“ఇండియాలో తాతయ్య లాగే ఆమెకు జీవించడంలో హుందా చావులో కూడా వుంది.” ముగ్గురు ముసలమ్మలు, మూడురకాల కోరికలు మరణం గురించి. ఐతే వీటన్నిటి పోలికకి బేస్ లైన్ మాత్రం ఇండియాలో తాతయ్య ప్రశాంతవైన మరణవే. శివ, శివా అనుకుంటూ, చక్కగా ఉయ్యాల బల్ల మీద కళ్ళు మూసుకుని పడుకోని, తేలీకుండానే కన్ను మూసిన తాతయ్య మరణవే. వొక వేళ తాతయ్యకి అత్యవసరవైన వైధ్య సహాయం అందుబాటులో వుండుంటే, అది అందుంటే, బ్రతికి బట్టకట్టుంటే ఆయన ఏ రకవైన చావుని కోరేవారో అరుణగారికి బహుశా వూహకందని విషయం. అలా కాకుండా తాతయ్య గారికి ఏ స్ట్రోకో వచ్చి మాటా, చేతా పడిపోయి, బ్రతుకు పడకకే పరిమితం ఐపోయి, డైనింగ్ నుంచి డెఫికేషన్ దాకా పడకమీదే జరిగే పరిస్తితి వచ్చుంటే, ఇంత జరిగినా, మనసు మాత్రం మామూలుగా సృహలో వుండి, బ్రతకడానికి అప్పుడప్పుడు ఏ వెన్టిలేటర్ సహాయవో అవసరవైతే, డా. సునీత గారికి తాతయ్య మీద ఎలాటి అభిప్రాయం వుండేదో అరుణగారే చెప్పాలి. డా. సునీత మనసులో ఆకాశం ఎత్తున తాతయ్య మీదున్న గౌరవం ఏ పాతాళానికి పడిపోయేదో, లేకపోతే శ్రీమతి. జేమ్సు మీద, బ్రతుకుకోసం ఆవె పడే ఆరాటం మీద గౌరవం ఆకాశం ఎత్తున పెరిగేదో అరుణ గారే చెప్పాలి.
పరిస్థితి వున్నది వున్నట్టు వివరించడం అవసరం. కానీ తన సౌలభ్యంకోసరం చావు బ్రతుకుల నిజాన్ని, తనకనుకూలంగా కొంచం వంచి, భయం కలిగించేలా, భయంకరంగా వివరించడం, వైద్యవృత్తికే కాదు, మనిషి ప్రవృత్తికీ కూడా గౌరవం కలిగించదు. తనకి చేతకాకపోతే ఏ పేలియేటివ్ కేర్ స్పెషలిస్టు సహాయవో తీసుకోవాలి అంతేగానీ అత్యంత అనారోగ్యంగా వున్న అమ్మ (శ్రీమతి. జేమ్సు) గురించి, కుటుంబ సభ్యులతో కటువుగా మాట్లాడటం అనాగరికం, కౄరత్వం. ఐతే ఈ అనాగరిక ప్రవర్తన ఈ వొక్క సంఘటనకే పరిమితం కాదు. డా. సునీత మనసుని చూపించడానికి, ఆ మనసులో ఆలోచనల్ని, వాటిలో వున్న మురికిని చూపించడానికి డా. సునీత చేతనే ఇలా చెప్పించారు “టెక్నాలజీ, అదివాడడానికి మన చేతి డబ్బు పడనక్కరలేదన్న ధీమా లేకపోతే వీళ్ళకి ఈ టెమ్టెషన్ ఉండదేవో!” నిజవే మరి, అందుకే భారద్దేశంలో ఆ టెక్నాలజీ, ఆ సౌలభ్యం చాలా మందికి దక్కకుండా చేయడంలో డా. సునీతలు విజయం సాధించారు. గుండె జబ్బుల లాంటి ప్రాణాంతకవైన వ్యాధులే కాకుండా, అతి సారల్లాంటి అతి సాధారణ వ్యాధులు కూడా జనాన్ని ప్రశాంతంగా శివ, శివ మనిపించే గొప్ప ప్రజారోగ్య శాఖని సృష్టించారు.
