సీబీరావుగారు చెప్పిన జాయియే పాటలాగే మేరేసనమ్ లో పుకార్ తా చలా హూ మై (రఫీ) మొదలైన మంచి పాటలెన్నో ఉదహరించదగ్గవే. “గ్రంథ విస్తరణ భీతి” ఎలాగూ ఉంటుంది కనక కొన్ని సినిమాల పేర్లూ, తక్కినవాటికి లింకులూ ఇచ్చి ఊరుకోవలసివచ్చింది. సమగ్రత కోసమని నయ్యర్ జీవిత విశేషాలన్నిటినీ మాత్రం రాయక తప్పలేదు.
తక్కిన వ్యాసరచయితలు కూడా భారతివంటి పాత పత్రికల పద్ధతిలో కాకుండా అవసరమైన చోట బొమ్మలనూ, ఆడియో లింకులనూ జతపరిస్తే వెబ్ పత్రిక సదుపాయాలను ఉపయోగించుకున్నవారవుతారు.
సమీక్ష బాగుంది. ఇస్మాయిల్ గారి ఈ సంకలనం లోని కొన్ని పారడాక్సెస్ ని బాగా పట్టుకున్నారు. అయితే ఒక చిన్న సమాచారం – జీవ(బ)నానంద దాస్ మీద కేంద్ర సాహిత్య అకాడమీ వారు ఒక పుస్తకం తెచ్చారు. భారతీయ సాహిత్యకారులు అన్న సిరీస్ లో అనుకుంటా! దాన్ని కుందుర్తి గారు రాసారు. అందులో జీవనానందదాస్ కవితలని చాలా అనువాదం చేసారాయన. వాటిల్లో “వనలతా సేన్” ఉంది. చాలా సాఫీగా , అచ్చతెలుగు పదాలతో అద్భుతంగా సాగుతుందా అనువాదం.
ఈమాటలో రచనల కాపీరైట్ హక్కులు ఈమాట పత్రికవి, రచయితవీను. లాభాపేక్షలేని వికీపీడియాలో ఈమాట రచనలలోని సమాచారాన్ని వాడుకోవడానికి పత్రికా పరంగా ఈమాటకు అభ్యంతరాలేమి లేవు. అయితే, మీరు ఏదైనా సమాచారాన్ని సంగ్రహించే ముందు ఆయా వ్యాస రచయితలను కూడా సంప్రదించి వారి అనుమతిని కూడా పొందడం అవసరం. అందరికీ ఉపయోగపడే వికీపీడియా వంటి బృహత్ప్రాజెక్టులకు తమ రచనలను వాడుకోనే విషయంలో చాలామంది ఈమాట రచయితలు సంతోషంగా ఒప్పుకుంటారనే నా అభిప్రాయం. రచయితల కాంటాక్ట్ వివరాలు మీకు తెలియకపోతే మాకు రాయండి. వారి అనుమతిని సంపాదించడంలో మీకు వీలైనంతగా సహాయం చెయ్యడానికి మేము తప్పకుండా ప్రయత్నిస్తాం!
‘జాయియే ఆప్ కహా జాయేంగే, యె నజర్ లౌట్ కె ఫిర్ ఆయేగీ ‘ – ఈ పాట కూడా మీరు ఉదహరించిన పాటలకు కలుపుకో తగ్గది. ఆలోచించిన కొద్దీ ఎన్నో మధుర గీతాలు మదిలో ప్రత్యక్షమవుతాయి. ఏక్ ముసాఫిర్ ఏక్ హసీనా చిత్రంలోని ‘ఆప్ యూఁహీ అగర్’ పాట పాడితే నిజంగానే మనకు నచ్చిన అమ్మాయి మనకు దగ్గరయ్యేంత మంత్రం ఉందా పాటలో. నయ్యర్ గురించి మీరు రాసినవి తెలిసినవే అయినా వ్యాసాన్ని ఎక బిగిని చదివించే శైలి ఆకట్టుకుంది. ఎక్కువమందికి తెలియని పలు విషయాలు చెప్పారు. తెలుగు వికి లో ఉంచటానికి కావలసిన అర్హతలున్న వ్యాసం ఇది. నయ్యర్ గురించి రాసి ఆప్ జీత్ లియా హమారా దిల్.
