పరధర్మో నిధనం శ్రేయః – స్వధర్మో భయావహః!!! ఇలా మార్చుకోవాల్సిందే. ఒళ్లు జలదరించేంతగా ఉన్న ఇంతటి పట్టైన కథనం నేనెప్పుడూ చదవలేదు. ఆ ప్రాంతాలు, పరిసరాలు, ఆ మనుషులు, మార్పులు దగ్గరగా చూసిన చివరి తరానికి చెందినవాడిని కావడంతో కాబోలు మాటకందని భయం కలిగిస్తున్నదీ రచన.
ఈ కధలో వాడిన భాషా, కధ చెప్పిన తీరూ, మాటలూ, విషయాలూ చాలా బాగున్నాయి. ఎటొచ్చీ, జంతువు బదులు ఏ పాలేరు లాంటీ మనిషినో తీసుకుంటే, ఇంకా అద్భుతంగా వుండేదనిపించింది. కడప జిల్లా మాండలీకం లోని పదాలకి అర్ధాలు ఇచ్చి వుండకపోతే, కధ అందరికీ ఇంత చక్కగా అర్థం అయి వుండేది కాదు. ఈ పద్ధతి బాగుంది. జంతువు ఘోష అనేసరికి, అంతా వూహే నన్నమాట అని అనిపించి, వుసూరుమనిపిస్తుంది. మనుషుల కష్టాలు అయితే ఇంకా హృదయాన్ని కదిలిస్తాయి. మొత్తానికి కధ బాగుంది.
“ఎవర్ని నేను, ఇక్కడ అమెరికన్ ని కాదు, పోనీ ఇండియాలో? నార్త్ లో మదరాసీని, తమిళ్ నాడు లో గొల్టీని, హైదరాబాద్ లో ఆంద్రోడ్ని, ఆంధ్రాలో రెడ్డిని, కమ్మోడ్ని, బాపనోడ్ని, మాలోడ్ని, మాదిగోడ్ని, ఎరుకలోడ్ని, ఏనాదోడ్ని. ఎవర్ని నేను, రంగు, కులాని కతీతంగా?”
నేను కు మీరిచ్చిన నిర్వచనం చాలా బాగుంది. ప్రతిదీ చాలా లోతుగా చెప్పబడింది.
శ్రోతలకూ, పాఠకులకూ అంత ఆసక్తి ఉండకపోవచ్చుగాని జుగల్బందీల్లో ఎన్నో టెక్నికల్ కాంప్రొమైజులు ఉంటాయి. ఉదాహరణకు మొదటినుంచీ బాలమురళిగారిది ఒకటి శ్రుతి. జోషీగారు మొదట్లో 2 , 3 శ్రుతుల్లో పాడుతూ ఉండేవారు. అలాగే వీణ 3, 4 శ్రుతుల్లో ఉంటుంది. సితారుది 1, 2 మధ్యలో ఉంటుంది. నేను సరోద్ తో సితార్ వాయించినప్పుడు ఇబ్బంది కలగలేదు కాని హిందూస్తానీ వేణువుతో (అతనికి 3 శ్రుతి అలవాటు) తేడా వచ్చింది.
ఇక ‘కృతి’ విషయంలో కూడా స్వల్పమైన తేడాలుంటాయి. సితార్, వేణువు రెండూ హిందూస్తానీ వాయిద్యాలే అయినప్పటికీ ‘గత్’ ఎంపికలో వ్యత్యాసాలుంటాయి. అలాగే వేగంలోని ‘కంఫర్ట్ జోన్లో’ కూడా తేడా ఉంటుంది. ఇవన్నీ ముందుగా ప్రాక్టీసు చేసుకుంటునప్పుడు పరిష్కరించుకోవలసిన సమస్యలు.
