Comment navigation


15538

« 1 ... 1530 1531 1532 1533 1534 ... 1554 »

  1. “తండ్రి” తనం గురించి Ch.Venu గారి అభిప్రాయం:

    09/03/2006 6:50 am

    The story by Mr Prasad is good. Dialogues are natural.

  2. సాహిత్య చర్చలు – పర్యవసానాలు గురించి Madhav Machavaram గారి అభిప్రాయం:

    09/03/2006 5:05 am

    ఇందులో అన్వయం చెప్పుకోలేక పోడానికీ, అర్ధం కాక పోడానికీ ఏముంది? వాక్యక్రమంలో అన్వయాలు వెతుక్కునే ఛాందసులకిది తప్పనో, ఫ్రాయిడియన్ స్లిప్పనో అనిపించచ్చు గానీ, ఇది నిజానికి చాలా లోతైన వాక్య నిర్మాణం. తెలుగు సాహత్యకుల గురించి జగద్విఖ్యాతమైన రహస్యాన్ని పునరుద్ఘాటిస్తూనే, గుడిపాటి వేసిన మౌలికమైన ప్రశ్నకి సమాధానమిచ్చిన, రెండువైపుల పదునున్న కత్తి లాంటి వాక్యం. ఇదీ అర్ధం కాకపోతే ఎవరు మాత్రం ఏం చేయగలరు?

  3. ఒక వేసవి గురించి అక్కిరాజు భట్టిప్రోలు గారి అభిప్రాయం:

    09/02/2006 11:11 pm

    చంద్రా…

    ఎంత సంక్లిష్టమైన విషయాన్నయినా అంత సునాయాసంగా, హృద్యంగా ఎలారాస్తారో అర్థం కాదు. చివరి నాలుగయిదు వాక్యాల్లో ఓ పట్టాన మర్చేపోలేని, బోల్డెంత ఆలోచింపచేసే గంభీరమయిన భావనని ఇమడ్చ గలగటం మీకే చెల్లింది.

    కాకపోతే కథనంలో అక్కడక్కడా కాస్త క్లారిటీ తగ్గినట్టుంది.

    మీరు ఇంకా ఎక్కువగా కథలు రాయాలి. ఇలా రెండేళ్ళకి ఒకటి మీ స్థాయికి చాలదు.

    అక్కిరాజు

  4. సంగీతంతో కుస్తీ గురించి Sai Brahmanandam Gorti గారి అభిప్రాయం:

    09/02/2006 12:47 pm

    నేను మీ అంత విద్వాంసుణ్ణి కాకపోయినా, సంగీతం అంటే అభిరుచి, కాస్తంత అవగాహన ఉందని అనుకుంటున్నాను. మీ వ్యాసం మీద అభిప్ర్రాయం రాయడం నా పొరపాటని గ్రహించాను. మీ స్పందనకి ధన్యవాదాలు.
    – సాయి బ్రహ్మానందం గొర్తి

  5. సంగీతంతో కుస్తీ గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    09/02/2006 11:21 am

    నేను 1964 నుంచీ సితార్ వాయిస్తున్నాను. వీణ కూడా కొంతవరకూ వాయించగలను.

    సంగీతం గురించి చెప్పాలంటే చాలానే ఉంది. పిచ్ బెండర్ సహాయంతో కీబోర్డ్ మీద అద్భుతమైన కర్నాటక గమకాలను పలికిస్తున్న తమిళ కళాకారుల గురించి సాయిగారికి బహుశా తెలిసి ఉండదు.

    వయొలిన్ కూడా పాశ్చాత్య వాయిద్యమే. ముత్తుస్వామి తమ్ముడు బాలుస్వామి దీక్షితర్ మొదట దాన్ని కర్నాటక సంగీతానికి ఉపయోగించాడట.

