Comment navigation


15549

« 1 ... 152 153 154 155 156 ... 1555 »

  1. కాకవిన్ – కుసుమవిలసిత – తురిదగతి గురించి తఃతః గారి అభిప్రాయం:

    04/20/2022 11:08 am

    Dr Yerneni:

    1. “తబ్బిబు కాగ జార్చు అవకుంఠనము, కనికరించు కామినీ!”echoes Md. Rafi’s “chehare se apane Aj to pardA uThAiye, Lillah mujhako chAnd si sUrat diKAyiye!”

    2. A.K. Ramanujan was one of my early readings -his
    “If you wish to be safe in love
    court a mermaid.
    She’s single-thighed.” still rings in my ears.

    regards-తఃతః

  2. కాకవిన్ – కుసుమవిలసిత – తురిదగతి గురించి తఃత గారి అభిప్రాయం:

    04/19/2022 11:08 pm

    Dr Yerneni:
    “Visvanatha Satyanarayana had a little difficulty with Arjuna getting married everywhere he goes and leaving a trail of wives and kids behind, without thinking of them ever again. But, I think it is swell.”
    In this context I love Md Rafi singing ,
    “main pyaar ka raahi hun
    teri zulf ke saae men
    kuchh der thahar jaau”

  3. ఏప్రిల్ 2022 గురించి తః తః గారి అభిప్రాయం:

    04/19/2022 10:46 am

    Long ago I remember to have said that the News papers were like tissue papers of their chosen leaders — presenting them, the leaders, fresh and clean every day in the morning.

  4. నీళ్ళు గురించి Satish Bolla గారి అభిప్రాయం:

    04/18/2022 7:36 am

    ఏడిపించారు సుబ్బరామయ్యగారు. అలా ఆ కాలంలోకి తీసుకుపోయారు.

  5. కాకవిన్ – కుసుమవిలసిత – తురిదగతి గురించి Lyla yerneni గారి అభిప్రాయం:

    04/15/2022 11:50 am

    కృష్ణ మోహన రావు గారు:

    Besides your essays, I am reading and enjoying A.K. Ramanujan’s essays on poetry. He too is well versed in Tamil, Kannada, Sanskrit. I don’t know any of these languages. Since Ramanujan can discuss language, structure, idiom, and idiosyncrasies etc. eloquently in English; I read him in English. All these studies are however so perplexing and intriguing to me.

    In that joy of reading him and reading you, is this Telugu poem of mine:

    మబ్బులవీటిలోన నువు ముందుగ నడువు మరాళి! రేపుమా
    పబ్బునె నాకు చూడగను నీ ఘన జఘనము ఊగి తూగగా
    అబ్బుర పాటుతో మగువ! నీ వెటు నడచిన అంటి వత్తు! నే
    తబ్బిబు కాగ జార్చు అవకుంఠనము, కనికరించు కామినీ!

    కణ్వకవి ‘అర్జున వివాహము’ నుండి మీరిచ్చిన పద్యంలో, ఆ ఆకాశగమనంలో ఉన్న దేవతా స్త్రీ పేరు మీరివ్వలేదు. నాకు తెలియదు. చేమకూరి వేంకటకవి ‘విజయ విలాసము’ లో, -ఉలూచి, చిత్రాంగద, సుభద్రలను మురిపించి వివాహమాడిన అర్జునుడే నా పద్యంలో ఉన్నది.

    Arjuna is such a sportive guy. A liberated guy. He does not mind leading or being led. In war. In love. Does not mind being a guest in houses of all kinds of men and women, in unknown lands. Visvanatha Satyanarayana had a little difficulty with Arjuna getting married everywhere he goes and leaving a trail of wives and kids behind, without thinking of them ever again. But, I think it is swell. It is actually very Telugu.

    Thanks for the essay, and your poetry JKM. Have a nice weekend All!

    -లైలా

    PS: Upon reading the essay on కేతన in this magazine, I am liberating myself from some ద్రుతములు, సంధులు, కచటతపలు గజడదబలు గా మార్చటాలు. I like to say చంద్రుడు, ప్రియా, instead of జంద్రుడు, బ్రియా.

  6. మొల్ల రామాయణం: కవిత, వర్ణనా మాధుర్యాలు గురించి Venkateswararao VEMURI గారి అభిప్రాయం:

    04/14/2022 5:48 pm

    వ్యాసం చాలా బాగుంది!

  7. మొల్ల రామాయణం: కవిత, వర్ణనా మాధుర్యాలు గురించి ఉషా దేవి అయినవోలు గారి అభిప్రాయం:

    04/14/2022 4:23 am

    అందరికీ మీ మీ స్పందనలకు ధన్యవాదాలు.

