యతి మూడు విధములు, అవి విరామ యతి, అక్షరసామ్య యతి, ప్రాస యతి. విరామ యతి అనగా అక్కడ పదము అంతము కావాలి, తఱువాతి అక్షరముతో ఒక క్రొత్త పదము ప్రారంభము కావాలి. సంస్కృత ఛందములలో పాదాంత విరామ యతి సామాన్యము. అందువలన సంస్కృత వృత్తములు సామాన్యముగా గుర్వంతములు. పాదాంత హ్రస్వాక్షరము గురుతుల్యము. కొన్ని ఛందములకు పాద మధ్యములో ఈ విరామ యతి ఉండదు. అక్షరసామ్య యతి అనగా పాదపు మొదటి అక్షరమునకు యతి స్థానమునందలి అక్షరమునకు హల్లుల, అచ్చుల పొంతనము ఉండాలి. మొట్టమొదట ఈ యతుల సంఖ్య తక్కువగా ఉన్నను నేడు అవి పుట్టగొడుగులలా వ్యాపించి పోయాయి. ద్వితీయాక్షరము ప్రాస కనుక ప్రాస యతులు యతి స్థానము పక్కన ఉండే అక్షరమునకు హల్లుల పొంతనముతో ఉంటుంది.
యతిని ఎక్కడ ఉంచాలి? సంస్కృతములో విరామ యతులను పాదపు విఱుపులుగా వివరించినారు, ఉదా. శార్దూలవిక్రీడితపు విఱుపు 12, 7 అక్షరాలు. సంస్కృతములో మానిని కవిరాజవిరాజితము వంటి తాళవృత్తములకు యతిని నిర్దేశించరు, దానిని కవికి వదిలెదరు. తెలుగులో పది లేక అంతకన్న ఎక్కువగా ఉండే అక్షరాలు కలిగిన వృత్తములకు యతి తప్పని సరి. కాని ఈయతి స్థానము ఎల్లప్పుడు logical గా ఉండవు. సామాన్యముగా తెలుగు లాక్షణికులు లఘువుపైన యతిని ఉంచరు. యతి స్థానము నా ఉద్దేశములో ఐచ్ఛికము. కొన్ని సమయాలలో లాక్షణికుల యతి స్థానము మాత్రాగణములకు సరిపోదు, ఉదా. ఇంద్రవజ్ర. UUI UU IIUI UU ఇది గురు లఘువుల అమరిక. సంస్కృతములో దీనికి యతి లేదు. తెలుగులో ఎనిమిదవ అక్షరము పైన. ఎందుకో? పాదము 5,4 5,4 మాత్రలకు సరిపోయినప్పుడు యతి స్థానమును రెండక్షరాల పిదప ఎందుకు ఉంచాలి? అది లఘువు చేసిన పాపమా? ఇలా ఎన్నో ఉన్నాయి. వసంత తిలకకు ఒక యతి, అందులోని మొదటి గురువును రెండు లఘువులుగా చేసినప్పుడు మఱొక చోట యతి.
నేను పాదమును తాళబద్ధముగా వ్రాయుటకు వీలవుతుందా అని పరిశీలించి యతి స్థానమును నిర్ణయిస్తాను. ఒకే పద్యమునకు రెండు విధములుగా కూడ యతులను పెట్ట వీలగును!
కన్నడములో యతి లేదు, మలయాళములో కూడ విరామయతి మాత్రమే. తమిళములో యతిని మోనై అంటారు. తమిళములో యతి ఉన్నది. కొన్ని సమయాలలో యతి, ప్రాసయతి ఒకే పాదములో ఉంటాయి కూడ!
కావున యతి విషయములో logical personal preferences ఆమోదయోగ్యమే!
వసంతతిలకమునకు నేను నిర్ణయించిన యతికి కారణము అది ఇంద్రవజ్రనుండి జనించినది, దానికి ఇంద్రవజ్రపు యతి పొసగుతుందని. సరసాంక వృత్తమునకు కూడ ఇట్టి యతియే.
ఇలాంటి ప్రదేశాలు చూడటం అరుదు. మీతోబాటు నేను కూడా ప్రయాణం చేసినంత గొప్ప అనుభూతి కలిగింది. రచయితకు ధన్యవాదాలు.
