ఆత్మ కాకి — మనసుని పూర్తిగా జో కొట్టి సగటు మానసిక పరిణతితో జీవనం గడపలేక, అలాగని తన అంతరాత్మను తాను సంపూర్ణంగా అవగాహన చేసుకోలేక ,అర్ధజ్ఞానంతో బ్రతికేస్తూన్న సమాజం లోని చాలా మందిని ఉపేక్షించలేక, చీకాకు పడిపోతున్న బుద్ధి జీవి కథ.
సీతాయనం గురించి నల్లపనేని విజయలక్ష్మి గారి అభిప్రాయం:
చాల బావుంది, రియల్లీ గుడ్ ఆర్టిక్యులేషన్. మై బెస్ట్ విషెస్ టు యు.
అంతర్థానం గురించి పాణిని జన్నాభట్ల గారి అభిప్రాయం:
06/03/2023 9:40 am
ధన్యవాదాలు అందరికీ 🙏
ఊహల ఊట 25 గురించి sumanaspati reddy గారి అభిప్రాయం:
06/03/2023 6:57 am
ఈమాటలో ప్రతినెలా మొదట్లో చాగంటి తులసి గారి ఊహల ఊట కొత్త గల్పిక వెలువడినప్పుడల్లా, పేజీలు వెనక్కి తిప్పి ఇంతకుముందు వచ్చిన వాటిలో కొన్నైనా తిరిగి చదవక తప్పని ఒక విచిత్ర పరిస్థితి ఎదురవుతోంది నాకు: ఈవిడ ఏవిటేవిటి చేస్తోంది వీటిల్లో అని మరోసారి చూసుకోవాల్సి రావడం!
నడి ఎనభయిలు దాటిన ముదిమి వయస్సులో, శారీరక రుగ్మతల పెనుబలాన్ని తోసిరాజని, ఒక రచయిత్రి ఇలాంటి పోకడ పోవడమే ఒక బహు అరుదైన విచిత్ర విషయం! పైగా మార్క్సిస్టు సామాజిక దృక్పథంతో రాసే ఒక రచయిత్రి చాలా పరిశీలించి విశ్లేషించి ఆలోచించి రాసిన రచనల్లా కాకుండా ఇవి ఒక ప్రవాహ గతిలో ఉబికి వస్తున్న ఊటల్లా ఉన్నాయాయె!
1940ల్లో విజయనగరమనే ఒక ఉత్తరాంధ్ర చిన్న పట్టణంలో ఆధునిక చైతన్యాన్ని కూడా సంతరించుకున్న ఒక మధ్య వర్గ ‘సద్బ్రాహ్మణ’ కుటుంబంలో పెరుగుతున్న చలాకీ చురుకు అమ్మాయి చెప్పుకోకుండా ఉండలేకపోతున్న అనుభవాలు, ఆలోచనల జలతారుల అల్లిక జిగిబిగి ఈ గల్పికలు సరే!
అయితే ఈ గల్పికలు చదివి, తులసి గారు ఈ బాల్య జ్ఞాపకాలల్లో మార్క్సిజం మరిచి సంప్రదాయ భారతీయ జీవన శైలి చక్కందనాలూ, కమ్మని రుచులూ వర్ణించే పనిలో పడ్డారు అని చాలామంది త్వరపడి అనుకునే ప్రమాదం ఉంది. కానీ కొద్దిగా ఆగుతూ చూస్తే ఈ అమ్మాయి ‘మహ’ వర్ణనలూ, వ్యాఖ్యల్లోంచి పలు మౌలిక విషయాలు సరికొత్త రీతుల్లో సరికొత్త సంబంధాల పేర్పులతో మనకు కనిపించడం మొదలుపెడతాయి. ఈ భాగంలో బామ్మ చెప్పిన ‘లక్షింవార’ కథ, మన సంప్రదాయ జీవనంలో అనేక రూపాల్లో ప్రాచుర్యంలో ఉన్న కథా కథన ప్రక్రియలు ఎంత తీవ్రమైన సామాజిక నైతిక విమర్శనా దృష్టిని కూడా అందించేవో అన్న దానికి ఒక గొప్ప ఉదాహరణగా దర్శనమిస్తుంది.
