పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16391

  1. విన్నంత కన్నంత తెలియవచ్చినంత గురించి విప్లవ్ అభిప్రాయం:

    07/07/2006 7:44 am

    “ఏతా వాతా” ప్రయోగం వాడకాన్ని గమనిస్తే, కాస్త ఎక్కువైతే ఏ ప్రయోగమైనా పరమ బోర్ గా మిగులుతుంది అని తేలుతుంది.

    “మారిపోతున్న విలువలు ఆదర్శపాత్రమయినవా? ” అన్నది ప్రశ్న.

    ఏది ఆదర్శమో తెలియదు కానీ, భాషకు సంబంధించి, “మార్పు చెడిపోవడం కాదని” కాల్డ్వెల్ ప్రతిపాదించాడని రాసింది బూదరాజు గారే.

    అర్ధానుస్వార శకటరేఫలను వర్జించాలన్న ప్రతిపాదనను చూపెట్టి, అది అభ్యుదయగామి పండితుల దృక్పథం క్రిందికి వస్తుందని చెప్పిందీ బూదరాజు గారే. అభ్యుదయం ఆదర్శపాత్రమేనేమో.

    “ఈ నాటి రేడియోల్లో, పత్రికల్లో, సాహితీ రచనల్లో, సినిమాల్లో అనుక్షణం వాడుకలో ఉండి ప్రజాసామాన్యానికి అందుబాటులో ఉన్న వ్యావహారాన్ని ఏ శక్తీ ఎక్కువ కాలం బహిష్కరించలేదు” అన్నది బూదరాజు గారే. {పై వాటికి టీవీ యాంకర్లను జత చేయాలిప్పుడైతే. వత్తులు పలికినట్టు హైదరాబాదు పాత బస్తీల కూడ ఎవ్వలు పలుకరట, నిన్న మొన్న బళ్ళెకు పోతున్న పిల్లలతోటి ఒక సారి మాట్లాడి చూస్తె యాంకర్లను తయారు చేస్తున్నది మనమే అని తెలుస్తుంది.}

    “ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకున్న తెలుగు పాఠ్య గ్రంథాలు ఇప్పటికీ గ్రాథికంలోనే ఉన్నాయి. మరో మహోద్యమం ప్రళయం లాగా వచ్చి ముంచెత్తితే తప్ప ఈ స్వార్థ సంకుచిత ప్రతీప శక్తులను మొదలంటా పెకలించటం సాధ్యపడకపోవచ్చు.” అని ఈసడించింది బూదరాజుగారే. “ఆ సమయం ఎంతో దూరాన లేదు” అన్నదీ ఆయనే.

    ఈ బాట ఇట్లనే పట్కోని పోతె మాటల్లోంచి జారిపోయేటివి ఒత్తులు దీర్ఘాలే, సంధులు సమాసాల తర్వాత. వెయ్యేండ్ల గ్రాంథికం ఒకటి కానప్పుడు వందేండ్ల వ్యవహారికం ఒకలాగనే ఉండాలంటె కష్టం. జాగ్రత్త పడేటోళ్ళు పడొచ్చు. లేకపోయినా భాష ఆగదు.

    http://www.eemaata.com/books/budaraju.pdf

    బూదరాజు గారి మీద సమయోచితమైన ముచ్చట్లు చెప్పినందుకు రచయితకు, “ఈ మాట” కు అభినందనలు.
    విప్లవ్

  2. విన్నంత కన్నంత తెలియవచ్చినంత గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    07/06/2006 6:12 pm

    పొరబాటు సరిచేసినందుకు సాహితిగారికి కృతజ్ఞతలు. భాషావేత్త గురించిన వ్యాసం కాబట్టి మరికాస్త ఒళ్ళు దగ్గరపెట్టుకొని రాయాలి అని గుర్తున్నా, తప్పులు దొర్లాయి. ప్రత్యేకంగా ఆయన “ఒత్తక్షరాలను (మహాప్రాణాలను) రాయటంలో ఎంతో జాగ్రత్త అవసరం,” చదువుకోని వారి వాడుకలో ఈ భేదం లేదుగాని, చదువుకున్నవారు ఈ భేదం గుర్తించాలని, కాస్త వాత గూడా పెట్టారు. ఉదాహరణలు ఇచ్చారు: అర్థం, అర్ధం; శోధ, శోథ; పలం, ఫలం; గాతం, ఘాతం; కరం, ఖరం.

