Comment navigation


15547

« 1 ... 1476 1477 1478 1479 1480 ... 1555 »

  1. న త్వం శోచితుమర్హసి గురించి రానారె గారి అభిప్రాయం:

    07/03/2007 10:57 am

    వ్యాఖ్యలు రాసి అభిప్రాయాలు తెలిపిన అందరికీ కృతజ్ఞతలు చెప్పడం సంప్రదాయం. అయితే, ఈ కృతజ్ఞతలు ఒక వారం ముందు చెప్పి ఉండాల్సింది. కొత్త సంచిక వచ్చి, ప్రస్తుతం నా మాటలను అసందర్భం అనిపింపజేస్తుండవచ్చు, క్షమించాలి. ఈ కథకు మూలం ఇక్కడ మొదటి వ్యాఖ్య రాసిన వ్యక్తి. ఆరోజు ఆ గిత్తను కట్టేసింది ఆయనే. విహారి, నేనుసైతం, మురళీకృష్ణ, నవీన్‌గార్లకు ధన్యవాదాలు. ప్రసాదుగారు, మీరన్నది నిజమే కావచ్చు. కానీ పెద్దగా కదిలించి కన్నీళ్లు పెట్టించడం మాత్రమే కాదు ఈ కథ ప్రధాన ఉద్దేశం. వైదేహిగారి అభిప్రాయం ఈ కథ ఉద్దేశానికి అద్దంపట్టింది: “జీవన విధానాన్ని,జీవన్మరణాల మధ్యలో నిర్వికారం గా సాగిపోయే లోకవ్యవహారాన్ని చిత్రీకరించడం”. వేంకటరత్నంబాబుగారు, కథ మీకు నచ్చినందుకు చాలా సంతోషం. “ములకనాటీ మాండలికం” అంటే ఏమిటో నాకు తెలీదు. మీకు తెలిస్తే దయచేసి చెప్పండి.

  2. ఈమాట కొత్త వేషం గురించి Vanguri Chitten Raju గారి అభిప్రాయం:

    07/03/2007 9:27 am

    ఈ యూనికోడులూ, మంచం కోడులూ నాకు బొత్తిగా తెలియవు కానీ, “ఈమాట” కొత్త వేషం బహు ముచ్చటగా ఉంది. ఇప్పుడు అన్నీ చదవడం సులభంగా ఉంది. అఫ్కోర్సు, చదివినవన్నీ అర్థం అయ్యాయి అని అబధ్ధం చెప్పను కాక చెప్పను.
    సంపాదకులకీ, నిర్వాహకులకీ ధన్యవాదాలు, అభినందనలు.
    భవదీయుడు
    వంగూరి చిట్టెన్ రాజు వ్రాలు

  3. రెండు కవితలు గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    07/03/2007 8:10 am

    మొదటి కవిత ముద్దుగా ఉంది. రెండవది పెద్దగా ఉంది:-)

  4. నామాట: తెలుగు అంతర్జాతీయ భాషగా…! (నిజంగానా?) గురించి Ambanath గారి అభిప్రాయం:

    07/03/2007 5:47 am

     నవ్వులు నవ్వే ముందు మీరు ఈ విషయాలు అర్థం చేసుకోండి.

    1. హిందీ మన జాతీయ భాష కాదు. మనం తెలుగుజాతి. మన జాతీయభాష తెలుగు మాత్రమే. ఒకడి మాతృభాష ఇంకొకడికి జాతీయ భాష కాజాలదు. హిందీ మన నెత్తిన రుద్దబడిన పరాయి భాష.

    2. భాషలకి లేబుల్స్ (ప్రాంతీయభాష, జాతీయభాష, అంతర్జాతీయభాష, అధికారభాష, మైనారిటీ భాష వగైరా) వెయ్యడం వాటి యాదృచ్ఛిక ఎదుగుదలని అడ్డుకోవడం కాదా ? మానవజాతిని అగ్రకులాలు నిమ్నకులాలు అని విభజించి కొందరిని తొక్కించడం, కొందరిని ఎక్కించడం- దీనికి ఈ లేబుల్స్ కీ తేడా ఏమిటి ?