ఎప్పుడైనా విమర్శ లేకుండా కథ ఉంటుందా? విమర్శ తగిలేలా చెప్పనిది కథనం అవుతుందా, అని ప్రశ్నిస్తోంది ఈ గల్పిక!
ఇంకెన్నో సొగసులు కూడా ఉన్నాయి ఈ గల్పికలోనే. వాటన్నింటినీ ఇప్పుడు వివరించడం కన్నా రచయిత ధర్మాన్ని, రచన ధర్మాన్ని చక్కగా సాధిస్తున్నారు సరికొత్తగా ఈ వయసులోనూ తులసిగారు అని చెప్తే సరిపోతుంది అనుకుంటా!!!
పదాలతో పెనవేసుకొని ఉండే conventional మూసల ఇమాజినేషన్‌ని సదా ప్రతిఘటిస్తూ పదాలకి ఆవలి భావాన్ని తోడితెచ్చి, చదువరికి అనుభవం చేసే auditory imagination నిండి ఉన్న మీ కవిత ‘వలలెందుకు?’ (టైటిల్ బాలేదు గానీ) గొప్పగా ఉంది. ఇటువంటి మంచికవితలు అరుదుగానైనా ఈమాటలో కనబడటం బాగుంది.
ఈమాట శీర్షికల్లో ఒక్క ‘కవితలు’ మినహా, మిగతా genresలో ఉత్తమాభిరుచి, ఉన్నత ప్రమాణాలూ కనబడుతుంటాయి. ఇందులో రాసేవాళ్లు, కామెంట్లు చేసేవాళ్లు, చర్చోపచర్చల్లో కలబడేవాళ్లు, ఈ ఈమాట నిర్వాహకులతో సహా ఒక Finite Set (గణిత పరిభాష) లాగా, నిలయవిద్వాంసుల బృందం! ఆధునిక – ఆధునికోత్తర కవిత dictionకి ఆ finite set అలవాటు పడకపోయినా, ఇస్మాయిల్ గారి వంటి కవులకి ఈమాటలో స్థానం దక్కడానికి కారణం – బహుశా వేల్చేరు నారాయణరావు గారి వంటి ఒకరిద్దరు scholars, connoisseurs of modern poetry అసోసియేషన్ వల్ల కామోసు.
మోహనరావుగారికి శిరసు వంచి, పాదాభివందనములు అర్పిస్తున్నాను. చర్చలలో పాల్గొన్న పండితవర్గానికి కైమోడ్పులు. మీరు ఛందశ్శాస్త్రముపై ప్రదర్శించిన పరిశోధనా వ్యాసము అత్యద్భుతము. నాకు మీ వ్యాసము చదివాక ఛందశ్శాస్త్రము మోక్ష సాధకము అనే నా విశ్వాసమునకు ఊతము చిక్కినది. ఈ వ్యాసములో “ఆత్మ పరమాత్మను చేరు సాధకము ఛందశ్శాస్త్రము” అని నా అంతరంగ పరిశోధన, నా తపన ఎంతో కాలంగా వేధిస్తూ ఉంది. ఈ వ్యాసం నాకు చాలా ఊతం ఇచ్చింది. మీ ఛందశ్శాస్త్ర పరిశోధనలు నాకు కావాలి. మెయిల్కు పంపినా సరే! ఎలా లభ్యమవుతాయో దారి చూపగలరు. నాకు మోక్షైకసాధకము ఛందశ్శాస్త్రము అని పరిపూర్ణ నమ్మకముంది.
ఉదాహరణ: 1. భుజంగ ప్రయాతము ఛందస్సు. సర్పపు నడక. అనగా మూలాధారమునుండి సహస్రార పరమాత్మను చేరు సాధనము భుజంగ ప్రయాతము. పంచభూతతథ్వాలను అధిగమించి, వానిపై గల మనసును శూన్యమును చేసి, సుమన దాటి, ఉన్మనను ప్రవేశించి, సహస్రారబిందు పరమాత్మ దర్శనమే భుజంగ ప్రయాతపుటాంతర్యము. అందుకే శంకరులు మానవులను భుజంగప్రయాతములో ఆ యా దైవాలను స్తుతించి, కుండలినీ చైతన్యముపొంది, ఊర్ధ్వగామియై, బ్రహ్మరంధ్రము విచ్ఛిన్నమై విశ్వవిరాట్లో చేరాలని విశ్వహితైక దృష్టితో శంకరులు మనకోసం రచించారు. శంకరుల అద్వైత పునః ప్రతిష్ఠత్వానికి అత్యంత బలీయమైన ఉదాహరణ.
