Comment navigation


15542

« 1 ... 1494 1495 1496 1497 1498 ... 1555 »

  1. భయం! గురించి సుధాకర్ గారి అభిప్రాయం:

    03/07/2007 12:15 am

    మొదట్లో ఆసక్తిగా అనిపించినా మధ్యలో రచయత ఎటెటో వెళ్లిపోయి ఏవేవో కధకు అనవసరమైనవి చెప్పడం వల్లన…”నేనెక్కడున్నాను?” అని చదివేవాడికి అనిపించేలా చేసారు. మరలా కధలోనికి వచ్చే సరికే లింకులన్నీ తెగిపోయి వేలాడుతున్నాయి. ఇక చివరకు వచ్చేసరికి అసలా లింకులకు అంతు లేదని తెలిసాక నీరసం వచ్చింది. పక్కాగా చెప్పాలంటే స్వాతిలో సీరియల్ లా ఉంది.

  2. మహరాజవ్వాలంటే… గురించి ప్రసాద్ గారి అభిప్రాయం:

    03/06/2007 1:24 pm

    హ్హ హ్హ భలే సరదా పుట్టించారు. బ్రంహ్మానందం గారి కొనసాగింపు కూడా బాగా వుంది.
    –ప్రసాద్
    http;//blog.charasala.com

  3. భయం! గురించి ప్రసాద్ గారి అభిప్రాయం:

    03/06/2007 1:12 pm

    గగుర్పొడిచే కథ.
    ఇంతకీ అతనిది అనుమానమేనా? లేక నిజంగానే ఏదో గోకిందా?

    –ప్రసాద్
    http;//blog.charasala.com

  4. సీతా-రామా గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:

    03/06/2007 12:21 pm

    నా కథ గురించి నేను

    సౌమ్యా, కిషోర్, ప్రసాద్,

    విమర్శ నిజవే. పది, పదిహేనేళ్ళుగా ఈ దేశంలో గడపటం వలన, చాలా ఆలోచనలు కూడా ఆంగ్లంలోనే వస్తాయ్ . వాటిని మరికొంచం ఓపిక చేసుకుని తెలుగులో పెట్టకపోవటం వొక లోపవే.

    కొంచెం కామాలు ఎక్కువగానే వున్నాయ్ ఈ కథలో. కానీ ఇక్కడ ఏదో జరిగిన సంఘటనని చెప్పడం కాకుండా, గతం గురించి మనసు ఏడ్చే ఏడుపీ కథ. మనిషికొచ్చే ఏడ్పు ఎలా ఐతే వెక్కుళ్ళు, వెక్కుళ్ళుగా వస్తుందో, మనసికంగా కలిగే వొత్తిడి కుడా అట్లాగే వెక్కుళ్ళు, వెక్కుళ్ళుగా, కామాలు, కామాలుగా పాటలాగా వస్తుంది. ఆ కామాలు, వాటి మధ్య వున్న కనిపించీ, కనిపించని రిథమ్, ఆ మానసిక వొత్తిడిని, ఘాడత తగ్గకుండా అక్షరాల్లోకి అనువదించగలిగేయని నా ఉద్దేశం.

    పేర్లను అలాగ పెట్టటంలో ఉద్దేశవేంటంటే, సీతా, రామ్ ల మధ్య వున్నటువంటి లింగ బేధాన్ని తీసేసి, వాళ్ళిద్దరి వ్యధ వొకటిగా వుండటం చూపించ దలచుకున్నాను. అదెంతవరకు క్లిక్ అయిందో అనుమానవే.

    మనం వ్రాసిన కథ కానీ కవిత కానీ ప్రచురణకి పంపే ముందు, చాలా సార్లే చదువుతాం. కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్లు, ఎన్ని సార్లు చదివినా, మనదనే మమత మనసుని కప్పేసి లోపాల్ని అంతగా తెలీనీదు. వొకసారి ప్రచురించబడిన తర్వాత, వొకటి, రెండు విమర్శలు వచ్చిన తర్వాత, బుర్ర మళ్ళా ఓపెన్ కావడం మొదులవుతుంది.

    కథ ఆరంభం బాగుంది గానీ, ముగింపు చాలా పేలవంగా వుంది. వున్నట్టుండి ఏవి వ్రాయాలో తెలియక, ఎలా ముగించాలో తెలియక, ఏదో రెండు పేరాలు వ్రాసి ఆపేసినట్టుంది. ఇక సీతా రావుల చిత్రణ నాకు చాలా నచ్చినా, వారి ద్వారా చెప్పదలచుకున్న విషయం కథంతా అంతర్లీనంగా సాగినా, వారి మనసు వొత్తిడి అక్షరాల్లోంచి చదవరి మనసులోకి ట్రావర్స్ కాగలిగేలా వున్నా, ఎందుకో కథ అసంపూర్తిగా అనిపించింది. పది పేజీల కథలో మధ్యలో నాలుగు పేజీలు చదివినట్లుంది. గతంలోకి తొంగి చూస్తున్నట్టు కాకుండా, వర్తమానంలో జరుగుతున్న కథలా వ్రాసుంటే బాగుండేది. బ్రతుకులో ఇష్టవైందేదో తెలిసి, దాన్ని కొంచం కొంచగా వదులుకుంటూ, అశహ్యించుకునే దారిలోకి తెలిసీ, తెలియకుండా సీత రావుల ప్రయాణాన్ని, ఆ ఘర్షణని జరుగుతున్న విధంగా చిత్రిస్తే మరింత బాగుండేది.

