చక్కటిదీ, చదివించేదీ, ఆలోచింపజేసేదీ ఈ వ్యాసం. ఇంతకు మించిన మెచ్చికోళ్లు పలువురి వంతపాడటం మినహా మరో ప్రయోజనాన్నివ్వవు. అందుకే, ఈ రచనని ఇంకా మెరుగు పరచడానికి నాకు తోచిన సూచనలనిచ్చి ఊరుకుంటాను.
1. భాషాశాస్త్రం 101 కి పరిమితం చేసి ఉంటే బాగుండేది.
ఈ వ్యాసానివి రెండు ముఖ్య విషయాలు (1) తులనాత్మక భాషాశాస్త్రాన్ని తెలుగుకి అన్వయించడాన్ని పరిచయం చెయ్యడం (2) దుష్తర్కభూయిష్టాలై, చదివేవాళ్లని సిగ్గిలజేసే వాదాలతో తెలుగుభాషకి ఉన్నాయో లేవో తెలియని గుణాలని అంటగట్టే రచనల్ని దుయ్యబట్టడం.
(1) మీద కేంద్రికరించి, దాంతోపాటు భాషావిశ్లేషణ తరీఖాల్లో తగిలే జారుడుమెట్లని ఉల్లేఖించి, అంతటితో కట్టిపెడితే ఈ వ్యాసానికి మరింత సమగ్రతా, చక్కదనం చేకూరేవి. నిజమే, చెత్త విశ్లేషణలు చూస్తే చిర్రెత్తుకొస్తుంది. ఆ చిరాకే రచయితనకేఈ వ్యాసానికి పురిగొల్పిందన్న మాట కూడా నిజమే. చెత్తని నిరోధించవల్సిన ఎడిటర్లు, ప్రొఫెసర్లూ కొందరు స్వయంగా ఈ చెత్తకి పాల్పడటం మరీ దారుణం.
అయినప్పటికిన్నీ, భాషాశాస్త్రం 101 వల్ల కొత్త విషయం తెలుసుకున్నామన్న ఆనందానికీ, కుశాస్త్రబుద్ధులని వాయించే తీవ్రతకీ పొంతన లేదు. రసాభాస విషయం అటుంచితే, ఈ రెండు విషయాలని కలబోయడం వల్ల వాటిల్లే పెద్ద ముప్పు మరొకటి ఉంది.
ఈ చెత్త పుట్టుపూర్వోత్తరాలూ, స్థితిగతులూ పరిశీలించాలంటే, “మన వాళ్లు ఉట్టి వెధవాలోయి” అనేసి పబ్బం గడుపుకునే రోజులు చెల్లిపోయాయి. ఇలాంటి చెత్త “క్రియేషనిజం” లాంటి “అనిజాల” రూపంలో అమెరికాలోనూ ఉంది. కనుగొంటే అంతటా ఉంది. ఊరికే చెత్తని తిట్టేసి ఊరుకుంటే మజాగానే ఉంటుందిగానీ, ఆ తాత్కాలికానందం చెత్తకీ చరిత్రకీ ఉండే సంబంధాన్ని విడమర్చాల్సిన అవసరాన్ని విస్మరింపజేస్తుంది. ఈ చెత్త దానంతట అదే అధ్యయనీయ విషయం.
2. రెండు విషయాల్ని కలబోస్తే ఒకదానికి అన్యాయం జరగచ్చు.
a. Kuhn పండితుడు Structure of Scientific Revolutions వెలయించి అరశతాబ్దం కావస్తోంది. “Paradigm Shift” అని ఇప్పుడు కాకపోతే కాసేపటికి అనేసేవాడే ప్రతివాడూనూ. ఇప్పటికైనా శాస్త్రీయ పరిశోధన అనేది క్రమపద్ధతిలో, మునుపటి తప్పులని దిద్దుకుంటూ అలాగ్గా పురోగమిస్తుందనే అపప్రథని ప్రచారం చెయ్యడాన్ని నిషేధిస్తే మంచిది. స్థూల స్థాయిలో చూస్తే సైన్సు తన సిద్ధాంతాల్ని ఒక పట్టాన మార్చుకోదనీ, వస్తేగిస్తే అలాంటి సైద్ధాంతి పరిణామం విలయానికేమీ తక్కువకాదనీ ఒప్పుకుతీరాలి. కుశాస్త్ర తరీఖాలని చెండే వ్యాసంలో శాస్త్రగతి తీరుగురించి పాతరోజుల పడికట్టురాళ్లనే తిరగదోడటం అభ్యంతరకరం. .
