కొన్నేళ్ల క్రితం చిన్నపిల్లకోసం రాస్ట్రవ్యాప్తంగా రెడియోలో ప్రసారమైన ఒక విజ్ఞాన ధారావాహిక కార్యక్రమంలో కలివికోడి, బట్టమేకల గురించి తెలుసుకున్నాను. మళ్లీ ఇక్కడ చూస్తున్నాను. నాకు అమిత సంతోషం కలిగించినవి – అరుదైన ఆ పక్షి ఛాయాచిత్రాలు. కోనేటిరావుగారికీ ఈమాట సంపాదకవర్గానికీ కృతజ్ఞతలు. రెండు దశాబ్దాల క్రితం మన గ్రామాల్లో మనుషులకంటే జంతు సంపద ఎక్కువగీ ఉండేదని చెబుతారు. ఈ విషయం నాకూ అనుభవంలోనిదే. ఇవాళ పరిస్థితి మనకు తెలుసు. భూగోళాన్నంతటినీ మనిషి ఆక్రమిస్తున్న ఈ పోకడలో తమ ఉనికిని కోల్పోతున్న జీవాలెన్నో! సర్వేజనాః మాత్రమేకాదు సర్వప్రాణికోటీ సుఖీభవ – అనే స్పృహను కలిగించడంలో ఇలాంటి వ్యాసాలు సాయపడగలవని ఆశిద్దాం.
చాలా చక్కని కథ!! బీభత్సంగా రాయగలిగిన ఇతివృత్తాన్ని ఎంతో సున్నితంగా రాశారు. అందుకనే కాబోలు హృదయానికి హత్తుకుంది. మీరు మరిన్ని మంచి కథలు యిలా అందంగా రాయాలని నా కోరిక.
రానారె…మొత్తానికి నేను చెప్పినది చేశావన్న మాట!!! సంతోషం. ఇంకో విషయం ఏమిటంటే చాన్నాళ్ళ ముందు నేనూ సరిగ్గా ఇటువంటి కథ వ్రాశాను. కాకుంటే అందులో దూడ కాకుండా వీధి కుక్క ఉంటుంది.. పోలిక కథలో మాత్రమే, కథనం లో కాదు. అద్భుతంగా వ్రాశావు. ఇలాగే వ్రాస్రూ మమ్మల్ని అలరిస్తూ ఉండు.
చక్కటి మాండలికంలో అద్భుతం గా ఒదిగిన భాష,ఆర్ద్రత నిండిన కధనం. ఒక జంతువు స్వగతంగా కధ నడపటం కొత్త ప్రక్రియే కాక పెంపుడు జంతువులకి తమ యజమానులతో ఉండే లేదా ఉండటానికి సాధ్యమయ్యే అనుబంధాన్ని eloquent గా ,ఉదాత్తంగా సూచించటం జరిగింది.గ్రామీణ వాతావరణాన్ని ,జీవన విధానాన్ని,జీవన్మరణాల మధ్యలో నిర్వికారం గా సాగిపోయే లోకవ్యవహారాన్ని కళ్ళకు కట్టినట్లు చిత్రీకరించారు.
మంచి కధ!!!
కడపసీమలో అపురూపమైన కలివి కోడి గురించి రానారె గారి అభిప్రాయం:
05/22/2007 7:41 am
కొన్నేళ్ల క్రితం చిన్నపిల్లకోసం రాస్ట్రవ్యాప్తంగా రెడియోలో ప్రసారమైన ఒక విజ్ఞాన ధారావాహిక కార్యక్రమంలో కలివికోడి, బట్టమేకల గురించి తెలుసుకున్నాను. మళ్లీ ఇక్కడ చూస్తున్నాను. నాకు అమిత సంతోషం కలిగించినవి – అరుదైన ఆ పక్షి ఛాయాచిత్రాలు. కోనేటిరావుగారికీ ఈమాట సంపాదకవర్గానికీ కృతజ్ఞతలు. రెండు దశాబ్దాల క్రితం మన గ్రామాల్లో మనుషులకంటే జంతు సంపద ఎక్కువగీ ఉండేదని చెబుతారు. ఈ విషయం నాకూ అనుభవంలోనిదే. ఇవాళ పరిస్థితి మనకు తెలుసు. భూగోళాన్నంతటినీ మనిషి ఆక్రమిస్తున్న ఈ పోకడలో తమ ఉనికిని కోల్పోతున్న జీవాలెన్నో! సర్వేజనాః మాత్రమేకాదు సర్వప్రాణికోటీ సుఖీభవ – అనే స్పృహను కలిగించడంలో ఇలాంటి వ్యాసాలు సాయపడగలవని ఆశిద్దాం.