    రవికిరణ్ తిమ్మిరెడ్డి

  5. చాదస్తం గురించి ప్రసాద్ గారి అభిప్రాయం:

    03/06/2007 12:10 pm

    వైదేహి గారి అభిప్రాయముతో నేను వంద శాతము ఏకీభవిస్తున్నాను.
    పెళ్ళి రాఘవ్ స్వంత విషయం. అది ఎలా చేసుకోవాలన్నది అతనే నిర్ణయించుకోవాలి. పెద్దలు అనుభవంతో సహాయపడాలే గానీ అన్న పెద్దావిడ సలహాతోనే సరిపెట్టి పెళ్ళికి వెళ్ళి వుండాల్సింది. అలాగాక తను నమ్మిందే ఇతరులు నమ్మాలనే చాదస్తంతో ముఖ్య స్నేహితుడి పెళ్ళికి వెళ్ళకపోవడం అనుచితం.
    –ప్రసాద్
    http://blog.charasala.com

  6. ఒక చలిపొద్దు గురించి ఫణి డొక్కా గారి అభిప్రాయం:

    03/06/2007 11:15 am

    చాలా బాగా రాసారు.

    ఆకులు రాల్చే చెట్టైనా, ఆకులు రాలని చెట్టైనా, మీ కవితలో ఎంతో అందంగా వొదిగిపోతుంది. చూడగలిగిన వారికి మీకవితల్లో మనోహర దృశ్యాలు కనిపిస్తాయి.

    నా మట్టుకు నేను మీ కవితలకోసం ఎప్పుడూ ఎదురుచూస్తూ వుంటాను, ఆసక్తిగా..

    మీ ఫణి డొక్కా.

  7. ఇద్దరు దుర్మార్గులు గురించి ప్రసాద్ గారి అభిప్రాయం:

    03/06/2007 9:46 am

    కథ చాలా బాగుంది. సంభాషణలు ఎక్కడా దారి తప్పకుండా బాగున్నాయి.
    “గోపీ పీన పయోధర” అన్నప్పుడు నాకు నవీన్ “అంపశయ్య” గుర్తుకు వచ్చింది. అందులో కథానాయకుడికి ఇది ఇలాగే మరిన్ని బూతులు మళ్ళి మళ్ళీ మెదడులోకి వచ్చి విసుక్కుంటాడు.
    ప్రసాద్
    http://blog.charasala.com

  8. రెండు సంగీత సంప్రదాయాల్లో అష్టదిగ్గజాలు గురించి Vaidehi Sasidhar గారి అభిప్రాయం:

    03/06/2007 9:13 am

    చక్కని వ్యాసం! సంగీతాన్ని ఆనందించటం తప్ప విశ్లేషించటం తెలియని వారిని,సంగీతం పై అపారమైన అభిమానమే తప్ప అధికారం,విజ్ఞానం లేని వారిని కూడా ఆసక్తి కరంగా చదివించిన వ్యాసం. ప్రాక్పశ్చిమ సంప్రదాయాలలోని దిగ్గజాల జీవిత విశేషాలను,విభిన్న సంగీత రీతుల లోని కొన్ని విశేషాలను వివరించిన తీరు బావుంది.ఆకట్టు కునే శైలి వచనంలో దాగిన కవిత్వంలా ఉంది.

  9. రెండు సంగీత సంప్రదాయాల్లో అష్టదిగ్గజాలు గురించి సురేశ్ కొలిచాల గారి అభిప్రాయం:

    03/06/2007 7:43 am

    నాకు ఎందుకో ఇండో-యూరోపియను భాషలు ఎలాగో, అలాగే ఈ సంగీతము కూడా అయి ఉండవచ్చు అనిపిస్తుంది.

    చావా గారు: అన్ని విషయాలను ఇండో-యూరోపియన్ అద్దం లోంచి చూస్తే ఎలాగండీ? 🙂 ఇండో-యూరోపియన్ భాషల మధ్య జన్మ సంబంధం నిరూపించే భాషాశాస్త్ర ఆధారాలు కోకొల్లలు. గత అయిదారు వందల ఏండ్లలోనే బాగా అభివృద్ధి చెందిన పాశ్చాత్య కర్ణాటక సంగీత సంప్రదాయాలకు, సుమారు అయిదు వేల యేండ్ల కింద విడిపోయిన ఇండో-యూరోపియన్ భాషలకు లంకె లేదు. ఈ వ్యాసంలో సంగీత సంప్రదాయాల మధ్య సారూప్యం ఎత్తిచూపడానికి ప్రయత్నించిన నాగరాజు గారు సైతం ఆ పోలికలకు కారణం మానవుని ఆలోచనల్లో నిగూఢమైన ఏకత్వమనే వాదించాడే గాని వాటి మధ్య ఏ రకమైన జన్మ సంబంధం అంటగట్టలేదు. ఏవో కొన్ని యాదృచ్ఛిక సారూప్యాలను (chance similarities) ఆధారం చేసుకొని తయారు చేసిన సజాతిత్వ సిద్ధాంతాలు శాస్త్ర విమర్శకు నిలవలేవని మీకు తెలుసు కదా?

    రిగార్డులతో,
    సురేశ్.

  10. అంతరం గురించి ప్రసాద్ గారి అభిప్రాయం:

    03/06/2007 7:38 am

    కథ చాలా బాగా వుంది. తను మాత్రమే బాగా చేయగలమనుకొనే వారి బలహీనతను, ఎదురింటావిడ భర్తను పొగిడే భార్యల సోదిని బాగా చెప్పారు.
    –ప్రసాద్
    http://blog.charasala.com

« 1 ... 1494 1495 1496 1497 1498 ... 1555 »