బస్సెడు అన్న పదం నేను సృష్టించలేదండి. చిన్నప్పుడు ఏదో కార్టూన్ పుస్తకం లో చూసాను. కథ కి పేరు పెడుతున్నప్పుడు ఆ విషయం నా దృష్టి లో లేదు అనుకోండి. అయినా మీ ఈ వ్యాఖ్య తో నేను clarify చేయడం అవసరం అనిపించి చెబుతున్నా.
ఆసక్తి కరమైన కధనం తో చక్కగా సాగిన కధ.
ఆధునికమైన,విశాల భావాలు కలిగిన ప్రధాన పాత్ర చిత్రణ చాలా బావుంది.అయితే ఈ పాత్ర ఔచిత్యం చివరలో కొద్దిగా దెబ్బ తిన్నదేమో అనిపిస్తుంది. మొదట నుంచీ చాలా openminded గా అనిపించిన ఈ పాత్ర కేవలం తన వ్యక్తిగత అభిప్రాయాలకు విరుద్ధంగా(అవి ఉన్నతమైన అభిప్రాయాలైనప్పటికీ) రాఘవ వివాహం చేసుకొంటం అతని “వ్యక్తిగతం” అనే విషయాన్ని గమనించకపోవటం ఆశ్చర్యం గా ఉంది. అతని అభిప్రాయాల తో తను ఏకీభవించకపోయినా వారి స్నేహాన్ని పురస్కరించుకుని అతని వివాహానికి వెళ్ళక పోవటం కొద్దిగా “చాదస్తం” గానే కాక మొదట నుంచీ ఉన్న పాత్ర చిత్రణ కి contradictory గా ఉందేమోనని నా వినమ్ర అభిప్రాయం.
అమెరికా వంటి దేశాల్లో భౌగోళికంగా ఎంతో వైవిధ్యం ఉన్న ప్రాంతాలున్నాయి కనక వాటిని చూసినవారూ, అక్కడ కొంతకాలం ఉండి ఆ అనుభవాలని పంచుకోగలిగినవారూ తెలుగులో రాయగలిగితే ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఈ కథలో “తరవా తేమవుతుంది?” అనే సస్పెన్స్ మాత్రమే కాక ఇటువంటి రచనల్లో వర్ణనలు కూడా ఆకర్షణీయం అవుతాయి. రచయితకు అభినందనలు.
ఈకథ చదివినతరవాత, వెనక్కి వెళ్లి బస్సెడుదూరం మళ్లీ చదివాను. ఈతరం వర్థమాన రచయితలు చక్కని తెలుగునుడికారంతో రాసినకథలంటే నాకు ప్రత్యేకాభిమానం. రెండుకథలూ కథావస్తువులు ఎంచుకోడంలో రచయిత్రికి గలనేర్పుని సూచిస్తున్నాయి. కథ మలిచిన తీరు కూడా చెప్పుకోదగ్గది. “బస్సెడు”లాటి పదం సృష్టించిన రచయిత్రి దిబీచ్‍కి కూడా కథావస్తువులో గాంభీర్యానికి తగ్గట్టు శీర్షిక ఎంచుకుంటే బాగుండేదేమో.
ఈ కథలో పర్యవసానం తేల్చకుండా ఒదిలేయాలనే ఒదిలేశాను. ఈ కథ రాయటానికీ, ముగింపుని నిర్ణయించటానికీ చాల ఆలోచన చెయ్యవలసి వచ్చింది. ఎంతవరకు చెప్పటం, ఎంత మేరకి పాఠకుని ఊహకి ఒదలిపెట్టటం అన్న విషయంపై తర్జనభర్జనలు చేసేను.
కథలో ఇప్పుడు ఉన్న ఆఖరి వాక్యం కూడా తీసెద్దామా అని తటపటాయించి చివరికి ఉంచటానికే నిశ్చయించేను. చీకట్లో తాడు మీద కాలేసి భయపడ్డవాడికి దీపం వేసి చూపించి ఆ భయం పోగొట్టినట్ట్లే బయట ఎలుగ్గొడ్డు ఉన్నాదనుకుని భయపడ్డవాడిని ఆ చీకటి గదిలో ఆ భయంతో ఒదిలెయ్యకుండా బయటకి తీసుకురావటమే మంచిదనిపించింది. బయటకి వచ్చేక ఏమి చూసేడన్నది ఉద్దేశ్యపూర్వకంగానే చెప్పలేదు.
