Comment navigation


15543

« 1 ... 1483 1484 1485 1486 1487 ... 1555 »

  1. శ్రీ శ్రీ కవిత్వంపై … మరో వ్యాసం గురించి వాడపల్లి,శేషతల్పశాయి గారి అభిప్రాయం:

    05/04/2007 10:06 pm

    వీరిదే మరొక విలువైన ‘ఖండకావ్యము – భావకవిత్వము‘ అను వ్యాసమును ఆంధ్రభారతిలో చదువగలరు.


    నమస్సులతో,
    శాయి.

  2. కడపసీమలో అపురూపమైన కలివి కోడి గురించి Lyla Yerneni గారి అభిప్రాయం:

    05/04/2007 7:30 pm

    బహు అందమైన ఛాయాచిత్రాలు. అందమైన వ్యాసము.
    రచయితకు ధన్యవాదాలు.
    అసలు సౌందర్య రాశి – వ్యాసములోని కలివి కోడి – గురించి
    మరికొన్ని గమనించవలసిన విషయాలు తెలిపిన సి.బి రావు గారికి
    కూడాను.

  3. ఈమాట గురించి గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    05/04/2007 8:08 am

    కొత్త ఫీచర్స్ పత్రికలోని రచనల వైవిధ్యాన్ని పెంచుతాయనడంలో సందేహం లేదు. జమ్మి వారి వ్యాసం చదవగానే కొందరు పాఠకులు గొంతు విప్పి అభిప్రాయాలు వ్యక్తం చెయ్యడం ఆనందదాయకం. ‘కొత్త’ అనేది ‘చెత్త’ కానంతవరకూ అభిలషణీయమే అనుకుంటాను.

    ఒక ఉదాహరణ చెపుతాను. నా దగ్గిరున్న 50 ఏళ్ళ నాటి “కినిమా” సంచికల్లో ఆనాటి సినీ టెక్నాలజీ గురించిన వ్యాసాలు ప్రచురించడం చూశాను. నిరంతరమూ సినిమా భజన చేసే కోట్లాది తెలుగువారికి ఈ ఆధునిక యుగంలో ఇటువంటి టెక్నాలజీ పట్ల ఏమాత్రం ఆసక్తి ఉందో తెలియదు.

    ఇలాంటి కొత్త విషయాల గురించి రాయగలిగినవారి సహాయం పొందితే ఈమాటవంటి పత్రికకు ఎంతో లాభమే. దీన్ని గురించి సంపాదకవర్గం అభిప్రాయాలు ఎటువంటివో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. (సినీ డైరెక్షన్లో తర్ఫీదు పొందుతున్న ఒక తెలుగు యువతి అట్లాంటాలో నివసిస్తోంది. ఆమెను సంప్రదించడం సంపాదకులకు సాధ్యమే)

  4. లోపలికి గురించి ప్రద్యుమ్న గారి అభిప్రాయం:

    05/04/2007 5:41 am

    పాత టైరు, పగుళ్ళ లిపి రెండూ చాలా బాగున్నాయి.

  5. కడపసీమలో అపురూపమైన కలివి కోడి గురించి cbrao గారి అభిప్రాయం:

    05/04/2007 1:32 am

    కలివి కోడి పక్షులు ఎక్కువగా రాత్రి పూటే సంచరిస్తాయి. చాలా పిరికివి. మనిషి అలికిడికి పారి పోతాయి. లంక మల్లీశ్వరం అడవుల్లో నుంచి తొలుత తెలుగు గంగ ప్రయాణమార్గం నిర్దేశించబడనప్పుడు ఈ పక్షులను రక్షించటం కీలకమైంది. అప్పటి ముఖ్య మంత్రి N.T.రామారావు గారు పక్షి కోసం తెలుగు గంగ దారి ఎందుకు మళ్ళించాలి అన్న ప్రశ్నకు అప్పటి Chief Conservator of Forests శ్రీ పుష్ప కుమార్ గారు లౌక్యంగా ఈ Jerdon’s Courser పక్షి ప్రపంచంలో మన కడప జిల్లాలో మాత్రమే ఉంటుందనీ, అసలు ఇది ప్రపంచంలోనే అరుదైన తెలుగు పక్షి అని చెప్పి రామారావు గారి తెలుగు అభిమానాన్ని తెలుగుగంగ కాలువ దారి మళ్ళించి పక్షిని ,దాని పరిసరాలను పరిరక్షించటానికి వాడారు.

    1986 లో ఈ అరుదైన పక్షిని కనుగొన్న 20 సంవత్సరాలకే మరో ఉపద్రవం ఈ పక్షిని మట్టుపెట్టడానికి వచ్చింది.నీటి పారుదల శాఖ వారు లంక మల్లీశ్వరం అభయారణ్యంగుండా కాలువ తవ్వటానికి అనుమతించినప్పుడు contractor భారీగా యంత్ర సామగ్రిని అడవికి తరలించిన సమయంలో Bombay Natural History Society Research Scholar భరత్ భూషణ్ వాటిని కనుగొని సకాలంలో అటవీ శాఖ అధికారులను హెచ్చరించటంతో వారు ఆ సామగ్రిని స్వాధీనం చేసుకొని కాంట్రాక్టర్ పై కేసు పెట్టడం జరిగింది. దరిమెలా BNHS Director అసద్ రహ్మాని, W.W.F. మరియు Birdwatchers Society of Andhra Pradesh సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కలిసి కాలువ దారి మళ్ళింపు యొక్క ఆవశ్యకత గురించి చెప్పి వారిని ఒప్పించటం లో కృతకృత్యులయ్యారు.
    కలివికోడి రక్షణకు పైన చెప్పిన సంస్థల కృషి అభినందనీయం.
    భారత ప్రభుత్వం వారు ఈ పక్షిపై వెలువరించిన తపాలా బిళ్ళను చూడండి.
    http://www.geocities.com/rs_suresh/jcourserstamp.jpg

