Comment navigation


15541

« 1 ... 1507 1508 1509 1510 1511 ... 1555 »

  1. భాషా సంబంధ నిరూపణ – భాషాశాస్త్రం 101 గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    01/15/2007 2:35 pm

    సురేశ్ గారి వ్యాసంలో భాష గురించిన పరిశోధనలన్నీ శాస్త్రీయ దృక్పథంతోనే జరగాలనీ, అందులో రాజకీయ ధోరణులకూ, ప్రాంతీయ దురభిమానాలూ, కక్షలూ, కావేషాలకూ తావుండకూడదనీ చక్కగా చెప్పబడింది.

    తెలుగు ద్రావిడభాష అనేది మద్రాసులో పుట్టి పెరిగిన నాలాంటివాళ్ళకు బాగా అనిపిస్తూ ఉండేది. తమిళంలోని కొన్ని పదాలే కాక త్రికసంధి పద్ధతిలో వాళ్ళు మాటలను ముడిపెట్టడమూ ఇత్యాదులన్నీ తెలుగులాగే అనిపిస్తాయి. పాత శాసనాల్లో ఇమ్మడి (రెండో), ముమ్మడి (మూడో) వగైరా విశేషణాలు కూడా ద్రావిడభాష మూలాలనే సూచిస్తాయనిపిస్తుంది.

    ప్రాంతీయంగా సురేశ్ గారు చెప్పినట్టు కన్నడిగులు ప అనేదాన్ని హ అని (తప్పుగా?) పలికినట్టే మలయాళంలో వత్స అనే మాటను వల్స అని తప్పుగా పలుకుతారని నాకు తెలుసు. ఎందుకంటే త్ అనే అక్షరం ల్ లాగా ఉంటుందట.

    మధ్య ఆసియాతో వేదకాలానికి వేల ఏళ్ళ మునుపే సింధు నాగరికతకు సంబంధాలుండేవనేది నిజమే. అక్కడి నిప్పూరు మొదలైన స్థలాల పేర్లు తెలుగులా అనిపిస్తాయి కాని కొందరు పరిశోధకులు చెపుతున్నది సింధు నది నాగరికతలో ప్రజలు మాట్లాడినది ద్రావిడ కుటుంబానికి చెందిన భాష అయి ఉంటుందనే. దానికి తిన్నగా తెలుగుతో ముడిపెట్టడం సబబుగా తోచదు. ఆ కాలంలో (క్రీ.పూ.2400-2000 ప్రాంతాల) అక్కడివారు మాట్లాడినది ద్రావిడ భాషే నని తేలితే అది తెలుగు, తమిళం మొదలైనవాటికి మాతృక అయి ఉండే అవకాశం ఉంటుంది. సంస్కృతం, ప్రాకృతం, పాలీ మొదలైన భాషలూ, బ్రాహ్మీ లిపీ అన్నీ తరవాతి కాలానికి చెందినవిగా భావిస్తున్నారు. ఇది నిరూపణ అయితే ద్రావిడ భాషలన్నీ (ఒక్క తమిళమే కాదు) అతి ప్రాచీనమైనవేనని తేలుతుంది. ఎందుకంటే సింధు నాగరికతకు బీజాలు బలూచిస్తాన్ లో క్రీ.పూ. 6500 నుంచీ ఉన్నాయట. అప్పటి నుంచి వేదకాలం (క్రీ.పూ. 1400 తరవాత) దాకా అవిచ్ఛిన్నంగా కొనసాగిన సమాజ జీవితంలో కొన్నయినా ద్రావిడ భాషల మాతృకలు ఉండి ఉంటాయని అనుకోవచ్చు.

    మంచి వ్యాసాన్ని అందించిన సురేశ్ అభినందనీయులు.

