Comment navigation


15541

« 1 ... 1518 1519 1520 1521 1522 ... 1555 »

  1. తెలుగు సాహిత్యం లో విమర్శ గురించి Veluri Venkateswara Rao గారి అభిప్రాయం:

    11/05/2006 11:08 am

    Alok Vastav గారు కృష్ణశాస్త్రి గారి మూల వ్యాసం చదివి ఉంటే, ఉమాపతి గారి గురించి నేను అన్నమాటలకి అక్షేపణ చేసేవారు కాదనుకొంటాను.

    కృష్ణశాస్త్రి గారి “పాతిక సంవత్సరాల తెలుగు కవిత్వము” అన్న 1948 భారతి పత్రికలోని వ్యాసం 1923 నుంచి 1948 వరకూ వచ్చిన కవిత్వంపై, నాటి కవితా ఉద్యమాలపై చక్కని విమర్శనా వ్యాసం అని నిస్సంశయంగా చెప్పవచ్చు.

    ఓరియంట్ లాంగ్మన్ వారు 1993 లో ప్రచురించిన “అప్పుడే పుట్టి ఉంటే” అన్న కృష్ణశాస్త్రి గారి వ్యాస సంపుటి లో ఈ వ్యాసం తిరిగి అచ్చయ్యింది. 1/8 డెమీ సైజులో 34 పేజీల సుదీర్ఘ వ్యాసం ఇది. ఆ వ్యాసంనుంచి ఈ కింది వాక్యాలు (చూ: 29 వ పేజీ):

    “… కృష్ణపక్షం ప్రచురించాను. స్ఫుటంగా నా మనస్సులో నాటుకొపోయిన మరి రెండు మూడు ఘట్టాలు ఉన్నాయి. 1925 లో నేమో అక్కిరాజు ఉమాకాంతం గారు వ్రాసిన “నేటి కాలపు కవిత్వము” అనే గ్రంథం వచ్చింది. ఆశనిపాతమంత తీవ్రధాటితో వచ్చింది. రాకేం జేస్తుంది? ఎప్పుడయితే నిజమైన ఒక ఉద్యమం బయలుదేరిందో, అప్పుడే దాని గుణదోషవిమర్శన కూడా వస్తుంది. ఆయన తీవ్ర విమర్శననుంచి నావంటి కవులు నేర్చుకోవలసినది లేకపోనూ లేదు; కాని కొంత ఆర్ద్ర దృష్టితో కవితాహృదయముతో ఆ విమర్శన సాగితే, నేటికాలపు కవిత్వంలో వారు చక్కదనమూ కవిత్వగుణమూ గ్రహించి ఉండేవారు. ఊపిరాడనీయనంత కోపంతో ఆ గ్రంథం దాడిచేసినట్లనిపించింది నావంటి వారికి. దానికి జవాబు వ్రాద్దామా అన్నారు కొందరు మిత్రులు. ఏమి జవాబు మేము వ్రాయగలం? కొత్త పద్యాలు వ్రాయడమే జవాబనిపించింది. వ్రాయకుండా ఎలాగుండగలం? ఈ సంకల్పం 1925 లో మదరాసులో మరీ దృఢపడింది.”

    ఆర్ద్ర దృష్టి, కవితా హృదయము ఉమాకాంతపండితులకు లోపించిందని ఇంతకన్నా మృదువుగా, కృష్ణశాస్త్రిగారి కన్నా చక్కగా ఇంకెవరు చెప్పగలరు?

    అభివాదాలతో,

    వేలూరి వేంకటేశ్వర రావు.

  2. రచయితలకు సూచనలు గురించి swarup krishna గారి అభిప్రాయం:

    11/05/2006 9:04 am

    మీ మాగజైను చాలా బాగున్నది. మీ కృషి ఫలించాలనీ ఆశిస్తూ

  3. తెలుగు సాహిత్యం లో విమర్శ గురించి Ananth B. Shastry గారి అభిప్రాయం:

    11/05/2006 8:41 am

    మీ వ్యాసం కాస్త ఓపిగ్గా చదవ వలసి వచ్చింది.

