Comment navigation


15538

« 1 ... 1527 1528 1529 1530 1531 ... 1554 »

  1. గత శతాబ్దంలో ప్రజాకవులు గురించి విప్లవ్ గారి అభిప్రాయం:

    09/08/2006 6:32 am

    వేలూరి గారూ,

    ఈ యూనికోడ్ తెలుగు ఎప్పుడో ఒక సారి నన్ను పప్పులోకి దింపుతుంది అని తెలిసీ ఈ గెస్ట్ బుక్ లో రాయకుండా ఉండలేక పోయాను, ఇదీ ఒక వ్యసనం గా మారే ప్రమాదం ఉందనిపిస్తుంది. ఏదో రాస్తూ పోయాను ఎట్లాగైనా ఈ “ప్రజాకవి” అనే అనవసర సిద్ధాంతాన్ని, నిర్వచనాన్ని కొంతైనా discredit చేయాలనే ఉద్దేశ్యంతో.

    నా మటుకు నాకు ఇది ఒక నామ వాచకం లా లేక ఒక బిరుదు గా వదిలేస్తే బాగుంటుందనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మనకు ప్రజాకవి కాళోజీ ఉన్నారు. ఆయన జన్మదినం సందర్భంగా రేపు (సెప్టెంబర్ 9 న) తెలంగాణ జిల్లాల్లో చాలా వరకు ఉత్సవాలు కూడా జరుగుతున్నయి. మీరిప్పుడు తిరుపతి వెంకట కవుల్ని ప్రజాకవులు అని చెబితే ఎవరో మాష్టారుకు ఇది నచ్చి అదే మాట తెలుగు పుస్తకాల్లోకి ఉన్నది ఉన్నట్లు దింపితే అప్పుడు నాలాంటి వాడొకడు తన పాళీని జియో పొలిటికల్ ఇంకులో ముంచి ఇవ్వాళ కాక పోతె రేపు ఇట్ల రాయ వీలయితది:

    “బోగపోళ్ళ బాగోతపు పద్యాలను మా నెత్తిన /ప్రజల కవిత్వం పేర రుద్ది / సౌహార్ద్రం, సమైక్యం భాషంటివి / నా యాసను చిన్నబుస్తివి / నీ పాఠం నాకొద్దు / ప్రజలు నేను, కవిత్వం నాది, ప్రజాకవివి నువ్వెట్లయితవు”

    అందుకే: వెల్చేరు గారు సెప్టెంబరు తెలుగు నాడిలో రాసిన తిరుపతి వెంకట కవుల పరిచయం చాలు, మీ వ్యాసం కూడా మొదటి నాలుగు పేరాలు (టైటిల్ తోసహా) మినహాయించి, “1999 జూన్ జులై ” కాడ్నించి అద్భుతం. అది నా అసలు అభిప్రాయం. ఆ మాట డొంక తిరుగుడుగా చెప్పాలనుకోవటం నా తప్పే.

    అన్నట్టు, తొడ పాశం పెట్టిన సారు మీదికి ఎదురు మళ్ళానని నన్ను పక్క సెక్షనులో తోసారు, అప్పుడు ఏదో లే అని సరిపెట్టుకుని ఉంటే ఇప్పుడిట్లా తయారయి ఉండే వాడిని కాదేమో.

    మీరు తప్పుగా అనుకోకపోతే ఇప్పటికే ఎక్కువ రాసాను,
    ఇక సెలవ్, విప్లవ్

  2. సంగీతంతో కుస్తీ గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    09/08/2006 6:25 am

    సాయిగారి సంతృప్తి కోసమని నేను లోగడ రాసిన వ్యాసం లింక్ ఇస్తున్నాను. అందులో శాస్త్రీయ సంగీతపు 16, 22 శ్రుతులను గురించి క్లుప్తంగా చెప్పాను.

    https://eemaata.com/em/issues/200007/789.html

    ఆయనకి వ్యాసం నచ్చినందుకు సంతోషం. ఔత్సాహికుల సౌకర్యం కోసమని 16 శ్రుతుల గురించి ప్రస్తావించలేదనీ, నేనూ, ఇతర పాఠకులూ విన్నవించుకోవడం జరిగింది.