    3. ప్రాథమికంగా ఇంగ్లీషుతో సహా (ఏదో ఒక అర్థంలో) ప్రతి భాషా ప్రాంతీయ భాషే అయినప్పుడు-తెలుగు అంతర్జాతీయ భాష అయితే/అంటే తప్పేమిటి ?

    4. అంతర్జాతీయ భాష హోదా లాంటివి ఎవడి పడగ్గదిలో వాడు పడుకుంటే వచ్చేవి కావు. దానికి ప్రయత్నం కావాలి. కృషి కావాలి. ఏ ప్రయత్నమూ లేకుండా సింగపూర్‌లో తమిళానికి అధికార హోదా సిద్ధించలేదు. కాస్త ఆలస్యంగా నైనా తెలుగువాళ్ళు ఆ ప్రయత్నం చేస్తే మీకేంటి బాధ ?

    5. తెలుగుకు ప్రస్తుతం ఆంధ్రదేశంలో పట్టిన దుర్గతి అది అంతర్జాతీయ భాష కావడానికి అవరోధం కాదు. బ్రాంచీలు లేని వ్యాపారాలు ఈ రోజుల్లో శోభించవు. అలాగే బ్రాంచీలు లేని భాషలు కూడా వృద్ధి చెందవు. అందుకని మన ఆంధ్రదేశం కాక మరో రెండు మూడు దేశాల్లో మన భాషకి అధికార హోదా సంపాదించి పెట్టడానికి మనం కృషిచెయ్యాలి. ఇదో చారిత్రిక అవసరం.

    ఈ డిమాండు రాకముందే నా మనసులో ఈ అభిప్రాయం గత కొన్ని దశాబ్దాలుగా ఉంది.

  5. ఈమాట కొత్త వేషం గురించి jabalimuni గారి అభిప్రాయం:

    07/02/2007 11:11 pm

    అన్ని సంచికలు PDF files గా download చేసుకోగలిగేటట్లు అవకాశము కల్పించండి
    మీ కృషి శ్లాఘనీయము.
    జాబాలిముని

  6. అతిథి వ్యయో భవ గురించి chavakiran గారి అభిప్రాయం:

    07/02/2007 10:13 pm

    బాగుంది

    అయితే మేము ఈ సారి అమెరికా వచ్చినప్పుడు ఎవరి ఆతిధ్యమూ ఆశించకూడదన్న మాట

    మా హొటేల్లేవే మేమే చూసుకోవాలి 🙂

  7. అతిథి వ్యయో భవ గురించి imkO baadhituDu గారి అభిప్రాయం:

    07/02/2007 10:10 pm

    “….ఓ పెంపుడు కుక్కలా చేతికి గొలుసు కట్టి మరీ తిప్పుకున్నాడు.” అంటే తిప్పుకోవడం వరకే పోలిక కానీ వ్యక్తుల పోలిక కాదని నాకు అనిపించింది. చూడగా సుబ్బారావు గారికి బ్రహ్మానందం గారి మీద్ వ్యక్తి గతంగా కోపం లా అనిపిస్తోంది. ఈ కథలో రావి గారు చెప్పినట్లు గా ఏమీ ఎబ్బట్టు గా అనిపించ లేదు.
    ఇలాంటి సంఘటనలు అనేకం చూస్తున్నాము. ఈ మధ్యనే ఒకా పెద్దాయన ఆతిధ్యం ఇచ్చిన ఆవిడ చెయ్యి పట్టుకోవడం అందరికీ తెలిసిందే !

  8. నాకు నచ్చిన పద్యం: తిక్కన భారతంలో ద్రౌపది కోపవర్ణన గురించి kalidas గారి అభిప్రాయం:

    07/02/2007 7:21 pm


    మీరు సీస పద్యాన్ని 8 పాదాలుగ విడదీసి వ్రాస్తే బాగుండేది.