మరొక ఉదాహరణ: శంకరుల ప్రథమమైన ఆశు శ్లోకము వసంతతిలకము “అంగం హరేః పులక….” అనునది. ఆ మొదటి ‘అం’ బ్రహ్మను ‘గం’ పొందించేది. అని వారి జీవితసందేశమును మానవుల జీవితాలు ఆధ్యాత్మిక వసంతంలా విరియాలని, పద్మములై అంటని సరోజములై అద్వైత సిద్ధి పొందాలని వారి హృదయసారమని నా విశ్వాసము. ఇలా చూస్తే ఒక్కోఛందమునకు ఒక్కో అధిదేవత ఉంటాడు. 26 ఛందస్సులు సంస్కృతములో. 26 మంది దేవతల శక్తి ఆ యా 26 ఛందాలలో కప్పబడి ఉండి, “ఆచ్ఛాదనే, ఆహ్లాదనే” అను ఛందోనామ సార్థకతను సంతరించుకున్నాయి. వాల్మీకి రామాయణంలో గాయత్రిని నిబద్ధించారు. శంకరులు కైలాస దర్శనంలో అమ్మ ఇచ్చిన సౌందర్యలహరి లో నందీశ్వరుడు 59 శ్లోకాలు శంకరునివద్దనుండి లాక్కొనిపోతే, శంకరులు అమ్మతో మొరపెట్టుకుంటే అమ్మ నువ్వు 59 వ్రాయి అని కటాక్షించింది. 41+59=100. శిఖరిణి ఛందస్సు. అమ్మ హిమజ. కైలాసపతి సహచరి. శిఖర సంచారిణి. కనుక ‘శిఖరిణి” రూపంలో జగన్మాత దర్శనమిచ్చింది. సౌందర్యలహరి అనుభవిస్తే మన సహస్రారశిఖరములో గోచరిస్తుంది. మోక్షము చేకూరుతుంది.
కావ్యకంఠగణపతిముని ఇంద్రాణీసప్తశతిని ఏడు వైదిక ఛందస్సులలో స్తుతిస్తూ వ్రాసారు. అది ఒక వైపు భరత జాతి విముక్తి. భరత సంఘ బానిసత్వ విముక్తి. దేహవిముక్తి. అలౌకికభక్తి పరాకాష్ఠ, లౌకికంలోనూ ప్రదర్శించిన సిద్ధుడు. తపస్వి, ఉపాసకుడు. మహోత్తుంగశిఖరం. లౌకికాలౌకిత్వములసవ్యసాచి ప్రపంచములో లేడు. ఇంకా ఇలా ఆలోచిస్తే ఒక కవి, ఉత్పలమాల, శార్దూల, మత్తేభాలతో స్తుతి చేసాడంటే సత్వగుణమాలిన్యం, రజోగుణ మాలిన్యం, తమోగుణమాలిన్యం తొలగి “నిస్త్రైగుణ్యో భవ అర్జున!” అన్న గీతాసందేశం, ఛందశ్శాస్త్రము మోక్షప్రదమని ఋజువవుతుంది.శంకరుల స్తోత్ర సాహిత్యజగమంతా దాదాపు 20 వృత్తములలో ఉన్న తీరు మంత్రోపాసనాది గర్భితమై మోక్షైకసాధనము, అద్వైత సిద్ధి సోపానము ఛందశ్శాస్త్రము అని ఋజువవుతుంది. బుధజనులు దొసగులను మన్నించండి.అవి గరళము. అమృతం ఆస్వాదించండి.