    సుమారుగా 100 ఏళ్ళ క్రితం వ్రాసిన విమర్శ గురించి సోదాహరణంగా విపరీతంగా చర్చించారు. 40/50 ఏళ్ళ క్రితం వ్రాయబడ్డ (నాకు ఉమాకాంతం గారు ఏ సంవత్సరంలో వ్రాసారో గుర్తులేదు) విమర్శ గురించి ఒక్క ముక్క చెప్పి, దానిపై మీ అభిప్రాయం వ్రాసారు. ప్రస్తుత విమర్శనా ధోరణి పై మీ అభిప్రాయాల్ని వెలిబుచ్చారు. అంత వరకూ బాగుంది. కాని, కొత్త విమర్శలకు ఉదారణలు ఇచ్చి ఉండవలసింది. కనీసం నలుగురి పేర్లు, వారి రచనల పేర్లిచ్చినా బాగుండేది.

    విమర్శ ఎలా ఉండకూడదో చెప్పారు బాగానే ఉంది. ఎలా ఉండాలో చెప్పే విమర్శలు తెలుగులో లేవనుకోవాలా? అనే సంశయాన్ని కలిగించారు. మంచి విమర్శల గురించి కనీస ప్రస్తావన చేస్తే బాగుండేది.

    వ్యాసంలో ఋణ విద్యుచ్ఛక్తి దండిగా ఉంది. మీ ఆశయం దాన్ని చదువరులకు తెలియజెప్పడం కాదు గదా! వారి దృష్టి ధనాత్మకత వైపు మళ్ళించడానికి అది ఒక వేదిక మాత్రమే.

    ఇది ఒక సాహితీ సభలో కీలకోపన్యాసంగా ఇవ్వబడిందని చెప్పుకున్నారు గాబట్టి ఒక మనవి. కీలకోపన్యాసాలు ఋణాత్మకంగా మొదలవడంలో తప్పులేదుగాని, ఉపన్యాసం పూర్తయేసరికి ధనాత్మకత హృదయాల్లో ప్రతిష్ఠించాలి. ఈ వ్యాసం ఆ పని చెయ్యగలదని అనిపించలేదు నాకు.

    పైన చెప్పిందంతా కేవలం నాకొక్కడికే అనిపిస్తే అది నాలోపమే.

    విధేయుడు
    అనంత్

  4. అన్నీ చెప్పగల భాష గురించి Sowmya గారి అభిప్రాయం:

    11/04/2006 11:23 pm

    బాగుందండీ.

  5. గణపతి బప్పా మోరియా! గురించి suseela subbarao గారి అభిప్రాయం:

    11/04/2006 8:43 pm

    దేవుడు అనే పదానికి సరి ఐన నిర్వఛనం హాస్యపూరితంగా, సునిసితంగా ఇచ్చిన ఈకథ ముచ్చటగా వుంది. చాలా రోజుల తరువాత సావిత్రిగారి కలం నుంచి ఒక మంచి కథ వెలువడింది.

  6. తెలుగు సాహిత్యం లో విమర్శ గురించి Alok Vastav గారి అభిప్రాయం:

    11/04/2006 12:07 pm

    అక్కిరాజు ఉమాకాంతం గారిది హద్దుమీరిన అవహేళన అన్న మీ మాటలు అంతగా నచ్చలేదు. యే కొంచెం సూటిగావున్నా అది హద్దులు మీరిందనా కొలబద్ద? కట్టమంచివారికంటే అక్కిరాజుగారిలో నాకు నిజాయితీ, ఆవేదనా కనపడుతుంది. శ్రీశ్రీ మాటల బట్టి జూస్తే కవులకు అక్కిరాజుగారి పాండిత్య భయమేగానీ ఆయన ఆవేదన కనబడలేదులా వుంది. అంటే ఆయా కవులకి కవిత్వవీరత్వం, పాండిత్యభీరుత్వమని తీర్మానించవొచ్చుగదా! లేదూ ఆయన చేత విమర్శింపబడ్డవారందరూ కవిపండితులే అనుకొంటే ఆయన విమర్శలని దీటుగా ఎదుర్కొంటూ యేల గ్రంధాలు, వ్యాసాలు వెలయించలేదు? “ఆ మహాపండితుడి ఆక్షేపణలకు సమాధానమ ఎవరేం చెప్పగలరు? మరింత ఉత్సాహంతో, పట్టుదలతో నవ్యకవితారీతులను ప్రచారం చేయడమే ఆయనకు చెప్పగల సమాధానమని మేమనుకొన్నాం” అని కృష్ణశాస్త్రిగారు భారతి రజతోత్సవ సంచికలో రాసినట్టు శ్రీ పేర్వారం జగన్నాధం గారు రాసారు. “మేమనుకొన్నాం” అన్న పదం నాకెందుకో “మూక మనస్తత్త్వా”న్ని గుర్తుకుతెచ్చింది.వొక్క పండితుడి “అవహేళన”కి మూక ప్రచారం స్థాయిలో సమాధానమివ్వాలని అంతమంది కలిసి తీర్మానించడమే సాక్షి అక్కిరాజుగారిది అవహేళనతో కూడిన విమర్శ కాదని. సంపూర్ణంగా భారతీయతత్వ చింతనతో విమర్శించిన అక్కిరాజుగారిని కట్టమంచివారి సరసన కట్టివేయడం మనసుకి కష్టంగా వుంది.

  7. బస్సెడు దూరం గురించి neeharika గారి అభిప్రాయం:

    11/04/2006 9:43 am

    బాగా రాసావు. అనట్టు ఒక చిన్న సందేహమొచ్చింది: ఏదైనా పెళ్ళికి వెళ్ళినప్పుడు మొదలయిందా ఈ కథ కు అంకురం?

  8. బస్సెడు దూరం గురించి Ashish.R.Katta గారి అభిప్రాయం:

    11/04/2006 3:56 am

    మనసులోని భావాలను సిరా చేసి కాగితం పై నింపితే కవితలు ఉద్భవిస్తయి
    సంఘటనలల జీవితాన్ని కాగితం పై పెట్టి కనికట్టు చెస్తే ఒక మంచి కధ జనిస్తుంది
    దాంట్లో శివం లంటి పాత్ర ఊపిరి పొసుకుంటుంది
    పేజీ చివరన వ్రాసిందెవరని చూస్తే తెలుగు భాష కి కొత్త ఊపిరి పోస్తున్న ఒక నవకిరణం నామం కనిపిస్తుంది

  9. ఈ-మెయిలు గురించి Sudheer Kumar Kothuri గారి అభిప్రాయం:

    11/04/2006 3:25 am

    బాగుంది…అలిగిన వేళ రాజీకి ఈమెయిలొక సాధనమయ్యింది. మీ కవిత ఎంతో సహజంగా వుంది. నేను కూడా నా భార్యతో ఏమైనా గిల్లీకజ్జాలు జరిగి మాటలు మూగవోయినప్పుడు ఈమెయిల్ నే రాజీ సందేశానికి ఉపయోగిస్తాను. అందుకే మా ఇద్దరి మధ్య ఎమైన గొడవైనప్పుడు నా వైఫ్ పదే పదే ఈమెయిల్ చెక్ చేస్తూంటుంది.

  10. పనిపిల్లలు గురించి Kiran గారి అభిప్రాయం:

    11/03/2006 4:43 pm

    vara garu mee katha super, asalu mee kavitha chaduvuthunte meeru padda kastam artham avuthundi I mean ee katha ni rayadaniki padda kastam. Story pathade kani chala kothaga chupincharu mee style naku nachindi meeru katha lo motham munigi poyaru, asalu meeru katha lo jeevinchesaru…

« 1 ... 1518 1519 1520 1521 1522 ... 1555 »