Comment navigation


15549

« 1 ... 148 149 150 151 152 ... 1555 »

  1. పెద్రో గురించి ravikanth buggineni గారి అభిప్రాయం:

    05/03/2022 3:14 pm

    అద్భుతమైన తుది ఘట్టం 🙂

  2. ఆత్మగోపాలుడి అనుభూతి తరంగం గురించి తః తః గారి అభిప్రాయం:

    05/03/2022 11:05 am

    మూర్తీ: నిషిగంధ ‘జాజుల జావళి’ని – మీరు- కవితా సౌదర్యాన్ని దర్శించి పరిచయం చేశారు. మీకు అభినందనలు. రెండు మాటలు చెప్పక తప్పదు మూర్తీ: 1. తిలక్ “నా మాటలు వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లలు” అనలేదు, “నా మాటలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు” అన్నాడు. ‘అందమైన’ అని పెద్ద తప్పు చేశాడని నా అభిప్రాయం. 2. నిశ్శబ్దాన్ని ‘వినగలిగిన’ కవయిత్రి ‘నిశ్శబ్ద శబ్దం’ అని ఎందుకు అనవలసి వచ్చిందో తెలియలేదు. నమస్కారాలతో- తః తః

  3. పాత నెలవంక గురించి సనత్ గారి అభిప్రాయం:

    05/03/2022 10:49 am

    అన్వర్, హృదయానికి హత్తుకునేలా చిన్ననాటి సంగతులు గుర్తుకు వచ్చేలా , చాలా బాగా వ్రాశారు. 🙏🙏👏👏👌👍

  4. ఆత్మగోపాలుడి అనుభూతి తరంగం గురించి నిషిగంధ గారి అభిప్రాయం:

    05/03/2022 8:56 am

    హృదయపూర్వక ధన్యవాదాలు, మూర్తిగారు!!

    ఆమె దగ్గర అక్షరాలు అదృశ్యమైనా మిగిలే రహస్య భాష ఒకటి ఉంది.” ఈ వాక్యం దగ్గర చాలా సేపు ఆగిపోయాను… కవిత్వం ఆత్మని స్పృశించడం అంటే ఏమిటో అర్ధం అయింది. డే టూ డే బాధ్యతల మధ్య సఫొకేట్ అవుతున్న నా భాషకి కూడా కాస్త ఊపిరి దొరికింది.

    ఈ కాస్తన్ని కృతజ్ఞతలతో మీకు నమస్సులు!

  5. పాత నెలవంక గురించి Sudheer గారి అభిప్రాయం:

    05/03/2022 1:52 am

    నా చిన్నతనం గుర్తుకు తెచ్చారు…

  6. గడినుడి – 67 గురించి Rama Rao Alla గారి అభిప్రాయం:

    05/02/2022 11:59 pm

    ఆర్యా!

    మునుపులా లేదు గత మూడు మాసములుగా ఈ గడినుడి ముఖ్యముగా గడిలో ప్రశ్న కనబడుటలేదు. మరియు ప్రశ్న ఎన్ని అక్షరాలో ప్రశ్న లేదా ఆధారము ప్రక్కన కనబడుట లేదు, దయచేసి నావంటి వారికి సహాయపడగలరు.

    రామారావు ఆళ్ళ

  7. పాత నెలవంక గురించి R.S.Venkateswaran గారి అభిప్రాయం:

    05/02/2022 11:36 pm

    కథ చదివి హృదయం ఆర్ద్రమయ్యింది.

  8. పాత నెలవంక గురించి Anwar గారి అభిప్రాయం:

    05/02/2022 8:04 pm

    సుభద్రాదేవిగారికి, బదరిగారికి, తః తః ఇంకా తః తః గారికి మరియు రవికృష్ణగారికి, రాజాగారికి, శర్మగారికి నెలవంకను చదివినందుకు, మిమ్మల్ని పండగ ఈనాముగా నాకు పంచినందుకు ఎంతో సంతోషం 🙂

  9. పాత నెలవంక గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:

    05/02/2022 2:48 pm

    అద్భుతం! ఒక్కసారి మావూరికి తీసుకెళ్ళి కంట్లో నీరు తెప్పించారు.