భావ కవిత్వం రాసే ప్రతీ కవీ, రాద్దమనుకొనే వర్థమాన కవులు తప్పక చదవాల్సిన పుస్తకం. కేవలం వస్తు విమర్శ లేదా సమీక్ష తప్ప ఎక్కడా అతి స్తుతి లేని సమీక్ష ఇది. ఆకులు, పూలు, చెట్ల మీదే కవిత్వం రాసే కవులు
చదవాల్సిన పుస్తకం. సమీక్ష చదివితే ఖచ్చితంగా పుస్తకం చదవాలి అన్నట్లుగా రాసారు.
యథార్థ చక్రం -6 గురించి Sai Brahmanandam Gorti గారి అభిప్రాయం:
03/04/2007 9:10 pm
వేమూరి గారు,
మీకు నచ్చినందుకు సంతోషం.
బౌద్ధం ఎలా మారిందో రెండు వాక్యాలు చెప్పానంతే!
సౌందరనందం రాసిన అశ్వఘోషుడు కాలానికే మహాయానం వచ్చేసింది.
ఈ కథ బాగుంది కానీ, ఇందులో English వాడుక కాస్త ఎక్కువైంది అనిపించింది. ఒక భాష నుంచి ఇంకో భాష లోకి ఒక చిన్న కథలో ఇన్ని సార్లు switch అవ్వాల్సి రావడం చాలా చిరాగ్గా అనిపించింది. అదే కనుక లేకుండా ఉండి ఉంటే ఈ కథ ఇంకా బాగుండేది అని నా అభిప్రాయం.
ఓ.పీ.నయ్యర్ గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
03/05/2007 8:23 am
సీబీరావుగారు చెప్పిన జాయియే పాటలాగే మేరేసనమ్ లో పుకార్ తా చలా హూ మై (రఫీ) మొదలైన మంచి పాటలెన్నో ఉదహరించదగ్గవే. “గ్రంథ విస్తరణ భీతి” ఎలాగూ ఉంటుంది కనక కొన్ని సినిమాల పేర్లూ, తక్కినవాటికి లింకులూ ఇచ్చి ఊరుకోవలసివచ్చింది. సమగ్రత కోసమని నయ్యర్ జీవిత విశేషాలన్నిటినీ మాత్రం రాయక తప్పలేదు.
తక్కిన వ్యాసరచయితలు కూడా భారతివంటి పాత పత్రికల పద్ధతిలో కాకుండా అవసరమైన చోట బొమ్మలనూ, ఆడియో లింకులనూ జతపరిస్తే వెబ్ పత్రిక సదుపాయాలను ఉపయోగించుకున్నవారవుతారు.
ది బీచ్ గురించి Aruna గారి అభిప్రాయం:
03/05/2007 8:07 am
చాలా బాగుంది. కధలో తన భార్యని ఒప్పించే తీరు మీద ఇంకొంచము దృష్టి పెడితే ఇంకా బాగుండేది.
“పల్లెలో మా పాత ఇల్లు”:ఇస్మాయిల్ గురించి Narayanaswamy గారి అభిప్రాయం:
03/05/2007 7:04 am
సమీక్ష బాగుంది. ఇస్మాయిల్ గారి ఈ సంకలనం లోని కొన్ని పారడాక్సెస్ ని బాగా పట్టుకున్నారు. అయితే ఒక చిన్న సమాచారం – జీవ(బ)నానంద దాస్ మీద కేంద్ర సాహిత్య అకాడమీ వారు ఒక పుస్తకం తెచ్చారు. భారతీయ సాహిత్యకారులు అన్న సిరీస్ లో అనుకుంటా! దాన్ని కుందుర్తి గారు రాసారు. అందులో జీవనానందదాస్ కవితలని చాలా అనువాదం చేసారాయన. వాటిల్లో “వనలతా సేన్” ఉంది. చాలా సాఫీగా , అచ్చతెలుగు పదాలతో అద్భుతంగా సాగుతుందా అనువాదం.
