అందరూ చేస్తారు బస్సు ప్రయాణం. ప్రయణమంతా ఎవో తెగని ఆలోచనలు అందరికీ వస్తాయి. కానీ మనస్సులో చెలరేగే ఆలోచనలు కాగితంపై పెట్టడం అందరికీ సాధ్యమా? ఈ చైతన్యస్రవంతిని మన ముందుంచిన సౌమ్యగారికి అభినందనలు
“ఒక విలేఖరి” విశ్లేషణ, విస్తారం చక్కగా ఉన్నాయి. నాకు చాలా నచ్చిన, నన్ను ఒక వారమంతా ఊహల్లోనే ఉంచేసిన ఆనాటి సాహితీసదస్సును ఏ రకంగా తలచుకోగలిగినా సంతోషమే! నాటి ఆ సదస్సుకు నేను రావలసిందేనని మరీ మరీ అడిగి మరీ నన్ను హ్యూస్టన్ రావించిన వంగూరి చిట్టెన్ రాజు గారికి, ఆ రెండు రోజుల సదస్సును మనస్సుకు హత్తుకునేలా నిర్వహించిన నిర్వాహకసభ్యులందరికి, అప్పటి స్మృతులను మరలా అందించిన “ఒక విలేఖరి”కి, “ఈమాట”కు నా కృతజ్ఞతలు. (నేను కలవగల అవకాశం కల్పించి, నాతో సావకాశంగా మాట్లాడి, మనస్పూర్తిగా నన్ను ప్రోత్సహించి, ప్రేరేపించిన పెద్దలకు కృతజ్ఞతలు చెప్పుకోవటానికి ఇది సముచిత రంగస్థలం కాదేమో. వారందరికీ కూడా నా నమస్సులు చెప్పుకోవటం తక్కిన పాఠకులకు, సంపాదకులకు ఇబ్బందికరం కాదని తలుస్తాను.)
కోనసీమ కథలు చెప్పినందుకు ధన్యవాదాలు. నేచెప్పిన కథ variation on the same theme అన్నమాట. ఇట్లాంటి పిట్ట కథలు ఇంకా ఏవన్నా ఉంటే చెప్పండి. అన్నీ కలిపి ఒక చిన్ని పుస్తకం వేద్దాం.
మరోసారు ధన్యవాదాలతో,
వేలూరి వేంకటేశ్వర రావు.
అక్కడినుండి మిగిలిన సంచికలు కూడా PDF గా Download చేసుకునే అవకాశమ కలిపించండి.
మీ
కమేశ్వరరావు.
ఛందోధర్మము గురించి Raja Shankar Kasinadhuni గారి అభిప్రాయం:
11/02/2006 3:35 pm
కృష్ణదేశికాచార్యులగారి వ్యాసం చాలా బాగుంది. మంచి పద్యం చదివినప్పుడు, యతి ప్రాసల నియమాలని పాటిస్తూ కూడా ఈ కవి ఎంత చక్కని పద్యం వ్రాయగలిగాడని అనుకునేవాడిని. అయితే, యతి ప్రాసలు పదదారిద్ర్యంతో బాధపడే కవులకు సంకెళ్ళైతే, సత్కవులకు తమ భావాన్ని మరింత బాగా వ్యక్తం చేయడానికి దోహదం చేసే సాధనాలనే ఆలోచన ఈ వ్యాసం చదివేదాకా కలగలేదు. ఇంత చక్కని వ్యాసం వ్రాసిన రచయతకూ, ప్రచురించిన ఈమాట సంపాదకులకూ ధన్యవాదాలు.
కథ చాలా బాగుంది, సావిత్రిగారూ!
ఇది ఉత్తరాది వినాయకుడి కథ కాబోలు.
దక్షిణాది వినాయకుడు బ్రహ్మచారి గదా!
బహుశా ఇది కూడా మాయేమో?
వారి తమ్ముడేమో ఉత్తరాదిలో బ్రహ్మచారి,
దక్షిణంలో ఇద్దరు భార్యలకు భర్త!
