Comment navigation


15541

« 1 ... 1517 1518 1519 1520 1521 ... 1555 »

  1. పనిపిల్లలు గురించి Akella గారి అభిప్రాయం:

    11/07/2006 3:52 am

    కథలో ఏదో చెప్పాలనే తపన ఉంది కానీ ఏమి చెప్పాలో దిశానిర్దేశం లేదు, అసంపూర్తిగా ముగిసిందనిపించింది

  2. పనిపిల్లలు గురించి Sriram గారి అభిప్రాయం:

    11/06/2006 12:04 pm

    Hi Prasad, it’s good…

  3. తెలుగు సాహిత్యం లో విమర్శ గురించి Alok Vastav గారి అభిప్రాయం:

    11/06/2006 10:57 am

    కామేశ్వరరావు గారు పొరబడ్డారు.అక్కిరాజుగారు తమ గ్రంధంలో ఎక్కడా “ఇది నా అభిప్రాయం, “ఈ కవిత నా అభిప్రాయానికి అనుగుణంగా లేదు”, “లేదు కాబట్టి ఇది కవిత గాదు” అని ఎక్కడా అనలేదు.అల్లా అనడం బుద్ధితక్కువదనమని మనకే తెలిసినపుడు వ్యాకరణ, తర్క నిష్ణాతుడైన ఆయనకు తెలియకపోవడమేంటి?

    తాను మండన జేసిన ప్రతి సిద్ధాంతానికీ వేద, పురాణ, ఇతిహాస, అలంకారశాస్త్రం వంటి ప్రామాణికగ్రంధాలను ఉదహరించారు.అక్కడే కట్టమంచివారికీ అక్కిరాజుగారికీ తేడా కనపడేది. ఎవరైతే ప్రత్యక్ష, అనుమాన, ఆగమాలను వాడకండా వాదిస్తాడో అది సిద్ధాంతమవదు రాద్ధాంతమౌతుంది.

    అల్లా ప్రామాణికంగా రాసిన విమర్శని నిరుపయోగమైన సెంటిమెంటులతో తోసిపుచ్చడం పరిణితి చెందని మనసులకే సాధ్యం.

  4. తెలుగు సాహిత్యం లో విమర్శ గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    11/06/2006 10:04 am

    ఇక్కడ కృష్ణశాస్త్రిగారన్న “ఆర్ద్రత”, “కవితాహృదయం” అన్న పదాలని కొంత స్పష్టపరచాలి. వేలూరి వారీ వ్యాసంలో చెప్పినట్టు, రకరకాల కవిత్వాలకి ఒకే విమర్శసిద్ధాంతాన్ని వర్తింపచెయ్యడం తప్పు. ఒకో రకం కవిత్వానికి ఒకో రకమైన రూపం, వస్తువు, పాఠకవర్గం, ప్రత్యేక ప్రయోజనాలూ ఉంటయి. వాటికి తగట్టు ఆ కవిత్వానికి ప్రమాణాలు ఏర్పడతాయి. వాటిని అర్థం చేసికొని దానికి తగినట్టు విమర్శ చేస్తే అది సహృదయ విమర్శ అనిపించుకుంటుంది. లేకపోతే, ఎంత మంది ఎంతగా ఇష్టపడితే నాకేంటి, నేను మెచ్చిందే కవిత్వం అన్నట్టుంటుంది. సహృదయ విమర్శ అంటే ఊరికే రాసిన వాళ్ళను పొగడటం కాదు. వాళ్ళ కవిత్వాన్ని సరిగా అంచనా వేసి (పైన పేర్కొన్నట్టు), దానికి తగట్టు విమర్శించడం. అక్కిరాజు వారీ పని చెయ్యలేకపోయారు.

  5. ఆ నేల, ఆ నీరు, ఆ గాలి గురించి PATHAKUDU గారి అభిప్రాయం:

    11/06/2006 8:56 am

    త్రేతాయుగంలోనే, ద్వాపరయుగానికి చెందిన “భాగవతం” అనే పదం సీతకి ఎలా తెలుసు? ఈ పదానికి వేరే అర్థం కూడా వుందా?
    అడవుల్లో కాపాడేవాళ్ళు ముందు నడుస్తారా, లేక వెనక నడుస్తారా?
    సృష్టికర్త బ్రహ్మకి నారదుడు చెబితేనే గానీ, రామాయణ కథ తెలియదా?
    అంగదుడు రాజవడమేమిటీ? సుగ్రీవుడు కదా రాజు? అంగదుడు యువరాజవుతాడు. రాజూ, యువరాజూ ఒక్కటేనా?
    పడవుల్లో వెళ్ళడానికి సముద్రుడిని అడగడం ఎందుకు, నీళ్ళమీద రాళ్ళేసుకుని వెళ్ళాలంటే అడగాలి గానీ? అడగకపోతే కోపం వొచ్చి, పడవులని ముంచేస్తాడా సముద్రుడు?
    “కాలిలో ముల్లు కూడా తియ్యడు మీ అన్న” అని సీత అనడానికి ఆధారం ఏమిటి?
    తప్పుగా అడిగితే, మన్నించండి.