    కొంతవరకూ మన ప్రస్తుత జీవితానిక్కారణం మనమే; కొంతవరకేమిటి లెండి, పూర్తిగానే. ఒకానొకప్పుడు మన ఊర్లో సంతోషం అంటే పెళ్ళికెళ్ళడమో, సంక్రాంతికి బట్టలు కుట్టించుకోవడమో. ఏదో పెద్ద సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసేయాలని గానీ, ఐ ఐ టి తప్ప మరోచోట అసలు చదువే వద్దని గానీ కోరికలు ఉండేవా? మా వాడు కాస్త బాగా చదూకుంటే చాలని సంతృప్తి. డబ్బులు ఉన్నాయా లేవా అనేది కొద్దిగా బాధించినా పైకి కనబడే అప్యాయతలు వేరు. పెళ్ళిలో బంతిలో కూర్చుని పప్పన్నంతో మొదలుపెట్టి జోకులేసుకుంటూ బూరెలు వరకూ ఏదీ వదలకుండా, ఏదీ పారేయకుండా, తినడంలో ఉన్న మాధుర్యం ఇప్పుడేదీ? టేబిల్ మీద అతి సుతారంగా కూర్చుని పెట్టినవి తినీ తిననట్టు పారేయాలి అదీ మన పురోగతి. లేదా వరసలో నుంచుని “మనకి దొరికింది” తినడమే. పప్పు పనికిరాదు. చైనీస్ నూడుల్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, లేదా ఫ్రైడ్ రైస్. పులుసూ, చారూ అనరాదు పల్లెటూరి వెధవలం అవుతాం. స్టైల్ గా సాంబార్, రసం, పాపడ్ అనాలి. వడియాలంటే ఏమిటి? “అన్నం” తినడమా? బార్బేరియస్! అది నామోషీ, రెండు “రోటీలు” ఇవ్వండి. ఆరోగ్యానికి మంచిది. గడ్డపెరుగు మనకి తగదు. అందులో వెన్న వల్ల హార్ట్ ఎటాక్ వస్తుందని అమెరికా వోడు – తీర్థం శంఖువులో పోసి మరీ – చెప్పేడుగా? ఐతే మన తాతలు అది తిని దాదాపు తొంభై ఏళ్ళు ఎలా బతికారో అని ప్రశ్న లేవదీస్తే – వాళ్ల తరం వేరు – అనే సమాధానం జేబులో సిద్ధంగా ఉంది. వాళ్లకి లేని మానసిక దరిద్రాలు మనం ఎలా అంటించుకున్నాం? తరం వేరేనా? బుర్రలో పురుగులు వేరా?

    మన మానసిక దరిద్రాలకి కారణం ‘అంతులేని డబ్బు సంపాదించాలనే’ అతి కోరిక. అది ఎన్నటికీ ఎంత సంపాదించినా తీరేది కాదు కనక ఆ రోజులు గడిచిపోయినట్టే. మావయ్య ఇంటికో తాతగారింటికో వెళ్తే కనిపించే ‘ఏవిరా ఇదేనా రావడం?’ అనే అప్యాయతా, వాళ్ళొస్తే మనకి కలిగే ఆనందం మళ్ళీ రావు. ప్రస్తుతం ఉన్నదేమిటంటే ‘నాకేం తెచ్చావు? ఎన్నాళ్ళుంటావు?’ అనే అడక్కుండానే మొహం మీద కనిపించే ప్రశ్నలు. మనిషి కనిపించి ఎల్లాళ్ళైందో అని వాటేసుకునే రోజులు లేవు. డబ్బు, డబ్బు, డబ్బు. ఇదే మహా మంత్రం. తరం తరం నిరంతరం ఇదే జపిస్తూ ఉండండి. ప్రస్తుత సర్వరోగ కారణీ, సర్వరోగ నివారిణీ రెండింటికీ ఒకే మహా మంత్రం. ఏ గురువు దగ్గిరకీ వెళ్ళాల్సిన అవసరం లేదు.