వక్త్రతుండ మహాకాయ
సూర్యకోటిసమప్రభ
నిర్విఘ్నం కురు మే దేవ
సర్వకార్యేషు సర్వదా
మా కోనసీమలో ఇటువంటి కధే ప్రచారంలో ఉండేది. అందులో అంతవరకూ రాముడి విల్లంబులు, ధనస్సు మోసే లక్ష్మణుడు కాస్తా గోదావరి దాటి కోనసీమలో ప్రవేశించగానే – “ఛీ ! నా చేత నీ విల్లంబులు మోయిస్తూ, నన్ను సోదరుడిలా కాకుండా నన్ను ఒక పనివాడిగా చూస్తున్నావు.” అంటూ ధనస్సు క్రింద పారేస్తాడు. సీత కూడా యధాలాపంగా రాముడ్ని తూలనాడుతుంది. తీరా గోదావరి దాటి గానే రాముడి చేతిలో విల్లంబులు చూసి అదేమిటి అన్నగారి చేతిలో ధనస్సు చూసి క్షమించమని అడుగుతాడు. అప్పుడు సీతమ్మ తమ వింత ప్రవర్తన కి కారణం అడిగితే – ఆ నేల మహత్యం అంటాడు రాముడు. ఇదొక కథ.
ఇంకొక కథ ఉంది. అది మీ కథ కి కొనసాగింపు కథ!
రావణ సంహారం అయ్యాక పుష్పక విమానంలో హనుమంతుడు అందరితో కలసి వానరులు కూడా ఎక్కుతారు.అంతవరకూ ఎంతో వినయ విధేయతల్తో ఉన్న హనుమంతుడు హఠాత్తుగా కోతి చేష్టలు చేస్తూ అందరీ గిల్లుతూ రక్కుతాడు. గిల్లి కజ్జాలు పెట్టుకుంటాడు. దాంతో వానర మూక రెచ్చిపోతారు. విభీష ణుడు, లక్ష్మణుడు అందరూ రాముడితో మొర పెట్టుకుంటారు. రాముడు కాస్త ఓరిమి వహించమని వారికి చెబుతూ, మనం ప్రస్తుతం గోదావరీ తీరాన ఉన్న కోనసీమ పైన ఉన్నాం ! ఇదంతా ఈ నేల గాలి ప్రభావం ! కంగారు పడనవసరం లేదని చెబుతాడు. గోదావరి దాట గానే మరలా హనుమంతుడు బుద్ధిగా ఉంటాడు. కోనసీమ నేల గాలి ప్రభావం అంతగా ఉంటుందని చెప్పే ఓ కల్పిత పిట్ట కథ!
బస్సెడు దూరం గురించి cbrao గారి అభిప్రాయం:
11/02/2006 8:58 pm
అందరూ చేస్తారు బస్సు ప్రయాణం. ప్రయణమంతా ఎవో తెగని ఆలోచనలు అందరికీ వస్తాయి. కానీ మనస్సులో చెలరేగే ఆలోచనలు కాగితంపై పెట్టడం అందరికీ సాధ్యమా? ఈ చైతన్యస్రవంతిని మన ముందుంచిన సౌమ్యగారికి అభినందనలు
హ్యూస్టన్ తెలుగు సదస్సు గురించి NaChaKi గారి అభిప్రాయం:
11/02/2006 8:16 pm
“ఒక విలేఖరి” విశ్లేషణ, విస్తారం చక్కగా ఉన్నాయి. నాకు చాలా నచ్చిన, నన్ను ఒక వారమంతా ఊహల్లోనే ఉంచేసిన ఆనాటి సాహితీసదస్సును ఏ రకంగా తలచుకోగలిగినా సంతోషమే! నాటి ఆ సదస్సుకు నేను రావలసిందేనని మరీ మరీ అడిగి మరీ నన్ను హ్యూస్టన్ రావించిన వంగూరి చిట్టెన్ రాజు గారికి, ఆ రెండు రోజుల సదస్సును మనస్సుకు హత్తుకునేలా నిర్వహించిన నిర్వాహకసభ్యులందరికి, అప్పటి స్మృతులను మరలా అందించిన “ఒక విలేఖరి”కి, “ఈమాట”కు నా కృతజ్ఞతలు. (నేను కలవగల అవకాశం కల్పించి, నాతో సావకాశంగా మాట్లాడి, మనస్పూర్తిగా నన్ను ప్రోత్సహించి, ప్రేరేపించిన పెద్దలకు కృతజ్ఞతలు చెప్పుకోవటానికి ఇది సముచిత రంగస్థలం కాదేమో. వారందరికీ కూడా నా నమస్సులు చెప్పుకోవటం తక్కిన పాఠకులకు, సంపాదకులకు ఇబ్బందికరం కాదని తలుస్తాను.)