    చదివి highlight చేసుకున్నాను గాని రాసేటప్పుడు జాగ్రత్త పడలేదు!

    కొడవళ్ళ హనుమంతరావు

  3. విన్నంత కన్నంత తెలియవచ్చినంత గురించి sahiti అభిప్రాయం:

    07/06/2006 12:02 pm

    చాలా బాగుంది.బూదరాజు గారి మీద ఉన్న అభిమానానికి మరిన్ని అలంకారాలు వచ్చి చేరాయి. “విలేఖరులు” (నాకు తెలిసి “విలేకరులు” అని బూదరాజు గారే అన్నారు) .. చిన్న ఇబ్బంది.

    వ్యాస కర్త కి కృతజ్ణతలు (ఇది ఇంకెలా రాయాలో తెలీలేదు మన్నించాలి)

  4. నౌషాద్‌ గురించి Mr. D.A.Eswar అభిప్రాయం:

    07/05/2006 8:38 pm

    రాగాల చేత “అందంగా చాకిరీ చేయించి అద్బుతమైన సంగితాన్ని మనకిచిన నౌషాద్ గారి గురించి మనకు తెలియని interesting విషయాలు , పదాలతొ అందంగా చాకిరీ చెయించి రొహినిప్రసాద్ గరూ మంచి వ్యాసం ఇచ్చారు.
    After reading this article, I feel more respect for Sri Naushad.
    Thanks to Prasadgaru & Eemaata for this very good essay and also for the rare photographs of ‘the great people’..

  5. వెల్ల గురించి వాతాపి అభిప్రాయం:

    07/05/2006 11:50 am

    మంచి కవిత. చక్కని భావం.
    చైతన్యం చల్లగా ఉండడం మాత్రం బాగోలేదు. పరికించి చూస్తే కవిత మొదటి తొమ్మిది లైన్లలో పూర్తయింది. మిగిలినదంతా అనవసరం. అలాగే, వెల్ల అన్నపదం కోట్స్ లో పెట్టటం కూడా అనవసరం.

  6. కోపం గురించి Prasad Charasala అభిప్రాయం:

    07/05/2006 11:07 am

    నాకు ఈ కథలో చెప్పదలచుకొన్నదేమిటో అర్థం కాలేదు. చివరికంటా కూడా చదవలేక పోఆను. చదివివుంటే అర్థం అయ్యెదేమొ!!
    __ ప్రసాద్

  7. గేటెడ్ కమ్యూనిటీ గురించి Prasad Charasala అభిప్రాయం:

    07/05/2006 10:38 am

    చాలా చక్కగా ఉంది. ఎవరికి వారు గిరి గీసుకొని బందెల్దొడ్డిలో బర్రెల్లా జీవిస్తూ ఎవరి స్తోమతుకు తగ్గట్లు వాల్లు గేట్లు, వాచ్ మన్ లూ …
    రెండు వర్గాల దృక్కోణాన్నీ రచయిత చాలా బాగా చూపించారు.
    __ ప్రసాద్

  8. గ్రేడింగ్ అమ్మలు గురించి Abhi అభిప్రాయం:

    07/04/2006 8:45 pm

    well written article 🙂 మొదటి వాక్యం చూస్తే చలం యోగ్యతా పత్రం గుర్తువచ్చినది.