    కొనేటి రావు గారి వ్యాసంలోని చిత్రాలలో Jerdon’s Courser ‘Double Bands’ చూడండి . వాటిలో నల్ల అంచుల మధ్యలో గులాబీ రంగు గమనించండి. ఇంతవరకు వెలువడిన ఏ చిత్రాలలోను లేని స్పష్టత వీటి లో వుంది. కారణం ఇవి పగలు తీసిన ఛాయా చిత్రాలు. ఈ ఛాయా చిత్రాల రచయిత పేరు వ్యాసం లో ఉదహరిస్తే బాగుండేది. చక్కటి వ్యాసాన్ని అందచేసిన జమ్మి కోనేటి రావు గారికి అభినందనలు.

    ఆసక్తి ఉన్నవారు కడప-బద్వేలు-లంక మల్లీశ్వరం అభయారణ్యం లో స్థానికుల సహాయం తో కలివి కోడిని చూడవచ్చు.

  6. న త్వం శోచితుమర్హసి గురించి నేనుసైతం గారి అభిప్రాయం:

    05/03/2007 5:55 am

    రానారె,

    కళ్ళముందు కదలాడే లా చెప్పావు.

    -నేనుసైతం

  7. న త్వం శోచితుమర్హసి గురించి విహారి గారి అభిప్రాయం:

    05/02/2007 12:45 pm

    రానారె,

    ఎలా వర్ణించాలో తెలియడం లేదు. చాలా చాలా బాగుంది. సంపేసినావ్ బో. కళ్ళంబడి బొట బొటా నీళ్ళు కారిపోయినాయ్ బో.

    – విహారి

  8. కడపసీమలో అపురూపమైన కలివి కోడి గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    05/02/2007 9:27 am

    వైల్డ్ లైఫ్ గురించి తెలుగులో రాస్తున్న కొద్దిమందిలో కోనేటిరావుగారొకరు. మన దేశంలో ఈకో టూరిజం, వైల్డ్ లైఫ్ టూరిజం పెరుగుతున్న దాఖలాలూ కనిపిస్తున్నాయి. ఒకవేపు బడా నాయకులూ, వారి సహచరులూ నెమళ్ళవంటి అపురూప ప్రాణులని చాటుగా చంపి తింటున్నప్పటికీ మొత్తం మీద ఈ విషయాల గురించిన అవగాహన పెరుగుతోంది. ఇలాంటి వ్యాసాలు అందుకు తోడ్పడతాయి.

  9. కడపసీమలో అపురూపమైన కలివి కోడి గురించి Rao Vemuri గారి అభిప్రాయం:

    05/02/2007 9:02 am

    ఇటువంటి వ్యాసం రాసినందుకు జమ్మి కోనేటిరావుగారినీ, ప్రచురించినందుకు ఈమాట సంపాదకవర్గాన్నీ అభినందించకుండా ఉండలేకపోతున్నాను. ఈ భూమి మీద మానవుడికి ఎంత హక్కు ఉందో సమస్త జీవకోటికీ కనీసం అంత హక్కూ ఉంది. నా చిన్నతనంలో అనకాపల్లి – చోడవరం రోడ్డు మీద, గోవాడ దగ్గర, ఒక ఒక పెద్దపులిని చంపేరు. అంటే ఆ మన్యప్రాంతాలలో పులులు తిరిగేవనే కదా తాత్పర్యం. అదే రోడ్డు మీద మా పెద్దన్నయ్య ఒక దుమ్ములగొండిని కూడ చూసేడు. ఇప్పుడు పులులు లేవు, దుమ్ములగొండ్లూ లేవు. మన వన్య సంపద నశించి పోయిన తరువాత విచారించి లాభం లేదు.

  10. సుమధుర సందర్భోచిత స్వర రచన గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    05/02/2007 8:16 am

    అనుభవజ్ఞులు ఏం రాసినా చదవదగినదే. శ్రీనివాస్ గారి వ్యాసం చదువుతూ ఉంటే ఈ మధ్య ప్రసిద్ధ సంగీత దర్శకుడు ఎం.ఎస్.విశ్వనాథన్ ఒక ఇంటర్వ్యూలో ఆయన గురించి అన్న మాటలు గుర్తుకొచ్చాయి. సంగీత దర్శకుడు చెప్పినదానికన్నా, ఊహించినదానికన్నా బాగా పాడి మెప్పించగలిగిన గాయకుల్లో శ్రీనివాస్ ఒకరని పేరు ఉండేదట. కేవలం అద్భుతంగా పాడటమే కాక మంచి అభిరుచీ, సంస్కారమూ ఆయనకు ఉండడమే అందుకు కారణం. ఈ వ్యాసంలో అది తెలుస్తుంది.

« 1 ... 1483 1484 1485 1486 1487 ... 1555 »