    పూర్వం ఇప్పటి వలె patents లేవు కదండీ. బహుశా ఆ రామాయణ పద్య ప్రభావం తోనే రాసి ఉండొచ్చు. అయినా మొల్ల అభివ్యక్తి ఆహ్లాదకరం గా లేదూ?? ఇలా అనేక మంది కవులపై ఇతరుల ప్రభావాలు ఎన్నో కదా. ఆ మాట కొస్తే నన్నయ పద్యాలలో కన్నడ ప్రభావం ఉందంటారు కదా. ఈ ప్రభావాలు మన కవుల రచనా పటిమను తక్కువ చెయ్యలేవు అనే అనుకుంటా.

  8. మొల్ల రామాయణం: కవిత, వర్ణనా మాధుర్యాలు గురించి మరింగంటి సురేంద్ర ప్రసాద్ గారి అభిప్రాయం:

    04/13/2022 11:24 pm

    ఎప్పుడో 40-45ఏళ్ళ కిందట చదివిన ఈ కావ్యం తిరిగి ఇన్నాళ్ళకు మీ ద్వారా నెమరుకు వచ్చింది. ధన్యుడిని. ధారణలో ఉన్న పద్యాలలో మూడు ఉదహరించారు. మరోసారి శ్రమపడి పాత పుస్తకాల పెట్టె తెరవాలి. కూకటి ముడికినై కురులు గూడని నాడె, బెదరక తాటక పీచమడచె … రాజ మాత్రుండె మేదినీ రక్షకుండు, రామ భూపాలు డాది నారాయణుండు, ఆరూఢ ప్రతిమాన విక్రమ కళాహంకార తేజోనిథి వంటి పద్యాలు మరోసారి చదవాలి.

  9. ఏప్రిల్ 2022 గురించి హెచ్చార్కె గారి అభిప్రాయం:

    04/13/2022 2:32 am

    ‘వార్త ఉండవలసినట్టు ఉంటే కనీసం అది హత్య అని అనిపించకుండా ఉంటుంది.’

    అనిపించకుండా ఉంటే చాలా? హత్య అయినా ఫరవాలేదా?

    వార్తా పత్రికల్లో వ్యాఖ్యలూ ప్రచారాలే తప్ప వార్తలనేవే లేకుండా పోతుంటే, మీరు చంద్రుడి సంగతెందుకు లెద్దూ, వ్రేలికి వంకర్లు లేకుంటే చాలు అంటున్నారు సారూ. వార్తల్లో భాషా ప్రామాణికత తప్పక అవసరం, ఒకే వార్త ఒకరికి ఒకలా ఇంకొకరికి ఇంకొకలా అర్థం కాకుండా ఉంటానికి. జర్నలిజం లిటరేచర్ ఇన్ హర్రీ. కథకులూ, కవుల భాషే ఎట్టాగో ఉంటోంది. హర్రీలో తయారైన వార్త భాష మీద ఇంత విమర్శ అనవసరమే. దాని కన్న వార్తల ఆబ్జెక్టివిటీ చాల ఎక్కువ ముఖ్యం.

  10. మొల్ల రామాయణం: కవిత, వర్ణనా మాధుర్యాలు గురించి మంథా వీరభద్రం గారి అభిప్రాయం:

    04/12/2022 1:04 pm

    చాలా చక్కగా వివరించారు. ఒక సందేహం. గుహుడు రాముని పాదధూళి పోవటానికై కాళ్ళు కడిగి పడవలోకెక్కించుకుంటాననే సందర్భంలో మొల్లగారి సుడిగొని రాము పాదములు సోఁకిన ధూళి వహించి రాయి యేర్పడ నొక కాంత యయ్యె నఁట…. పద్యానికి మాతృక ఆధ్యాత్మిక రామాయణంలో అహల్యాశాపవిమోచనం చేసిన తర్వాత విశ్వామిత్రుల వారు మిథిల చేరటానికై వ గంగ దాటడం కోసం పడవ కోసం చూస్తున్నప్పుడు ఒక పడవవాడు రామునితో అన్న

    క్షాలయామి తవ పాద పంకజం
    నాథ దారుదృషదయో:కిమన్తరం|
    మానుషీకరణచూర్ణమస్తి తే
    పాదయోరితి కథా ప్రథీయసి||

    శ్లోకం ఉంది కదా! ఇదే ప్రేరణ కావచ్చునంటారా? నావికుడన్న మాటలనే మొల్ల గారు గుహునితో అనిపించినట్టున్నారు కదా.

« 1 ... 152 153 154 155 156 ... 1555 »