  6. బహుశా ఇంకో నిజం గురించి Akella గారి అభిప్రాయం:

    11/06/2006 5:05 am

    Time waste story, why its so boring on the net normally, why again in eemata, this kind of stuff?

  7. రాత్రి నృత్యం గురించి Alok Vastav గారి అభిప్రాయం:

    11/06/2006 4:26 am

    OK

  8. ఉద్యోగం గురించి Akkiraju Bhattiprolu గారి అభిప్రాయం:

    11/06/2006 4:24 am

    కథ, కథనం రెండూ బాగున్నాయి. కథ చదివాక నాకు కల్గిన ఆలోచనలు… విమర్శలు కావు..
    1. ఈ కథ తెలుగులో నే ఎందుకు రాయాలి? నాలాంటి వాడయితే ఇంగ్లీషు రాక అని టక్కున చెప్పచ్చు. ఇంగ్లీషు, తెలుగు రెండూ వచ్చిన వాళ్ళు దీన్ని ఏభాష లో రాయాలి? నా ఉద్దేశం ఏదో తప్పు జరిగిందని కాదు. ఇలాంటి కథని తెలుగులో రాయాలి అనే నిర్ణయానికి రావడానికి ఏ ప్రాతిపదిక అవసరం అని సందేహం. ఇందులో డాక్టరు ఇండియనే కానక్కర లేదు. రచయిత/త్రి ఇలాంటి విషయాన్ని తెలుగు పాఠకులకు పరిచయం చేయాలీ అనే ఉద్దేశం ఒక్కటే నాకు స్ఫురిస్తోంది. అదే నిజమయితే, రచయిత్రి కి నా అభినందనలు… ఎన్ని కొత్త వస్తువులు తెలుగులోకి వస్తే తెలుగు సాహిత్యం అంత విస్తృత మవుతుంది.

    2. కథలో చాలా డ్రామా ఉంది. ఆ పాల్ భార్యకి ఆ సమస్య రాక పోయుంటే ఏమయ్యేది? అవసరమయిన కారెక్టర్లకి అవసర మయినప్పుడు అవసర మయిన జబ్బులు రావటం తెలుగు సినిమా టెక్నిక 🙂 (ఇందులో తప్పేం లేదు… ఎంతో కొంత డ్రామా కథ నడిపించడానికి అవసరమే)

    అక్కిరాజు

  9. తెలుగు సాహిత్యం లో విమర్శ గురించి Alok Vastav గారి అభిప్రాయం:

    11/06/2006 3:41 am

    వేలూరిగారూ, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీకు తెలిసేవుంటుంది.ఐనా వుదహరిస్తాను.ఉమాకాంతంగారు గురజాడవారిని మద్రాసు నగరంలో కలిసినప్పుడు జయంతిరామయ్య మొదలైనవారి గ్రాంధికభాషా సమర్థనను ప్రస్తావిస్తూ అక్కిరాజుగారు గ్రాంధికభాషను సమర్ధించారు.ఐతే అందుకు సమాధానంగా గురజాడ “వారు పెద్దవారు అంచేత వారికి నా వాదన అర్థంకాలేదు.మీరు యువకులు మీకూ అర్థమవడంలేదు” అని చెప్పారు.వెనక్కి వచ్చిన ఉమాకాంతంగారు మరి యేమీ ఆలోచించక తమ గ్రంధాన్ని వ్యావహారికంలోనే రాసారు. ఉమాకాంతంగారి సున్నితత్వం కూడా కృష్ణశాస్త్రిగారంత సున్నితమే.