  9. విన్నంత కన్నంత తెలియవచ్చినంత గురించి Abhi అభిప్రాయం:

    07/04/2006 4:18 pm

    చాలా చాలా బాగుంది :).మరిన్ని వ్యాసాలు మీనుంచి ఆశిస్తూ..

  10. నౌషాద్‌ గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    07/04/2006 9:52 am

    తండ్రిని మించిన తనయుడు

    సంగీతం గురించి కనీసపు జ్ఞానం లేకపోయినా నేను రోహిణీప్రసాద్ గారి వ్యాసాలు చదవడానికి కారణం వారి నిరాడంబర భాషా, శైలీ, క్లిష్టమైన విషయాలను విడమరచి సులభంగా చెప్పే నేర్పూ.

    నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో ఇతర రాష్ట్రాలకన్నా తెలుగు వాళ్ళు చాలా ఎక్కువగా వున్నా కూడా సంగీతంలో ప్రవేశం మనవాళ్ళకంటే వేరే రాష్ట్రాలవాళ్ళకే ఎక్కువున్నట్లనిపించేది. ముఖ్యంగా మనప్రక్కవాళ్ళే అయిన తమిళయన్లలో, ప్రతివాళ్ళూ గాత్రమో వాయిద్యమో చిన్నప్పుడే నేర్చుకునేవాళ్ళని విన్నాను. మనవాళ్ళకి ట్యూషన్లు, కోచింగ్లతో సంగీతానికి సమయం మిగులుతున్నట్లు లేదు. (పల్లెటూళ్ళలో, చిన్న పట్టణాలలో, రెండు మూడేళ్ళకోసారి వెళ్ళి పదిరోజులుండి చూసి ఏర్పరచుకున్న అభిప్రాయమిది; వాస్తవం కాకపోవచ్చు.)

    చిన్నప్పుడే, 3-7 ఏళ్ళ మధ్య ప్రతిబిడ్డకూ ఏదో ఒక కళమీద గురి కుదురుతుందనీ, ఆ అభినివేశం పెద్దయ్యాక ఏర్పడటం దాదాపు అసంభవమనీ, చిన్నప్పుడే తగిన వాతావరణం కలిగించాల్సిన బాధ్యత పెద్దవాళ్ళకుందనీ కొకు రాశాడు. పాటల్లోపడితే చదువులు పాడవుతాయని తల్లిదండ్రులకి సహజమైన భయం వుండొచ్చుగాని, దానికి కాస్త మందలింపు సరిపోవచ్చు:

    “మా ప్రసాద్ సితార్ తో చదువు పాడు చేసుకోవటం నాకంతగా ఇష్టం లేదు. వాడు పరీక్షలప్పుడు కూడా relax కావటానికి ఓ అరగంట వాయించుకుంటే నేను అభ్యంతరం చెప్పను. కాని social functions లో వాయిస్తే ఇక mind చదువుమీదికి పోదు. ఆమధ్య వాడి స్నేహితులు చిన్న పార్టీ ఏర్పాటు చేసి వాడి చేత రెండున్నర గంటలు సితారు వాయింపించారట. అందులో వున్న ప్రమాదం వాడికీ తెలుసు. అందుకని దాని జోలికిపోక చదువుకోమని రాశాను. డిసెంబరు సెలవుల్లో నెలరోజులూ సితారే వాయిస్తాడు. summer holidays అంతా వాడికి మరోపని వుండదు. వాడికి వ్యక్తిత్వం లేకపోవటమేమిటి? సైన్సులోనూ, సంగీతంలోనూ నాకు వాడు చాలా విషయాలు చెప్పగలడు. నాకున్న వ్యసనాలు కూడా ఆరెండే. అందుచేత వాటిలో నన్ను ఇప్పటికే మించి ముందుకు వెళ్ళాడు.”
    — కృష్ణాబాయికి 11-11-1968 న కొకు రాసిన ఉత్తరం నుండి.

    కొడవళ్ళ హనుమంతరావు