ఆర్యా! మరో ఉదాహరణ: పంచచామరము. శకరులవారు గణేశపంచరత్నమును “ముదాకరాత్తమోదకం…. అని అలాగే ‘నర్మదాష్టకమును’ పంచచామరము’ వృత్తములో రచించారు. పంచచామరములో విశేషముంది. చామరము చమరీమృగపు వెంట్రుకలతో తయారు చేసినది. చమరీమృగము సత్వగుణానికి ప్రతీక. ఆ రోమాలు కూడా సత్వసంజాతములు. పరమాత్మ గణేశుడు కాని, జీవనది నర్మదానది గాని ప్రాణదాతలు. గణేశుడు మూలాధారమందు ఉన్న గణేశుడు. ఆయనను ఆరాధిస్తే గాని కుండలినీ చైతన్యము ఊర్ధ్వగామి కాదు. ఆయనను ఆరాధించాలి. ప్రసన్నుడు కావాలి. ఆయనను సర్వాత్మనా రుక్మిణీదేవి, ప్రహ్లాదుడు సర్వేంద్రియములతో పరమాత్మను సేవించారు. ఇంద్రియాలను అంకితం చేసి స్వామిని శూన్యమనసున దర్శించారు. పరమాత్మ కరుణించి, అటు గజేంద్రుని అందరు భక్తులను పంచేంద్రియములతో సర్వసమర్పణ భావముతో ” తుభ్యమ్ నమః, న మమ” భావంతో సేవించారు. అలాంటి సేవనే పంచేంద్రియములతో నర్మదాదేవిని స్తుతిస్తే అమ్మ కమండలము లోనికి వచ్చి రక్షించింది. అలాగే గణేశుని అలాగే పంచేంద్రియములతో ఆరాధిస్తే పరమాత్మ సాయుజ్యం లభ్యం. కనుక పంచ, అనగా ఐదు ఇంద్రియములను సత్వసంయుతచిత్తముతో ఆ ఇంద్రియములనే చామరములుగా చేసి, అటు గణేశుని, నర్మదను సేవించి, తమను భగవంతునకు అర్పణము గావించుకున్నారు. పంచేంద్రియములు ప్రపంచ వాసనలు విసర్జించి, గణేశ, నర్మదలను పంచేంద్రియ సేవ అంతేగాక పంచ అనగా విస్తారం సమస్తదేహాన్ని సర్వాంగాలతో అటు జ్ఞానేంద్రియములు, ఇటు కర్మేంద్రియాలు అన్నిటితో మెప్పు పొంది తరించి, ధన్యులై, మానవులను పంచ చామర వృత్తములతో దేవతలను పంచేంద్రియ సమర్పణముతో సేవించి తరించండి అని ఛందస్సు మోక్షసాధకమని ఆదిశంకర భగవత్పాదులు మనకు దివ్యబోధ గావించారు. ఈ పరమాత్మ సాయుజ్య ప్రాప్తి, ఛందస్సు ద్వారా సాధ్యమని శ్రీ గురువర్యులు మోహనరావు గారు నాకు ఈ అభిప్రాయమంజరిని పంచుకొనుటకు దేశికులైన వారి చరణారవిందములకు మరో మారు వందనములర్పిస్తూ, మీతో కలిసి నడచిన పండిత బృందమునకు ఐదు పది చేసి వినయపూర్వకముగా నమస్కరిస్తూ.
ఛందస్సు పై పరిశోధనాగ్రంథాలు సూచించగలరు. లభ్యములగు విధము తెలుపండి.
గుర్రాల మావయ్య గురించి A Suresh గారి అభిప్రాయం:
06/04/2023 8:43 am
మంచి రచన. ధన్యవాదాలు.
ఆత్మకాకి గురించి vidyasaagar గారి అభిప్రాయం:
06/04/2023 6:17 am
ఆత్మ కాకి — మనసుని పూర్తిగా జో కొట్టి సగటు మానసిక పరిణతితో జీవనం గడపలేక, అలాగని తన అంతరాత్మను తాను సంపూర్ణంగా అవగాహన చేసుకోలేక ,అర్ధజ్ఞానంతో బ్రతికేస్తూన్న సమాజం లోని చాలా మందిని ఉపేక్షించలేక, చీకాకు పడిపోతున్న బుద్ధి జీవి కథ.