బస్సెడు దూరం గురించి phanindra గారి అభిప్రాయం:
11/02/2006 8:10 pm
బాగుంది! మనసు చేసే గుప్పెడు ఆలోచనలను గుమ్మంలో ముగ్గులు చిలకరించినట్లు, రాతిరి ఆకాశానికి చుక్కలు అలంకరించినట్లు ఎంత అందంగా చిత్రించారు!
బస్సెడు దూరం గురించి krishnaveni గారి అభిప్రాయం:
11/02/2006 8:06 pm
మొత్తానికి నీ చైతన్య స్రవంతిని, మహాప్రస్థానాన్ని వదలలేదు సౌమ్య ఇక్కడ.
anyways as usual బాగా రాసావు.
-sai
ఉద్యోగం గురించి chavakiran గారి అభిప్రాయం:
11/02/2006 8:04 pm
చాలా బాగుంది
మీరు డాక్టరు అని నాకు తెలుసు కదా:)
ఒకవేళ సాఫ్ట్‌వేర్ ఇంజనీరు అయితే ఎలా వ్రాసేవారు ?
ఆ నేల, ఆ నీరు, ఆ గాలి గురించి Veluri Venkateswara Rao గారి అభిప్రాయం:
11/02/2006 7:53 pm
బ్రహ్మానందం గారూ!
కోనసీమ కథలు చెప్పినందుకు ధన్యవాదాలు. నేచెప్పిన కథ variation on the same theme అన్నమాట. ఇట్లాంటి పిట్ట కథలు ఇంకా ఏవన్నా ఉంటే చెప్పండి. అన్నీ కలిపి ఒక చిన్ని పుస్తకం వేద్దాం.
మరోసారు ధన్యవాదాలతో,
వేలూరి వేంకటేశ్వర రావు.
ఈమాట కొత్త వేషం గురించి Kameswararao గారి అభిప్రాయం:
11/02/2006 5:02 pm
మొదటి 30 సంచికలు P D F గా download చేయబడ్డాయి.
అక్కడినుండి మిగిలిన సంచికలు కూడా PDF గా Download చేసుకునే అవకాశమ కలిపించండి.
మీ
కమేశ్వరరావు.
ఛందోధర్మము గురించి Raja Shankar Kasinadhuni గారి అభిప్రాయం:
11/02/2006 3:35 pm
కృష్ణదేశికాచార్యులగారి వ్యాసం చాలా బాగుంది. మంచి పద్యం చదివినప్పుడు, యతి ప్రాసల నియమాలని పాటిస్తూ కూడా ఈ కవి ఎంత చక్కని పద్యం వ్రాయగలిగాడని అనుకునేవాడిని. అయితే, యతి ప్రాసలు పదదారిద్ర్యంతో బాధపడే కవులకు సంకెళ్ళైతే, సత్కవులకు తమ భావాన్ని మరింత బాగా వ్యక్తం చేయడానికి దోహదం చేసే సాధనాలనే ఆలోచన ఈ వ్యాసం చదివేదాకా కలగలేదు. ఇంత చక్కని వ్యాసం వ్రాసిన రచయతకూ, ప్రచురించిన ఈమాట సంపాదకులకూ ధన్యవాదాలు.