  2. తరం మారినా … గురించి Ayyavaru Sivalenka గారి అభిప్రాయం:

    01/15/2007 11:38 am

    maa tatagari hayam lo paleru gurtochhadu. asthulu ammukuni vachhestoo maa tatagaru ataniki ara ekaram polam plus chinna illu ichharu. ippatiki nilabettukunnaru. valla kuturu ippatiki maa intikochhi evo konni cheeralu gatra pattukupotundi. aa paleru manavadiki pedda chaduvu abbaledu ee kadhalo parvatamma koduku/manavadu laaga.

    btw TA karaam (maaTA lodi) ela vastundi telugu lo type cheyyalanukunna kaani avi raledu naaku 🙁

  3. భాషా సంబంధ నిరూపణ – భాషాశాస్త్రం 101 గురించి Srinivas vurupuTuuri గారి అభిప్రాయం:

    01/14/2007 6:03 pm

    హనుమ గారికి
    మీ పొడవాటి వ్యంగ్యభరితమైన జవాబు చూసాక…
    మీరు ఆ పుస్తకం చదివారా లేదా తేల్చుకోలేకపోయాను. పురాణాల నుంచి చారిత్రిక ఆధారాలను సేకరించారని,సుప్రసిద్ధ చరిత్రకారులను (“మార్క్సిస్టు వర్గానికి చెందిన కుహనా మేధావుల”ను) ఆక్షేపించారని మీరు సూచించిన రెండు విషయాలే, ఈ పుస్తకానికి సంబంధించినవి గా తోచాయి.
    నేను, కొంతకాలం క్రితం “ఏది చరిత్ర?” చదివాను.హోల్ మొత్తంగా కాకపోయినా, మరీ బేసబబుగా అనిపించలేదు నాకు (అఫ్ కోర్స్, ఉత్సాహం కొద్దీ చదవటమే కానీ, చరిత్రగురించి నాకు పెద్దగా తెలీదు.మూల గ్రంథాలు చదివి నిజానిజాలని బేరీజు చేయటం నాతో అయ్యే పని కాదు). ఎప్పుడో,తీరిగ్గా ఇంకొన్ని విషయాలు తెలుసుకుంటాను. అందాకా…
    ఈ పుస్తకం ఉత్తి చెత్తే అనుకుందాం. కానీ, నా లాంటి uninitiated (I can’t think of the right word) పాఠకులను, నా లాంటి వారి నుంచి సెకండ్ హాండ్, థర్డ్ హాండ్ గా విని తెలుసుకునే వారిని ప్రభావితం చేయగలుగుతుంది అని అనుకుంటాను. ముఖ్యం, ఈ వాదనలు మళ్ళీ, మళ్ళీ వినిపిస్తూ ఉండటం వల్ల. ఆ ప్రమాదాన్ని నివారించేందుకైనా సరే,ఎవరైనా ఓ “చరిత్ర 101” రాస్తే బావుంటుందని అనుకుంటాను. ఏవంటారు?

    శ్రీనివాస్

  4. కిటికీ గురించి Raghothama Rao C గారి అభిప్రాయం:

    01/14/2007 4:23 am

    బావున్నాయి. నాకు షికారు నచ్చింది.

  5. వలసపోతున్న మందహాసం గురించి Raghothama Rao C గారి అభిప్రాయం:

    01/14/2007 4:16 am

    చాలా బావుంది సుబ్బూ….నిజమే రామారావుగారిని కలిసాకే కవిత్వం లోతు తెలిసింది. మందహాసం వలసపోయినా వారధి ఉందిగా 🙂

  6. భాషా సంబంధ నిరూపణ – భాషాశాస్త్రం 101 గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    01/13/2007 4:07 pm

    చరిత్ర, ‘శాస్త్రీయ’ దృక్కోణం

    శ్రీనివాస్,

    “తెలుగు సాహిత్య, సాంస్కృతిక, కళారంగాల పునరుజ్జీవనం కోసం నిస్వార్థ కృషి చేస్తున్న” అజో-విభో-కందాళం ఫౌండేషన్ నుండి “చరిత్రను ఎట్లా అర్థం చేసుకోవాలో, ఎట్లా చూడాలో, ఎట్లా చెప్పాలో, ఎట్లా రాయాలో అనే అంశాలమీద మనజాతి అలవరచుకోవలసిన దృక్పధాల్ని” శాస్త్రిగారు నిర్దేశించారని హార్దిక ప్రశంసలను అందుకున్న పుస్తకాన్ని,

    చారిత్రక నవలా చక్రవర్తి ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ గారిచే “భారతీయ చరిత్రకు దిద్దిన తిలకం”గా “శాస్త్రీయ ఆయుర్వేద సామాజిక బలవర్థక ఔషధం” గా కీర్తించబడ్డ గ్రంథాన్ని, క్లుప్తంగానన్నా సమీక్షించడానికి నాకు చరిత్రలో డిగ్రీ లేదు సరికదా,కనీసం ఔత్సాహికులకుండాల్సిన పరిజ్ఞానమన్నా లేదు.

