Comment navigation


15543

« 1 ... 1485 1486 1487 1488 1489 ... 1555 »

  1. పునశ్చరణం గురించి Pavan garikapati గారి అభిప్రాయం:

    04/30/2007 8:36 am

    చాలా అనందంగా ఉంది, వాదన ప్రతి వాదనలు చూడడం ఈ కవిత మీద,
    మనం వ్యాసాలు రాయకుండా కవితలు రాయడమెందుకు? వ్యాసాలకు వచన కవితలకు ఎక్కడ తేడా? ఎంతో గొప్ప భావాన్ని ఎన్నో పదాలని ఉపయోగించి చెప్పినా అది కవిత్వమేనా? ఈ మధ్య చాలా మంది ‘కవులు?’ క్లుప్తత అంత పెద్ద విషయమే కాదని వాదిస్తున్నారు, దాని కోసం చేపల కధని ఉపమానంగా ఉపయోగించడం? హాస్యాస్పదం.
    ఏ కవి కైనా ఏదో ఒక భావావేశంతొ కవిత మొదలవుతుంది, అది అప్పుడే గని నుండి బయట పడ్డ వజ్రం లాంటిది. దానికి ఎంతో సాన పెడితే గాని అది చూపరులకు అనందాన్ని ఇవ్వలేదు.

    ఉదాహరణకు: పైన కవిత

    పునశ్చరణ ఎందుకు? మాతృత్వ ప్రేమతోనా? అయితే ఈ తొలి చూలాలు ఎందుకు? పాఠకుడు ఏ భావనకు లోనవ్వాలని?

    ఒక్క క్షణం కూడా వదలలేక — నిజంగా మాతృమూర్తికి ఆ భావన సహజమా?

    అప్పుడే పుట్టిన పసికందును
    ముద్దాడే మాతృమూర్తిలా

    ఈ రెండు పంక్తులు సరిపోవా? ఎక్కువ గా వివరిస్తే భావాలు బంధీ అయిపోవా? అప్పుడే పుట్టిన పసికందుని ముద్దాడే మతృమూర్తి ‘ఒక్క క్షణం కూడా వదలలేక’ అనే భావానికే పరిమితమా?

    అన్నీ ప్రశ్నలే వేసాను పరిశీలించండి.

    ఇలాగే ప్రతి వాక్యాన్ని ప్రతి పదాన్ని పరిశీలించి సరి చేస్తే కవిత తప్పకుండా బాగుంటుంది.
    పవన్

  2. నామాట గురించి Sridatta Kompella గారి అభిప్రాయం:

    04/26/2007 3:29 pm

    Hi All

    I think we need to start reforms at home. Teach your kids to talk and read in Telugu at home and teach them to use RTS to write. Telugu culture will follow. Putting the Telugu seed in your children will spread the message thru out the community.

    Thanks to my parents for talking in Telugu naturally at home, I realized that it is part of my heritage and I learned to answer in Telugu and became fluent. Me speaking Telugu helped me understand a lot about Telugu culture. Now, I can connect with my Andhra Roots while still being a first generation American teenager.

    regards
    Sridatta Kompella

  3. సీతా-రామా గురించి ఇస్మాయిల్ పెనుకొండ గారి అభిప్రాయం:

    04/23/2007 9:11 pm

    మొత్తానికి మిమ్మల్ని ఇక్కడ కలుసుకున్నాను. నాక్కూడా కథ ప్రారంభం కాస్త క్లిష్టంగా అనిపించింది. కానీ పోనుపోనూ ప్రసాద్ అన్నట్లు వారి అంతరంగాల్లోకి పరకాయప్రవేశం చెందేలా కథ నడిచింది. మీ మొదటి కథలోనే నాకు చలం గారి శైలి, కథా చిత్రణ కనిపించింది. కానీ కొత్తపాళీ గారు అభిప్రాయపడినట్టు కథలో వేగం కొన్ని చోట్ల మరీ ఎక్కువైంది. కానీ మొత్తానికి ఓ మంచి కథావస్తువు ఎన్నుకొన్నందుకు మీకు నా అభినందనలు.

  4. ఈమాట గురించి గురించి శివరాం గారి అభిప్రాయం:

    04/21/2007 4:58 pm

    మీరు చేస్తున ఈ ప్రయత్నాకి మా జోహరులు

  5. అంతరం గురించి బాపా రావు గారి అభిప్రాయం:

    04/21/2007 1:10 am

    కథకుడికి ఉద్యోగంలో ఎదురైన అవస్థకీ, వింధ్యకి తన వైవాహిక జీవితంలో ఎదురైన అవస్థకీ, చక్కగా సాపత్యం కుదిర్చారు రచయిత. కానీ, కథ చివర్లో మటుకు తెలుగు రచయితలకి సాధారణంగా తగులుకునే ‘అరటిపండు వొలిచేయడం’ అనే ఉచ్చునించి తప్పించుకోలేకపోయారు. శైలజకి దానంతట అది (కథనం మాజిక్ వల్ల) లైటు వెలిగి ఉండాలిసింది; తనతో పాటు పాఠకుడికి (ఆలోచన వల్ల) అదే లైటు వెలగాలి. కానీ జరిగిందేమిటంటే కథకుడు చివర్న రమేష్ గా మారిపోయి, పట్టరాని ఉబలాటాన్న ఆలోచనంతా తనే అందిపుచ్చుకుని చేసేస్తాడు. పోనీ ఇదొక ఐరనీగా రచయిత ఉద్దేశించారనుకుందామనుకున్నా అందుకు దాఖలాల్లేవు.

