్యక్తి కాళికాంబగారు. ఆమెను అతి దగ్గర నుంచి చూసిన వాడిగా గర్విస్తున్నాను. జోహర్!

  6. పంచేంద్రియాలు: 1. వాసన గురించి sudha అభిప్రాయం:

    10/21/2024 8:24 pm

    Such a detailed write up. Throughly read it. Thank you.

  7. కరుణశ్రీ: తపోభంగము గురించి ఓలేటి శ్రీనివాస భాను అభిప్రాయం:

    10/21/2024 1:48 am

    గోరు వెచ్చని పాయసం లాగా ఉంది కె.వి.యస్. రామారావు గారి వారి వ్యాసం.

  8. స్మైల్ ఒఖడే… ఇహ లేడు! గురించి M.A.Khadeer అభిప్రాయం:

    10/20/2024 10:13 pm

    It was a sad development that Isnail too moved towards religion. Brahmins(some) are the red hot revolutionaries in India, like Gora gaaru,

  9. దక్షిణ అమెరికా దృశ్యమాలిక – 8 గురించి అమరేంద్ర అభిప్రాయం:

    10/20/2024 8:30 pm

    నాగేస్రావ్ గారూ
    ఇంగ్లీషు వెర్షన్లు ఉన్నాయండి
    మీ వాట్సప్ నెంబర్/ మైల్ ఐడి నాకు పంపండి (వాట్సప్9818982614)..అవి మీకు పంపుతాను.
    మీ పాపకు శుభాకాంక్షలు

  10. దక్షిణ అమెరికా దృశ్యమాలిక – 8 గురించి నాగేస్రావ్ అభిప్రాయం:

    10/18/2024 9:30 pm

    అమరేంద్ర గారూ, శేషగిరి గారు రాసిన ఈ వ్యాసాలు ఇంగ్లీష్ లో దొరుకుతాయా? మా అమ్మాయికి యాత్రలంటే చాలా ఇష్టం, కానీ తెలుగు చదవలేదు, అందుకని.