పెద్ద కళాకారులైతే ఒక్కొక్కరికీ ‘ప్రసిద్ధమైన’ శైలి కూడా ఉంటుంది. అయితే ఒక్కొక్కప్పుడు ఒక కళాకారుడు రెండో వ్యక్తిని ‘హైజాక్’ చేసినట్టనిపిస్తుంది. అంజద్ అలీ ఖాన్ సరోద్ మీద వేగంగా ‘ఝాలా’ వాయించి హంగామా చేస్తున్నప్పుడు లాల్గుడిగారి వాయింపుకి సరైన న్యాయం జరగలేదని అనిపించింది.
ఈ రోజుల్లో శాస్త్రీయ సంగీతానికి ఆదరణ తగ్గిపోతోందన్న ఆదుర్దాతో కాస్త జనరంజకంగా ఉండడానికి ఈ యుగళ కచేరీలను ఏర్పాటు చెయ్యడమూ కద్దు. అంతగా ప్రసిద్ధులు కానివారిద్దరు కలిసి కాస్త ఆకర్షణ పెంచడానికి ప్రయత్నించడమూ చూస్తాం.
Indeed, Jugalbandi is a thrilling experience and when the artistes are good and equally competent can give immense pleasure.
In the jugalbandi of Balamurali with Kishori Amonkar, in raagam pooriya dhanashree, Balamurali did an ‘online’ translation of the khayal
“paayaliyaa jhankar mOre” as “andelu ghallanagA”, which sounded very clever, and matched Kishori Amonkar’s style
Shashank (flute, Carnatic) and Purbayan Chatterjee (Sitar) have formed an ensemble called “rasAyana” and are performing regularly all over the world. They played here in Adelaide together a few weeks ago which was quite good. They chose Yaman/kalyANi for their joint exploration which was quite enjoyable.
Thanks for a good article.
Sharada
.
Thanks to Eemaata & to Rohiniprasadgaru for giving the readers a rare thrill of enjoying a very rare jugalandi of Balamurali Krishna and M Ali Khan by describing his own experience.
Hindustani and Carnatic jugalbandis may provide an opportunity to everyone to familiarize themselves with the other side.
Those who can understand and enjoy the comparative aspects of both Carnatic and Hindustani music may be fewer.
One rarely finds Hindustani musicians and music lovers, who know something about Carnatic. Even among Carnatic music lovers, the enthusiasm to know the other style is not much, I feel.
ఒకసారి ప్రచురింప బడినవాటిని స్వీకరించకూడదన్న నియమాన్ని సడలించుకొని ఇటీవలి సంచికలలో మీరు తీసుకొని వచ్చిన కొన్నివ్యాసాల్ని చూసిన తరువాత, ‘ఈమాట’ లో కేవలము అటువంటి పునఃప్రచురణలకు ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తూ ఒక విభాగాన్ని ఏర్పాటుచేస్తే బాగుంటుందేమో అన్న విషయాన్ని పరిశీలించవలసిందని నా మనవి.
తోలుబొమ్మలాట – 03వ భాగం గురించి రానారె గారి అభిప్రాయం:
05/08/2007 11:22 am
పరధర్మో నిధనం శ్రేయః – స్వధర్మో భయావహః!!! ఇలా మార్చుకోవాల్సిందే. ఒళ్లు జలదరించేంతగా ఉన్న ఇంతటి పట్టైన కథనం నేనెప్పుడూ చదవలేదు. ఆ ప్రాంతాలు, పరిసరాలు, ఆ మనుషులు, మార్పులు దగ్గరగా చూసిన చివరి తరానికి చెందినవాడిని కావడంతో కాబోలు మాటకందని భయం కలిగిస్తున్నదీ రచన.
తోలుబొమ్మలాట – 01వ భాగం గురించి రానారె గారి అభిప్రాయం:
05/08/2007 10:35 am
ఆహా!! మహానుభావుడు. తోలుబొమ్మలాట ఆడటమే బతుకుదెరువుగా ఉన్న పాతకాలం మనిషికి ఆ కళపట్ల ఉన్న ఆరాధనను కళ్లకు కట్టినట్లు రాసినాడు. సన్నపురెడ్డీ దీర్ఘాయుష్మాన్ భవ. చిన్నవాణ్ణైనా ఇదీ నా ఆశీర్వాదం.