ఊహల ఊట 25 గురించి చెళ్లపిళ్ల శ్యామల గారి అభిప్రాయం:
06/13/2023 1:10 pm
ఊహలు ఊటలై పారుతున్నాయి. ఒక్కో కథలో ఒక్కో విషయం నేర్చుకుంటున్నాను. చిన్నారి తులసి ఈ సారి కథ ఎలా రాయాలో బామ్మ పాత్రతో చెప్పించే విధానం చూస్తే మన చిన్ననాటి బామ్మలు గుర్తుకు వచ్చారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే బామ్మగారి వయసున్న తులసిగారు చిన్నారి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి తాను తన బామ్మతో వున్నట్టు ఒక imagery సృష్టిస్తారు. పాత్రలు మనతో మాట్లాడుతున్నట్టు వర్తమానంలో మనతో కలిసి వున్నట్టు అనిపిస్తుంది. బామ్మ చెప్పిన మార్గశిర లక్ష్మీ వారాల కథలు వింటే చిన్న నాడు అమ్మ చెప్పే కథలు గుర్తుకువస్తాయి. మొత్తం మీద ఊహల ఊట ఓ జ్ఞాపకాల పూలబుట్ట. పరిమళాల చిరుజల్లు.
కళ్ళకు కట్టినట్లుగా వ్రాసినందుకు, అంత గొప్పగా అనువాదం చేసిన అమరేంద్ర గారికీ కృతజ్ఞతాస్తుతులు.
వసంతతిలకము గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
06/12/2023 1:15 pm
మంచి వ్యాసం.
చిన్న టైపోకు సవరణ. “బాలసూర్యనిభు – నిట్టులోడించి పోవం” అన్నది నిజానికి “బాలసూర్యనిభు – నిట్టులడించి పోవం” అని ఉండాలి.
అదటుంచి, ఈ వసంతతిలకం గురించి ఈరోజున నాపాహిరామప్రభో శీర్షికన వ్రాసిన పద్యం తాలూకు యతిమైత్రి స్థానం విషయంపై కొంత లక్షణచర్చ చేసాను: శ్రీరామభక్తులను చేరని జన్మమేలా?
ఈపై లింకులో ఉన్న విషయంపరిశీలించి మీఅభిప్రాయం చెప్పగలరు.
అవటా అని చదవడం మొదలెడితే మార్గశీర్షపు నవ్వుల వాయినాలు, కొల్లేరు చాంతాడులాంటి బామ్మ గొలుసు కథలు… మార్గశీర్షం అంటే అర్ధం కోసం వెతుకులాటలతో ఏకబిగిని చదివించేసింది. ఆ పిల్ల ఆకలి బాధని అణుచుకున్నా, బామ్మ మాత్రం ఆపకుండా కథల జోకలితో తెగ నవ్వించింది.
ఉద్యాపన మొదలుపెట్టిన దగ్గర నుంచి అపకారికి ఉపకారం చేయించేవరకు ఊరుకోని బామ్మతో చెప్పించిన నీతి వాక్యంతో ఒక సామాజిక అంశాన్ని వెలికి తీసారు ఆ నోముల్లోంచి. నిజమే కదా? ఈ నమ్మకాలు, శ్రధ్ధతో కూడిన నోముల పూజల్లో పరమార్ధంలో ఏ పారమార్ధం దాగుందో కదా! ఎలాగైన రచయిత్రి ఆలోచన సామాజికంవైపే పయనించడం నాకు భలే అనిపించింది. భలే ఏమిటి? అసలు ఉద్దేశ్యమే అది కదా?