    తల్లికి బిడ్డడి మీద వున్నట్టుగానే కవులకు తాము రాసిన రాతల పట్ల మమకారం వుండడం అత్యంత సహజం.ఎవరైనా బిడ్డని అనాకారియని తిట్టితే తల్లికి ఖేదమవడంలో సహజత వుంది. గానీ ఎవరైనా బిడ్డని దుష్టుడని నింద వేస్తే తల్లి కోపగించక ఆరోపణలోని నిజానిజాలను విచారించుకోవాలి. బిడ్డ నిజంగానే దుష్టుడైతే ఆ ఆరోపణ జేసిన వ్యక్తికి కృతజ్ఞత తెలియజెప్పాలి. అంతేగానీ గుడ్డినమ్మికతో ఆరోపించిన వ్యక్తిని నిందించడమో, ఆ ఆరోపణను తృణీకరించడమో జేస్తే అది ఆత్మహత్యాసదృశమే. కట్టమంచివారు మొదటి చర్యకు పాల్పడితే, ఉమాకాంతం గారు రెండవదాన్ని జేసారు. అనగా కృతులలోని దుష్టాలను ఖండించారు. రూపాన్ని అవహేళన జేయడం నీచమేగానీ గుణ లోపాలను ఎత్తి చూపడం నేరం గాదు. అంచాత అక్కిరాజుపైని అక్కసు అర్థరహితం. అక్కిరాజుగారికి అర్ర్ద హృదయం కొరవడలేదుగానీ కవులకు అర్థజ్ఞానం కొరవడిందన్నది నిర్వివాదం.

  10. తెలుగు సాహిత్యం లో విమర్శ గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    11/05/2006 3:43 pm

    విమర్శల్లో తెగనాడినవి గుర్తున్నంతగా తక్కినవి గుర్తుండవేమో! తెలుగులో మంచి విమర్శలు చాలానే వెలువడ్డాయి. కాని వేలూరివారు చెప్పినట్టుగా కొన్ని విమర్శల ద్వారా రచన గురించే కాక విమర్శకుడి సంగతి కూడా మనకు తెలుస్తుంది.

    పాత సాహిత్యంలో “అమలినం” కాని శృంగారాన్ని పద్ధెనిమిదో శతాబ్దం నుంచీ విమర్శకులు ఈసడించుకోవడం కనిపిస్తుంది. ఆ తరవాతి కాలంలో కూడా ముద్దుపళనివంటివారి రచనలు తీవ్ర విమర్శకు లోనవడం గురించి ఆరుద్ర ప్రస్తావించారు. వాటిలో కొన్ని శృంగారాన్ని గురించిన స్త్రీల దృక్పథాన్ని తెలుపుతాయనీ, వాటిని తరవాతి కాలంలో అణచకుండా ఉన్నట్టయితే అదొక ఆధునిక స్త్రీవాద సాహిత్యానికి దారి తీసి ఉండగలదనీ ఆయన భావించారు.

    వ్యాసంలో ప్రస్తావించిన రచనలోనే కృష్ణశాస్త్రిగారు తనకన్నా సీనియర్లనూ, జూనియర్లనూ కూడా పేర్కొంటూ, విమర్శ కాకపోయినా సమీక్ష చేశారు. కె.వి.రమణారెడ్డి అనేకుల రచనలను వివరంగా విమర్శించారు. “ఋణ” దృక్పథంతో చేసిన విమర్శల్లో రాచమల్లు రామచంద్రారెడ్డిగారు దిగంబర కవులను గురించి రాసినది కూడా ఒకటి. త్రిపురనేని మధుసూదనరావు విశ్వనాథ రచనలను విశ్లేషించి మరీ చెండాడాడు.

    ఈ మధ్య ద్వానాశాస్త్రి తదితరులు విప్లవ, స్త్రీ వాద, దళితవాద, మైనారిటీ వాద రచనలను సహృదయతతో విమర్శ చేస్తున్నారు. ఇవి అంతగా గుర్తుండకపోవటానికి కారణం ఇవన్నీ దిన, వార, మాసపత్రికల్లో ఏదో ఒక మూల కాస్తకాస్తగా కనిపిస్తూ ఉండడమే. సాహిత్యానికే దిక్కులేని ఈ రోజుల్లో విమర్శలను పట్టించుకునేవారే తక్కువ.

    మంచి సాహిత్యాన్నిగాని, ఉన్న సాహిత్యంలో మంచినిగాని పరిచయం చేస్తే అది కూడా ఉపయోగకరమే. 1969లో నేను ఆంధ్రా యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు వెల్చేరు నారాయణరావుగారు వెన్నెల రాత్రి వేళ హాస్టలు డాబామీద తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రి కవితను విద్యార్థులకు చదివి వినిపించడం గుర్తుంది.

    విమర్శకులూ, సమీక్షకులూ సామాన్య పాఠకులకన్నా కాస్త లోతుగా పరిశీలించి, రచనలను గురించి వ్యాఖ్యానం చేస్తారు కనక సాహిత్యాభిమానులకు అది ఉపయోగపడుతుంది. అయితే వారికి కూడా తప్పనిసరిగా కొన్ని పరిమితులుంటాయి. వేలూరివారి వ్యాసంవల్ల నాకు అర్థమయినదిదే.

« 1 ... 1517 1518 1519 1520 1521 ... 1555 »