బాగుందండీ.
అయితే ఇంతకీ ఆ “ఈమానవుడెవరు చెప్మా?” పాత్ర అంతేనా!
నేను ఇంకా కథ ఉందేమో అనుకున్నా! 🙂
Yeah, I also agree with the comment by Ms Bharathi on “ఈమానవుడెవరు చెప్మా?” phrase.
నవీన్ గారి కి కొన్ని ప్రశ్నలు… పాఠకురాలిగా నా వైపు నుంచి:
1. మీ రచనల్లో ఎక్కడో తప్ప హాస్యం కనబడకపోవడానికి ఏమన్నా కారణం ఉందా??
2. మీరు కథల కంటే నవలలు ఆసక్తి కరంగా రాయగలరేమో. మీ కథల్లో వస్తు వైవిధ్యం తక్కువేమో అని నా observation. మీరు ఏమంటారు?
3. మీ సాహిత్య వ్యాసాల ప్రస్తావన లేకుండానే ముగించారేమిటి ఈ వ్యాసాన్ని?
దారిపక్క, చెట్టు క్రింద ,
ఆరిన కుంపటి విధాన
కూర్చున్నది ముసల్దొకతె
మూలుగుతూ ముసురుతున్న
ఈగలతో వేగలేక …
“ఆ అవ్వే మరణిస్తే
ఆ పాపం ఎవ్వరి” దని
వెర్రిగాలి ప్రశ్నిస్తూ
వెళ్ళిపోయింది…
కవిత ఎవరిదో చెప్పక్కర్లేదు కదా!
జె.యు.బి.వి. ప్రసాదు గారు, కధలో “నేను”, “పార్వతమ్మ” లను మీరైతే ఎలా నడిపిస్తారో కొద్దిగా నమూనా వీలైతే రాయండి. చదవాలని ఉంది. ఇంకెవరైనా రాసినా సరే! 🙂 చూద్దాం . చూద్దాం. ఎవరెలా కధ నడుపుతారో చూద్దాం!
రామాయణ కల్పవృక్షం నాలాంటి పామరుడు కూడా ఆస్వాదించేలా ఇంత బాగుంటుందని తెలిపినందుకు కృకజ్ఞతలు. తెలుగు వికీపీడియాలోకి ఆంధ్రమహాభారతాన్ని యూనీకోడీకరిస్తూ దాదాపు 500 పద్యాలు మూలగ్రంథ ప్రతి చూసి రాసివుంటాను. కొన్నిపద్యాలు రాశాక ఒకో పద్యాన్ని అర్థంచేసుకోవడం సులభమవుతూవచ్చింది. సందర్భాన్నిబట్టి ఒకో సన్నివేశాన్ని కళ్లకుకట్టే ఆ పద్యకర్తల చాతుర్యానికి అబ్బురపడే అదృష్టం అలా దక్కింది. ఇక ఈ వ్యాసం చదివాక విశ్వనాథవారి కావ్యం చదవాలనిపిస్తూంది. మీరుదహరించిన కాళ్లకూరివారి చింతామణి నాటకంలో సుబ్బిశెట్టిపాత్ర చెప్పే పద్యం చూసి ‘ఆహా’ అని ఆనందంతో పైకే అనేశాను. ఇక నాకు ఒక సందేహం -తెలుగు నుడికారమనేది సామెతలు, జాతీయాలు, అలంకారాలకుమల్లే ఒక ప్రత్యేకాంశమా?
చిలుకూరి నారాయణరావు గారి ఆంధ్రభాషాచరిత్రము రెండవ సంపుటము (volume II) మాత్రమే DLI లో దొరికింది. అది PDF రూపంలో ఈ క్రింద ఇచ్చిన link ద్వారా download చేసుకోవచ్చు. అట్లాగే గత సంవత్సరంలో తెలుగు పత్రికలలో వచ్చిన వ్యాసాలు కొన్ని Internet లో కనిపించాయి. వాటి లింకులు కూడా ఇక్కడ ఇస్తున్నాను.
రిగార్డులతో,
సురేశ్ కొలిచాల
—
కొసమెరుపు: మోహన రావు గారు చెప్పినట్టుగా జీవశాస్త్రం, భాషాశాస్త్రం 19 వ శతాబ్దంలో కూడా ఒకదానిపై ఒకటి ప్రభావం చూపినట్టున్నాయి. ఈ క్రింది వ్యాసం Comparative Method పుట్టుకకు జీవశాస్త్రంలోని Comparative Anatomy ఆధారం అని వాదిస్తోంది: Where does the ‘Comparative Method’ Come from?
ఈ కధలో ‘నేను’ అనే పాత్రధారి పార్వతమ్మ అనే పాత్ర పట్ల మానవత్వం అనేదే లేకుండా ప్రవర్తించాడు. సంస్కరణ అనేది సమాజం లోని పేదరికాన్ని తీసెయ్యలేక పోవచ్చు గానీ, తెలిసున్న వాళ్ళ విషయంలో చాలా సహాయంగా వుంటుంది. దానం వేరూ, సహాయం వేరూ. దానాలకి ఆత్మగౌరవం అడ్డొస్తుంది గానీ, సహాయాలకి రాదు. సహాయం అనేది లేకుండా మనుషులు బతకలేరు. ‘నేను’ అనే పాత్రధారి ప్రవర్తన ఏ మాత్రం సమంజసంగా లేదు ఈ కధలో.