బయట ఎలుగ్గొడ్డు నిజంగా ఉందా లేదా అన్న విషయం చెప్పెస్తే కథలో పట్టు పోతుందనిపించింది. ఆకాశవీధిలోని నక్షత్రమండలంలో అప్పుడే చూసిన ఎలుగ్గొడ్డే మళ్ళా ఇలా అతని మనోవీధిలో తారసపడి ఉండొచ్చుకదా. ఒంటరిగా, ఏకాంతంగా ఉన్న మనిషి మనోస్థితి కథ ఇది. ఆ వ్యక్తి చూసినవి, విన్నవి, అనుభవించినవి, అన్నీ ఆ వ్యక్తికి నిజమే కావచ్చు కానీ పైవారికి నిజం కాకపోవచ్చు. A Beautiful Mind ప్రస్తావన తీసుకురాటానికి కూడా కారణం ఇదే. మన ఉపనిషత్తులలోని చత్వారీ వాక్పథాల ప్రస్తావన తీసుకురాటానికి కూడ కారణం ఇదే.
నేను గతంలో రాసిన ‘అభయారణ్యంలో ఏంబర్‘ అన్న కథలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కనుక వారి మనోభావాలని వివరించి చెప్పటం జరిగింది. ఇక్కడ ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు కనుక సంఘటనలని మాత్రం వర్ణించి వ్యాఖ్యానాలని చదువరుల ఊహకి ఒదిలేశాను. ఉత్తమపురుషలో చెప్పిన కథ కనుక పర్యవసానం మీద వ్యాఖ్యానాలు చేస్తే కథ మీద నా ముద్ర పడిపోతుందని చెప్పలేదు.
తరువాయి భాగం అంటారా? ఒక నవల రాయటానికి సరిపడా వస్తువు ఉంది. ఓపిక ఉండాలి, అంతే!
తెలుగు వికీపీడియా గురించి ఈ వ్యాసాన్ని పునర్ముద్రించినందుకు “ఈమాట” సంపాదక వర్గానికి కృతజ్ఞతలు. తెలుగు భాషాభిమానం విషయంలో తెలుగు వికీ సభ్యులు “ఈ మాట” పత్రికను ఆత్మీయులుగా భావిస్తున్నారు.
మీరు అనుమతిస్తే “ఈమాట” నుండి కొన్ని విషయాలను తెలుగు వికీలోకి తీసుకోవాలని మా ఆకాంక్ష. సందర్భాన్నిబట్టి “ఈమాట” పత్రికనూ, వ్యాస రచయితనూ కూడా తెలుగు వికీలో “ఫలానావారి సౌజన్యంతో” అని తప్పక వ్రాస్తాము .
ఇంతకు ముందే “ఈమాట” లోని విషయాలను తెలుగు వికీలో వాడుకొనవచ్చునని శ్రీ సురేష్ కొలిచాల గారు సహృదయతతో అనుమతించారు. మరొకమారు మీరు ఈ అనుమతిని ఈ పత్రికాముఖంగా తెలియజేస్తే బాగుంటుంది. ముఖ్యంగా “ఈమాట” యూనికోడ్‌లో ఉన్నందున మీ అనుమతి మాకు ఎంతో మంచి వనరు, సౌలభ్యం కలుగజేస్తుంది.
ది బీచ్ గురించి Sowmya గారి అభిప్రాయం:
03/04/2007 8:57 pm
బస్సెడు అన్న పదం నేను సృష్టించలేదండి. చిన్నప్పుడు ఏదో కార్టూన్ పుస్తకం లో చూసాను. కథ కి పేరు పెడుతున్నప్పుడు ఆ విషయం నా దృష్టి లో లేదు అనుకోండి. అయినా మీ ఈ వ్యాఖ్య తో నేను clarify చేయడం అవసరం అనిపించి చెబుతున్నా.
చాదస్తం గురించి Vaidehi Sasidhar గారి అభిప్రాయం:
03/04/2007 6:30 pm
ఆసక్తి కరమైన కధనం తో చక్కగా సాగిన కధ.