ప్రపంచంలో రకరకాలైన విభేదాలున్నయ్. జాతి, రంగు, ప్రాంతం, కులం, ధనం, వీటన్నికితోడు, అరుణ గారు మరో క్రొత్త విభేదాన్ని ప్రచారంలోకి తెస్తున్నరు. అది చావు. మనం ఏరకంగా మరణించావో అనేది మనం ఏరకంగా బ్రతికేవో అనేదాన్ని నిర్వచిస్తుంది అనమాట. డి ఎన్ ఆర్ (DNR – Do Not Resuscitate) అనేది, పరిస్థితులకి, మన ఇష్టాఇష్టాలకీ సంభందం లేనటువంటి, యూనివర్సల్ గుడ్ అనమాట. అరుణ గారి ద్రుష్టిలో అదొక గొప్ప, వీరోచితవైన విషయం, ఎవరికో కోరుకున్న వాళ్ళకి కాదు, అందరికీ.
1934 ప్రాంతాల్లో శ్రీశ్రీ రాసిన కవిత్వం చర్చించబడినంతగా, కోట్ చెయ్యబడినంతగా ఆధునిక తెలుగు కవిత్వంలో ఇంకెవరిదీ కనబడదు. అది రాసేనాటికి ఆయన వయస్సు 24 ఏళ్ళే అనేది మనం గుర్తుంచుకోవాలి.
శ్రీశ్రీ గారి కవిత్వం పై విపులమైన,ఆసక్తికరమైన వ్యాసం.
“జడలు విచ్చిన సుడులు రెచ్చిన
కడలి నృత్యం శమిస్తుందా
నడుము తడబడి సడలి మునుగక
పడవ తీరం క్రమిస్తుందా”
నాకు నచ్చిన కొన్ని శ్రీశ్రీ కవితలలో “నిజంగానే” ఒకటి.
రచయిత వ్యాసంలో చెప్పినట్లు ఈ పంక్తులు భవిష్యత్తుని శంకించినట్లు అనిపించే అవకాశంఉన్నా,నా వ్యక్తిగత అభిప్రాయంలో ఈ కవిత లో నిరాశావాదం కన్నా మానవాళి శ్రేయస్సు కోరే ఒక కవి artistic as well as idealogic impatience for the welfare of mankind కనిపిస్తుంది.
మృతజీవులు – 1 గురించి పొద్దు » Blog Archive » కొ. కు. గారి అనువాద నవల “మృతజీవులు” గారి అభిప్రాయం:
06/20/2007 2:25 am
[…] ఆ అనువాదం ఈమాట లో నాలుగు భాగాలు వచ్చి ఆగిపోయింది. ఇప్పుడు ఆ అనువాదాన్ని 25/6/2007 నుంచి పొద్దులో ధారావాహికగా అందించనున్నామని తెలపడానికి సంతోషిస్తున్నాం. ఈ అనువాదాన్ని పొద్దులో కొనసాగిస్తామని కోరిన వెంటనే అంగీకరించి అనువాద ప్రతిని అందజేసిన రోహిణీప్రసాద్ గారికి, పొద్దులో కొనసాగించడానికి అంగీకరించిన ఈమాట సంపాదకులు కొలిచాల సురేశ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. […]
నాకు తెలుగు పద్యాల గురించి అస్సలు తెలియదనాలి, ఈ మధ్యే నేర్చుకుంటున్నా.
మీ వ్యాసం మళ్ళీ మళ్ళీ చదివి ఎంతోకొంత నేర్చుకుంటాను. ఇలాంటి నేర్పే వ్యాసాలందించినందుకు ధన్యుడను.
రాకేశ్
అన్నట్టు, నేను లిపిలో రాస్తాను (inscript), మీ RTS enforcement వల్ల రాయలేకపోతున్నా.
అగ్ని స్నానం గురించి Sai Brahmanandam Gorti గారి అభిప్రాయం:
06/12/2007 9:45 am
Raghothama Rao C గారి అభిప్రాయమంతో నేనూ ఏకీభవిస్తున్నాను. మీరు చెప్పినట్లుగా ఉపమానాలు తగ్గించి భావక్లుప్తంగా రాసిఉండవలసింది. మరోసారి మీ సూచన గుర్తుంచుకొని రాయడానికి ప్రయత్నిస్తాను.
ముగ్గురు ముసలమ్మలు గురించి Ravikiran Timmireddy గారి అభిప్రాయం:
06/21/2007 7:28 am

రవికిరణ్ తిమ్మిరెడ్డి
శ్రీ శ్రీ కవిత్వంపై … మరో వ్యాసం గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
06/20/2007 3:35 pm
1934 ప్రాంతాల్లో శ్రీశ్రీ రాసిన కవిత్వం చర్చించబడినంతగా, కోట్ చెయ్యబడినంతగా ఆధునిక తెలుగు కవిత్వంలో ఇంకెవరిదీ కనబడదు. అది రాసేనాటికి ఆయన వయస్సు 24 ఏళ్ళే అనేది మనం గుర్తుంచుకోవాలి.