b. పాశ్చాత్య పాలకులు మనల్ని చిన్నబుచ్చడానికి పన్నిన వెధవ పన్నాగమే ఈ సైన్సంతా అనే వాళ్లది తెలిసీ తెలియని వాదమే కావచ్చు. కానీ అటువంటి అజ్ఞానాన్నీ, అమాయకత్వాన్నీ ఖండించబూనుకున్న వ్యాసంలో కేవలం విలియం జోన్సులాంటి దిట్టల పేర్లు ఉటంకించి, దాంతో పూర్వపక్షం పని పూర్తయిపోయిందనిపిస్తే ఏమన్నట్టు? తెల్లవాడు నిన్నగాక మొన్నటి దాకా మానవశాస్త్రం పేరుతో పుర్రెల ప్రమాణాలు కొలిచి తెల్లజాతి ఎక్కువా, నల్లజాతి తక్కువా అని నిరూపించడానికి నానా తిప్పలూ పడ్డాడు. బుద్ధిపూర్వకంగా కొంతా, అసంకల్పిత దురభిప్రాయాల వల్ల కొంతా, సాంఘికశాస్త్రాల్లో నానా కంగాళీ చేసారు పాశ్చాత్యులు. సూక్ష్మంగా ఎందరో మహానుభావులుండినా, స్థూలంగా తెల్లవాడి సైన్సుని అనుమానంగా చూసేవాడు ప్రతివాడినీ దురభిమానమే నెడుతోందనేయడం చరిత్ర వాస్తవాలని విస్మరించడమే అవుతుంది.
ఇక్కడ అసలు సమస్య ఇంత విషయాన్ని మరో అంత విషయంతో ఒకే వ్యాసంలో కూరితే వచ్చిపడే అనర్థం.
3. ఈ దురవస్థకి వనరుల లేమే కారణమా?
ఈ రంగంలోని తెలుగువాళ్లల్లో భద్రిరాజు, బూదరాజు తదితరులవంటి మహనీయులు ఉన్నారని రచయిత ప్రస్తావించారు. వనరుల లేమి వీరికేమీ అడ్డంకి కాలేదు. భాషాశాస్త్రం కణభౌతికశాస్త్రం లాంటిది కాదు–దీనికి పెద్ద ఎత్తున యంత్రాలూ, దినుసులూ అవసరం లేదు. మేధస్సులూ, పుస్తకాలూ, ఇంటర్నెట్టూతో చాలా దూరమే పోవచ్చును. ఉన్నతస్థాయి పండితుల ప్రభావపంకిందిస్థాయి వారిమీద ప్రసరించలేదంటే అందుకు సంస్థాగత కారణాలుంటాయి. కుసంస్థకి డబ్బుపోస్తే ఫలితాల్నిస్తుందా? అన్న విషయం అలోచించాలి. అదిన్నీ భాషాశాస్త్రం 101 తో కాకుండా విడిగా.
4. భాషాశాస్త్రం 101 ని మరికాస్త దూరం తీసుకెళ్లాలి
పదజాలమే కాకుండా వ్యాకరణ నిర్మాణం కూడా తులనాత్మక అధ్యనానికి ఉపకరిస్తుందా? ఉదాహరణకి తెలుగు సంధులూ, తమిళ సంధులూ, సంస్కృత సంధులూ పరస్పరం పోలిస్తే తెలిసేది ఏమిటి? అలాగే సమాసాల విషయంలో.