    మరొక విషయం. 72 మేళకర్తల వరకూ వివరించడానికి 16 శ్రుతులు సరిపోతాయి కాని ఆరభి, దేవగాంధారి వంటి రాగాల మధ్య తేడాలు తెలుసుకోవడానికి ఉపకరించవు. ఔత్సాహికులకు అవసరంలేని ఇలాంటి విషయాలు కొన్ని ఉంటాయి. 22 శ్రుతుల గురించి తెలియాలంటే ఇది చూడండి.

    http://www.rit.edu/~pnveme/raga/Sruti.html

    [ఈ 12 vs. 16 vs. 22 శ్రుతుల పై చర్చ ఇంతటితో ముగించవలసిందిగా పాఠకులకు మనవి. – సంపాదకులు]

  3. సంగీతంతో కుస్తీ గురించి Sai Brahmanandam Gorti గారి అభిప్రాయం:

    09/07/2006 2:34 pm

    నేను రాసిన అభ్యంతరమల్లా ఒక్కటే ! మొత్త స్వరాలు 16, కానీ కీబోర్డు మీద కేవలం 12 మాత్రమే పలికించ గలమని రాయచ్చు కదా? మొత్తం 12 స్వరాలే అని రాయడం, నా దృష్టిలో సుముచితం కాదు. అవును, 16 స్వరాలు 16 అని రాసి, 12 అని రాయకుండా ఉండాల్సింది అని అనచ్చుకదా? లేదా 16 స్వ రాలు ఉన్నాయి, కానీ 12 మాత్రమే కీబోర్డు లో పలికించ వచ్చు అని రాయడం వల్ల ఎవరికీ అభ్యంతరం ఉండదు.
    అలా కాకుండా మేకేం తెలియదంటూ, నాకు అపారమైన వాయిద్య అనుభవం ఉంది అని రాయడం వల్లే నేను పొరపాటని రాయడం జరిగింది. నేను వ్యాసకర్తని కానీ, ఆయన వ్యాసం బాగోలేదని కానీ రాయలేదు. నాకూ సంగీతానుభవం ఉంది. నేనూ వీణ వాయించ గలను. వాయిద్య ముఖ్యం కాదు, సంగీతమే ముఖ్యం అన్నప్పుడు, మనం ఇచ్చే సమాచారం సరిగ్గా ఉండాలన్నదే నా ఉద్దేశ్యం, అంతేకానీ, ఇంకోళ్ళ విద్వత్తుని ప్ర శ్నించడం కాదు. వస్తువు వదిలేసి, వ్యక్తులవైపు విమర్శ దారి మళ్ళితే ఎలా ఉంటుంది?
    వ్యాసం చదివేక ప్రసాదు గారికి అపారమైన సంగీతానుభవం ఉందని ఎవరికైనా అర్థం అవుతుంది.

    – సాయి బ్రహ్మానందం గొర్తి

  4. గత శతాబ్దంలో ప్రజాకవులు గురించి Veluri Venkateswara Rao గారి అభిప్రాయం:

    09/07/2006 2:27 pm

    ఆలస్యంగా సమాధానాలిస్తున్నందుకు మన్నించండి. ముందుగా రథ్య అర్థం గురించి:
    రథ్య అంటే రాజమార్గము అనీ, రథసమూహము అనీ రెండర్థాలూ ఉన్నాయి ( చూ: సూర్యరాయాంధ్ర నిఘంటువు, ఆరవ సంపుటము, 648 వ పేజీ, లేదా చూ: శబ్దరత్నాకరము, 922 వ పేజీ)

    నాకూ శ్రీశ్రీ అంటే చచ్చే ఇష్టం, వల్లమాలిన అభిమానం. ఏ ప్రజలకి అతను “ప్రజాకవి” గా చలామణి అవుతాడో నావ్యాసంలో (నావ్యాస పరిథిలో అంటే ఇబ్బంది తక్కువ అవచ్చు!) చెప్పిందానికన్నా ఎక్కువగా చెప్పేందుకు ఏమీ లేదు.

    గద్దర్, వంగపండుల పాటలని ముందుగా “కవితలు”గా బేరీజు వెయ్యాలి. అందుకు చెయ్యవలసిన కృషి వేరే ఉంది. (ఆ పని నేను మొదలెట్టా!)అసలు, ఆపాటలు కవిత్వమా? కాదా? అని నిర్థారణ చేసుకున్న తరువాత, వారు ప్రజాకవులా కారా అన్న ప్రశ్న ఉదయిస్తుంది. (నన్ను అపార్థం చేసుకోకండి, అక్కిరాజు గారూ! ఆహా! ఎంచక్కని సినిమా డైలాగు!)