    ఒకప్పుడు శాస్త్రీయ సంగీతానికి పనికిరావనుకున్న సితార్, షెహనాయి, వేణువు, సంతూర్, మేండొలిన్, క్లారినెట్, గిటార్ మొదలైన వాయిద్యాలన్నీ ఈనాడు ప్రతిభావంతుల చేతుల్లో ఎంత బాగా వినిపిస్తున్నాయో చెప్పనక్కర్లేదు. కీబోర్డ్స్ వంటిదే అయిన హార్మోనియం బడే గులాం తదితర మహా విద్వాంసులందరికీ పక్క వాయిద్యంగా ఉపయోగపడింది. దర్బారీ కానడవంటి రాగాల విషయంలో దాని పరిమితులు వారికి తెలియవని కాదు. కొన్ని దశాబ్దాల క్రితం కర్ణాటక గాయకులు కూడా దాన్ని పక్కవాద్యంగా వాడుకున్నారని చాలామందికి తెలియకపోవచ్చు. ఇంతకీ వాయిద్యం ముఖ్యం కాదు. సంగీతమే ముఖ్యం.
    ఆసక్తి ఉన్నవారు ఈ లింక్ ను చూడవచ్చు:అసలింతకీ నా వ్యాసం ఉద్దేశమేమిటో గుర్తిస్తే కీబోర్డ్స్ గురించిన ఈ చర్చ అంతా అనవసరమని అనిపిస్తుంది. సంగీతం నేర్చుకుందామనుకునే ఔత్సాహికులకు కొంతవరకూ పనికొస్తుందని రాశానేగాని సంగీతశాస్త్ర చర్చలోకి దిగడం నా ఉద్దేశం కాదు.

  6. సంగీతంతో కుస్తీ గురించి Sai Brahmanandam Gorti గారి అభిప్రాయం:

    09/02/2006 8:06 am

    ఈ 16 స్వరాలు కీబోర్డు మీద పలికించ లేక పోవచ్చు. కానీ వీణ మీద ఈ 16 స్వరాలు అతి చక్కగా పలికించ వచ్చు. మానవ స్వరానికి అతి దగ్గరగా ఉన్న వాయిద్యం వీణ. దాదాపు ప్రఖ్యాతి చెందిన వాగ్గేయ కారులందరూ వైణికులే ! ( త్యాగయ్య, శ్యామ శాస్త్రి, దీక్షితార్, వేంకట మహ్హి…) అతి ప్రాచీన మైన వాయిద్యాన్ని, మనదైన దాన్ని వదిలేసి మనం కీబోర్డు ల వెంట బడడం నిజంగా దురదృష్ట కరం. ఈ వీణ కనక ఏ అమెరికన్ల దో అయి ఉంటే, ఎలాంటి ఉఛ్చస్థితిలో ఉండేది కదా అనిపిస్తుంది. పూర్వం కచేరీలలో పక్క వాయిద్యంగా వీణ ఉండేది. దీక్షితారు వయొలిను సంగీత కచేరీలలో ప్రవేశ పెట్టాక వీణ మెల్ల మెల్ల గా కనుమరుగయ్యింది. బహుశా సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్ళ్చచ్చు అన్న సౌకర్యం కూడా ఒక కారణం కావచ్చు.
    లయ గురించి కొద్దిగా నయినా ప్రస్తావిస్తే బాగుండేది.
    – సాయి బ్రహ్మానందం గొర్తి.

  7. సంగీతంతో కుస్తీ గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    09/02/2006 5:37 am

    సాయిగారు చెప్పిన 16 శ్రుతుల సంగతి తెలిసినదే. నిజానికి 22 శ్రుతులున్నాయని చెపుతారు. ఇవన్నీ నా వ్యాసం పరిధికి మించినవనే ఉద్దేశంతో ప్రస్తావించలేదు.
    16 శ్రుతుల ద్వారా 72 మేళకర్త రాగాలు వస్తాయి. వాటన్నిటినీ కీబోర్డ్స్ ద్వారా పలికించడం వీలవదు. సంగీతం ఎంత సంక్లిష్టమైనదో వివరిస్తూ పోతే నేర్చుకుందామనే ఆసక్తి ఉన్నవారు మరింతగా బెదిరిపోయే ప్రమాదం ఉంటుంది. ప్రాథమిక స్థాయిలో రాగాలను గురించిన అవగాహన పొందటానికి ఒక మామూలు హార్మోనియంవంటిదీ, 12 స్వరాలతో పరిచయమూ ఉంటే సరిపోతుందనే ఉద్దేశంతో నేను లోతైన విషయాలను బుద్ధిపూర్వకంగానే విడిచిపెట్టాను.

    లయ సంగతి నా పాత వ్యాసాల్లో ప్రస్తావించాను. మొత్తం సంగీతశాస్త్రం గురించి చెప్పడానికి పెద్ద పుస్తకాలు ఎలాగూ ఉన్నాయి కదా అని అదంతా మళ్ళీ ఏకరువు పెట్టకుండా యూజర ఫ్రెండ్లీ పద్ధతిలో సులువుగా అర్థమయే మేరకు రాశాను.