వికీపీడియా – స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం గురించి సురేశ్ కొలిచాల గారి అభిప్రాయం:
03/05/2007 5:43 am
సుధాకర్ బాబు గారికి, ఇంకెందరో వికీకారులకు,
ఈమాటలో రచనల కాపీరైట్ హక్కులు ఈమాట పత్రికవి, రచయితవీను. లాభాపేక్షలేని వికీపీడియాలో ఈమాట రచనలలోని సమాచారాన్ని వాడుకోవడానికి పత్రికా పరంగా ఈమాటకు అభ్యంతరాలేమి లేవు. అయితే, మీరు ఏదైనా సమాచారాన్ని సంగ్రహించే ముందు ఆయా వ్యాస రచయితలను కూడా సంప్రదించి వారి అనుమతిని కూడా పొందడం అవసరం. అందరికీ ఉపయోగపడే వికీపీడియా వంటి బృహత్ప్రాజెక్టులకు తమ రచనలను వాడుకోనే విషయంలో చాలామంది ఈమాట రచయితలు సంతోషంగా ఒప్పుకుంటారనే నా అభిప్రాయం. రచయితల కాంటాక్ట్ వివరాలు మీకు తెలియకపోతే మాకు రాయండి. వారి అనుమతిని సంపాదించడంలో మీకు వీలైనంతగా సహాయం చెయ్యడానికి మేము తప్పకుండా ప్రయత్నిస్తాం!
సంపాదక వర్గం తరఫున,
సురేశ్ కొలిచాల.
సీతా-రామా గురించి Kishore గారి అభిప్రాయం:
03/05/2007 3:15 am
సీతా రామా లో కామా(,)లెక్కువయ్యాయి. ఒక్కో వాక్యాన్ని అంత పెద్దదిగా వ్రాస్తే భావం పట్టు కోల్పోయినట్లుంది..
ఇద్దరు దుర్మార్గులు గురించి Kishore గారి అభిప్రాయం:
03/05/2007 1:15 am
భాగుంది. ఇంతకీ ఈ కథకి “ఇద్దరు దుర్మార్గులు” అనే పేరు ఎందుకు పెట్టారు?
ఓ.పీ.నయ్యర్ గురించి cbrao గారి అభిప్రాయం:
03/04/2007 10:35 pm
‘జాయియే ఆప్ కహా జాయేంగే, యె నజర్ లౌట్ కె ఫిర్ ఆయేగీ ‘ – ఈ పాట కూడా మీరు ఉదహరించిన పాటలకు కలుపుకో తగ్గది. ఆలోచించిన కొద్దీ ఎన్నో మధుర గీతాలు మదిలో ప్రత్యక్షమవుతాయి. ఏక్ ముసాఫిర్ ఏక్ హసీనా చిత్రంలోని ‘ఆప్ యూఁహీ అగర్’ పాట పాడితే నిజంగానే మనకు నచ్చిన అమ్మాయి మనకు దగ్గరయ్యేంత మంత్రం ఉందా పాటలో. నయ్యర్ గురించి మీరు రాసినవి తెలిసినవే అయినా వ్యాసాన్ని ఎక బిగిని చదివించే శైలి ఆకట్టుకుంది. ఎక్కువమందికి తెలియని పలు విషయాలు చెప్పారు. తెలుగు వికి లో ఉంచటానికి కావలసిన అర్హతలున్న వ్యాసం ఇది. నయ్యర్ గురించి రాసి ఆప్ జీత్ లియా హమారా దిల్.
“పల్లెలో మా పాత ఇల్లు”:ఇస్మాయిల్ గురించి Sai Brahmanandam Gorti గారి అభిప్రాయం:
03/04/2007 9:18 pm
భావ కవిత్వం రాసే ప్రతీ కవీ, రాద్దమనుకొనే వర్థమాన కవులు తప్పక చదవాల్సిన పుస్తకం. కేవలం వస్తు విమర్శ లేదా సమీక్ష తప్ప ఎక్కడా అతి స్తుతి లేని సమీక్ష ఇది. ఆకులు, పూలు, చెట్ల మీదే కవిత్వం రాసే కవులు
చదవాల్సిన పుస్తకం. సమీక్ష చదివితే ఖచ్చితంగా పుస్తకం చదవాలి అన్నట్లుగా రాసారు.
యథార్థ చక్రం -6 గురించి Sai Brahmanandam Gorti గారి అభిప్రాయం:
03/04/2007 9:10 pm
వేమూరి గారు,
మీకు నచ్చినందుకు సంతోషం.
బౌద్ధం ఎలా మారిందో రెండు వాక్యాలు చెప్పానంతే!
సౌందరనందం రాసిన అశ్వఘోషుడు కాలానికే మహాయానం వచ్చేసింది.
-సాయి బ్రహ్మానందం గొర్తి
సీతా-రామా గురించి Sowmya గారి అభిప్రాయం:
03/04/2007 9:08 pm