    ఒకానొకప్పుడు, “తెలుసా”లో గద్దర్ పై నేను ఒక పెద్ద వ్యాసం రాసిన గుర్తు. ఆ వ్యాసం అంతా అతని ఒకేఒక్క పాటమీద! అప్పట్లో, కొందరు నన్ను చీవాట్లు కూడా పెట్టారు. అదివేరే విషయం, అనుకోండి.

    గద్దర్ పైవ్యాసంకూడా త్వరలోనే ( సమీక్షకులు “సై” అంటేనే సుమా!) ఈమాట లో రావచ్చు.

    విప్లవ్ గారు చాలా విషయాలు చెప్పారు. సాంఘిక చరిత్ర గురించి ఆయనకి నేను పాఠం చెప్పగల సమర్థుణ్ణి కాదు. అయినా, ఆయన నన్ను పూర్తిగా “అపార్థం” ( అబ్బ! ఇంతకన్నా మంచి మాట తెలుగులో లేదు కాబోలు!) చేసుకున్నట్టు అనుమానం గా వుంది. వ్యక్తిగత అభిప్రాయాలని మన్నించమని మా తెలుగు మేష్టారు ఎప్పుడో చిన్నప్పుడే, శొంఠిపిక్క పెట్టి మరీ నేర్పారు! అందుకు బద్ధుణ్ణి, ఇప్పటికీనూ!

    ఇతి.
    అభివాదాలతో, — వేలూరి వేంకటేశ్వర రావు.

  5. ఈమాట కొత్త వేషం గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    09/06/2006 1:54 pm

    అమెరికాలోనూ, మన దేశానికి దూరంగా ఇతర ప్రాంతాల్లోనూ ఉంటున్న తెలుగువారు తమ సంస్కృతిని మరిచిపోకుండా ఉండేందుకూ, తమ పిల్లలకు దాన్ని గురించి పరిచయం చేసేందుకూ తంటాలు పడటం మామూలే. ఇందులో భాగంగా సంగీతం, నాట్యం మొదలైన కళలనూ, తెలుగు భాషనూ నేర్పేందుకు చిన్నా పెద్దా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించకుండా ఇందులోని సాధక బాధకాల గురించీ, నేర్పేవాళ్ళ, నేర్చుకునేవాళ్ళ అనుభవాల గురించీ వ్యాసాలు ఈమాటలో వేస్తే నలుగురికీ ఉపయోగకరంగా ఉంటుంది. అస్తమానం సినిమా నటులని పిలిపించి వారితో అవస్థలు పడేకన్నా స్థానికంగా జరిపే ప్రయత్నాలు మంచి ఫలితాలనిస్తాయని నా ఉద్దేశం. ఇటువంటి రచనలను ఆహ్వానిస్తూ సంపాదక వర్గం ప్రకటన చేస్తే బావుంటుందేమో. అటువంటి రచయితల గురించి తెలిస్తే వారిని వ్యాసాల కోసం సంప్రదించటం కూడా మంచిదే.

  6. సాహిత్య చర్చలు – పర్యవసానాలు గురించి అనానిమస్తు గారి అభిప్రాయం:

    09/06/2006 1:48 pm

    చిమట గారి వ్యాఖ్యలో:
    ===>
    “తెలుగు సాహిత్యం లో ఎవరు కూడా తమ తమ అభిప్రాయాలకు జీవితాంతం కట్టుబడి వుంటారని, నేను భావించడం లేదు.”
    “తెలుగు సాహిత్యం లోచర్చల వల్ల కొంతమందైనా పునరాలోచనలో పడతారని, నేను భావించడం లేదు.” పరస్పర విరుద్ధమైన భావాలు.
    ===>
    సాహిత్యకారులు పునరాలోచనలో పడడానికి చర్చలు కాక మరేదైన కారణం ఉండొచ్చునని అనుకోవచ్చు కదా. పదవులు, అవార్డులు, కులాలు, ప్రాంతాలు, వాదాలు, స్నేహం వీటి వల్ల పూర్వాశ్రమంలో తమ అభిప్రాయాలు మార్చుకున్న పెద్దమనుషుల దాఖలాలేవీ మనకు లేవా?

    ఐనా ఒక వ్యాసంలో ఒక వాక్యాన్ని ఇలా out of context కోట్ చేయడం వల్ల పాఠకులకి clarity కన్నా confusion ఎక్కువ. సంపాదకీయంలో ఇలాంటివి ఉండడం అనుచితంగా ఉంది.