  9. అతిథి వ్యయో భవ గురించి atidhi bAdhituDu గారి అభిప్రాయం:

    07/02/2007 5:54 pm

    కొన్ని సినిమాల ఎడ్వర్టైజ్ మెంట్లలో వాడినట్టూగా … నిజమైన సంఘటనల ఆధారంగా అని రచయిత ఒక disclaimer పెట్టవలసింది. కథలోని అనుభవాలు చాలా మందికి ఎదురయ్యేవే. నేనూ ఇలాంటివి ప్రత్యక్షంగా చూసాను, స్వయంగా అనుభవించాను కాబట్టి Venky బాధని అర్ధమ్ చేసుకోగలను.
    ఇలాంటి కాలక్షేపమ్ కథల్ని చదివి ఆనందించాలి. Unless it is a sensistive or serious subject, it is a waste of time when we engage ourselves in రంధ్రాన్వేషణమ.

  10. అతిథి వ్యయో భవ గురించి రావి సుబ్బారావు గారి అభిప్రాయం:

    07/02/2007 1:55 pm

    శ్రీనుగారూ, నా అభిప్రాయంలో కొంత వ్యంగ్యం వుంది. అందుకే ఈ కధలో మీకా “ధ్వని” వినబడలేదు.
    గొర్తిగారూ, మీ సుదీర్ఘ వివరణకి కృతజ్నతలు. మీ కధ మళ్ళీ చదవమన్నారని చదివాము.
    “క్రితం సారి స్రవంతి అభిమాన మాటల రచయిత వచ్చి సుందరం మామయ్య ఇంట్లో వున్నపుడు ఆయన్ని అందరూ కలిసి ఎక్కడ సినిమాల్లో పలుకుబడీ ప్రాపకం పొందేస్తారా అన్నట్టు ఓ పెంపుడు కుక్కలా చేతికి గొలుసు కట్టి మరీ తిప్పుకున్నాడు. మా ఇంటికిభోజనానికిపిలిస్తే ఆ మహా రచయితగారు తెగబిజీ అంటూ, క్షణం కూడా ఖాళీ లేదు, అమెరికా వచ్చి కూడా సినిమాలకి పని చేస్తున్నారు – రోజూ తెగ కాల్స్ వస్తాయి – అందుకే మధ్యాహ్నం పన్నెండు తరువాతే లేటుగా లేస్తారు అంటూ సుదీర్ఘ ఉపన్యాసం దంచుకున్నాడూ నాకూ మా ఆవిడకీ!”
    ఇంక రచయితగారి మంచీ చెడ్డలు వెంకీ మాటల్లో చూడండి. “….ఓ పెంపుడు కుక్కలా చేతికి గొలుసు కట్టి మరీ తిప్పుకున్నాడు.” వెంకీ తన అభిమాన రచయితని “కుక్క”తో పోలుస్తున్నాడా? సుందరం ఎం చెత్త మనిషైనప్పటికీ, గొలుసు కట్టి తిప్పితే, కుక్కలా ఆ సినీ రచయిత తిప్పించుకున్నారు కదా, వెంకీ మాటల ప్రకారం? అప్పుడు ఆ సినీ రచయిత చెడ్డదనం వెంకీ మాటల్లో తెలియడం లేదా? భోజనానికి రాలేదని సినీ రచయితని కుక్కతో పోల్చిన వెంకీ హిపోక్రసీ అద్భుతంగా కనబడ్డం లేదా? “ఆ మహా రచయితగారు” అన్న వెంకీ వెక్కిరింపులో కూడా అభిమానం కనబడుతోందా?
    నాలాంటి పాఠకులకి వెంకీలో పైన చెప్పినట్టుగా హిపోక్రసీ మాత్రమే కనబడుతోంది. అభిమానంతో మాత్రమే వెంకీ తనకి నచ్చని వాళ్ళింట్లో వున్న సినీ రచయితని, తను పరిచయం లేని సినీ రచయితని, ఒకరు కడ్తే గొలుసు కట్టించుకుని కుక్కలా తిరిగే సినీ రచయితని అభిమానంతో పిలిచాడంటే ఏ మాత్రమూ నమ్మశక్యంగాని విషయం.
    మీరన్నట్టు వెంకీ కీర్తి కండూతి అన్న విషయం కధలో డైరెక్టుగా చెప్పలేదు. అయినా వెంకీ ప్రవర్తనా, మాటలూ చూస్తే ఆ నిర్ణయానికి రాక తప్పదు.
    బంధుత్వం దూరమా, దగ్గరా అన్నది వరసతో సంబంధం లేని విషయం. ఒక వరస చెప్పినప్పుడు అది రైటా, కాదా అనేది వేరే విషయం. తప్పు వరస కాబట్టి అది అర్హ్తం పర్థం లేని వరస అని అన్నాను. కధలో ప్రతీ చిన్న తప్పూ, కధకి నష్టం కలిగించేదాని లాగానే వుండదు.
    రచయితగా మీరు చెప్పారు కాబట్టి వెంకీ తన బాకీ రాబట్టుకోవడానికే ప్రయత్నించాడని ఒప్పుకుందాం. దాని వల్ల వెంకీ వుత్త తెలివి తక్కువ మనిషని అర్థం అవుతోంది.

