Comment navigation


15538

« 1 ... 1534 1535 1536 1537 1538 ... 1554 »

  1. గ్రేడింగ్ అమ్మలు గురించి Prasad గారి అభిప్రాయం:

    07/31/2006 9:39 am

    బావుంది. కవుల చేతులకి తగలని ఇలాంటి పూలు పల్లెల్లో ఎన్నో కనిపిస్తాయి. ఏ ఒక్కరి చేతుల్లోనో అప్పుడప్పుడిలా పూచి విరబూస్తాయి.
    — ప్రసాద్
    http://charasala.wordpress.com

  2. సఖియ గురించి Prasad గారి అభిప్రాయం:

    07/31/2006 9:13 am

    “ముద్దెట్టు నా మెడ వొంపులో-
    నిన్ను సెగలు కక్కే సూర్యుణ్ణి చేస్తాను”
    ఇది చాలా బాగుంది. కానీ ఎందుకో “సఖియ” వెన్నెల కౌగిట్లో మద్యం సేవించడమే అంత బాగా లేదు.
    — ప్రసాద్
    http://charasala.wordpress.com

  3. పక్షులు గురించి Prasad గారి అభిప్రాయం:

    07/31/2006 9:08 am

    చాలా బావుంది.
    “ఒకోసారి ఒకో కొత్త చిత్రాన్ని
    ఆకాశానికతికిస్తాయి”
    “కువ కువలాడుతూ
    మనసుకొమ్మ మీద వచ్చివాల్తాయి”
    “కిల కిలా రావాల్లోంచి
    పాటను పట్టుకోమని
    ఒకటే మారాం చేస్తాయి.”
    ఇవి భలే నచ్చాయి.
    అయితే
    “గుమిగూడి గింజలేరుకుంటున్నప్పుడు
    కనువిందు కలిగిస్తాయి.
    చెదిరిపోయేటప్పుడు వీటి అందానికి
    కళ్ళు చెదిరిపోతాయి.”
    మరియు
    “గుమిగూడినంతసేపే వీటి అందం.
    చెదిరినప్పుడు మాత్రం మనసు
    చివుక్కుమనిపిస్తాయి. ”
    చెప్పిన విషయమే మళ్ళీ చెప్పినట్లనిపించింది. అలాగే చెదిరిపోయినప్పుడు, ఒకసారి అందానికి కళ్ళు చెదిరిపోతాయనీ, మరొకసారి మనస్సు చివుక్కుమనిపిస్తాయనీ పరస్పరం విరుద్దంగా వున్నాయేమో అనిపించింది.
    — ప్రసాద్
    http://charasala.wordpress.com

  4. పగటి వాన గురించి Prasad గారి అభిప్రాయం:

    07/31/2006 9:00 am

    “చినుకు చినుకూ పెట్టే ముద్దులకి
    సిగ్గుతో తలొంచుకుంటూనే
    సౌందర్యాన్ని ప్రసవిస్తూ
    ప్రకృతి…”
    ఇది భలే మంచి వర్ణన. నాకు భలే నచ్చింది. చినుకుతోనేగదా, ప్రకృతి ప్రసవించేది.
    — ప్రసాద్

    http://charasala.wordpress.com

  5. వెల్ల గురించి Prasad గారి అభిప్రాయం:

    07/31/2006 8:57 am

    “మంచి కవిత. చక్కని భావం.
    చైతన్యం చల్లగా ఉండడం మాత్రం బాగోలేదు. పరికించి చూస్తే కవిత మొదటి తొమ్మిది లైన్లలో పూర్తయింది. మిగిలినదంతా అనవసరం. అలాగే, వెల్ల అన్నపదం కోట్స్ లో పెట్టటం కూడా అనవసరం.”
    — ప్రసాద్
    http://charasala.wordpress.com

  6. సందుక గురించి Prasad గారి అభిప్రాయం:

    07/31/2006 8:54 am

    అన్నా, సందూక అంటే ఏంటొ జర జెప్పవూ? నేను రాయలసీమ పోరన్ని, నాకిది తెల్వదు. ఇలా మాండలీకాలల్ల కూడా కవితలొస్తే అన్ని జాగాల బాషని అందరు నేర్చుకొంటరు గద. మస్తుంగుందన్నా ఇది.
    — ప్రసాద్
    http://charasala.wordpress.com

  7. గుల్మొహర్ గురించి Prasad గారి అభిప్రాయం:

    07/31/2006 8:45 am

    చాలా అద్భుతంగా వుంది. మోడుల్లా మారి మళ్ళీ వసంతం రాకతో కొంగొత్త పచ్చదనంతో, మరికొన్ని వడలెల్ల కొత్తకొత్త రంగుల చెంగావి చీరలు కట్టిన వాటిల్లా సింగారించుకుంటే చూసి మురిసిపోవటమే కానీ ఈ సరికొత్త భావనలు పొడచూపలేదు. ఇక ప్రతి వసంతానికీ నే చూసే ప్రతిచెట్టూ ఈ కవితే పలికిస్తుందనడంలో సందేహం లేదు.
    — ప్రసాద్
    http://charasala.wordpress.com

  8. హా (స్యం) సం (గీతం) గురించి iswarimurty గారి అభిప్రాయం:

    07/31/2006 12:26 am

    ప్రసాదుగారు,
    నాకు తెలియని ఎందరో గాయకుల గురుంచి తెలియ చేసిన మీకు నా అభినందనలు . సంప్రదాయ సంగీత గురించి తెలియపరిచింది మీ వ్యాసం.

  9. నేటి సినిమాలలో వికృత పోకడలు – విపరీత ధోరణులు గురించి చిట్టెల్ల కామేశ్వర రావు గారి అభిప్రాయం:

    07/29/2006 11:10 pm

    చాలా బాగుంది. అయితే ఒక చోట “పుబ్బలో పుట్టి … మఖలో మాడిపోయి ” అని రాసారు. ప్రాస కోసం అయితే సరే. కాని చెప్పాలనుకున్న విషయాన్ని బట్టి అయితే “మఖలో పుట్టి , పుబ్బలో మాడి పోయే” అని రాయాలేమో.. అని నా వ్యక్తిగత అభిప్రాయం. రంధ్రాన్వేషణ అనుకోకుండా ఉంటే మంచిదే. లేకపోతే క్షంతవ్యుడిని. ఏదేమైనప్పటికీ, చాలా మంచిగా, చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా, నిర్భయంగా , సునిశితమైన దృష్ఠతే విశ్లేషించిన తీరు బహూధా ప్రశంసాపాత్రం. మీ నుండి మరిన్ని సమకాలీన సమస్యలపై విశ్లేషణలను ఎదురుచూసేలా చేసారు. హేట్సాఫ్.

  10. ఎంగేజ్మెంట్ గురించి Shiva గారి అభిప్రాయం:

    07/27/2006 7:38 pm

    I am not able to understand the climax…

    Is the moral of the story is chicago and newyork are the places which u cannot leave ?

« 1 ... 1534 1535 1536 1537 1538 ... 1554 »