కాశీనాథుని రాజాశంకర్
గణపతి బప్పా మోరియా! గురించి aananda గారి అభిప్రాయం:
11/02/2006 11:24 am
కథ చాలా బాగుంది, సావిత్రిగారూ!
ఇది ఉత్తరాది వినాయకుడి కథ కాబోలు.
దక్షిణాది వినాయకుడు బ్రహ్మచారి గదా!
బహుశా ఇది కూడా మాయేమో?
వారి తమ్ముడేమో ఉత్తరాదిలో బ్రహ్మచారి,
దక్షిణంలో ఇద్దరు భార్యలకు భర్త!
వక్త్రతుండ మహాకాయ
సూర్యకోటిసమప్రభ
నిర్విఘ్నం కురు మే దేవ
సర్వకార్యేషు సర్వదా
నవ్వి నవ్వి నా బొజ్జ పేలదు గదా!
– ఆనంద
ఆ నేల, ఆ నీరు, ఆ గాలి గురించి Sai Brahamanandam Gorti గారి అభిప్రాయం:
11/02/2006 11:17 am
వేలూరి గారు,
మా కోనసీమలో ఇటువంటి కధే ప్రచారంలో ఉండేది. అందులో అంతవరకూ రాముడి విల్లంబులు, ధనస్సు మోసే లక్ష్మణుడు కాస్తా గోదావరి దాటి కోనసీమలో ప్రవేశించగానే – “ఛీ ! నా చేత నీ విల్లంబులు మోయిస్తూ, నన్ను సోదరుడిలా కాకుండా నన్ను ఒక పనివాడిగా చూస్తున్నావు.” అంటూ ధనస్సు క్రింద పారేస్తాడు. సీత కూడా యధాలాపంగా రాముడ్ని తూలనాడుతుంది. తీరా గోదావరి దాటి గానే రాముడి చేతిలో విల్లంబులు చూసి అదేమిటి అన్నగారి చేతిలో ధనస్సు చూసి క్షమించమని అడుగుతాడు. అప్పుడు సీతమ్మ తమ వింత ప్రవర్తన కి కారణం అడిగితే – ఆ నేల మహత్యం అంటాడు రాముడు. ఇదొక కథ.
ఇంకొక కథ ఉంది. అది మీ కథ కి కొనసాగింపు కథ!
రావణ సంహారం అయ్యాక పుష్పక విమానంలో హనుమంతుడు అందరితో కలసి వానరులు కూడా ఎక్కుతారు.అంతవరకూ ఎంతో వినయ విధేయతల్తో ఉన్న హనుమంతుడు హఠాత్తుగా కోతి చేష్టలు చేస్తూ అందరీ గిల్లుతూ రక్కుతాడు. గిల్లి కజ్జాలు పెట్టుకుంటాడు. దాంతో వానర మూక రెచ్చిపోతారు. విభీష ణుడు, లక్ష్మణుడు అందరూ రాముడితో మొర పెట్టుకుంటారు. రాముడు కాస్త ఓరిమి వహించమని వారికి చెబుతూ, మనం ప్రస్తుతం గోదావరీ తీరాన ఉన్న కోనసీమ పైన ఉన్నాం ! ఇదంతా ఈ నేల గాలి ప్రభావం ! కంగారు పడనవసరం లేదని చెబుతాడు. గోదావరి దాట గానే మరలా హనుమంతుడు బుద్ధిగా ఉంటాడు. కోనసీమ నేల గాలి ప్రభావం అంతగా ఉంటుందని చెప్పే ఓ కల్పిత పిట్ట కథ!
ఇటువంటి కథలు మా కోనసీమ లో చాలా ఉన్నాయి.
– సాయి బ్రహ్మానందం గొర్తి