  7. అంకెలు-సంఖ్యలు: రామానుజన్ నుండి భార్గవ దాకా గురించి Rama S Yeleswarapu గారి అభిప్రాయం:

    09/06/2006 12:45 pm

    అయ్యా,
    భార్గవ గారి పరిశోధని చాలా అందంగా అధ్బుతంగా వ్రాశారు వేమూరి గారు. ఈ వ్యాసం చదివిన తరువాత గణితం మీద నాకు మరల ఉత్సుకత కలిగింది.
    దయచేసి ఇటువంటి వ్యాసాలు మరిన్ని భవిష్యత్తు లో ప్రచురించ ప్రార్ధన.

    భవదీయుడు,
    రామ సుబ్రహ్మణ్యం యేలేశ్వరపు.

  8. మొలతాడు గురించి P. Siva గారి అభిప్రాయం:

    09/06/2006 6:16 am

    పవన్ కుమార్ గారికి లాగే ఈ కవిత నాకు కూడ చాలా నచ్చింది. అయితే ఈ కవిత ఇరాక్ యుద్ధాన్ని ప్రశ్నిస్తున్నట్టు నాకనిపించింది. కవితలో ప్రియురాలు ఇరాక్ లో ప్రజాస్వామ్యమయితే, ఈతరాని ప్రియుణ్ణి బుష్ గా పేర్కొనవచ్చు. ఈ విధంగా ఆలోచిస్తే, బుష్ లాంటి వాళ్ళకి ఖచ్చితంగా తేలేది మొలతాడే (అది లేకున్నా)!
    కాకపోతే ఈ రెండు పాదాల ప్రాసకోసం పడుతున్న ప్రయాసలో చీల్చిన దుంగలో తోక ఇరుక్కున్న మర్కటంలా మారిన కవిగారి పరిస్థితికి కించిత్ జాలి కలిగిందని చెప్పక తప్పదు.. మరీ ముఖ్యంగా అనవసరంగా ఇరుక్కున్న మరకతాన్ని చూచాక.

  9. వానలో ఓ జాణ గురించి అనానిమస్తు గారి అభిప్రాయం:

    09/05/2006 2:26 pm

    కొంచెం అటూ ఇటూ తిప్పి హిమజ్వాల నవల్లో యీరో యీరోయిన్లకు మధ్య యింట్రడక్షన్/యింటరాక్షన్ సీన్ రాస్తే కాస్త ఇలాగే ఉంటుంది. కాపీ కొట్టారని అనను. కాని, స్వతంత్రభావాలున్న అమ్మాయి చిత్రీకరణ కాస్త స్టీరియోటైప్ అయ్యింది అనగలను. ఒరిజినాలిటీ విషయంలో నాలుగుకు సున్నా మార్కులు.

  10. గత శతాబ్దంలో ప్రజాకవులు గురించి విప్లవ్ గారి అభిప్రాయం:

    09/05/2006 2:03 pm

    “గతశతాబ్దపు” అని పేరు పెట్టారు కనుక సరిపోయింది. లేకపోతే ఇప్పటి
    “ప్రజాకవులు” మీకొక కవిత్వపు noose తయారు చేసి వేలాడ దీసే వాళ్ళు.

    గత శతాబ్దం అనే కంటే, శ్రీ శ్రీ కంటే ముందు ప్రజా కవులు అంటే మీ సొమ్మేం
    పోయింది? శ్రీ శ్రీ ని అనవసరంగా గొప్పవాణ్ణి చేస్తామని భయమా :).

    అయినా సరే, మొదట “ప్రజల గురించి” కొద్దిగా:

    “ఇకపోతే, ఎవరయ్యా నీ ప్రజలు అని నిలదీసి అడిగితే, నా సమాధానం: వీధి
    బడికెళ్ళి చదువుకోని వాళ్ళు, వీధిబడికి కూడా వెళ్ళలేని వాళ్ళు, ఏ రకంగానూ చదువుకోటానికి అవకాశంలేని వాళ్ళు, ఏదో ఒక చిన్న బడికెళ్ళి ఓ న మా లు నేర్చుకోని కాస్తోకూస్తో చదవడం చాకలిపద్దు రాయడం నేర్చుకున్న వాళ్ళు. వీళ్ళు అసలు సిసలైన ప్రజలు. మన మహానగరాలు, పెద్ద పెద్ద పట్టణాలూ వదిలేస్తే, నూటికి డెబ్భైమందో, ఎనభైమందో నేను పైన నిర్థారించిన
    ప్రజలకిందే జమా కట్టచ్చు. ఈ ప్రజల్లోకి వెళ్ళి బలపడ్డ కవిత్వం ప్రజా
    కవిత్వం.”