న త్వం శోచితుమర్హసి గురించి JUBV Prasad గారి అభిప్రాయం:
05/07/2007 3:29 pm
ఈ కధలో వాడిన భాషా, కధ చెప్పిన తీరూ, మాటలూ, విషయాలూ చాలా బాగున్నాయి. ఎటొచ్చీ, జంతువు బదులు ఏ పాలేరు లాంటీ మనిషినో తీసుకుంటే, ఇంకా అద్భుతంగా వుండేదనిపించింది. కడప జిల్లా మాండలీకం లోని పదాలకి అర్ధాలు ఇచ్చి వుండకపోతే, కధ అందరికీ ఇంత చక్కగా అర్థం అయి వుండేది కాదు. ఈ పద్ధతి బాగుంది. జంతువు ఘోష అనేసరికి, అంతా వూహే నన్నమాట అని అనిపించి, వుసూరుమనిపిస్తుంది. మనుషుల కష్టాలు అయితే ఇంకా హృదయాన్ని కదిలిస్తాయి. మొత్తానికి కధ బాగుంది.
ప్రసాద్
ఆరు చిత్తు రూపాలు గురించి విహారి గారి అభిప్రాయం:
05/07/2007 2:46 pm
“ఎవర్ని నేను, ఇక్కడ అమెరికన్ ని కాదు, పోనీ ఇండియాలో? నార్త్ లో మదరాసీని, తమిళ్ నాడు లో గొల్టీని, హైదరాబాద్ లో ఆంద్రోడ్ని, ఆంధ్రాలో రెడ్డిని, కమ్మోడ్ని, బాపనోడ్ని, మాలోడ్ని, మాదిగోడ్ని, ఎరుకలోడ్ని, ఏనాదోడ్ని. ఎవర్ని నేను, రంగు, కులాని కతీతంగా?”
నేను కు మీరిచ్చిన నిర్వచనం చాలా బాగుంది. ప్రతిదీ చాలా లోతుగా చెప్పబడింది.
విహారి
జుగల్‌బందీ కచేరీలు గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
05/07/2007 7:59 am
శ్రోతలకూ, పాఠకులకూ అంత ఆసక్తి ఉండకపోవచ్చుగాని జుగల్బందీల్లో ఎన్నో టెక్నికల్ కాంప్రొమైజులు ఉంటాయి. ఉదాహరణకు మొదటినుంచీ బాలమురళిగారిది ఒకటి శ్రుతి. జోషీగారు మొదట్లో 2 , 3 శ్రుతుల్లో పాడుతూ ఉండేవారు. అలాగే వీణ 3, 4 శ్రుతుల్లో ఉంటుంది. సితారుది 1, 2 మధ్యలో ఉంటుంది. నేను సరోద్ తో సితార్ వాయించినప్పుడు ఇబ్బంది కలగలేదు కాని హిందూస్తానీ వేణువుతో (అతనికి 3 శ్రుతి అలవాటు) తేడా వచ్చింది.
ఇక ‘కృతి’ విషయంలో కూడా స్వల్పమైన తేడాలుంటాయి. సితార్, వేణువు రెండూ హిందూస్తానీ వాయిద్యాలే అయినప్పటికీ ‘గత్’ ఎంపికలో వ్యత్యాసాలుంటాయి. అలాగే వేగంలోని ‘కంఫర్ట్ జోన్లో’ కూడా తేడా ఉంటుంది. ఇవన్నీ ముందుగా ప్రాక్టీసు చేసుకుంటునప్పుడు పరిష్కరించుకోవలసిన సమస్యలు.
పెద్ద కళాకారులైతే ఒక్కొక్కరికీ ‘ప్రసిద్ధమైన’ శైలి కూడా ఉంటుంది. అయితే ఒక్కొక్కప్పుడు ఒక కళాకారుడు రెండో వ్యక్తిని ‘హైజాక్’ చేసినట్టనిపిస్తుంది. అంజద్ అలీ ఖాన్ సరోద్ మీద వేగంగా ‘ఝాలా’ వాయించి హంగామా చేస్తున్నప్పుడు లాల్గుడిగారి వాయింపుకి సరైన న్యాయం జరగలేదని అనిపించింది.
