పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16635

  1. కల్యాణి రాగం – అనుబంధం గురించి Srinivas అభిప్రాయం:

    03/07/2008 7:12 pm

    కళ్యాణి అనే రాగాన్ని కటపయాది సూత్రం కోసం మేచ కళ్యాణి గా మార్చారనేది నిర్వివాదాంశం. మేచ కళ్యాణి వేరే రాగం అయితే అందులో ఒక కృతి చెప్పండి? శంకరాభరణం, ధీరశంకరాభరణం రాగాలు కూడా అంతే. మీరు అన్న ఆ ‘చెప్పబడుతున్న’ తేడా ఏంటి? మీరనుకునే ధీరశంకరాభరణం లో ఒక ఉదాహరణ ఇవ్వండి.

    ఇంకొకాయన అన్నట్టు జన్య రాగం ముందు ఉండి జనక రాగం తర్వాత పుట్టడం లో అసంబద్ధత ఏమీ లేదు. ఉన్న రాగాల్ని categorize చెయ్యడానికి, అర్థం చేసుకోటానికి మనం కల్పించుకున్న formulaలు జనక రాగాలు. జగమెరిగిన సత్యాల్ని science కోడీకరించినట్లు.

  2. తెరమరుగవుతున్న తెలుగు నాటకం -2 గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:

    03/07/2008 12:31 pm

    రాజా రావు గార్కి,

    మీకు ఈ వ్యాసం నచ్చినందుకు సంతోషించాను.
    వ్యాస సూచికలు వ్యాసం మొదటి భాగంలో ఇచ్చాను. ఒక్కసారి చూడండి.
    మీ సూచన ప్రకారం మరలా రెండో భాగంలోనూ పెట్టమని సంపాదకుల్ని అడిగాను.

    -సాయి బ్రహ్మానందం

  3. తెరమరుగవుతున్న తెలుగు నాటకం -2 గురించి mOhana అభిప్రాయం:

    03/07/2008 11:49 am

    మంచి వ్యాసము. సాయి గారికి అభినందనలు. మేము చిన్నప్పుడు
    బడిలో చదువుకొంటున్న రోజుల్లో ప్రతి సంవత్సరము ఒక నాటకము,
    ఒకటో రెండో నాటికలు వేసేవాళ్లము. మా బడి పక్క సౌందర్యమహలు
    అనే నాటకప్రదర్శనశాల ఉండేది అప్పుడు. శ్రీ కృష్ణ లీలలు, కరుణామయి
    అనే రెండు నాటకాలు జ్ఞాపకానికి వస్తుంది. తిరుపతిలో ఆ కాలంలో
    నాటకాల పోటీలు ఉండేవి. మంచి నాటకాలు, నాటికలు
    ప్రదర్శించే వాళ్లు. సురభి నాట్యమండలివారిని గురించి ఈ పుస్తకములో చదువవీలగును. తెలుగు సాంఘిక నాటకాల పరిణామము, వికాసము అనే పుస్తకం కూడా చదవతగినది.

    పై పుస్తకాలను డవున్లోడ్ చేసికోవచ్చు.
    ఆ కాలపు నాటకాలు ఎలా ఉంటాయో అన్న విషయాన్ని గురించి నేను కన్నడములో ఒక మంచి సినిమా చూసియున్నాను. దాని పేరు రంగనాయకి. కన్నడములో గిరీశ్ కర్నాడ్ వంటివారు నాటకాల ద్వారా చిత్రరంగం ప్రవేశించారు. గుబ్బి వీరన్న కూడ నాటకాల పురోభివృద్ధిలో చాల ముఖ్య పాత్ర వహించారు. ఇక విజయ్ తెందుల్కర్ వంటి వారిని గురించి చెప్పనక్కరలేదు. చలం రాసిన కొన్ని కథలలో కూడ నాటక రంగం ఒక ప్రముఖ స్థానాన్ని ఆక్రమించుకొన్నది.

    కావ్యేషు నాటకం రమ్యం అనే మాట మరువరాదు. – మోహన

  4. ఆహా గురించి damayanthi అభిప్రాయం:

    03/07/2008 10:27 am

    Hi,

    After reading the maniharam, I remembered Sree Sree, Chalam, and UG. Great poetry. Keep writing.

    Cheers,
    Damayanthi

  5. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 1 గురించి జె. యు. బి. వి. ప్రసాద్ అభిప్రాయం:

    03/07/2008 8:46 am

    అసమీక్షసమీక్ష్యకారి గారి అభిప్రాయం చదివాను. “భవిష్యత్తు ముందుగానే నిర్ణయమై వుందదని” నేనన్నానంటే, అది ఎటువంటి భవిష్యత్తు? అసమీక్షసమీక్ష్యగారు చెప్పినట్టు విశ్వం గురించా? వాతావరణ శాస్త్ర రీత్యా రెండ్రోజుల్లో తుఫాను వస్తుందని చెబితే, అది నిజమైతే, అలాంటి భవిష్యత్తు గురించా? లేదా సుబ్బారావుకి వచ్చే నెల్లో వుద్యోగం వస్తుందా, రాదా (శుక్రుడు పంచమ దశలో శని వేపు ప్రేమగా చూస్తున్నాడు కాబట్టి) లాంటి భవిష్యత్తా? అన్ని రకాల విషయాలనూ కలగా పులగంగా కలిపేశారు. వార ఫలాల్లో కనబడే భవిష్యత్తులాంటి విషయాల గురించి అంటున్నాను. గ్రహాల కదలికలూ, వాటి స్థానాలూ మానవ జీవితాన్ని సాంఘీకంగా నిర్దేశించే విషయాల గురించి మాట్టాడుతున్నాను. విశ్వం ఎలా వుందో, అది ఏ లెక్కల ప్రకారం ఏ విధంగా మారుతుందో లాంటి విషయాల గురించి మాట్టాడ్డం లేదు.

    ప్రకృతికి సంబంధించిన విషయాలు ప్రకృతి శాస్త్రాలకి అనుగుణంగా ఎలా నడుస్తాయో, సమాజానికి సంబంధించిన విషయాలు కూడా సామాజిక శాస్త్రాలకి అనుగుణంగా వుంటాయి. ఈ రెండు రకాల విషయాలూ ఒకదాని మీదొకటి ప్రభావాన్ని చూపించుకుంటాయి. మానవ జీవన విధానం వల్ల జరిగే వాతావరణ కాలుష్యం ప్రకృతి శాస్త్ర విషయాల మీద ప్రభావం చూపిస్తుంది. అలాగే ప్రకృతి వైపరీత్యాలు మానవ జీవితం మీద ప్రభావాన్ని చూపిస్తాయి.

    విషయాలు సరిగా అర్థం చేసుకోకపోతే, మోకాలికి, బోడి గుండుకీ ముడి పెట్టినట్టు వుంటుంది. ఈ అభిప్రాయ వేదికలో ఇంతకన్నా వివరంగా రాయడానికి కుదరదు. ఇప్పటికే ఇటువంటి విషయాల మీద చాలా పుస్తకాలు వున్నాయి.

    — ప్రసాద్

  6. కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 2: లైబ్‌నిట్జ్ స్వప్నం గురించి Siddi Raju అభిప్రాయం:

    03/07/2008 8:33 am

    చాలా బాగుంది. ఇంత క్లిష్ట విషయాల్ని ఇంత సులభంగా చెప్పడం, subject మీద మంచి ఆసక్తి, పట్టూ వున్నప్పుడు మాత్రమే సాధ్యమని నా ఉద్ధ్యేశ్యం. కాబట్టి మేము ఇంకా చాలా వ్యాసాలు ఆశించొచ్చు అన్న ఆలోచన చాలా అనందంగా వుంది.

  7. రచయితలకు సూచనలు గురించి pnvijaykumar అభిప్రాయం:

    03/07/2008 6:12 am

    ఈ పత్రిక చాలా బాగుంది.

  8. బ్లాగుల గురించి – నా మాట గురించి surya అభిప్రాయం:

    03/07/2008 4:54 am

    ఆర్టికల్ బ్లాగు బ్లాగు; కొస్యాసుర కామెంట్ భ్లేషు భ్లేషు!

  9. షష్ఠ్యంతములు గురించి P. N. Raja Rao అభిప్రాయం:

    03/07/2008 3:54 am

    మోహన రావు గారూ:

    నమో నమః మంచి వ్యాసం మాకు అందించారు.
    మనుచరిత్ర గురించి చెప్పి, విజయ విలాసములోని ” ఏతాదృగ్గుణ ఖనికిన్…”, వగైరా ఉదహరించపోవడం ఆశ్చర్యంగా ఉన్నది.
    విశ్వనాథ వారు రామాయణం మొట్టమొదటి ప్రచురణలో ఈ షష్ట్యంతాలు ఉన్నాయని విన్నాను. తరువాతి ప్రచురణలలో ముప్పాళ్ళ రాజా గారిని పొగుడుతూ రాసిన పద్యాలు కత్తిరింబడ్డాయని వినికిడి. ఆ మొదటి ప్రతి పద్యాలు మీ దగ్గిర ఉంటే వాటిని మాకు చెప్పండి.

    అభినందలతో,

    పి.యన్.ఆర్.

  10. తెరమరుగవుతున్న తెలుగు నాటకం -2 గురించి P. N. Raja Rao అభిప్రాయం:

    03/07/2008 3:37 am

    వ్యాసం చాలా బాగున్నది. చివర ఒక్క రిఫరెన్సుకూడా లేకపోవడం విచిత్రంగా ఉంది. తెలుగు నాటకరంగంపై చాలా పుస్తకాలు చూసిన గుర్తు.
    మిక్కిలినేని గారు, అంతకన్నా ప్రాచీనులు కృత్తివెంటి వారు, ఆ తరువాత స్థానం వారి స్వీయకథ, ఇలా ఎన్నో పుస్తకాలు తెలుగులో నాటక ప్రక్రియ గురించి, సదరు చరిత్ర వివరంగా ఉన్నట్టు నాకు గుర్తు.

    బ్రహ్మానందం గారికి అభినందనలు..
    పి.యన్.ఆర్.