Comment navigation


15547

« 1 ... 91 92 93 94 95 ... 1555 »

  1. కొడుకులు గురించి దామెర రాజయ్య గారి అభిప్రాయం:

    05/28/2023 9:57 am

    పెద్దింటి అశోక్ గారికి అభినందనలు. కథ చాలా సహజంగా, తరుగుతున్న మానవ సంబంధాలకు అద్దం పడుతోంది.

  2. ఊహల ఊట 24 గురించి sumanaspati reddy గారి అభిప్రాయం:

    05/26/2023 6:06 am

    దినమూ రాత్రి కృత్రిమ కాంతుల మధ్య జీవిస్తున్నామిప్పుడు. ఇందులో సౌఖ్యం ఎన్ని పాళ్లు ఉన్నా, అసంగత, అనవసర కాంతి కాలుష్యం అంతకన్నా ఎక్కువే దాపురించింది ఆన్నది నిజం.

    సహజ ప్రాకృతిక స్థితికి దగ్గరగా ఉన్న జీవితంలో చీకటి వెలుగులతో మన అస్తిత్వ సంబంధం వేరు. చేతులతో తయారు చేసి వెలిగించిన నూనె దీపపు కాంతుల శారీరక సాన్నిహిత్యం, దట్టమైన అంధకార ఆవరణంలో వాటి ఉనికి, అవి విసిరే నీడల సయ్యాటలు, అవి కోరుకునే గారాబం, రక్షణ — మన ఆదిమ స్పృహకు ఎంతో దగ్గరవి. మన ఊహలకు, ఆకాంక్షలకు, వాడి ఉన్న సాంఘిక నైతిక ఆధ్యాత్మిక శోధనలకు ప్రేరకంగా నిలిచేవి, నిలువగలిగినవి ఆ చిరు దీపాలు.

    ఆ స్పృహనంతా తీరికగా తలకెత్తుకొనే కార్తీక మాసపు సంబురాల బాల్యపు జ్ఞాపకాల తేట ఊహల ఊటగా తులసి గారు చిఱునెఱిగా పట్టుకొచ్చారు ఈ రచనలో. పది కాలాల పాటు విలువైనదిగా ఉండబోతోంది ఇది!

  3. తిక్కన సోమయాజి భారత యుద్ధ కథ – ఐదవ భాగం గురించి పి.వి.రాఘవరావు గారి అభిప్రాయం:

    05/20/2023 6:18 am

    బాగుంది ఇది వరకే చాలా సార్లు మహాభారతం చదివాను ఎన్ని సార్లు చదివినా ఆసక్తి గానే ఉంటుంది. మీరు వ్రాసిన ఈ భాగం కూడా ఆసక్తికరంగా సాగింది

  4. సోల్జర్ చెప్పిన కథలు: మొదటి నెల గురించి Srinivas Bandaa గారి అభిప్రాయం:

    05/19/2023 9:14 am

    వెంకీ గారూ, మీ అభినందనని ఆలస్యంగా చూశాను. Thank you.

  5. మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి Sreenivas Paruchuri గారి అభిప్రాయం:

    05/17/2023 10:19 am

    కామేశ్వరరావుగారు: బంగోరె “బ్రౌన్ జాబులు తెలుగు జర్నలిజం చరిత్ర 1832 నుండి 1857 దాక” అన్న పుస్తకాన్ని అప్పట్లో, అంటే 1973 లో, స్వయంగా ప్రచురించుకున్నారు. అది మార్కెట్లో ఇంకా దొరుకుతుందని అనుకోను. ఆయన స్వయంగా వేసుకున్న పుస్తకాలేవీ మార్కెట్లో అందుబాటులో లేవు. ఈ పుస్తకాన్ని ఎవరైనా (DLI, మనసు ఫౌండేషన్, సుందరయ్య లైబ్రరీ, …) scan చేశారేమో నాకు తెలియదు. నేను మీకు కాపీ ఇవ్వగలను. నా E-Mail: sreeni at gmx.de

  6. ముక్తచ్ఛంద కవిత – కొన్ని మౌలిక సమస్యలు గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:

    05/16/2023 10:24 am

    మంచి వ్యాసం.

    కాని ఈ తెలుగువ్యాసంలో సంస్కృతపదాడంబరం హెచ్చుగా ఉన్న వాక్యాలను తొలగించితే మనకు చివరకు ఒక్క వాక్యం కూడా మిగలదు. ఆ విషయం అటుంచితే ఆలోచనీయమైన అంశాలు చాలానే ఉన్నాయి.

