నల్లగా నిగనిగలాడే
సంతాలీ పిల్ల
తెల్లని నవ్వులొలుకుతూ
నా గది గోడలకి ‘వెల్ల’ వేస్తోంది
గది గోడలకైన గాయాలు
మానిపోతున్నాయి.
గొప్పింటి ఇల్లాలు చేసిన
మరకలన్నీ
మాయమవుతున్నాయి.
నల్లగా నిగనిగ లాడే
సంతాలీ పిల్ల
నాగదిగోడలకు
వెల్ల వేస్తోంది
తెల్లని నవ్వులొలుకుతూ
చల్లని నవ చైతన్యాన్ని నింపుతూ.