పేకాట గురించి Sowmya గారి అభిప్రాయం:
05/21/2007 12:05 am
ఏమిటో…. సడెన్ గా అయిపోయినట్లు అనిపించింది. కథలో చెప్పదలుచుకున్న విషయం ఏమిటో నాకు అర్థం కాలేదు.
లోపలికి గురించి Lyla Yerneni గారి అభిప్రాయం:
05/20/2007 4:08 pm
ఒహో! కవిత్వంపై కవిత్వం. అన్నీ బాగున్నాయ్ .
బాగా రాసారు జయ గారు!
లోపలికి గురించి jayasimha గారి అభిప్రాయం:
05/18/2007 3:14 am
కల
అలసి ఉన్న నన్ను చూసి అమ్మ జోల పాడినట్లు
చందమామ చెంతకొచ్చి వెన్నెలంత ఇచ్చినట్లు
పూవులన్ని రేకులిప్పి నన్నుచూసి విచ్చినట్లు
మబ్బులోన నీటిచ్చుక్క బుగ్గమీద రాలినట్లు
పిల్లగాలి పక్కనుంచి పలకరించి పోయినట్లు
కొమ్మమీది కోయిలమ్మ గొంతుఎత్తి పాడినట్లు
సామన్యులు చెయ్యలేని సాహసాలు చేసినట్లు
తరాలన్ని తరలివచ్చి తలనిమిరీ వేసినట్లు
కైలాసం కరిగివచ్చి నాదేశం కడిగినట్లు
పరబ్రహ్మే పరుగునొచ్చి ఈరాతలు రాసినట్లు
జయ
న త్వం శోచితుమర్హసి గురించి Nalini గారి అభిప్రాయం:
05/17/2007 5:36 pm
చాలా చక్కని కథ!! బీభత్సంగా రాయగలిగిన ఇతివృత్తాన్ని ఎంతో సున్నితంగా రాశారు. అందుకనే కాబోలు హృదయానికి హత్తుకుంది. మీరు మరిన్ని మంచి కథలు యిలా అందంగా రాయాలని నా కోరిక.
తెలుగులో అంకెలు, సంఖ్యలు 11 నుంచి పైన గురించి Suryanarayana Murthy Akella గారి అభిప్రాయం:
05/17/2007 11:33 am
purNaayuvu concept can be taken from astrology, there the sum of all 9 planetary dasas is 120.
ravi -6
chandra-10
kuja -7
rahu- 18
guru- 16
sani-19
budha-17
ketu-7
sukra-20
న త్వం శోచితుమర్హసి గురించి నవీన్ గార్ల గారి అభిప్రాయం:
05/16/2007 11:57 pm
రానారె…మొత్తానికి నేను చెప్పినది చేశావన్న మాట!!! సంతోషం. ఇంకో విషయం ఏమిటంటే చాన్నాళ్ళ ముందు నేనూ సరిగ్గా ఇటువంటి కథ వ్రాశాను. కాకుంటే అందులో దూడ కాకుండా వీధి కుక్క ఉంటుంది.. పోలిక కథలో మాత్రమే, కథనం లో కాదు. అద్భుతంగా వ్రాశావు. ఇలాగే వ్రాస్రూ మమ్మల్ని అలరిస్తూ ఉండు.
అద్వైతం గురించి anitha గారి అభిప్రాయం:
05/16/2007 8:58 am
చాలా బావుందండీ!
న త్వం శోచితుమర్హసి గురించి Vaidehi Sasidhar గారి అభిప్రాయం:
05/16/2007 6:44 am
చక్కటి మాండలికంలో అద్భుతం గా ఒదిగిన భాష,ఆర్ద్రత నిండిన కధనం. ఒక జంతువు స్వగతంగా కధ నడపటం కొత్త ప్రక్రియే కాక పెంపుడు జంతువులకి తమ యజమానులతో ఉండే లేదా ఉండటానికి సాధ్యమయ్యే అనుబంధాన్ని eloquent గా ,ఉదాత్తంగా సూచించటం జరిగింది.గ్రామీణ వాతావరణాన్ని ,జీవన విధానాన్ని,జీవన్మరణాల మధ్యలో నిర్వికారం గా సాగిపోయే లోకవ్యవహారాన్ని కళ్ళకు కట్టినట్లు చిత్రీకరించారు.
మంచి కధ!!!
అమరు శతకం గురించి మూడుమాటలు గురించి Suryanarayana Murthy Akella గారి అభిప్రాయం:
05/16/2007 4:53 am
Dear Rao garu,
Monumental work, real pleased, wish I could do a little.
Suryanarayana Murthy Akella
Sharjah UAE