ఆధునికమైన,విశాల భావాలు కలిగిన ప్రధాన పాత్ర చిత్రణ చాలా బావుంది.అయితే ఈ పాత్ర ఔచిత్యం చివరలో కొద్దిగా దెబ్బ తిన్నదేమో అనిపిస్తుంది. మొదట నుంచీ చాలా openminded గా అనిపించిన ఈ పాత్ర కేవలం తన వ్యక్తిగత అభిప్రాయాలకు విరుద్ధంగా(అవి ఉన్నతమైన అభిప్రాయాలైనప్పటికీ) రాఘవ వివాహం చేసుకొంటం అతని “వ్యక్తిగతం” అనే విషయాన్ని గమనించకపోవటం ఆశ్చర్యం గా ఉంది. అతని అభిప్రాయాల తో తను ఏకీభవించకపోయినా వారి స్నేహాన్ని పురస్కరించుకుని అతని వివాహానికి వెళ్ళక పోవటం కొద్దిగా “చాదస్తం” గానే కాక మొదట నుంచీ ఉన్న పాత్ర చిత్రణ కి contradictory గా ఉందేమోనని నా వినమ్ర అభిప్రాయం.
యథార్థ చక్రం -6 గురించి Rao Vemuri గారి అభిప్రాయం:
03/04/2007 5:16 pm
అంతా ఇంత బాగా తెలుగులో రాసి చిట్టచివర మళ్ళా హీనయాన బుద్ధిజం ఏమిటండీ! నా తెలుగు సోది నాది. మరోలా అనుకోకండి.
భయం! గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
03/04/2007 4:38 pm
అమెరికా వంటి దేశాల్లో భౌగోళికంగా ఎంతో వైవిధ్యం ఉన్న ప్రాంతాలున్నాయి కనక వాటిని చూసినవారూ, అక్కడ కొంతకాలం ఉండి ఆ అనుభవాలని పంచుకోగలిగినవారూ తెలుగులో రాయగలిగితే ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఈ కథలో “తరవా తేమవుతుంది?” అనే సస్పెన్స్ మాత్రమే కాక ఇటువంటి రచనల్లో వర్ణనలు కూడా ఆకర్షణీయం అవుతాయి. రచయితకు అభినందనలు.
ఇద్దరు దుర్మార్గులు గురించి Shiva గారి అభిప్రాయం:
03/04/2007 11:08 am
చాలా బాగున్నది
ది బీచ్ గురించి మాలతి గారి అభిప్రాయం:
03/04/2007 10:56 am
ఈకథ చదివినతరవాత, వెనక్కి వెళ్లి బస్సెడుదూరం మళ్లీ చదివాను. ఈతరం వర్థమాన రచయితలు చక్కని తెలుగునుడికారంతో రాసినకథలంటే నాకు ప్రత్యేకాభిమానం. రెండుకథలూ కథావస్తువులు ఎంచుకోడంలో రచయిత్రికి గలనేర్పుని సూచిస్తున్నాయి. కథ మలిచిన తీరు కూడా చెప్పుకోదగ్గది. “బస్సెడు”లాటి పదం సృష్టించిన రచయిత్రి దిబీచ్‍కి కూడా కథావస్తువులో గాంభీర్యానికి తగ్గట్టు శీర్షిక ఎంచుకుంటే బాగుండేదేమో.
మాలతి
భయం! గురించి Rao Vemuri గారి అభిప్రాయం:
03/04/2007 10:48 am
రోహిణీప్రసాద్ గారూ,
ఈ కథలో పర్యవసానం తేల్చకుండా ఒదిలేయాలనే ఒదిలేశాను. ఈ కథ రాయటానికీ, ముగింపుని నిర్ణయించటానికీ చాల ఆలోచన చెయ్యవలసి వచ్చింది. ఎంతవరకు చెప్పటం, ఎంత మేరకి పాఠకుని ఊహకి ఒదలిపెట్టటం అన్న విషయంపై తర్జనభర్జనలు చేసేను.
కథలో ఇప్పుడు ఉన్న ఆఖరి వాక్యం కూడా తీసెద్దామా అని తటపటాయించి చివరికి ఉంచటానికే నిశ్చయించేను. చీకట్లో తాడు మీద కాలేసి భయపడ్డవాడికి దీపం వేసి చూపించి ఆ భయం పోగొట్టినట్ట్లే బయట ఎలుగ్గొడ్డు ఉన్నాదనుకుని భయపడ్డవాడిని ఆ చీకటి గదిలో ఆ భయంతో ఒదిలెయ్యకుండా బయటకి తీసుకురావటమే మంచిదనిపించింది. బయటకి వచ్చేక ఏమి చూసేడన్నది ఉద్దేశ్యపూర్వకంగానే చెప్పలేదు.