5. ఈ ప్రయత్నాన్ని (భాషాశాస్త్రం 101) ముందుకు తప్పక తీసుకెళ్లాలి. ఇతరత్రా ప్రచురించిన పక్షంలో తదుపరి అధ్యనానికి ఉపకరించే విధంగా annotated references and links అందిస్తే ధన్యులం.
6. ఇక మీద దయచేసి spell checker వాడి Correspondance వంటి నిష్కారణమైన మీటపాట్లని తప్పించి మమ్మల్ని రక్షించాలి.
Viewed 1st time in unicode.
its wonderful
John Hyde Kanumuri, Hyderabad
తరం మారినా … గురించి సురేశ్ కొలిచాల గారి అభిప్రాయం:
01/18/2007 5:20 am
ఈ కథను పూర్తిగా అన్వయం చేసుకోవాలంటే శివారెడ్డి కవితలతో పరిచయం చాలా అవసరం అనుకుంటాను. ఉదాహరణకు “తరం మారినా…” అన్న మకుటంతో ఉన్న ఈ కవిత చూడండి:
తరం మారినా…
ఆ గేటు పక్క
బెరుకు బెరుగ్గా – బెదురుగా
నిలబడ్డాడు – మూడేళ్ళవాడు,
లోన వాళ్ళమ్మ
బాసాన్లు తోముతుంది
బయట వాళ్ళయ్య
ఏడ రాళ్ళు గొడుతున్నాడో –
వాళ్ళయ్య కూడా
అదే వయసులో అలానే
ఈ గేటుపక్క కాకపోతే
మరోగేటుపక్క
నిలబడే వున్నాడు.
—- శివారెడ్డి (1973 నవంబర్
రక్తం సూర్యుడు సంకలనం నుంచి)
1. పుస్తకం చదవకుండానే పేరాలు కోట్ చెయ్యడానికి నేనేమీ స్వాములవారిని కాదుగదా! మీరు చదివినంత లోతుగా నేను చదివుండకపోవచ్చు. మీదృష్టీ నాదృష్టీ ఉత్తర దక్షిణ ధ్రువాలు కావచ్చు.
2. నేను రాసినదాంట్లో చివరి వాక్యం తప్ప మిగిలినదాంట్లో వెనక్కి తీసుకోవాల్సిందేమీ కనబడలేదు. శ్రుతి మించిన స్తోత్రాలకూ, సంయమనం లోపించిన “శాస్త్రీయ” విశ్లేషణకూ విరుగుడుగా కాస్తంత వ్యంగ్యం వాడాను. భావ్యం కాదంటారా?
3. ఇవి రెండే ముఖ్యమైన విషయాలని గానీ, అదొక చెత్త పుస్తకమని గానీ నేనన లేదు. అక్బరు అంతఃపురం ఎంత వ్యభిచార కేంద్రమో, తాజమహల్ అసలు ఎందుకు హిందూ రాజ్ మహలో, … లాంటి వేడి వేడి కబుర్లనొదిలేసి, నేను అప్రధాన విషయాలని పట్టించుకున్నాననా మీ ఆక్షేపణ? ఇప్పటి వరకూ వచ్చిన చరిత్ర అంతా తప్పుల తడిక, అందుకు ఈ కుహనా చరిత్రకారులే కారణం, మన పురాణాల్లో వున్నవాటిని (కనీసం కాలానికి సంబంధించినంత వరకు) శాస్త్రీయంగా కోటా వెంకటాచలం గారు ఏనాడో నిరూపించారు, అంతకన్నా ఇంకేం కావాలి? అన్నవి రచయిత ఉద్ఘాటించిన ప్రధానాంశాలలో కొన్ని. నేను అసందర్భంగా కోట్ చేస్తే మీరు తప్పు పట్టండి.
4. ఏదో ఒకటి రెండు పేరాలను తీసుకుంటే చాలదు, పుస్తకం మొత్తం మీద అభిప్రాయం వెలిబుచ్చాలంటారా? దానికి వేరే సందర్భం కావాలి. చరిత్ర గురించి మన జాతి అలవరచుకోవాల్సిన దృక్పధాలని ఆకాశానికెత్తేసే ప్రశంసల్ని చదివి, ఉండబట్టలేక ఒకటి రెండు రచయిత దృక్పధాలని ఉదాహరణలగా ఇచ్చాను.