ఈ రోజుల్లో శాస్త్రీయ సంగీతానికి ఆదరణ తగ్గిపోతోందన్న ఆదుర్దాతో కాస్త జనరంజకంగా ఉండడానికి ఈ యుగళ కచేరీలను ఏర్పాటు చెయ్యడమూ కద్దు. అంతగా ప్రసిద్ధులు కానివారిద్దరు కలిసి కాస్త ఆకర్షణ పెంచడానికి ప్రయత్నించడమూ చూస్తాం.
జుగల్‌బందీ కచేరీలు గురించి Sharada గారి అభిప్రాయం:
05/06/2007 7:05 pm
Indeed, Jugalbandi is a thrilling experience and when the artistes are good and equally competent can give immense pleasure.
In the jugalbandi of Balamurali with Kishori Amonkar, in raagam pooriya dhanashree, Balamurali did an ‘online’ translation of the khayal
“paayaliyaa jhankar mOre” as “andelu ghallanagA”, which sounded very clever, and matched Kishori Amonkar’s style
Shashank (flute, Carnatic) and Purbayan Chatterjee (Sitar) have formed an ensemble called “rasAyana” and are performing regularly all over the world. They played here in Adelaide together a few weeks ago which was quite good. They chose Yaman/kalyANi for their joint exploration which was quite enjoyable.
Thanks for a good article.
Sharada
.
జుగల్‌బందీ కచేరీలు గురించి Dwibhashyam Girija గారి అభిప్రాయం:
05/06/2007 10:02 am
Thanks to Eemaata & to Rohiniprasadgaru for giving the readers a rare thrill of enjoying a very rare jugalandi of Balamurali Krishna and M Ali Khan by describing his own experience.
Hindustani and Carnatic jugalbandis may provide an opportunity to everyone to familiarize themselves with the other side.
Those who can understand and enjoy the comparative aspects of both Carnatic and Hindustani music may be fewer.
One rarely finds Hindustani musicians and music lovers, who know something about Carnatic. Even among Carnatic music lovers, the enthusiasm to know the other style is not much, I feel.
శ్రీ శ్రీ కవిత్వంపై … మరో వ్యాసం గురించి Rao Pamganamamula గారి అభిప్రాయం:
05/06/2007 7:18 am
ఒకసారి ప్రచురింప బడినవాటిని స్వీకరించకూడదన్న నియమాన్ని సడలించుకొని ఇటీవలి సంచికలలో మీరు తీసుకొని వచ్చిన కొన్నివ్యాసాల్ని చూసిన తరువాత, ‘ఈమాట’ లో కేవలము అటువంటి పునఃప్రచురణలకు ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తూ ఒక విభాగాన్ని ఏర్పాటుచేస్తే బాగుంటుందేమో అన్న విషయాన్ని పరిశీలించవలసిందని నా మనవి.
కడపసీమలో అపురూపమైన కలివి కోడి గురించి naveen garla గారి అభిప్రాయం:
05/05/2007 3:34 am
నాది మదనపల్లె. మా నాయన చిన్నప్పుడు శేషమహల్ దగ్గర ఏరు కాడ చిరుతపులి కనిపించిండెంట….ఇది జరిగి సుమారుగా ఓ 50 సంవత్సరాలైతాంది.
మళ్ళీ మరోసారి మా తెలుగు మేష్టారి గురించి… గురించి వాడపల్లి,శేషతల్పశాయి గారి అభిప్రాయం:
05/04/2007 10:49 pm
మల్లావధానిగారు రచించిన ‘భారతాంబికా శతకము‘ను DLIలో చదువగలరు.
అల్లిపురముకాంపు జైలునందు వీరొనర్చిన అవధానమునందలి పద్యములు, అదేసందర్భమున మరికొందరి పద్యములు ఈ పుస్తకము చివరన ప్రచురింపబడినవి.
—
నమస్సులతో,
శాయి.