    అన్నింటికన్నా ముఖ్యంగా ప్రస్తుతం మన పరిస్థితి టిప్ ఆఫ్ ఐస్ బర్గ్ అని చెప్పుకోవాల్సిందే. ముందుంది ముసళ్ల పండగ. సంక్రాంతి అంటే, ఉగాది అంటే, అసలు దీపావళి అంటే, రమదాన్ అంటే, వెంఠనే ఫోన్ లో గూగిల్ చేసి చూసుకునే ప్రస్తుత దరిద్రంనుంచి, ఒకరికొకరు ఎదురుగా ఉన్నా వెంఠ వెంఠనే ఏదో అర్జంట్ అన్నట్టూ వాట్సాప్ చూసుకోవడం, ఎవరెన్ని లైకులు కొట్టారా నా మొహం మీద అనే నాచు గుంటల్లోంచి మరింత లోతులలో మురికి కూపాల్లోకి దిగబోతున్నాం. నేను ఒకప్పుడు అమాయకంగా అనుకున్న అతిరథ మహారథులు ఎవరూ కూడా ఈ దరిద్రానికి అతీతులు కాదు. ఎంతాశ్చర్యం! ఎవరో ఒకావిడ/యన ఫేసుబుక్కుమీద ఊతప్పం ఎలా చేసాడో రాసుకుంటాడు. ఇంక అప్పట్నుండీ ఎన్ని లైకులొచ్చాయా, ఎన్ని కామెంట్లా అంటూ గోల. తాను చేసిన ఊతప్పం ఇంట్లో ఎవరు కలిసి కూర్చుని తిన్నారు, ఎంత హాయిగా నవ్వుకున్నారనేది లేదు. స్నేహితులు కావాలా? రండి రండి ఫేసుబుక్కుమీదకి. నాకెంతమంది స్నేహితులో అంటూ మురిసిపోవచ్చు.

    ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితాల్లోంచి వంద మీటర్లు ఐదు సెకండ్లలో పరుగెట్టే జీవితాల్లోకి వెళ్ళబోతున్నాం. సీటు బెల్ట్ పెట్టుకోండి, రాబోయే దరిద్రాలని (నేను గ్లాసులో సగం నీరు చూసేవాణ్ణి కాదని ఒప్పుకుంటున్నా) చూడకుండా మనం దాటిపోతే అదృష్టవంతులమే.

    (నా వ్యాఖ్య చదివి నా మీద విరుచుకుపడే ముందు గమనించగలరు – “మనం” అంటే నేను కూడా)

  10. పాత నెలవంక గురించి తఃతః గారి అభిప్రాయం:

    05/02/2022 1:42 pm

    అన్వర్ ఒక విషయం చెబుదామని మళ్ళీ రాస్తున్నాను.

    నిజమైన కళాకారులకు మతాలూ- కులాలూ ఉండవని. ఒక ఉదాహరణ నేను గమనించినది: అనార్కలి చిత్రం ఒక ముస్లిం యువతి కథ. అందులో ‘దువాకర్ గమ్- – ఏ -దిల్! దువాకర్ ఖుదా సె!’ అన్న పాట రాసినది శైలేంద్ర ఒక హిందువు. స్వర రచన చితల్కర్ రామచంద్ర- మరొక హిందువు, పాడినది మరో హిందువు లతా మంగేష్కర్.

    బైజు బావరా ఒక హిందూ గాయకుని కథ అందులో ‘మన్ తడపత్ హరి దర్ షన్ కొ ఆజ్’ ఆన్న పాట సాహిత్యం షకీల్ బడయూని, సంగీత రచన నౌషాద్ పాడినది మహమ్మద్ రఫి ముగ్గురూ ముస్లిములు.

    నమస్కారాలతో- తః తః

« 1 ... 148 149 150 151 152 ... 1555 »