  8. సంగీతంతో కుస్తీ గురించి Sai Brahmanandam Gorti గారి అభిప్రాయం:

    09/01/2006 11:54 pm

    రోహిణీ ప్రసాదు గారూ,

    మీ వ్యాసం బాగుంది.
    సప్త స్వరాలు ఏడు (7) పన్నెండు ( 12 ) స్వరాలు అని రాసారు. కానీ 72 మేళ కర్త రాగాల విభజన చేస్తూ, “క, ట, ప, యాది” చట్రంలో స్వర విభ జన 16 స్వ రాలుగా చేయ బడిందని నేను నేర్చుకున్నాను.
    అవి –
    1.ష డ్జ మము ( స )
    2.శుద్ధ రిషభము ( రి1)
    3. చతుశ్రుతి రిషభము ( రి2)
    4. షట్శృతి రిషభము ( రి3 )
    5. శుద్ధ గాంధారము ( గ1)
    6. సాధారణ గాంధారము ( గ2 )
    7. అంతర గాంధారము ( గ3 )
    8. శుద్ధ మధ్యమము ( మ1)
    9. ప్రతి మధ్యమము ( మ2 )
    10. పంచమము ( ప )
    11. శుద్ధ దైవతము ( ద1 )
    12. చతుశ్రుతి దైవతము ( ద2 )
    13. షట్శృతి దైవతము ( ద3)
    14. శుద్ధ నిషాదము ( ని1 )
    15. కైసికి నిషాదము ( ని2 )
    16. కాకలి నిషాదము ( ని3 )
    నాకు తెలిసిన ఇంకొక చిన్న విషయం. ఈ సప్త స్వరాలలో నెమలి కూత
    ష డ్జ మము, వృషభ ధ్వని రిషభముగాను, మేక శబ్దం గాంధారముగాను, క్రోంచపక్షి పలుకులు మధ్యమం గాను, కోకిల కూత పంచమంగాను, గుర్రపు ధ్వని దైవతముగాను, ఏనుగు ఘీంకారం నిషాదంగానూ పుట్టాయని ఒక సంస్కృత శ్లోకం ఉంది.
    ఆ శ్లోకం ప్రస్తుతం నాకు అందుబాటులో లేదు. దొరికితే రాస్తాను.

    మీ వ్యాసంలో లయ ( తాళం ) గురించి కూడా ప్రస్తావిస్తే సంపూర్ణవ్యాస మయ్యేది.

    – సాయి బ్రహ్మానందం గొర్తి

  9. తెలుగు నవలలో అస్తిత్వ వాదం గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    09/01/2006 11:24 pm

    నవీన్ గారు తమ ప్రసంగ ప్రారంభంలో అస్తిత్వవాదాన్ని పరిచయం చేసి అది అమెరికా జీవితానికి ఎలా సరిపడుతుందో వివరించారు. అమెరికాలో సామాజిక నియమాలు, కట్టుబాట్లు పెద్దగా పనిచెయ్యవు, వ్యక్తి పూర్తిగా స్వతంత్రుడు, అనుకున్నది సాధించగలడు, భారతదేశపు సమాజం అందుకు విరుద్ధంగా ఉంది అని అభిప్రాయపడ్డారు.

    అస్తిత్వవాది Sartre అన్న మాటలని – “మానవుడు సర్వ స్వతంత్రుడు. అంతేకాదు. మానవుడు స్వేచ్ఛా శాపగ్రస్తుడు. స్వతంత్రుడుగా తప్ప మరొకలా ఉండలేడు” – నవీన్ విపులీకరించారు.

    నవీన్ గారు అమెరికా రావడం ఇదే మొదటిసారి. వారు ఇక్కడి జీవితాన్ని చూసి చేసిన వ్యాఖ్యానాన్ని విన్న వెంటనే నాకు Sartre ఏమనేవాడో అనే కుతూహలం కలిగింది. వెతికితే, 1946లో Sartre మొదటిసారి అమెరికా సందర్శించి రాసిన వ్యాసం కనబడింది. అది కొందరికన్నా ఆసక్తిదాయకంగా ఉండొచ్చని ఇస్తున్నాను.

    కొడవళ్ళ హనుమంతరావు

  10. అంకెలు-సంఖ్యలు: రామానుజన్ నుండి భార్గవ దాకా గురించి rajay గారి అభిప్రాయం:

    09/01/2006 9:41 pm

    Good article on maths sir.
    Keep it up.
    cheers.
    rajay
    sgp

« 1 ... 1530 1531 1532 1533 1534 ... 1554 »