    “చరిత్ర గతికి, కాలచక్ర గమనానికి సంబంధించినంతవరకూ అస్పష్టతకు తావు లేని ప్రాచీన భారతీయ సారస్వతాన్ని,” “క్షణంలో 1/300 వంతు అయిన వేధ నుంచి 30 కోట్ల 67 లక్షల సంవత్సరాలుండే మన్వంతరం వరకు, ఆపైన కూడా ఆధునిక కంప్యూటర్లకు సైతం అంతుబట్టనంత సూక్ష్మాతి సూక్ష్మ, స్థూలాతిస్థూల కాలగణన అనాదిగా సొంతమైన” భారతీయ మేధని అందుకోడానికి నేను ఎప్పుడో వెలగబెట్టిన కంప్యూటర్ సైన్స్ డిగ్రీ ఏమాత్రం పనికొస్తుంది?

    “ప్రాచీన భారత చరిత్రకు తిరుగులేని ప్రమాణాలైన భవిష్య, మత్స్య, బ్రహ్మాండ, విష్ణు, వాయు పురాణాలు” ఏమైనా చదివానా?

    ప్రాచీన సాహిత్యాన్ని చదవడమేకాక, భర్తృహరి కవిత్వం మీదనే అసమాన విమర్శ రాసి, లెక్కల్లోనూ జన్యుశాస్త్రంలోనూ కృషి చేసి, తనతో అంగీకరించని చరిత్రకారులచేత గూడా ఆద్యుడిగా ప్రశంసించబడ్డ కోశాంబి రచనలతోగానీ, వాటిని తెలుగు వాళ్ళకి పరిచయం చేసిన బాలగోపాల్ పుస్తకంతోగానీ పోల్చడానికి, వాళ్ళు దేశద్రోహులూ, జాతిద్రోహులూ అయిన మార్క్సిస్టు వర్గానికి చెందిన కుహనా మేధావులాయె!

    భారతీయ ఆత్మని ఆవిష్కరించగల బ్రహ్మజ్ఞాన సంపన్నులెవరన్నా సమీక్షించడానికి అర్హులేమో!

    కొడవళ్ళ హనుమంతరావు

  7. భాషా సంబంధ నిరూపణ – భాషాశాస్త్రం 101 గురించి SrinivAs vurupuTuri గారి అభిప్రాయం:

    01/13/2007 8:47 am

    సురేశ్ గారికి
    మీరు రాసిన భాషా శాస్త్ర వ్యాసం చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంది. మీకు నా అభినందనలు, కృతజ్ఞతలు.

    ఇంతకు మునుపు (నవంబర్ 2005) తెలుగు భాష వయస్సు గురించి రాస్తూ, మీరు “ఆర్య, ద్రావిడ పదాలు భాషా కుటుంబాలని సూచించే పదాలే గాని, రెండు వేర్వేరు జాతులని సూచించే పదాలు కావని శాస్త్రవేత్తల నమ్మకం. జన్యుశాస్త్రంలో సాధించిన అభివృద్ధి ఆధారంగా ఈ దశాబ్దంలో జరుపుతున్న పరిశోధనలు భారతదేశంలో ఆర్య, ద్రావిడ అని రెండు విభిన్నమైన జాతులు లేవన్న శాస్త్రజ్ఞుల అభిప్రాయాలని ధ్రువపరుస్తున్నది” అన్నారు. ఈ విషయం గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది. ఇంకొన్ని వివరాలు, లింకులు ఇవ్వగలరా?