5. ఇంకా చాలా రాయొచ్చు కాని, దీనిని పొడిగించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. అదీగాక దీనికి సురేష్ వ్యాసంతో కొంత సంబంధమున్నా కాస్త దూరమైన విషయం. చరిత్ర మీదా, “ఏది చరిత్ర?” మీదా కూడా వ్యాసాలు రావాలి. ఆ విషయంలో మీతో ఒప్పుకుంటాను. ఎందుకంటే, కొడవటిగంటి కుటుంబరావు అన్నట్లు, “చరిత్ర గురించి శాస్త్రీయంగా ఆలోచించడం నేర్చుకుంటే అన్ని విషయాల గురించీ శాస్త్రీయంగా ఆలోచించగలుగుతాం.”
చిన్నతనపు అనుభవాల్లో మనలో దాదాపుగా ప్రతి ఒక్కరికీ పార్వతమ్మ వంటి వ్యక్తులతో పరిచయం తప్పక ఉండే ఉంటుంది. ప్రపంచం ఆధునికం అవుతున్నకొద్దీ మధ్య తరగతివారు బాగుపడుతూ రావడం, అణగారిన వర్గాలు మరింత హీనస్థితికి వెళ్ళడం ఎలా జరుగుతుందో కారా గారు తన రచనల్లో చెప్పనే చెప్పారు. ఈ కథ కూడా ఇంచుమించుగా అదే విషయాన్ని వర్ణిస్తోంది. వ్యక్తిగతంగా సహాయం చేసినా, దానాలు చేసినా ఈ పరిస్థితుల్లో పెద్ద మార్పు కలుగుతుందని అనిపించదు. ఈ కథలో వ్యక్తుల కన్నా కాలానుగుణంగా జరిగిన సామాజిక మార్పులే ముఖ్యమనిపిస్తాయి. నిజ జీవితపు అనుభవంలాంటి ఈ కథను రాసిన వేలూరివారికి ధన్యవాదాలు.
కిటికీ గురించి Sudheer Kumar Kothuri గారి అభిప్రాయం:
01/20/2007 5:05 pm
చాలా బావున్నాయి
భాషా సంబంధ నిరూపణ – భాషాశాస్త్రం 101 గురించి Bapa Rao గారి అభిప్రాయం:
01/19/2007 5:45 pm

సద్భావనలతో,
కొచ్చెర్లకోట బాపా రావు
రచయితలకు సూచనలు గురించి John Hyde Kanumuri గారి అభిప్రాయం:
01/18/2007 7:06 am
Viewed 1st time in unicode.
its wonderful
John Hyde Kanumuri, Hyderabad
తరం మారినా … గురించి సురేశ్ కొలిచాల గారి అభిప్రాయం:
01/18/2007 5:20 am
ఈ కథను పూర్తిగా అన్వయం చేసుకోవాలంటే శివారెడ్డి కవితలతో పరిచయం చాలా అవసరం అనుకుంటాను. ఉదాహరణకు “తరం మారినా…” అన్న మకుటంతో ఉన్న ఈ కవిత చూడండి:
తరం మారినా…
—- శివారెడ్డి (1973 నవంబర్
రక్తం సూర్యుడు సంకలనం నుంచి)
వలసపోతున్న మందహాసం గురించి PrasUna గారి అభిప్రాయం:
01/17/2007 2:03 am
చాలా చక్కగా చెప్పారు.
తరం మారినా … గురించి Veluri Venkateswara Rao గారి అభిప్రాయం:
01/16/2007 3:16 pm
సౌమ్య గారి ఆక్షేపణలతో నేనూ ఏకీభవిస్తాను. మీరెత్తి చూపించిన వాక్యాలు కథకి
అనవసరమే!
అభివాదాలతో,
వేలూరి వేంకటేశ్వర రావు.
