పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16342

  1. నువ్వు నాకొద్దు గురించి Raghuram గారి అభిప్రాయం:

    06/09/2006 5:02 am

    ఎక్కడ హార్ట్ టచింగ్ గా గాని, Interseting గా గాని లేదు. ఈ కథ యొక్క ఉద్దేశ్యం ఏమి అర్థం కాలేదు.

  2. కొత్త కథకుల కష్టాలు గురించి Durgaprasad Gorti గారి అభిప్రాయం:

    06/07/2006 12:39 pm

    చాలా బాగుంది వ్యాసం..

  3. కృష్ణరాయల కవిపోషణ గురించి Dr.Ismail Penukonda గారి అభిప్రాయం:

    06/07/2006 2:12 am

    మంచి వ్యాసం.ఇలాంటి విజ్ఞానదాయకమైన చర్చ ను ఆస్వాదించడం…నా అదృష్టం!

  4. ఎవరీ సీతా, శూర్పణఖలు? గురించి JR.Nagabhushanam గారి అభిప్రాయం:

    06/05/2006 1:07 am

    Olga gari “Samagamam” katha meeda JUBV Prasadgari vimarsa ento bagundi. Vunna patralameeda vimarsa kakunda, patrala swabhavanney marcheyyadam cheyyakoodadu. Ala cheste elavuntundo Olgagari Samagamam kathaa, Prasadgari vimarsa cheputundi. – bhushan – nagabhushanamr@hotmail.com

  5. ఈమాట కొత్త వేషం గురించి పద్మ గారి అభిప్రాయం:

    05/31/2006 6:07 pm

    మీ గ్రంథాలయంలోని పాత పుస్తకాల లింకులు పునరుద్ధరించవలసిందిగా మనవి. శిలాలోలిత సగంలో చదివి ఆపేశాను. ఇప్పుడు లింకు కనిపించట్లేదు.

    శిలాలోలిత, ఇంకా ఇతర పుస్తకాలన్నీ కొత్త format లోకి తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నాం. మీ సూచనకి ధన్యవాదాలు.

  6. ఈమాట కొత్త వేషం గురించి vtp గారి అభిప్రాయం:

    05/31/2006 5:42 pm

    అడిగే వాళ్ళ కోరికలకు అంతూ పొంతూ లేదనుకోండి. కాని ఒక చిన్న విన్నపం.
    మీ గ్రంథాలయంలోని పాత పుస్తకాల లింకులు పునరుద్ధరించవలసిందిగా మనవి. శిలాలోలిత సగంలో చదివి ఆపేశాను. ఇప్పుడు లింకు కనిపించట్లేదు.

  7. కొత్త కథకుల కష్టాలు గురించి నవీన్ నంబూరి గారి అభిప్రాయం:

    05/30/2006 12:32 am

    అక్కిరాజు గారూ,
    వ్యాసం బావుంది. మీ కథల్లాగే మీ వ్యాసానికీ చదివించే గుణం పుష్కలంగా ఉంది. కొత్త కథకుల కష్టాలంటూ పనిలో పనిగా సినిమా స్క్రీన్ ప్లే టెక్నిక్కులు కూడా రాశారే 🙂

    నవీన్ నంబూరి

  8. ఎంగేజ్మెంట్ గురించి kkp గారి అభిప్రాయం:

    05/25/2006 7:09 pm

    its a nice story viplav gaaru, but i have to say i could not get the ending, like what happened?????

  9. ఎంగేజ్మెంట్ గురించి Kiran Kumar Chava గారి అభిప్రాయం:

    05/24/2006 8:49 pm

    నాకు నచ్చింది

    అంటే కథ నచ్చినా నచ్చకపొయినా, మీ భాష మాత్రం వీరు అనేటంత కూనీ చేసినట్లు లేదు

    ఎట్‌లీష్టు మేము ఏది మాట్లాడుకుంటున్నామో అదే ఉన్నది

    ఈ మధ్య తెలుగు పదాలు ఎక్కువ వాడాలని భావించుతున్న మాట మాత్రము నిజమే

    కాకపోతే
    శతద్రు ది స్వార్డ మేకర్

    శతద్రు ఖడ్గశాలి

    వీటిలో ఏది బాగుంది?

    నేను అనుకుంటున్న కథకు టైటిల్స్ 🙂

    ఇంకా ఏమిటి?

    ఎలా ఉన్నారు?

    ఇంతకీ ఎవరిని అడుగుతున్నాను?

    ఆఫీస్లో పనేమీ లేక ఇలా కామెంట్లమీదకామెంట్లు వ్రాస్తున్నాను అనుకునేరు!

    బొచ్చడు పనుండి , లేకపోతే మా ఊరిలో అన్నట్టు బండెడు పనుంది

    ఏదో rss ఫీడ్ పట్టుకోని ఇక్కడికి వచ్చినాను, వచ్చిన తరువాత నిజంగా ఈ కథలో భాషను అంతగనంగా ఖూనీ చేసినారా అని ఓ చిన్న అనుమానం వచ్చినది, సరే చదివినాను, చదివినాను కదా అని ఫీలైన విషయము ఇక్కడ చెక్కుతున్నాను

    మనదేమి పొయినది ఎలాగూ ఈ తెలుగు ప్లగ్గిన్ను నా పని ని ఈజీ చేసినది కదా.

    మనదేమి పొయినది ఎలాగూ ఈ తెలుగు తురుపుముక్క నా పనిని తేలిక చేసినది కదా – అని వ్రాయాలేమో, లేకపోతే కామెంట్లకు కూడా కామేంట్లు రావచ్చు

    అవును నీ నాలుకకు రెండువైపులా పదును ఉన్నదా?
    ఓ వైపు నీ బ్లాగులోనేమో టీ వీ నైన్ను ఉట్టి పుణ్యానికి మరీ ఆంగ్లము వాడతాడని తిడుతుంటావు

    ఇక్కడేమో విప్లవ్ గారి ఆంగ్లము బాగుందంటావు?

    బహుశా విప్లవ్ గారు వ్రాసినది విశ్వనాథ గారిలాగా కొద్దిమందికే అర్థము కావాలనేమో! టీవీనైన్ను మాత్రం అందరు చూడాలని ?????

    టైం అవుట్

  10. ఎంగేజ్మెంట్ గురించి Kiran Kumar Chava గారి అభిప్రాయం:

    05/24/2006 8:37 pm

    ఎంత వరకూ నియంత్రించాలి అనేది నాకు ఇంత వఱకూ అర్థము కాలేదు.

    రచయితకు ఎంత వరకూ స్వేచ్చా ఉండాలి? ఎంత వరకూ వ్యాకరణమును పాటించాలి?

    ఏది మంచి ఏది చెడు, నిర్ణయించేది ఎవరు?

    నా వరకూ అయితే చివరగా మెజారిటీ ప్రజలకు అర్థము అయితే చాలు (మెజారిటీ అంటే నూటికి యాబై ఒక్కటి కాకుండా నూటికి ఓ తొంబయి అని నా భావము)

    మరళా ఇక్కడ కూడా ఓ మతలబు ఉన్నది మీరు కేవలము పట్నాలలోని వారికోసము వ్రాస్తే వారికి అర్థము అయితే చాలు నంటారా? కేవలము విద్యావంతులకు వ్రాస్తే వారికి మాత్రము అర్థము అయితే చాలు నంటారా?

    ఇన్ని మాటలెందుకు మీకు నచ్చితే చాలు, మీ రచన. 🙂