సీతాయనం గురించి నల్లపనేని విజయలక్ష్మి గారి అభిప్రాయం:
06/04/2023 12:54 am
హృదయపూర్వక ధన్యవాదాలు పద్మావతి గారు.
అంతర్థానం గురించి నళిని ఎర్ర గారి అభిప్రాయం:
06/03/2023 1:12 pm
ఆగని కన్నీటిధార
చాలా బాగుంది.
అంతర్థానం గురించి Srisudha గారి అభిప్రాయం:
06/03/2023 10:19 am
చాల బావుంది, రియల్లీ గుడ్ ఆర్టిక్యులేషన్. మై బెస్ట్ విషెస్ టు యు.
అంతర్థానం గురించి పాణిని జన్నాభట్ల గారి అభిప్రాయం:
06/03/2023 9:40 am
ధన్యవాదాలు అందరికీ 🙏
ఊహల ఊట 25 గురించి sumanaspati reddy గారి అభిప్రాయం:
06/03/2023 6:57 am
ఈమాటలో ప్రతినెలా మొదట్లో చాగంటి తులసి గారి ఊహల ఊట కొత్త గల్పిక వెలువడినప్పుడల్లా, పేజీలు వెనక్కి తిప్పి ఇంతకుముందు వచ్చిన వాటిలో కొన్నైనా తిరిగి చదవక తప్పని ఒక విచిత్ర పరిస్థితి ఎదురవుతోంది నాకు: ఈవిడ ఏవిటేవిటి చేస్తోంది వీటిల్లో అని మరోసారి చూసుకోవాల్సి రావడం!
నడి ఎనభయిలు దాటిన ముదిమి వయస్సులో, శారీరక రుగ్మతల పెనుబలాన్ని తోసిరాజని, ఒక రచయిత్రి ఇలాంటి పోకడ పోవడమే ఒక బహు అరుదైన విచిత్ర విషయం! పైగా మార్క్సిస్టు సామాజిక దృక్పథంతో రాసే ఒక రచయిత్రి చాలా పరిశీలించి విశ్లేషించి ఆలోచించి రాసిన రచనల్లా కాకుండా ఇవి ఒక ప్రవాహ గతిలో ఉబికి వస్తున్న ఊటల్లా ఉన్నాయాయె!
1940ల్లో విజయనగరమనే ఒక ఉత్తరాంధ్ర చిన్న పట్టణంలో ఆధునిక చైతన్యాన్ని కూడా సంతరించుకున్న ఒక మధ్య వర్గ ‘సద్బ్రాహ్మణ’ కుటుంబంలో పెరుగుతున్న చలాకీ చురుకు అమ్మాయి చెప్పుకోకుండా ఉండలేకపోతున్న అనుభవాలు, ఆలోచనల జలతారుల అల్లిక జిగిబిగి ఈ గల్పికలు సరే!
అయితే ఈ గల్పికలు చదివి, తులసి గారు ఈ బాల్య జ్ఞాపకాలల్లో మార్క్సిజం మరిచి సంప్రదాయ భారతీయ జీవన శైలి చక్కందనాలూ, కమ్మని రుచులూ వర్ణించే పనిలో పడ్డారు అని చాలామంది త్వరపడి అనుకునే ప్రమాదం ఉంది. కానీ కొద్దిగా ఆగుతూ చూస్తే ఈ అమ్మాయి ‘మహ’ వర్ణనలూ, వ్యాఖ్యల్లోంచి పలు మౌలిక విషయాలు సరికొత్త రీతుల్లో సరికొత్త సంబంధాల పేర్పులతో మనకు కనిపించడం మొదలుపెడతాయి. ఈ భాగంలో బామ్మ చెప్పిన ‘లక్షింవార’ కథ, మన సంప్రదాయ జీవనంలో అనేక రూపాల్లో ప్రాచుర్యంలో ఉన్న కథా కథన ప్రక్రియలు ఎంత తీవ్రమైన సామాజిక నైతిక విమర్శనా దృష్టిని కూడా అందించేవో అన్న దానికి ఒక గొప్ప ఉదాహరణగా దర్శనమిస్తుంది.