  6. పునశ్చరణం గురించి rajasankar kasinadhuni గారి అభిప్రాయం:

    04/20/2007 7:10 pm

    అయ్యా శివ గారు,
    రసభంగాలూ, కొంపలంటుకోవడాల దాకా మీ అలోచనలు వెళ్ళిడానికి నా అభిప్రాయాలలో ఏవుందో నాకు ఎంత వెతుకున్నా అర్థం కాలేదు. నాకు నచ్చిన కవితలు కనుక రెండింటికీ చెరి ఒక (చిన్న) సవరణ సూచించాను. అవి,
    1. విన్నకోట రవి శంకర్ గారు కవితని (భావం ఏ మాత్రం దెబ్బ తినకుండా) ఇంకొంత concise గా చెప్పి ఉండవచ్చని
    2. వైదేహి గారు పోలికలని కూడా ముచ్చటగా మూడేసి పంక్తులలో చెప్పినట్లైతే structural uniformity వల్ల కవిత మరింత రక్తి కట్టేదని

    వచనకవిత్వానికి ఏ నియమాలులేవు కనుక నా సూచనలు అంత సమంజసమైనవి కావని వచన కవిత్వం రాసే వాళ్ళూ, చదివేవాళ్ళూ అనుకోవచ్చు. కానీ వచన కవిత్వంలో కూడా సందర్భోచితంగా కొన్ని లక్షణాల విషయంలో శ్రధ్ధ చూపించడం అవసరం అని నా నమ్మకం. ఒక్క Economy of words మాత్రం అన్ని సందర్భాలలోనూ సముచితమైనది (We will have to agree to disagree here).

    చివరగా, ఎవరి రచనలు వారికి అపురూపం కనుక పై రెండు కవితలనీ (నా సూచనలు మీకు అర్థం అవడం కోసం) నాకు తోచినట్లుగా మార్పులు చేసి ఇక్కడ చూపెట్టడం అంత సబబు కాదు నా అభిప్రాయం.
    శలవు,
    కా.రా

  7. పునశ్చరణం గురించి P. Siva గారి అభిప్రాయం:

    04/20/2007 12:58 pm

    కా.రా. గారు,
    మీ కథ బావుంది.
    క్లుప్తత అన్నిచోట్లా పనికిరాదంటే ఎక్కడా పనికి రాదని కాదు. సందర్భాన్నిబట్టి అవసరం మారుతుంది.
    ఈ రెండు కవితల్లో ఏ మాటలు అనవసరంగా చేరి మీకు రసభంగం కలిగించాయో వివరిస్తారా? లేదా అదే భావస్ఫూర్తి కలిగిస్తూ ఏ మాటలు తొలగించవచ్చో తెలియజేయగలరా?
    జిజ్ఞాసతో,
    శివ

  8. పునశ్చరణం గురించి rajasankar kasinadhuni గారి అభిప్రాయం:

    04/19/2007 3:54 pm

    “పి.శివ” గారు,
    క్లుప్తంగా చెప్పినంత మాత్రాన ‘వివరం’ అందకుండా పోదు. మీరు శెలవిచ్చిన లెక్కన “Brief description” కూడా oxymoron. పాపం చాలా కస్టపడి కథ చెప్పారు. మీరు చెప్పిన కథకి counter గా బండి మీద పండ్లు అమ్ముకునేవాడి కథ ఉంది. “ద్రాక్ష పళ్ళు, బత్తాయి పళ్ళు…” అని అరుచుకుంటూ ఒక అమాయకుడు బండి తోసుకుంటూ వెడుతున్నాడు. మీరు అడ్డం పడి, ఊరికే పళ్ళ పేర్లు చెప్పి ఊరుకుంటే కొనేవాడికి నువ్వు అమ్ముతున్నట్టు ఎలా తెలుస్తుంది అని అడిగారు. ఆ అమాయకుడు “ద్రాక్ష పళ్ళు అమ్ముతాం, బత్తాయి పళ్ళు అమ్ముతాం….” అని అరవడం మొదలుపెట్టాడు. అప్పుడు మీరు, ఊరికే అమ్ముతాననేసి ఊరుకుంటే ఎప్పుడు అమ్ముతావో కొనేవాడికి ఎలా తెలుస్తుందని అడిగారు. ఇలా మీ బారిన పడ్డ అ అభాగ్యుడి కథ ఎక్కడి దాకా వెళ్ళిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ లెక్కన కథ పూర్తయ్యేసరికి మీరు ఎన్ని మాటలు add చేసి ఉంటారో చెప్పుకోండి చూద్దాం?
    మన వాదనకి అనుగుణంగా ఎన్ని కథలైనా అల్లుకోవచ్చు. పాఠకుడు ఇచ్చిన సూచన నచ్చడం నచ్చకపోవడాన్ని బట్టి రచయత దానిని అనుసరించాలా వద్దా అని నిర్ణయించుకోవడం జరుగుతుంది. ఎవడికి obsession లేదు? మీరన్నట్లు ఎవరి ఏడుపు వారిది.