రెండు నెలలకు ముందు హైదరాబాదులో ఒక సాహిత్య సమావేశములో ఒక expert కేవలము aaba అంత్యప్రాసలతో ఒక కవితను రుబాయీ అని వ్రాసినారు. నేను దానికి రుబాయీ ఛందస్సు లక్షణములు లేవు అని చెప్పగా రుబాయీకి తెలుగుకు సరిగా మహాకవి దాశరథి చెప్పినట్లు (దాశరథి అలా చెప్పలేదు) వ్రాస్తే చాలు, విదేశీయ ఛందస్సు అవసరము లేదని అన్నారు. కొన్ని సంవత్సరాలుగా రుబాయీ ఛందములను పరిశీలిస్తున్న నేను అందులోని 3/12 కందములోని సరి పాదములకు సరిపోయినప్పుడు దానికి విదేశీయతను ఆపాదించడము సబబు కాదని ఈ వ్యాసమును రచించినాను. అది దీని background. ఇక పోతే దువ్వూరి ఆదిభట్ల మున్నగువారు వారు వ్రాసినవి అనువాదములు అనుసృజనలు అనియే చెప్పుకొన్నారు. పారసీకములోవలె రుబాయీలు అని చెప్పుకోలేదు. కాని తెలుగులో పారసీక ఉర్దూ భాషలలోవలె రుబాయీలను వ్రాయ వీలగును, అలా వ్రాసినప్పుడు అవి సహజముగానే తెలుగులో ఉంటాయి అన్నదే ఈవ్యాసపు ముఖ్యోద్దేశము. మఱి అరవై సంవత్సరాలుగా ఎందుకు వీటిని గొప్ప కవులు తప్పు దారిని నడిపించారో నాకు తెలియదు. నాకు Spanish తెలియదు కనుక మీ రుబాయీ నాకు అర్థము కాలేదు. నమస్సులు.
నేను వివినమూర్తిగారి రచనలని చదవలేదు, ఇప్పుడు చదవాలి అనిపించేలా, మీ వ్యాసం చాలా బావుందండీ. మనం బెంగుళూరులో 17 ఏళ్ల క్రితం కొన్నిసార్లు వివినమూర్తి, కవన శర్మ కలిసిన రోజులు గుర్తుకొచ్చేయి .
వసంతతిలకము గురించి J K మోహన రావు గారి అభిప్రాయం:
06/14/2023 11:39 am
శ్యామల రావు గారు,
యతి:

విధేయుడు – మోహన
మనమెరుగని మధ్య అమెరికా 2 గురించి Annapurna గారి అభిప్రాయం:
06/13/2023 6:11 pm
ఇలాంటి ప్రదేశాలు చూడటం అరుదు. మీతోబాటు నేను కూడా ప్రయాణం చేసినంత గొప్ప అనుభూతి కలిగింది. రచయితకు ధన్యవాదాలు.
ఊహల ఊట 25 గురించి చెళ్లపిళ్ల శ్యామల గారి అభిప్రాయం:
06/13/2023 1:10 pm
ఊహలు ఊటలై పారుతున్నాయి. ఒక్కో కథలో ఒక్కో విషయం నేర్చుకుంటున్నాను. చిన్నారి తులసి ఈ సారి కథ ఎలా రాయాలో బామ్మ పాత్రతో చెప్పించే విధానం చూస్తే మన చిన్ననాటి బామ్మలు గుర్తుకు వచ్చారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే బామ్మగారి వయసున్న తులసిగారు చిన్నారి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి తాను తన బామ్మతో వున్నట్టు ఒక imagery సృష్టిస్తారు. పాత్రలు మనతో మాట్లాడుతున్నట్టు వర్తమానంలో మనతో కలిసి వున్నట్టు అనిపిస్తుంది. బామ్మ చెప్పిన మార్గశిర లక్ష్మీ వారాల కథలు వింటే చిన్న నాడు అమ్మ చెప్పే కథలు గుర్తుకువస్తాయి. మొత్తం మీద ఊహల ఊట ఓ జ్ఞాపకాల పూలబుట్ట. పరిమళాల చిరుజల్లు.
రుబాయీలు గురించి Lyla yerneni గారి అభిప్రాయం:
06/13/2023 8:39 am
మీ ఉద్దేశం ఇప్పుడు సరిగ్గా అర్ధమైంది. I got it. Thank you.
మనమెరుగని మధ్య అమెరికా 1 గురించి Bhaskar D గారి అభిప్రాయం:
06/12/2023 7:57 pm
కళ్ళకు కట్టినట్లుగా వ్రాసినందుకు, అంత గొప్పగా అనువాదం చేసిన అమరేంద్ర గారికీ కృతజ్ఞతాస్తుతులు.
వసంతతిలకము గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
06/12/2023 1:15 pm
మంచి వ్యాసం.
చిన్న టైపోకు సవరణ. “బాలసూర్యనిభు – నిట్టులోడించి పోవం” అన్నది నిజానికి “బాలసూర్యనిభు – నిట్టులడించి పోవం” అని ఉండాలి.