ఎప్పుడైనా విమర్శ లేకుండా కథ ఉంటుందా? విమర్శ తగిలేలా చెప్పనిది కథనం అవుతుందా, అని ప్రశ్నిస్తోంది ఈ గల్పిక!
ఇంకెన్నో సొగసులు కూడా ఉన్నాయి ఈ గల్పికలోనే. వాటన్నింటినీ ఇప్పుడు వివరించడం కన్నా రచయిత ధర్మాన్ని, రచన ధర్మాన్ని చక్కగా సాధిస్తున్నారు సరికొత్తగా ఈ వయసులోనూ తులసిగారు అని చెప్తే సరిపోతుంది అనుకుంటా!!!
వలలెందుకు? గురించి నరేష్ నున్నా గారి అభిప్రాయం:
06/03/2023 12:00 am
పదాలతో పెనవేసుకొని ఉండే conventional మూసల ఇమాజినేషన్‌ని సదా ప్రతిఘటిస్తూ పదాలకి ఆవలి భావాన్ని తోడితెచ్చి, చదువరికి అనుభవం చేసే auditory imagination నిండి ఉన్న మీ కవిత ‘వలలెందుకు?’ (టైటిల్ బాలేదు గానీ) గొప్పగా ఉంది. ఇటువంటి మంచికవితలు అరుదుగానైనా ఈమాటలో కనబడటం బాగుంది.
ఈమాట శీర్షికల్లో ఒక్క ‘కవితలు’ మినహా, మిగతా genresలో ఉత్తమాభిరుచి, ఉన్నత ప్రమాణాలూ కనబడుతుంటాయి. ఇందులో రాసేవాళ్లు, కామెంట్లు చేసేవాళ్లు, చర్చోపచర్చల్లో కలబడేవాళ్లు, ఈ ఈమాట నిర్వాహకులతో సహా ఒక Finite Set (గణిత పరిభాష) లాగా, నిలయవిద్వాంసుల బృందం! ఆధునిక – ఆధునికోత్తర కవిత dictionకి ఆ finite set అలవాటు పడకపోయినా, ఇస్మాయిల్ గారి వంటి కవులకి ఈమాటలో స్థానం దక్కడానికి కారణం – బహుశా వేల్చేరు నారాయణరావు గారి వంటి ఒకరిద్దరు scholars, connoisseurs of modern poetry అసోసియేషన్ వల్ల కామోసు.
ఆత్మకాకి గురించి రఘు గారి అభిప్రాయం:
06/02/2023 5:56 am
అంతులేని కధ.
శంకరాచార్యుల రచనలో ఛందస్సు వైభవము గురించి రంగావజ్ఝల మురళీధరరావు గారి అభిప్రాయం:
06/02/2023 3:54 am
మోహనరావుగారికి శిరసు వంచి, పాదాభివందనములు అర్పిస్తున్నాను. చర్చలలో పాల్గొన్న పండితవర్గానికి కైమోడ్పులు. మీరు ఛందశ్శాస్త్రముపై ప్రదర్శించిన పరిశోధనా వ్యాసము అత్యద్భుతము. నాకు మీ వ్యాసము చదివాక ఛందశ్శాస్త్రము మోక్ష సాధకము అనే నా విశ్వాసమునకు ఊతము చిక్కినది. ఈ వ్యాసములో “ఆత్మ పరమాత్మను చేరు సాధకము ఛందశ్శాస్త్రము” అని నా అంతరంగ పరిశోధన, నా తపన ఎంతో కాలంగా వేధిస్తూ ఉంది. ఈ వ్యాసం నాకు చాలా ఊతం ఇచ్చింది. మీ ఛందశ్శాస్త్ర పరిశోధనలు నాకు కావాలి. మెయిల్కు పంపినా సరే! ఎలా లభ్యమవుతాయో దారి చూపగలరు. నాకు మోక్షైకసాధకము ఛందశ్శాస్త్రము అని పరిపూర్ణ నమ్మకముంది.
