చక్కటి కధనం!ఒక్కోసారి (బహుశా చాలా సార్లు) సంఘపు కట్టుబాట్లు జీవన సౌందర్యాన్నే కాక మనుషుల లోని కారుణ్యాన్ని ,మానవత్వాన్ని ఎంత అమానుషం గా హత్య చేస్తాయో చెప్పకనే చెప్పిన కధ.
రానారె గారి ములకనాటీ మాండలికపు కధ చాల బాగుంది.పంచతంత్రము లో యెద్దు మాట్లాడినట్లు రాసినారు అనుకుంటున్న. యెద్దు బదులు పాలేరుతో కధ నడిపితే కొత్తదనం వుండదు.ఇది ఒక నూతన ప్రక్రియ.కొంత కాలం క్రితం RADIO 4 UK లో ఒక నాటిక విన్న.ఆ నాటిక లొ అంతా జట్ఖా గుర్రం మాట్లాడుతూ LONDON వీధుల గురించి విక్టోరియా కాలం నాటి సామాజిక పరీస్తితులు వర్ణిస్తూ రానారె కథ లొయెద్దు లా ఏకరువు పెడుతుంది తన భాధలన్ని. ఈ గుర్రము స్వగతము ఆంతా london eastend మాండలికములో సాగుతుంది.రానారె యెద్దు లా గుర్రం అంత్యదశ తో కథ అంతమవుతుంది.
కడప ప్రాంతం లో కనిపించే అతి అరుదైన పక్షి గురించి వ్యాసం ప్ర చురించిన మీకు కృతఙ్ఞతలు. వ్యాసకర్త శ్రీ కోనేటిరావు గారికి అభినందనలు. సుమారు 20 సంవత్సరాల క్రిందట నేను లంకమల్ల అడవులకు వెళ్ళినపుడు ఈ అరుదైన పక్షి ని చూసే అవకాశం దొరకలేదు. బట్టమేక లు కనపడ్డాయి కాని కలివికోడి కనబడలేదు.
జయదేవ్ మెట్టుపల్లి
చికాగో
ఈ రోజే మీ సైటు చూశాను. చాలా బగుంది. మీకు నా అభినందనలు.
ఇందులోని గ్రంధలయములో మరిన్ని పుస్తకాలు చోటుచేసుకుంటాయని ఆశిస్తున్నాను.
ఇందులో పంపిన రచనలు ప్రచురించేది లేనిది ముందుగా రచయితలకు మెయిల్ ద్వార తెలియజేస్తారా? ప్రచురణకు ఎంత సమయం పడుతుందో తెలుపగలరు.
వంశీధర్ కుడికాల
ప్రాచ్య, పాశ్చాత్య భావజాలాల మధ్య ఉన్న తీవ్రమైన అంతరాన్ని అల్పమైన మాటల్లో అనల్పార్ధమొచ్చేలా మీరు చెప్పిన విధానం బావుంది. ప్రపంచీకరణ, దాని దుష్ప్రభావాల గురించి పెద్ద చర్చ జరుగుతున్న ఈ సమయంలో ఈ రెండు సంస్కృతుల మధ్యనున్న తేడాని తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ప్రపంచమంతా పాశ్చాత్య వ్యామోహంలో కొట్టుకు పోతున్న ఈ సమయంలో ఈ వ్యాసంలో సూక్ష్మంగా చర్చించిన అంశాలను మరింత విస్తృత పరచాల్సి ఉందని భావిస్తున్నాను. ఆపనిని చక్రపాణి రావు గారు సమర్ధంగా నిర్వహించగలరని నమ్ముతున్నాను. వారికి ధన్యవాదాలు తెళుపుకుంటున్నాను.