బయట ఎలుగ్గొడ్డు నిజంగా ఉందా లేదా అన్న విషయం చెప్పెస్తే కథలో పట్టు పోతుందనిపించింది. ఆకాశవీధిలోని నక్షత్రమండలంలో అప్పుడే చూసిన ఎలుగ్గొడ్డే మళ్ళా ఇలా అతని మనోవీధిలో తారసపడి ఉండొచ్చుకదా. ఒంటరిగా, ఏకాంతంగా ఉన్న మనిషి మనోస్థితి కథ ఇది. ఆ వ్యక్తి చూసినవి, విన్నవి, అనుభవించినవి, అన్నీ ఆ వ్యక్తికి నిజమే కావచ్చు కానీ పైవారికి నిజం కాకపోవచ్చు. A Beautiful Mind ప్రస్తావన తీసుకురాటానికి కూడా కారణం ఇదే. మన ఉపనిషత్తులలోని చత్వారీ వాక్పథాల ప్రస్తావన తీసుకురాటానికి కూడ కారణం ఇదే.
నేను గతంలో రాసిన ‘అభయారణ్యంలో ఏంబర్‘ అన్న కథలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కనుక వారి మనోభావాలని వివరించి చెప్పటం జరిగింది. ఇక్కడ ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు కనుక సంఘటనలని మాత్రం వర్ణించి వ్యాఖ్యానాలని చదువరుల ఊహకి ఒదిలేశాను. ఉత్తమపురుషలో చెప్పిన కథ కనుక పర్యవసానం మీద వ్యాఖ్యానాలు చేస్తే కథ మీద నా ముద్ర పడిపోతుందని చెప్పలేదు.
తరువాయి భాగం అంటారా? ఒక నవల రాయటానికి సరిపడా వస్తువు ఉంది. ఓపిక ఉండాలి, అంతే!
వికీపీడియా – స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం గురించి కాజ సుధాకర బాబు గారి అభిప్రాయం:
03/04/2007 10:10 am
తెలుగు వికీపీడియా గురించి ఈ వ్యాసాన్ని పునర్ముద్రించినందుకు “ఈమాట” సంపాదక వర్గానికి కృతజ్ఞతలు. తెలుగు భాషాభిమానం విషయంలో తెలుగు వికీ సభ్యులు “ఈ మాట” పత్రికను ఆత్మీయులుగా భావిస్తున్నారు.
మీరు అనుమతిస్తే “ఈమాట” నుండి కొన్ని విషయాలను తెలుగు వికీలోకి తీసుకోవాలని మా ఆకాంక్ష. సందర్భాన్నిబట్టి “ఈమాట” పత్రికనూ, వ్యాస రచయితనూ కూడా తెలుగు వికీలో “ఫలానావారి సౌజన్యంతో” అని తప్పక వ్రాస్తాము .
ఇంతకు ముందే “ఈమాట” లోని విషయాలను తెలుగు వికీలో వాడుకొనవచ్చునని శ్రీ సురేష్ కొలిచాల గారు సహృదయతతో అనుమతించారు. మరొకమారు మీరు ఈ అనుమతిని ఈ పత్రికాముఖంగా తెలియజేస్తే బాగుంటుంది. ముఖ్యంగా “ఈమాట” యూనికోడ్‌లో ఉన్నందున మీ అనుమతి మాకు ఎంతో మంచి వనరు, సౌలభ్యం కలుగజేస్తుంది.
కాజ సుధాకర బాబు (తెలుగు వికీ సభ్యుడు)
http://te.wikipedia.org/wiki/సభ్యుడు:Kajasudhakarababu
పనిపిల్లలు గురించి sita గారి అభిప్రాయం:
03/04/2007 9:37 am
దయచేసి “వాళ్ళు”, “వీళ్ళు” అని రాసేటప్పుడు మెలిక ళ రాయండి.
వికీపీడియా – స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం గురించి సుధాకర్(శోధన) గారి అభిప్రాయం:
03/04/2007 5:05 am
ఇలాంటి మంచి వ్యాసాలను ఎక్కడ ఎన్ని సార్లు అయినా ముద్రించవచ్చు. వికీ అభివృద్ధికి మీ వంతు అందిస్తున్న తోడ్పాటు అభినందనీయం.