    ఈ ప్రజల నిర్వచనం కూడా “గత శతాబ్ది” కి చెందేదే అనుకుంటాను.

    ఇప్పటి ప్రజలు ఏ కొద్ది మందో తప్పితే పట్టణ లేక నగర వాసన, పత్రికల నీడ సోకని వాళ్ళు తక్కువ.

    1991 జనాభా లెక్కల ప్రకారం అప్పటికే 25 శాతానికి పైగా పట్టణాల్లో ఉన్నారు, 2001 వచ్చే సరికి అది మూడవ వంతుకు చేరింది. అక్కడితో సరిపెట్టకుండా ఒక ఎస్టిమేట్ ప్రకారం ఈ దశాబ్ది చివరికి యాభై శాతానికి పైగా పట్టణ వాసులే అవుతారు మన జనాభా.

    మీరన్న “ప్రజ” ఇప్పటి వాళ్ళు కాదు అనేది కొంత వరకూ క్లియర్. అంతే కాదు, ప్రజల కు నిర్వచనం మారుతుంది ఎప్పటికప్పుడు, స్థలాన్ని బట్టి, కాలాన్ని బట్టి, అవసరాన్ని బట్టి కూడా. (ఉదా: అమార్త్య సేన్ పుస్తకం ఐడెంటిటీ & వయలెన్స్).

    ఇక ప్రజాకవుల గురించి:

    “ఈ ప్రజలని ఉత్తేజ పరిచి, వాళ్ళకి ఉత్సాహాన్నిచ్చిన కవిత్వం రాసిన వాళ్ళు
    ప్రజా కవులు. ”

    ప్రజలు మారినప్పుడు కవిత్వం మారుతుందన్నమాట ఈ ప్రజా కవుల Definition పట్టుకుని వెళితే. ఏది ఉత్సాహాన్ని ఇస్తే, అది ఎట్లా డెలివరీ చేస్తే
    వస్తుందో తెలిస్తే ప్రజాకవుల కు కావలసిన మినిమం క్వాలిఫికేషన్ తీరుతుందనుకుంటే ఇక సాధనాలదే ప్రధాన పాత్ర అవుతుంది, ఆ రాసింది ప్రజల నోళ్ళలో నానడానికి. నాటకాలు, అవధానాలు తిరుపతి కవులను ఎట్లా ప్రజల్లోకి తీసుకెళ్ళాయో ఆ తరువాత సున్నమేసిన తెల్ల గోడలు, సినిమాలు, ఇప్పుడు పత్రికలు శ్రీ శ్రీ ని (అతన్ని అనుకరించే వాళ్ళను) ప్రజల్లోకి
    తీసుకెళ్తున్నాయి.

    తిరుపతి వెంకట కవులు మీరిచ్చిన డెఫినిషన్ accept చేస్తారని నేననుకోను.
    ఒక వేళ చేస్తే అది కూడా ముపటి మాట కిందికే వస్తుంది. గతం గురించి
    చెప్పేటప్పుడు అనుకోవలసినమాట.

    ఇక ఇప్పటి సంగతి: వీధి నాటకాలు ఇప్పటి ఊళ్ళలో అంతగా కానరావు. ఎప్పుడో ఏడేండ్లప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊర్లో రాత్రి పూట “బావా ఎప్పుడు వచ్చితివీవు …” లాంటివి వింటూ నాటకం చూస్తూ అక్కడే పడి నిద్రపోయి, సగంలో మళ్ళీ “చెల్లియో చెల్లకో …” అంటూ మొదలు పెట్టిన గొంతుకో, హార్మోనియం దెబ్బకో మళ్ళీ దడుచుకుని లేచి ఇక నిద్ర ఎగిరిపోయి ప్రొద్దున ఆ కప్పు చాయ పడే వరకూ చొప్ప బెండ్లతో కచ్రపు బండ్లు చేసుకోవటం వంటివి తీరి రెండు దశాబ్దాలైనా అవుతుంది అనుకుంటాను.