నుడికారము అంటే ఏమిటో మీ ఈ రచన చదివిన తర్వాత కొంత విశదమైంది. అందుకు మీకు నా కృతజ్ఞతలు. అనువాద ప్రక్రియను గురించి మీ అనుభవాలతో కూడిన ఈ చర్చావ్యాసం విజ్ఞానదాయకం.
తెలుగు భాషపై ఈ మధ్య వివిధ పత్రికల్లో ఎన్నో అభిప్రాయాలను సద్విమర్శ చేసిన పరిశోధనా వ్యాసం ఇది! తెలుగులో ఇంత చక్కని వ్యాసాన్ని ప్రవాస ఆంధ్రుడు, ఒక ఔత్సాహిక విద్యార్ధిగా, రాయగలగటం గొప్ప విషయం. “సాహిత్యం ఒక కళ అయితే, భాషాశాస్త్రం విజ్ఞానశాస్త్రం” వంటి వాక్యాలు ఎంతో లోతైన ఆలోచన చేస్తే తప్ప రావు!
ఈమాటలో ఇంత చక్కని వ్యాసం వచ్చినందుకు, సురేష్ కి నా అభినందనలు. ఈ వ్యాసం స్పూర్తితో మరెన్నో పరిశోధనా వ్యాసాలు రావాలని కోరుకొంటూ,
రంగు తోలు గురించి Sowmya గారి అభిప్రాయం:
01/10/2007 8:04 pm
బాగుందండీ.
అయితే ఇంతకీ ఆ “ఈమానవుడెవరు చెప్మా?” పాత్ర అంతేనా!
నేను ఇంకా కథ ఉందేమో అనుకున్నా! 🙂
Yeah, I also agree with the comment by Ms Bharathi on “ఈమానవుడెవరు చెప్మా?” phrase.
నేనూ నా రచనలు గురించి Sowmya గారి అభిప్రాయం:
01/10/2007 7:54 pm
నవీన్ గారి కి కొన్ని ప్రశ్నలు… పాఠకురాలిగా నా వైపు నుంచి:
1. మీ రచనల్లో ఎక్కడో తప్ప హాస్యం కనబడకపోవడానికి ఏమన్నా కారణం ఉందా??
2. మీరు కథల కంటే నవలలు ఆసక్తి కరంగా రాయగలరేమో. మీ కథల్లో వస్తు వైవిధ్యం తక్కువేమో అని నా observation. మీరు ఏమంటారు?
3. మీ సాహిత్య వ్యాసాల ప్రస్తావన లేకుండానే ముగించారేమిటి ఈ వ్యాసాన్ని?
తరం మారినా … గురించి Lyla Yerneni గారి అభిప్రాయం:
01/10/2007 12:13 pm
కధ చదివాను . కామెంట్లూ చదివాను.
కవిత ఎవరిదో చెప్పక్కర్లేదు కదా!
జె.యు.బి.వి. ప్రసాదు గారు, కధలో “నేను”, “పార్వతమ్మ” లను మీరైతే ఎలా నడిపిస్తారో కొద్దిగా నమూనా వీలైతే రాయండి. చదవాలని ఉంది. ఇంకెవరైనా రాసినా సరే! 🙂 చూద్దాం . చూద్దాం. ఎవరెలా కధ నడుపుతారో చూద్దాం!
పద్యాలు – వాడుకభాష గురించి రానారె గారి అభిప్రాయం:
01/10/2007 11:09 am
రామాయణ కల్పవృక్షం నాలాంటి పామరుడు కూడా ఆస్వాదించేలా ఇంత బాగుంటుందని తెలిపినందుకు కృకజ్ఞతలు. తెలుగు వికీపీడియాలోకి ఆంధ్రమహాభారతాన్ని యూనీకోడీకరిస్తూ దాదాపు 500 పద్యాలు మూలగ్రంథ ప్రతి చూసి రాసివుంటాను. కొన్నిపద్యాలు రాశాక ఒకో పద్యాన్ని అర్థంచేసుకోవడం సులభమవుతూవచ్చింది. సందర్భాన్నిబట్టి ఒకో సన్నివేశాన్ని కళ్లకుకట్టే ఆ పద్యకర్తల చాతుర్యానికి అబ్బురపడే అదృష్టం అలా దక్కింది. ఇక ఈ వ్యాసం చదివాక విశ్వనాథవారి కావ్యం చదవాలనిపిస్తూంది. మీరుదహరించిన కాళ్లకూరివారి చింతామణి నాటకంలో సుబ్బిశెట్టిపాత్ర చెప్పే పద్యం చూసి ‘ఆహా’ అని ఆనందంతో పైకే అనేశాను. ఇక నాకు ఒక సందేహం -తెలుగు నుడికారమనేది సామెతలు, జాతీయాలు, అలంకారాలకుమల్లే ఒక ప్రత్యేకాంశమా?