అవధానం చూస్తూ అందరితో పాటు చప్పట్లు కొట్టడం తప్ప అందులోని లగువు బిగువుల్ని అర్ధం చేసుకోలేక పోతున్న నాలాంటి వారికి ఈ వ్యాసం చక్కని మార్గదర్శిగా ఉపయోగిస్తుంది. మీరు లక్షించిన మూడు ప్రయోజనాల్నీ మీ వ్యాసం నెరవేర్చగలదని నమ్ముతున్నాను. మంచి టాపిక్ మీద మంచి వ్యాసాన్ని అందించినందుకు రచయితకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
“మారిపోయిన కాలాన్ని గురించీ, కూలిపోతోన్న కులవృత్తుల గురించీ ఆవేదనగా” మాత్రమే చెప్పుకొస్తున్నారనుకొన్నాను. మనసుల్లోకి చూసి చెప్పినట్లుగా పాత్రలను నడిపించిన ఈ రచయితకు వాపోవడం మాత్రమే తెలుసునా అనుకొంటూ ఆసాంతం చదివిన నాకు సాలోచనగా ఇచ్చిన ముగింపుతో సమాధానం దొరికింది. గ్రామంలో పరిస్థితి అంతా చూసికూడా పోకమాను మోయించాలనే అమాయకత్వం (తెగువ!?) వారి కళా సంప్రదాయంలో భాగం అని కాస్త సర్దుకొంటే, ఈ ఘటనతో మంచి ముగింపుకు మార్గం ఏర్పడింది అనిపిస్తుంది. నాబోటివాడు అద్భుతమైన ఈ రచనను పొగడటమో విమర్శించడమో చేయడం తప్పేకావొచ్చునేమోగానీ, ఇదీ నా అభిప్రాయం.
అనాథ ప్రేత సంస్కారాత్… గురించి Vaidehi Sasidhar గారి అభిప్రాయం:
05/16/2007 4:28 am
చక్కటి కధనం!ఒక్కోసారి (బహుశా చాలా సార్లు) సంఘపు కట్టుబాట్లు జీవన సౌందర్యాన్నే కాక మనుషుల లోని కారుణ్యాన్ని ,మానవత్వాన్ని ఎంత అమానుషం గా హత్య చేస్తాయో చెప్పకనే చెప్పిన కధ.
రచయితలకు సూచనలు గురించి perugu.ramakrishna గారి అభిప్రాయం:
05/15/2007 6:43 am
ఈమాట.కామ్ చూసాను. చాలా బాగుంది. ఉత్తమ సాహిత్యం అందిస్తున్నందుకు
ధన్యవాదాలు.
పెరుగు రామకృష్ణ
న త్వం శోచితుమర్హసి గురించి kari venkataratnam babu గారి అభిప్రాయం:
05/15/2007 3:11 am
రానారె గారి ములకనాటీ మాండలికపు కధ చాల బాగుంది.పంచతంత్రము లో యెద్దు మాట్లాడినట్లు రాసినారు అనుకుంటున్న. యెద్దు బదులు పాలేరుతో కధ నడిపితే కొత్తదనం వుండదు.ఇది ఒక నూతన ప్రక్రియ.కొంత కాలం క్రితం RADIO 4 UK లో ఒక నాటిక విన్న.ఆ నాటిక లొ అంతా జట్ఖా గుర్రం మాట్లాడుతూ LONDON వీధుల గురించి విక్టోరియా కాలం నాటి సామాజిక పరీస్తితులు వర్ణిస్తూ రానారె కథ లొయెద్దు లా ఏకరువు పెడుతుంది తన భాధలన్ని. ఈ గుర్రము స్వగతము ఆంతా london eastend మాండలికములో సాగుతుంది.రానారె యెద్దు లా గుర్రం అంత్యదశ తో కథ అంతమవుతుంది.
కడపసీమలో అపురూపమైన కలివి కోడి గురించి Jaydev Mettupalli గారి అభిప్రాయం:
05/14/2007 12:56 pm
కడప ప్రాంతం లో కనిపించే అతి అరుదైన పక్షి గురించి వ్యాసం ప్ర చురించిన మీకు కృతఙ్ఞతలు. వ్యాసకర్త శ్రీ కోనేటిరావు గారికి అభినందనలు. సుమారు 20 సంవత్సరాల క్రిందట నేను లంకమల్ల అడవులకు వెళ్ళినపుడు ఈ అరుదైన పక్షి ని చూసే అవకాశం దొరకలేదు. బట్టమేక లు కనపడ్డాయి కాని కలివికోడి కనబడలేదు.