    ఇప్పటి రోజుల్లో కొన్ని పట్నాల్లో, నేను కర్నూలు, వరంగల్లు లో కొద్దిగా
    చూసాను, నాటక పోటీల పేరుతో; కానీ చాలా వరకు సాంఘికాలే అవి. మరీ గుంటూరు, గోదావరి జిల్లాల్లో అయితే ఇప్పట్లో దసరా సెలవుల్లో రాత్రిపూట స్టేజీ మీద జరిగేవి నాటకాలు అని వెళితే వేలూరి గారు “శివ శివా” అనుకుంటూనో లేక “శెవ్వా ఇదా వేషం” అంటూ అట్లాంటా పరిగెత్తుకు వచ్చేస్తారనుకుంటాను. (అది నా ఊహే, ఆయన అక్కడే పీఠం వేసుకు కూర్చుంటారేమో మరి నాకెరుక లేదు.)

    చెప్పేదేంటంటే, ఇదివరకు ప్రజలకు సాహిత్యాన్ని చేరువ గా తెచ్చే ప్రయోగం
    నాటకమైతే ఇప్పటి సాధనాలు వేరు అని. ఇప్పుడు పేపరు చదవని వాళ్ళు అతి తక్కువ. ఒక్క ఈనాడు పత్రికను కోటిన్నర మంది చదువుతారట వాళ్ళ లెక్కల ప్రకారం. ఉన్నది ఏడెనిమిది కోట్లే కదా, పిల్లలను తీసేస్తే మిగిలేది
    అయిదు కోట్లే. ఇక పత్రికలు చదవని వాళ్ళు ఆ లెక్కన అతి తక్కువ.

    అందుకే ఇప్పటి పత్రికల్లో వచ్చేవి ప్రజా కవితలు, కవిత్వం అనిపిస్తాయి ఈ
    రోజుల్లో. అవి తవికలే కావచ్చు, మరింకేమైనా కావచ్చు. ఏ పత్రికయినా చదివే వాళ్ళను ఉద్దేశ్యించింది కాబట్టి వాళ్ళనుద్దేశించిన రాతలే ఎక్కువగా
    వస్తయి. అవి ఎటువంటివి వస్తాయి అనడానికి పెద్ద ఊహాగానాలు అక్కరలేదు. చికెన్ గున్యా మీద సీస పద్యాలు వస్తయి. మొసపొటేమియా మీద పొటేలు రంకెలు వినిపిస్తయి. ఇదంతా ప్రజా కవిత్వమే.

    దీన్ని బట్టి చూస్తే ఎవరైతే ఆ కాలపు మాధ్యమాన్ని, అప్పటి పరిస్థితులకనుకూలంగా, అతి ప్రతిభావంతంగా ఉపయోగించుకుంటారో వారే ప్రజా కవిగా మిగులుతారు, మిగతా వాళ్ళు ఉత్తుత్తి కవులుగా నిలబడి జాతర చూడవలసిందే.

    తిరుపతి వెంకట కవుల నాటకాల్లో పద్యాలు అప్పటి కాలంలో ప్రజా కవిత్వం అయితే, ఇప్పటి ప్రజా కవిత్వం ప్రతి రోజూ అచ్చయే పేజీల మధ్య కనిపిస్తుంది.

    చివరగా, వాళ్ళే ఇప్పటి కాలంలో ఉండేదుంటే అరాఫత్, ఒసామాల నుండి అంతర్జాతీయ ద్రవ్య నిధి దాకా పొయిట్రీ రాసి ఉండే వాళ్ళే. ఇదేం పోయేకాలమో ఇంతగా చదువుకుని, ఇంతింత విషయాల గురించి తక్కువ పదాలతో పొయెట్రీ రాయగల ఇప్పటి కవులు వాటినే ఇంకొంచెం సాగదీసి వ్యాసం రాయొచ్చుకదా. “ఈనాడు” లాంటి అటూ ఇటూ కాని పత్రిక(లు), వీళ్ళు వ్యాసాలు రాస్తే మీ పేరు పెట్టి వేయం అనే ఒక దరిద్రపు రూలు పెట్టినందుకే మనకు కవులెక్కువ, వ్యాస కర్తలు తక్కువ అని నా అనుమానం.

    ఈ లెక్కన “గత శతాబ్దపు” ప్రజాకవుల పక్కన ఇప్పటి ప్రజా కవులను
    నిలబెడతానంటే కుదరనిపని. అసలు ప్రజాకవి అనే పదమే అనవసరం అని outlaw చేస్తే మంచిదని నాకనిపిస్తుంది, లేకపోతే “మహాకవి” అనే పదానికి
    బహుపదార్ధాలు వాటికి మళ్ళీ తాత్పర్యాలు చెప్పుకున్నట్టే ఇదీ తయారవుతుంది, only more often we get to define and redefine it.

    విప్లవ్

« 1 ... 1527 1528 1529 1530 1531 ... 1554 »