    అంత చెత్తగా ప్రవర్తించిన కమేడియన్లు వెంకీకి డబ్బు తిరిగి ఇవ్వరనేది అందరికీ అర్థమయ్యే విషయం. అంత తెలివి తక్కువ వెంకీ చెప్పే విషయాలు చాలా తప్పులు గానే వుంటాయి మరి. తెలివి తక్కువ పాత్రలు వుత్తమ పురుషలో కధ చెబితే, చాలా విషయాలు దాచేసి, హిపోక్రసీగా చెబుతారు. చదివే పాఠకులే అందులో వైరుధ్యాలు కనిపెట్టి అర్థం చేసుకోవాలి. ఇంట్లో పరమ చెత్తన్నర చెత్తగా ప్రవర్తించే వాళ్ళకి అన్ని సేవలు చెయ్యడంలోనే వెంకీ మనస్తత్వం అర్హ్తం అవుతోంది. చిన్న చిన్న తప్పులు కావు అవి. ఆడ కమేడియన్, మొగ కమేడియన్్ ఒకే గదిలో పడుకోవడం, గరాజులో తాగి చెత్త చెయ్యడం, గదిలో (పిల్లలున్న ఇంట్లో) సిగరెట్లు కాల్చి పారెయ్యడం – ఇవన్నీ మామూలు మనుషులు భరించతగ్గ విషయాలా?   ఇన్ని చెత్త విషయాలు భరించాడంటే వెంకీ తెలివి తక్కువ వాడూ, ముందర దృష్టి లేని వాడూ కాదు. చావు బాకీ వంకతో వాళ్ళని కలవాలనుకోవడంలో వున్న అసలు వుద్దేశ్యం వేరేగా వుంటుంది.
    పోనీలెండి, అంతో ఇంతో హిపోక్రసీ “సామాన్యుడైన” వెంకీకి వుందని ఒప్పుకున్నారు. ఆ హిపోక్రసీ సినమా వాళ్ళకంటే ఎక్కువుంటే ఏమిటీ, తక్కువుంటే ఏమిటీ? దొందూ దొందే! అమెరికాలో జరిగే కధలో హిపోక్రసీ వుండి తీరాలన్నమాట! మంచి మాటే! సినిమా వాళ్ళలో ఇంత హిపోక్రసీ వుంటే, సామాన్యుడైన మన వెంకీ అలా ఎలా అభిమానించగలిగాడో (రచయితని)! బహుశా అభిమానించడం మొదలు పెట్టేటప్పుడు తెలిసి వుండదు వెంకీకి. చావు బాకీ వసూలు చేసుకుందామనుకునే అమాయకుడు కదా?

    (This message has been edited – Editors)

« 1 ... 1476 1477 1478 1479 1480 ... 1555 »