భాషా సంబంధ నిరూపణ – భాషాశాస్త్రం 101 గురించి సురేశ్ కొలిచాల గారి అభిప్రాయం:
01/10/2007 10:18 am
చిలుకూరి నారాయణరావు గారి ఆంధ్రభాషాచరిత్రము రెండవ సంపుటము (volume II) మాత్రమే DLI లో దొరికింది. అది PDF రూపంలో ఈ క్రింద ఇచ్చిన link ద్వారా download చేసుకోవచ్చు. అట్లాగే గత సంవత్సరంలో తెలుగు పత్రికలలో వచ్చిన వ్యాసాలు కొన్ని Internet లో కనిపించాయి. వాటి లింకులు కూడా ఇక్కడ ఇస్తున్నాను.
– ఆంధ్రభాషాచరిత్రము – రెండవ సంపుటము (37.4MB)
– తెల్‌మున్ భాష తెలుగు
– ‘సుమేరు’లోనే వెలిగిన తొలి తెలుగు
– తెలంగాణ గోదావరే ‘తెలివాహ’!
– శ్రీ కృష్ణుడు తెలుగు జాతివాడే
– తెలుగువేరు, ఆంధ్రం వేరు!
రిగార్డులతో,
సురేశ్ కొలిచాల
—
కొసమెరుపు: మోహన రావు గారు చెప్పినట్టుగా జీవశాస్త్రం, భాషాశాస్త్రం 19 వ శతాబ్దంలో కూడా ఒకదానిపై ఒకటి ప్రభావం చూపినట్టున్నాయి. ఈ క్రింది వ్యాసం Comparative Method పుట్టుకకు జీవశాస్త్రంలోని Comparative Anatomy ఆధారం అని వాదిస్తోంది:
Where does the ‘Comparative Method’ Come from?
తరం మారినా … గురించి JUBV PRASAD గారి అభిప్రాయం:
01/10/2007 9:01 am
ఈ కధలో ‘నేను’ అనే పాత్రధారి పార్వతమ్మ అనే పాత్ర పట్ల మానవత్వం అనేదే లేకుండా ప్రవర్తించాడు. సంస్కరణ అనేది సమాజం లోని పేదరికాన్ని తీసెయ్యలేక పోవచ్చు గానీ, తెలిసున్న వాళ్ళ విషయంలో చాలా సహాయంగా వుంటుంది. దానం వేరూ, సహాయం వేరూ. దానాలకి ఆత్మగౌరవం అడ్డొస్తుంది గానీ, సహాయాలకి రాదు. సహాయం అనేది లేకుండా మనుషులు బతకలేరు. ‘నేను’ అనే పాత్రధారి ప్రవర్తన ఏ మాత్రం సమంజసంగా లేదు ఈ కధలో.
కిటికీ గురించి Seetha Kumari గారి అభిప్రాయం:
01/09/2007 10:46 pm
కిటికీ చాలా చక్కగా ఉంది…మనసుపై మంచి ముద్ర వెసింది….
వలసపోతున్న మందహాసం గురించి Seetha Kumari గారి అభిప్రాయం:
01/09/2007 10:43 pm
వీడ్కొలుని చాలా సున్నితంగా అందంగా చెప్పారు…
అనువాద కళ నా అనుభవాలు గురించి రానారె గారి అభిప్రాయం:
01/09/2007 1:02 pm
నుడికారము అంటే ఏమిటో మీ ఈ రచన చదివిన తర్వాత కొంత విశదమైంది. అందుకు మీకు నా కృతజ్ఞతలు. అనువాద ప్రక్రియను గురించి మీ అనుభవాలతో కూడిన ఈ చర్చావ్యాసం విజ్ఞానదాయకం.
భాషా సంబంధ నిరూపణ – భాషాశాస్త్రం 101 గురించి Lakshmanna Vishnubhotla గారి అభిప్రాయం:
01/09/2007 7:33 am
తెలుగు భాషపై ఈ మధ్య వివిధ పత్రికల్లో ఎన్నో అభిప్రాయాలను సద్విమర్శ చేసిన పరిశోధనా వ్యాసం ఇది! తెలుగులో ఇంత చక్కని వ్యాసాన్ని ప్రవాస ఆంధ్రుడు, ఒక ఔత్సాహిక విద్యార్ధిగా, రాయగలగటం గొప్ప విషయం. “సాహిత్యం ఒక కళ అయితే, భాషాశాస్త్రం విజ్ఞానశాస్త్రం” వంటి వాక్యాలు ఎంతో లోతైన ఆలోచన చేస్తే తప్ప రావు!
ఈమాటలో ఇంత చక్కని వ్యాసం వచ్చినందుకు, సురేష్ కి నా అభినందనలు. ఈ వ్యాసం స్పూర్తితో మరెన్నో పరిశోధనా వ్యాసాలు రావాలని కోరుకొంటూ,
విష్ణుభొట్ల లక్ష్మన్న