పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16635

  1. నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య గురించి malathi అభిప్రాయం:

    03/02/2008 4:12 am

    నీకూ నాకూ మధ్య నిశ్శబ్దం
    మూగబోయిన వాద్యమై మెరుస్తుంది
    — రసాత్మకంగా వుందండీ. మౌనంగురించి నాకున్నంత అనుభవం మరెవరికు వుండదేమో అనిపిస్తుంది ఒకోసారి. చక్కగా చెప్పారు.
    అభినందనలు.

  2. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 1 గురించి KRISHNA RAO JALLIPALLI అభిప్రాయం:

    03/02/2008 3:26 am

    నమ్మడమునమ్మకపొవడం అనేది ఎవరి ఇష్టం వారిది. కాని కొంత మంది భయపెట్టీ తమ పబ్బం గడుపు కుంటారు. వారిని మాత్రం ఇరగ దీయాలి.

  3. ఏది నిజం? – “రషోమాన్” జాపనీస్ సినిమా గురించి venkat అభిప్రాయం:

    03/02/2008 12:13 am

    నవతరంగంలో అకిరా కురసోవా మీద ఫోకస్ చేస్తూ, సభ్యులందరినీ రోషోమన్ సినిమాలో “ఏది నిజం” అని వ్యాసం రాయమని అడుగుదామనుకుంటున్న సమయంలోనే ఈ మాటలో ఇదే విషయం పై వ్యాసం రావడం ఎంతో సంతోషంగా వుంది.
    వ్యాసం చాలా బావుంది. తెలియని ఎన్నో విషయాలు తెలిసాయి. ఎఫెక్టు కోసం చెట్లన్నింటికీ నల్లరంగు వేయించిన కెంజి మిజోగుచి గురించి విన్నాను కానీ వర్షం నీళ్ళలో నల్జోంగు కలిపిన విషయం ఇప్పుడే విన్నాను.

    రానారె,
    ఈ సినిమా లాగే ప్రభావితం చేసే మరో రెండు సినిమాలున్నాయి. అంటొనియాని తీసిన బ్లొఅప్ మరియు ప్యాసెంజర్ చూడండి. ఇవి కూడా మీకు నచ్చుతాయి.

  4. లిటిల్‌సైంటిస్టు గురించి Ram Charan అభిప్రాయం:

    03/01/2008 11:50 pm

    I could not see any story in this except writer’s childhood memories.

  5. బ్లాగుల గురించి – నా మాట గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:

    03/01/2008 10:34 pm

    మీ మహా బ్లాగవతం బావుందండీ…

    కాకపోతీ -మీరు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా బ్లాగుల వల్ల తెలుగు చదివే వాళ్ళ సంఖ్య పెరిగింది. ఎలా అంటారా, తెలుగు వాళ్ళకి పుస్తకం కొనడం అనే అంటురోగం ఎప్పటికీ అంటదు.
    లింకులో, లంకెలో ఏదో ఒకటి తెలుగొచ్చీ చదివని వాళ్ళని చదివిస్తున్నాయని నా అభిప్రాయం.

    -సాయి బ్రహ్మానందం గొర్తి

  6. పదచిత్రాలు గురించి ఫణి అభిప్రాయం:

    03/01/2008 10:29 pm

    Liked it.

  7. ఏది నిజం? – “రషోమాన్” జాపనీస్ సినిమా గురించి కిరణ్ చిట్టెల్ల అభిప్రాయం:

    03/01/2008 10:20 pm

    @రానారె
    జెట్ లీ “హీరో” చిత్రం కూడా ఇలానే ఉంటుంది. అది దీనికి ఒక ట్రిబ్యూట్ అనుకోవచ్చు లెండి. ఇందులో లేనిది, అందులో ఉన్నది ఏంటంటే, రంగుల్ని వాడుకున్న పద్ధతి. దొరికితే చూడండి.

  8. ఆహా గురించి ఫణి అభిప్రాయం:

    03/01/2008 9:43 pm

    Some beautiful images. Some baffling questions.
    చాలా చాలా బాగుంది.
    “ఆ సాయంత్రం
    అదే ఏటి ఒడ్డున..

    సెలయేరు మీద
    చీకటి వెలుగులు రాస్తున్న
    చిత్ర లిపిని చదువుతూ

    దేనికీ అర్ధం లేదంటే..

    చిరు నవ్వు నవ్వుతూ
    ఆమె అన్నది కదా…

    “నీకు అర్ధం కానంత మాత్రాన
    అర్ధం లేనట్టేనా?” ”
    — Loved it beyond words.

  9. కల్యాణి రాగం – అనుబంధం గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:

    03/01/2008 8:36 pm

    ఈ క్రింది వాక్యం శుద్ధ తప్పు.

    “లక్ష్మన్న చెప్పినట్టుగా కల్యాణి రాగం 65వ మేళకర్త అయిన మేచకల్యాణి నుంచి జనించిన రాగం.”

    కళ్యాణి రాగం మేచ కళ్యాణి జన్యం కాదు. రెండు రాగాలూ, అంటే మేచకళ్యాణి నే కళ్యాణి అని పిలుస్తారు. ఇది 72 మేళ కర్త రాగాల విభజన కోసం కటపయాది చక్రం ప్రకారం కళ్యాణి రాగాన్ని మేచ కళ్యాణి గా వ్యవహరిస్తున్నారు తప్ప రెండూ ఒకటే! జన్య రాగ నిర్వచనం వేరు.

    ఈ విషయం లక్ష్మన్న గారి వ్యాసం చదివినప్పుడే రాద్దామనుకున్నాను. ఎందుకో కుదరలేదు.

    కానీ అదే విషయాన్ని ఇంకో సంగీతకారుడు బలపరచడం చూసి ఉండబట్టలేక రాస్తున్నాను.

    ఈ మాట సంపాదకులు ఇలాంటి సంగీత పరమైన వ్యాసాల్ని కూడా ప్రచురించే ముందు సంగీతం వచ్చిన వారి చేత సమీక్ష చేయిస్తే ఇలాంటి తప్పులు దొర్లవని నా అభిప్రాయం.

    -సాయి బ్రహ్మానందం గొర్తి

  10. యాత్ర గురించి Pavan Kumar Garikapati అభిప్రాయం:

    03/01/2008 8:04 pm

    ఈ కవితలు ఎంతొ బాగున్నాయి. క్లుప్తత కి అర్థం ఇదే. వినీల్ ఉక్కు పిడికిళ్ళతో వదులుతున్నాడు కవితలని. కొత్త కొత్త పద బంధాలు చాలా అందంగా ఇమిడాయి.

    పవన్ కుమార్ గరికపాటి