అదటుంచి, ఈ వసంతతిలకం గురించి ఈరోజున నాపాహిరామప్రభో శీర్షికన వ్రాసిన పద్యం తాలూకు యతిమైత్రి స్థానం విషయంపై కొంత లక్షణచర్చ చేసాను: శ్రీరామభక్తులను చేరని జన్మమేలా?
ఈపై లింకులో ఉన్న విషయంపరిశీలించి మీఅభిప్రాయం చెప్పగలరు.
[టైపో సవరించాము. కృతజ్ఞతలు – సం.]
ఊహల ఊట 25 గురించి చాగంటి ప్రసాద్ గారి అభిప్రాయం:
06/12/2023 4:23 am
చాగంటి తులసి గారి ఊహల ఊట బాగా ఊరింది.
అవటా అని చదవడం మొదలెడితే మార్గశీర్షపు నవ్వుల వాయినాలు, కొల్లేరు చాంతాడులాంటి బామ్మ గొలుసు కథలు… మార్గశీర్షం అంటే అర్ధం కోసం వెతుకులాటలతో ఏకబిగిని చదివించేసింది. ఆ పిల్ల ఆకలి బాధని అణుచుకున్నా, బామ్మ మాత్రం ఆపకుండా కథల జోకలితో తెగ నవ్వించింది.
ఉద్యాపన మొదలుపెట్టిన దగ్గర నుంచి అపకారికి ఉపకారం చేయించేవరకు ఊరుకోని బామ్మతో చెప్పించిన నీతి వాక్యంతో ఒక సామాజిక అంశాన్ని వెలికి తీసారు ఆ నోముల్లోంచి. నిజమే కదా? ఈ నమ్మకాలు, శ్రధ్ధతో కూడిన నోముల పూజల్లో పరమార్ధంలో ఏ పారమార్ధం దాగుందో కదా! ఎలాగైన రచయిత్రి ఆలోచన సామాజికంవైపే పయనించడం నాకు భలే అనిపించింది. భలే ఏమిటి? అసలు ఉద్దేశ్యమే అది కదా?
అంతర్థానం గురించి Kishore Karnam గారి అభిప్రాయం:
06/11/2023 10:10 am
The narration is very touching. Thank you.
రుబాయీలు గురించి J K Mohana Rao గారి అభిప్రాయం:
06/11/2023 8:35 am
రెండు నెలలకు ముందు హైదరాబాదులో ఒక సాహిత్య సమావేశములో ఒక expert కేవలము aaba అంత్యప్రాసలతో ఒక కవితను రుబాయీ అని వ్రాసినారు. నేను దానికి రుబాయీ ఛందస్సు లక్షణములు లేవు అని చెప్పగా రుబాయీకి తెలుగుకు సరిగా మహాకవి దాశరథి చెప్పినట్లు (దాశరథి అలా చెప్పలేదు) వ్రాస్తే చాలు, విదేశీయ ఛందస్సు అవసరము లేదని అన్నారు. కొన్ని సంవత్సరాలుగా రుబాయీ ఛందములను పరిశీలిస్తున్న నేను అందులోని 3/12 కందములోని సరి పాదములకు సరిపోయినప్పుడు దానికి విదేశీయతను ఆపాదించడము సబబు కాదని ఈ వ్యాసమును రచించినాను. అది దీని background. ఇక పోతే దువ్వూరి ఆదిభట్ల మున్నగువారు వారు వ్రాసినవి అనువాదములు అనుసృజనలు అనియే చెప్పుకొన్నారు. పారసీకములోవలె రుబాయీలు అని చెప్పుకోలేదు. కాని తెలుగులో పారసీక ఉర్దూ భాషలలోవలె రుబాయీలను వ్రాయ వీలగును, అలా వ్రాసినప్పుడు అవి సహజముగానే తెలుగులో ఉంటాయి అన్నదే ఈవ్యాసపు ముఖ్యోద్దేశము. మఱి అరవై సంవత్సరాలుగా ఎందుకు వీటిని గొప్ప కవులు తప్పు దారిని నడిపించారో నాకు తెలియదు. నాకు Spanish తెలియదు కనుక మీ రుబాయీ నాకు అర్థము కాలేదు. నమస్సులు.
ఎవరీ వివిన మూర్తి?! గురించి శ్రీరాం గారి అభిప్రాయం:
06/11/2023 3:38 am