జయదేవ్ మెట్టుపల్లి
చికాగో
రచయితలకు సూచనలు గురించి Vamshidhar Kudikala గారి అభిప్రాయం:
05/14/2007 6:22 am
ఈ రోజే మీ సైటు చూశాను. చాలా బగుంది. మీకు నా అభినందనలు.
ఇందులోని గ్రంధలయములో మరిన్ని పుస్తకాలు చోటుచేసుకుంటాయని ఆశిస్తున్నాను.
ఇందులో పంపిన రచనలు ప్రచురించేది లేనిది ముందుగా రచయితలకు మెయిల్ ద్వార తెలియజేస్తారా? ప్రచురణకు ఎంత సమయం పడుతుందో తెలుపగలరు.
వంశీధర్ కుడికాల
లోపలికి గురించి Prasuna గారి అభిప్రాయం:
05/13/2007 10:41 pm
చాలా బాగున్నాయి. చిరు మంచు జల్లుల్లా.
మహాభారతం ఏం చెప్తుంది? ఒక కొత్త కోణం గురించి పిన్నమనేని మృత్యుంజయరావు గారి అభిప్రాయం:
05/11/2007 3:04 am
ప్రాచ్య, పాశ్చాత్య భావజాలాల మధ్య ఉన్న తీవ్రమైన అంతరాన్ని అల్పమైన మాటల్లో అనల్పార్ధమొచ్చేలా మీరు చెప్పిన విధానం బావుంది. ప్రపంచీకరణ, దాని దుష్ప్రభావాల గురించి పెద్ద చర్చ జరుగుతున్న ఈ సమయంలో ఈ రెండు సంస్కృతుల మధ్యనున్న తేడాని తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ప్రపంచమంతా పాశ్చాత్య వ్యామోహంలో కొట్టుకు పోతున్న ఈ సమయంలో ఈ వ్యాసంలో సూక్ష్మంగా చర్చించిన అంశాలను మరింత విస్తృత పరచాల్సి ఉందని భావిస్తున్నాను. ఆపనిని చక్రపాణి రావు గారు సమర్ధంగా నిర్వహించగలరని నమ్ముతున్నాను. వారికి ధన్యవాదాలు తెళుపుకుంటున్నాను.
ఆర్నెలల్లో అవధాని కావటం ఎలా? 3 (ఆఖరి భాగం) గురించి పిన్నమనేని మృత్యుంజయరావు గారి అభిప్రాయం:
05/11/2007 2:52 am
అవధానం చూస్తూ అందరితో పాటు చప్పట్లు కొట్టడం తప్ప అందులోని లగువు బిగువుల్ని అర్ధం చేసుకోలేక పోతున్న నాలాంటి వారికి ఈ వ్యాసం చక్కని మార్గదర్శిగా ఉపయోగిస్తుంది. మీరు లక్షించిన మూడు ప్రయోజనాల్నీ మీ వ్యాసం నెరవేర్చగలదని నమ్ముతున్నాను. మంచి టాపిక్ మీద మంచి వ్యాసాన్ని అందించినందుకు రచయితకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
న త్వం శోచితుమర్హసి గురించి మురళీకృష్ణ కూనపరెడ్డి గారి అభిప్రాయం:
05/10/2007 11:13 am
“నా బొంది ఆణ్ణేబెట్టుకోని వారంరోజులు ఏడిస్తే నాకేమొస్సాది! నా తోలుగూడా పనికిరాకండాబోతాది గదా!? ”
ఎంత నిజం!
మంచికథ రానారే!
తోలుబొమ్మలాట – 12వ భాగం గురించి రానారె గారి అభిప్రాయం:
05/08/2007 1:55 pm