    వినయంతో,
    కాశీనాథుని రాజాశంకర్

  9. పునశ్చరణం గురించి P. Siva గారి అభిప్రాయం:

    04/19/2007 6:40 am

    రాజశంకర్ గారు,
    ఇవి మెటఫర్లు కావు సిమిలీలు. అనగా ఉత్ప్రేక్షలు కావు, ఉపమానాలు. ఇక ‘క్లుప్తంగా వివరించడం’ అనేది oxymoron.
    ఈమధ్య క్లుప్తత మీద obsession పెరుగుతున్నట్లుంది. నాలుగు మాటలు ఎక్కువయినంత మాత్రాన కొంపలేవీ మునిగిపోవు భావం అద్భుతంగా ఉన్నప్పుడు, కవి చెప్పదలుచుకున్నది పాఠకుడి మనసుకి అందినప్పుడు. సందర్భాన్ని బట్టి కవితలు ఒక్కోసారి దీర్ఘంగానూ ఉంటాయి, పదాలూ, భావాలూ పునరావృతమవుతూ ఉంటాయి. అందరి నవ్వులూ, ఏడుపులూ ఒకలా ఉండవుగదా! అన్నింటికీ క్లుప్తత మంత్రం పనికి రాదు. అప్పుడు మనకు హైకూలు తప్ప ఏవీ మిగలవు. ‘ఇక్కడ తాజా చేపలు సరసమైన ధరలకు అమ్మబడును’ అన్న బోర్డు కథ వినలేదా? అవధరించండి.
    ఒకాయన కొత్తగా చేపలకొట్టు పెట్టుకున్నాడు పైన చెప్పిన బోర్డు రాయించుకుని. మీలాంటి పెద్దమనిషి వచ్చి “పిచ్చోడా, షాపు ఇక్కడ పెట్టుకుని చేపలు ఇంకెక్కడో అమ్ముతావా? ‘ఇక్కడ’ అక్కర్లేదు తీసేయ”మన్నాడు. ఆ అమాయకుడు అలాగే చేశాడు. ఇంకొకాయన వచ్చి “ఈ సముద్రపొడ్డున తాజా చేపలు కాకపోతే కుళ్ళినవి ఎవరయినా అమ్ముతారా? ‘తాజా’ తీసేయించు” అన్నాడు. ఆ అమాయకుడు అలాగే చేశాడు. మరొకాయన వచ్చి “కొట్టునిండా చేపలు పెట్టుకుని చేపలు కాక ఇంకేం అమ్ముతావు. ‘చేపలు’ తీసేయించు” అన్నాడు. ఆ అమాయకుడు అలాగే చేశాడు. మీరొచ్చి “చుట్టూ పోటీగా ఇన్ని కొట్లుంటే అందరూ సరసమైన ధరలకే అమ్ముతారు గనక ‘సరసమైన’ అనవసరం’ తీసేయించు” అన్నారు. ఆ అమాయకుడు అలాగే చేశాడు. వేరొకాయన వచ్చి “ధరకు కాకుండా ఊరికే ఎవరయినా ఇస్తారా? ఆ మాట తీసేయించు” అన్నాడు. ఆ అమాయకుడు అలాగే చేశాడు. వాళ్ళావిడ వచ్చి “కొట్టునిండా చేపలు పెట్టుకుంది అమ్మడానికి కాక కొనడానికా? అర్థం లేని మాట, తీసేయించు” అన్నదిట. ఆ అమాయకుడు అలాగే చేశాడు.
    ఇప్పుడు ఆ ఖాళీ బోర్డున్న షాపులో చేపలు ఎవరు కొంటున్నారో మీకే తెలియాలి.
    అన్నట్టు మళ్ళీ పైకి వెళ్ళకుండా బోర్డు మీదినుంచి మీరే మాట తీయించారో చెప్పుకోండి.

  10. అంతరం గురించి Dr. K. Sujatha గారి అభిప్రాయం:

    04/18/2007 11:05 pm

    Theme is very familiar context. Ofcurse unlike Vindya. Infact author would have given more emphsais about vindya and her feelings than focussing too much on Sailu. No need to use so much of English to convey the messages but it is also true that in real context people talk same way.
    Dr. Sujatha.K

« 1 ... 1485 1486 1487 1488 1489 ... 1555 »