శ్రీ శ్రీ కవిత్వంపై … మరో వ్యాసం గురించి Vaidehi Sasidhar గారి అభిప్రాయం:
06/20/2007 11:23 am
శ్రీశ్రీ గారి కవిత్వం పై విపులమైన,ఆసక్తికరమైన వ్యాసం.
“జడలు విచ్చిన సుడులు రెచ్చిన
కడలి నృత్యం శమిస్తుందా
నడుము తడబడి సడలి మునుగక
పడవ తీరం క్రమిస్తుందా”
నాకు నచ్చిన కొన్ని శ్రీశ్రీ కవితలలో “నిజంగానే” ఒకటి.
రచయిత వ్యాసంలో చెప్పినట్లు ఈ పంక్తులు భవిష్యత్తుని శంకించినట్లు అనిపించే అవకాశంఉన్నా,నా వ్యక్తిగత అభిప్రాయంలో ఈ కవిత లో నిరాశావాదం కన్నా మానవాళి శ్రేయస్సు కోరే ఒక కవి artistic as well as idealogic impatience for the welfare of mankind కనిపిస్తుంది.
మృతజీవులు – 1 గురించి పొద్దు » Blog Archive » కొ. కు. గారి అనువాద నవల “మృతజీవులు” గారి అభిప్రాయం:
06/20/2007 2:25 am
[…] ఆ అనువాదం ఈమాట లో నాలుగు భాగాలు వచ్చి ఆగిపోయింది. ఇప్పుడు ఆ అనువాదాన్ని 25/6/2007 నుంచి పొద్దులో ధారావాహికగా అందించనున్నామని తెలపడానికి సంతోషిస్తున్నాం. ఈ అనువాదాన్ని పొద్దులో కొనసాగిస్తామని కోరిన వెంటనే అంగీకరించి అనువాద ప్రతిని అందజేసిన రోహిణీప్రసాద్ గారికి, పొద్దులో కొనసాగించడానికి అంగీకరించిన ఈమాట సంపాదకులు కొలిచాల సురేశ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. […]
మన ఛాందసులు గురించి chavakiran గారి అభిప్రాయం:
06/16/2007 1:54 pm
మీరు ఆపరేటింగు సిస్టములోని లిపి వాడుతుంతే ఇంగ్లీషు పైన ఎన్నుకోని ప్రయత్నించండి!
లేదా నోటుపేడులో వ్రాసి ఇక్కడ పేస్టు చేయండి!
జిగిరీ – 6వ భాగం గురించి Kishore గారి అభిప్రాయం:
06/14/2007 12:03 am
awesome
మన ఛాందసులు గురించి రాకేశ్ గారి అభిప్రాయం:
06/12/2007 8:24 pm
నాకు తెలుగు పద్యాల గురించి అస్సలు తెలియదనాలి, ఈ మధ్యే నేర్చుకుంటున్నా.
మీ వ్యాసం మళ్ళీ మళ్ళీ చదివి ఎంతోకొంత నేర్చుకుంటాను. ఇలాంటి నేర్పే వ్యాసాలందించినందుకు ధన్యుడను.
రాకేశ్
అన్నట్టు, నేను లిపిలో రాస్తాను (inscript), మీ RTS enforcement వల్ల రాయలేకపోతున్నా.
అగ్ని స్నానం గురించి Sai Brahmanandam Gorti గారి అభిప్రాయం:
06/12/2007 9:45 am
Raghothama Rao C గారి అభిప్రాయమంతో నేనూ ఏకీభవిస్తున్నాను. మీరు చెప్పినట్లుగా ఉపమానాలు తగ్గించి భావక్లుప్తంగా రాసిఉండవలసింది. మరోసారి మీ సూచన గుర్తుంచుకొని రాయడానికి ప్రయత్నిస్తాను.
– సాయి బ్రహ్మానందం గొర్తి
అద్వైతం గురించి Raghothama Rao C గారి అభిప్రాయం:
06/06/2007 11:23 pm
ముగింపులోని భావం కోసమే మిగతా కవిత వ్రాసినట్టు అనిపిస్తోంది.
అగ్ని స్నానం గురించి Raghothama Rao C గారి అభిప్రాయం:
06/06/2007 11:21 pm
చక్కగా మొదలైన కవిత్వం మధ్యలో పేలవంగా మారింది. ఉపమానాల సాగతీత ఒక కారణం్ కావచ్చునేమో!!