    వచనకవిత్వప్రక్రియ బలపడి స్థిరపడిందని ఆలోచించి సంతోషించాలో అది వెఱ్ఱితలలు వేసి కవిత్వానికి చదువరులు కరువయ్యారని విచారించాలో తెలియకుండా ఉంది.

  7. నన్నెచోడుని కళావిలాసము: కొన్ని చర్చనీయాంశాలు గురించి Anappindi Surya Lakshmi kameswara rao గారి అభిప్రాయం:

    05/16/2023 4:45 am

    నన్నెచూడుని కుమార సంభవంలో సతి, శివుడు ఏనుగు రూపంలో ఉన్నప్పుడు జన్మించినవాడు గణేశుడని ఉంది.

    మనకి తెలిసిన కధ పార్వతి వినాయకుడి బొమ్మ చేసి గణేశుడయ్యాడని.

    ఏది అసలైనది?

  8. స్ఫూర్తినిచ్ఛే కథలు: శ్యామ్‌యానా గురించి విన్నకోట రవిశంకర్ గారి అభిప్రాయం:

    05/14/2023 6:11 pm

    ప్రియ మిత్రులు డా.శ్యామ్‌తో తగుమాత్రం పరిచయం ఉన్నవారెవరైనా ఈ వ్యాసంలో చేసిన గుణవర్ణనతోను, ఆయన కథల స్వభావం గురించి రాసిన వాక్యాలతోను తప్పక ఏకీభవిస్తారు. మనకు చాలా ఇష్టమైన రచయితల విషయంలో రెండు రకాల భావాలు కలిగే ఆస్కారం ఉంది. కొందరి విషయంలో వారు మరికొంత రాస్తే బాగుంటుందని, మరి కొందరి విషయంలో వారిక రాయటం ఆపేస్తే బాగుంటుందని. శ్యామ్ మరింత ఎక్కువగా రాయాలనేదే నా కోరిక. ఎవరు చదువుతారు, ఏమి ప్రయోజనం అన్న చర్చ తరువాత. రాయటం వరకే మన పని. విపులాచ పృథ్వీ అన్నది అందుకే కదా!

    రాస్తూ ఉండటానికి ప్రగతిశీల దృక్పథం విధిగా ఉండవలసిన అవసరం కూడా లేదేమో. ప్రపంచం అసంబద్ధమని, జీవితం విషాద భరితమని భావించినా, దానిని గురించే రచనలు చెయ్యవచ్చు. రాయటానికి ముఖ్యంగా కావలసినది హృదయ భారం. అది ఉంటే చాలు, దానిని తీర్చుకోవటానికి రాయాలనిపిస్తుంది. సృజనాత్మక సాహిత్యం కాకపోతే, ఆయన సంభాషణల్లో కోకొల్లలుగా వినిపించే అనుభవాల గురించైనా రాయవచ్చు. వ్యాసాన్ని పుస్తక సమీక్ష అన్నారు గాని, చదివిన వారికి ఇది ఏదో ప్రత్యేకమైన సందర్భంలో రాసినట్టుగా అనిపించే అవకాశం ఉంది. బహుశా తులసిగారికి శ్యామ్ మీద ఉన్న వాత్సల్యం దానికి కారణం కావచ్చు. ఆత్మీయులైన, ప్రయోజకులైన చిన్నవాళ్ళని గురించి చెప్పేటప్పుడు కొందరి కళ్ళలో మెరుపు కనిపిస్తుంది. అటువంటి మెరుపేదో ఈ వ్యాసంలో ఉంది.

  9. గంధర్వులెవరు? గురించి శ్రీనాథ్ గారి అభిప్రాయం:

    05/14/2023 12:08 pm

    మీ లాజిక్ బాగుంది. ఇలా జరిగి ఉండొచ్చన్న ఒక పరిశోధన ఎప్పటికైనా అవసరమే. రాముడు, కృష్ణుడు గొప్ప కార్యాలు చేసి ఉంటారు కాబట్టి దేవుళ్లు అయ్యారేమో. ఈ చరిత్రను మరింత శోధించాల్సిన సమయం వచ్చింది.

  10. ప్రాచీన తెలుగు కొలమానం గురించి సుధాకర baabu గారి అభిప్రాయం:

    05/14/2023 5:14 am

    Highly informative with Excellent information.

« 1 ... 91 92 93 94 95 ... 1555 »