ఉదాహరణ: 1. భుజంగ ప్రయాతము ఛందస్సు. సర్పపు నడక. అనగా మూలాధారమునుండి సహస్రార పరమాత్మను చేరు సాధనము భుజంగ ప్రయాతము. పంచభూతతథ్వాలను అధిగమించి, వానిపై గల మనసును శూన్యమును చేసి, సుమన దాటి, ఉన్మనను ప్రవేశించి, సహస్రారబిందు పరమాత్మ దర్శనమే భుజంగ ప్రయాతపుటాంతర్యము. అందుకే శంకరులు మానవులను భుజంగప్రయాతములో ఆ యా దైవాలను స్తుతించి, కుండలినీ చైతన్యముపొంది, ఊర్ధ్వగామియై, బ్రహ్మరంధ్రము విచ్ఛిన్నమై విశ్వవిరాట్లో చేరాలని విశ్వహితైక దృష్టితో శంకరులు మనకోసం రచించారు. శంకరుల అద్వైత పునః ప్రతిష్ఠత్వానికి అత్యంత బలీయమైన ఉదాహరణ.
మరొక ఉదాహరణ: శంకరుల ప్రథమమైన ఆశు శ్లోకము వసంతతిలకము “అంగం హరేః పులక….” అనునది. ఆ మొదటి ‘అం’ బ్రహ్మను ‘గం’ పొందించేది. అని వారి జీవితసందేశమును మానవుల జీవితాలు ఆధ్యాత్మిక వసంతంలా విరియాలని, పద్మములై అంటని సరోజములై అద్వైత సిద్ధి పొందాలని వారి హృదయసారమని నా విశ్వాసము. ఇలా చూస్తే ఒక్కోఛందమునకు ఒక్కో అధిదేవత ఉంటాడు. 26 ఛందస్సులు సంస్కృతములో. 26 మంది దేవతల శక్తి ఆ యా 26 ఛందాలలో కప్పబడి ఉండి, “ఆచ్ఛాదనే, ఆహ్లాదనే” అను ఛందోనామ సార్థకతను సంతరించుకున్నాయి. వాల్మీకి రామాయణంలో గాయత్రిని నిబద్ధించారు. శంకరులు కైలాస దర్శనంలో అమ్మ ఇచ్చిన సౌందర్యలహరి లో నందీశ్వరుడు 59 శ్లోకాలు శంకరునివద్దనుండి లాక్కొనిపోతే, శంకరులు అమ్మతో మొరపెట్టుకుంటే అమ్మ నువ్వు 59 వ్రాయి అని కటాక్షించింది. 41+59=100. శిఖరిణి ఛందస్సు. అమ్మ హిమజ. కైలాసపతి సహచరి. శిఖర సంచారిణి. కనుక ‘శిఖరిణి” రూపంలో జగన్మాత దర్శనమిచ్చింది. సౌందర్యలహరి అనుభవిస్తే మన సహస్రారశిఖరములో గోచరిస్తుంది. మోక్షము చేకూరుతుంది.
కావ్యకంఠగణపతిముని ఇంద్రాణీసప్తశతిని ఏడు వైదిక ఛందస్సులలో స్తుతిస్తూ వ్రాసారు. అది ఒక వైపు భరత జాతి విముక్తి. భరత సంఘ బానిసత్వ విముక్తి. దేహవిముక్తి. అలౌకికభక్తి పరాకాష్ఠ, లౌకికంలోనూ ప్రదర్శించిన సిద్ధుడు. తపస్వి, ఉపాసకుడు. మహోత్తుంగశిఖరం. లౌకికాలౌకిత్వములసవ్యసాచి ప్రపంచములో లేడు. ఇంకా ఇలా ఆలోచిస్తే ఒక కవి, ఉత్పలమాల, శార్దూల, మత్తేభాలతో స్తుతి చేసాడంటే సత్వగుణమాలిన్యం, రజోగుణ మాలిన్యం, తమోగుణమాలిన్యం తొలగి “నిస్త్రైగుణ్యో భవ అర్జున!” అన్న గీతాసందేశం, ఛందశ్శాస్త్రము మోక్షప్రదమని ఋజువవుతుంది.శంకరుల స్తోత్ర సాహిత్యజగమంతా దాదాపు 20 వృత్తములలో ఉన్న తీరు మంత్రోపాసనాది గర్భితమై మోక్షైకసాధనము, అద్వైత సిద్ధి సోపానము ఛందశ్శాస్త్రము అని ఋజువవుతుంది. బుధజనులు దొసగులను మన్నించండి.అవి గరళము. అమృతం ఆస్వాదించండి.