“సందుక”: నారాయణస్వామి గురించి Vaidehi Sasidhar గారి అభిప్రాయం:
01/16/2007 2:51 pm
మంచి సమీక్ష!!
భాషా సంబంధ నిరూపణ – భాషాశాస్త్రం 101 గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
01/15/2007 10:32 pm
శ్రీనివాస్,
1. పుస్తకం చదవకుండానే పేరాలు కోట్ చెయ్యడానికి నేనేమీ స్వాములవారిని కాదుగదా! మీరు చదివినంత లోతుగా నేను చదివుండకపోవచ్చు. మీదృష్టీ నాదృష్టీ ఉత్తర దక్షిణ ధ్రువాలు కావచ్చు.
2. నేను రాసినదాంట్లో చివరి వాక్యం తప్ప మిగిలినదాంట్లో వెనక్కి తీసుకోవాల్సిందేమీ కనబడలేదు. శ్రుతి మించిన స్తోత్రాలకూ, సంయమనం లోపించిన “శాస్త్రీయ” విశ్లేషణకూ విరుగుడుగా కాస్తంత వ్యంగ్యం వాడాను. భావ్యం కాదంటారా?
3. ఇవి రెండే ముఖ్యమైన విషయాలని గానీ, అదొక చెత్త పుస్తకమని గానీ నేనన లేదు. అక్బరు అంతఃపురం ఎంత వ్యభిచార కేంద్రమో, తాజమహల్ అసలు ఎందుకు హిందూ రాజ్ మహలో, … లాంటి వేడి వేడి కబుర్లనొదిలేసి, నేను అప్రధాన విషయాలని పట్టించుకున్నాననా మీ ఆక్షేపణ? ఇప్పటి వరకూ వచ్చిన చరిత్ర అంతా తప్పుల తడిక, అందుకు ఈ కుహనా చరిత్రకారులే కారణం, మన పురాణాల్లో వున్నవాటిని (కనీసం కాలానికి సంబంధించినంత వరకు) శాస్త్రీయంగా కోటా వెంకటాచలం గారు ఏనాడో నిరూపించారు, అంతకన్నా ఇంకేం కావాలి? అన్నవి రచయిత ఉద్ఘాటించిన ప్రధానాంశాలలో కొన్ని. నేను అసందర్భంగా కోట్ చేస్తే మీరు తప్పు పట్టండి.
4. ఏదో ఒకటి రెండు పేరాలను తీసుకుంటే చాలదు, పుస్తకం మొత్తం మీద అభిప్రాయం వెలిబుచ్చాలంటారా? దానికి వేరే సందర్భం కావాలి. చరిత్ర గురించి మన జాతి అలవరచుకోవాల్సిన దృక్పధాలని ఆకాశానికెత్తేసే ప్రశంసల్ని చదివి, ఉండబట్టలేక ఒకటి రెండు రచయిత దృక్పధాలని ఉదాహరణలగా ఇచ్చాను.
5. ఇంకా చాలా రాయొచ్చు కాని, దీనిని పొడిగించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. అదీగాక దీనికి సురేష్ వ్యాసంతో కొంత సంబంధమున్నా కాస్త దూరమైన విషయం. చరిత్ర మీదా, “ఏది చరిత్ర?” మీదా కూడా వ్యాసాలు రావాలి. ఆ విషయంలో మీతో ఒప్పుకుంటాను. ఎందుకంటే, కొడవటిగంటి కుటుంబరావు అన్నట్లు, “చరిత్ర గురించి శాస్త్రీయంగా ఆలోచించడం నేర్చుకుంటే అన్ని విషయాల గురించీ శాస్త్రీయంగా ఆలోచించగలుగుతాం.”
కొడవళ్ళ హనుమంతరావు
విదేశంలో మనుమరాలు గురించి Radhika గారి అభిప్రాయం:
01/15/2007 8:02 pm
The poem is really nice and we liked it very much. U have captured her childhood in a very poetic manner through this poem. Great work………
తరం మారినా … గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
01/15/2007 4:45 pm