    పాఠకుల అభిప్రాయాలపై స్పందిస్తూ, మీరు “ఏది చరిత్ర?” గురించి ప్రస్తావించారు. వీలుంటే, ఈ పుస్తకాన్ని, దాని జత పుస్తకాన్ని సమీక్షించగలరా? Any takers?

    శ్రీనివాస్

  8. పద్యాలు – వాడుకభాష గురించి vaidehi sasidhar గారి అభిప్రాయం:

    01/12/2007 5:56 am

    చాలా మంచి వ్యాసం!!ఒకటికి రెండు సార్లు చదివించిన వ్యాసం!!వ్యవహార భాష లో పద్యరచన గురించి చక్కని విశ్లేషణ తో సరళంగా రచయిత ప్రధానాంశాన్ని ప్రతిపాదించారు.ముఖ్యం గా విశ్వనాధ వారి కల్పవృక్షంలోని వ్యవహారభాషా సౌందర్యాన్ని,నుడికారాన్ని చాలా ఆసక్తి దాయకంగా వివరించారు.

    వచన కవిత్వం లో ఎక్కువ ధార లేక పోవటానికి రచయిత చెప్పినట్లు తమకు ధారతో అవసరం లేదని వచనకవులు అనుకోవటం ఒక కారణమైతే ఏ నిర్మాణ చట్రపు సౌలభ్యం (చందస్సు,వృత్తాల ద్వారా వచ్చే ఓ సహజ సౌందర్యమైన నడక) లేకపోవటం మరోకారణమేమో అనిపిస్తుంది.ఈ క్లిష్టత వల్ల చక్కని ధార కలిగిన వచన కవిత రాయటం పూర్తిగా కవి ప్రతిభ,భావనాశక్తి,భావావేశం మీద ఆధారపడుతుందేమో !!!

    నాకు పరిచయమున్న స్వల్ప సాహిత్యం లో వచనకవిత్వం అంతటి ధారతో వ్రాసిన కవులలో ప్రముఖులు శ్రీ tilak. వారి “నువ్వు లేవు, నీ పాట ఉంది” కవిత ఒక గొప్ప కళాకారుడు తాదాత్మ్యం తో ఏకబిగిన ఊదిన వేణువు పాట లా సాగుతుంది,ఏ మాత్రం (మాత్రా) ఛందస్సు సహాయం (కూడా) లేకుండా!! (teluguone.com లో నువ్వు లేవు, నీ పాట ఉంది).

    చక్కని వ్యాసాన్ని అందించారు!! ధన్యవాదాలు!!!

  9. తరం మారినా … గురించి KRISHNA MURTHY BHAGAVATHULA గారి అభిప్రాయం:

    01/12/2007 3:26 am

    కధ చక్కగా ఉంది. పాత తరం వాతావరణాన్ని గుర్తు చేసింది. సౌమ్య గారు చెప్పినట్లు, ఆ రెండు వాక్యాలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా – “చావందరికీ ఒకటే అయినా, అందరి చావూ మనకొక్కటి కాదు.”

  10. తరం మారినా … గురించి Sowmya గారి అభిప్రాయం:

    01/10/2007 8:13 pm

    “మావూళ్ళో జూటు మిల్లు కలకత్తా నుంచి వలసొచ్చిన మార్వాడీలు నడిపేవాళ్ళు. ఇప్పుడూ ఆ మిల్లు వాళ్ళదే అనుకోండి” – ఈ తరహా వాక్యాలు 3,4 చోట్ల ఎందుకు రాసినట్లు? అంటే : ఇప్పుడూ అంతే అనుకోండి అన్న Addons. హాస్యానికి అయినా కూడా ఎందుకో అవి ఎక్కువయ్యాయి ఏమో అనిపించింది.
    “ కొంతమంది చచ్చి గాల్లోనూ, వాతావరణంలోనూ,పూల్లోనూ, పసిపాపల నవ్వుల్లోనూ, మనతలపుల్లోనూ, …….నిరంతర నిత్య నూతనంగా బతుకుతారు,”
    “చావందరికీ ఒకటే అయినా, అందరి చావూ మనకొక్కటికాదు,”
    – పై రెండు వాక్యాలూ చాలా బాగున్నాయి,

« 1 ... 1507 1508 1509 1510 1511 ... 1555 »