ఆర్యా! మరో ఉదాహరణ: పంచచామరము. శకరులవారు గణేశపంచరత్నమును “ముదాకరాత్తమోదకం…. అని అలాగే ‘నర్మదాష్టకమును’ పంచచామరము’ వృత్తములో రచించారు. పంచచామరములో విశేషముంది. చామరము చమరీమృగపు వెంట్రుకలతో తయారు చేసినది. చమరీమృగము సత్వగుణానికి ప్రతీక. ఆ రోమాలు కూడా సత్వసంజాతములు. పరమాత్మ గణేశుడు కాని, జీవనది నర్మదానది గాని ప్రాణదాతలు. గణేశుడు మూలాధారమందు ఉన్న గణేశుడు. ఆయనను ఆరాధిస్తే గాని కుండలినీ చైతన్యము ఊర్ధ్వగామి కాదు. ఆయనను ఆరాధించాలి. ప్రసన్నుడు కావాలి. ఆయనను సర్వాత్మనా రుక్మిణీదేవి, ప్రహ్లాదుడు సర్వేంద్రియములతో పరమాత్మను సేవించారు. ఇంద్రియాలను అంకితం చేసి స్వామిని శూన్యమనసున దర్శించారు. పరమాత్మ కరుణించి, అటు గజేంద్రుని అందరు భక్తులను పంచేంద్రియములతో సర్వసమర్పణ భావముతో ” తుభ్యమ్ నమః, న మమ” భావంతో సేవించారు. అలాంటి సేవనే పంచేంద్రియములతో నర్మదాదేవిని స్తుతిస్తే అమ్మ కమండలము లోనికి వచ్చి రక్షించింది. అలాగే గణేశుని అలాగే పంచేంద్రియములతో ఆరాధిస్తే పరమాత్మ సాయుజ్యం లభ్యం. కనుక పంచ, అనగా ఐదు ఇంద్రియములను సత్వసంయుతచిత్తముతో ఆ ఇంద్రియములనే చామరములుగా చేసి, అటు గణేశుని, నర్మదను సేవించి, తమను భగవంతునకు అర్పణము గావించుకున్నారు. పంచేంద్రియములు ప్రపంచ వాసనలు విసర్జించి, గణేశ, నర్మదలను పంచేంద్రియ సేవ అంతేగాక పంచ అనగా విస్తారం సమస్తదేహాన్ని సర్వాంగాలతో అటు జ్ఞానేంద్రియములు, ఇటు కర్మేంద్రియాలు అన్నిటితో మెప్పు పొంది తరించి, ధన్యులై, మానవులను పంచ చామర వృత్తములతో దేవతలను పంచేంద్రియ సమర్పణముతో సేవించి తరించండి అని ఛందస్సు మోక్షసాధకమని ఆదిశంకర భగవత్పాదులు మనకు దివ్యబోధ గావించారు. ఈ పరమాత్మ సాయుజ్య ప్రాప్తి, ఛందస్సు ద్వారా సాధ్యమని శ్రీ గురువర్యులు మోహనరావు గారు నాకు ఈ అభిప్రాయమంజరిని పంచుకొనుటకు దేశికులైన వారి చరణారవిందములకు మరో మారు వందనములర్పిస్తూ, మీతో కలిసి నడచిన పండిత బృందమునకు ఐదు పది చేసి వినయపూర్వకముగా నమస్కరిస్తూ.
ఛందస్సు పై పరిశోధనాగ్రంథాలు సూచించగలరు. లభ్యములగు విధము తెలుపండి.
రంగావజ్ఝల మురళీధరరావు,
శోభకృత్, జ్యేష్ఠ శుక్ల త్రయోదశ్యనంతర చతుర్దశి.