Comment navigation


15547

« 1 ... 1471 1472 1473 1474 1475 ... 1555 »

  1. నామాట: తెలుగు అంతర్జాతీయ భాషగా…! (నిజంగానా?) గురించి Sai Brahmaanandam Gorti గారి అభిప్రాయం:

    07/16/2007 8:40 am

    ట్రాయ్ మిచిగన్ లో అందరూ ( తెలుగు వాళ్ళే సుమా ! ) తెలుగు మాట్లాడడం సంతోషకరమైన విషయమే! కానీ – ఒక్కసారి ఆంధ్రా వెళ్ళి చూస్తే పరిస్థితి భిన్నం గా ఉంది. నేటి తరం విద్యార్థులకు తెలుగు చదవడం రాయడం అనేది పోతోంది అనేదే అందరి బాధా ! ఈ తరం వాళ్ళ సంగతి సరే ! ముందు తరాల సంగతి ఏమిటి? తెలుగు కేవలం కొద్ది మందికే పరిమితమైపోతోందన్న బాధ ఈ వ్యాసం. ఎనిమిది కోట్ల ఆంధ్రుల భాష విద్యా విధానంలో తొలగించి నినానాదాల కీ , వేదికలకే భాష గొప్పతనం మిగులుతోందన్న బాధే ఈ వ్యాస ఉద్దేశ్యం లా నాకనిపించింది.

    – సాయి బ్రహ్మానందం గొర్తి

  2. ఆ రోజులు గురించి Raghothama Rao C గారి అభిప్రాయం:

    07/16/2007 5:48 am

    సి.ఎస్ . రావుగారూ,

    వ్యక్తి పేర్లు, ఊరి పేర్లలోనూ ఉన్న సంస్కృతానికి, కవిత్వంలోని సంస్కృతానికి ఉన్నది బాదరాయణ సంబంధం మాత్రమేనని నా అభిప్రాయం.

    తీసివేయలేని విధంగా వాడిన సంస్కృత పదాల గురించి నేను చెప్పలేదండీ.

    నున్నని ఆకుల కపోలాలు కంటే నున్నని ఆకుల చెక్కిళ్ళు అని అనకూడదా?

    ప్రాత:కాలపు పిల్లతెమ్మర కంటే తొలిపొద్దు పిల్లతెమ్మర అంటే ఎలా ఉంటుంది?

    అచ్చతెలుగు పదాలు వాడితే కవిత్వంలో లోటు రాదు కదా !

    ఈ కవితలో కొత్తదనమంటూ ఉంటే అది ఒకే ఒక్క వాక్యంలోనే ఉంది “చేప పొలుసుల్లాంటి మబ్బుతునకల మాటుగా”.

  3. A Poem at the Right Moment: An Introduction గురించి Ranga గారి అభిప్రాయం:

    07/15/2007 11:25 pm

    No one knows the authorship of it, but everyone has seen the slOkam > జానక్యాః కమలామలాన్జలి పుటేః యాః పద్మరాగాయితః….

    I believe this is from Sri Rama Karnamrutam (by an unknown poet; some attribute the authorship of the book to Adi Shankara).

    I think an edition with tika/tatparyam is available from Jaya Lakshmi Publishers, Hyd.

    ranga

  4. ఆ రోజులు గురించి chavakiran గారి అభిప్రాయం:

    07/15/2007 9:33 pm

    ప్రాతః కాలం తప్ప మరీ పెద్ద సంస్కృత ఓన్లీ పదాలు నాకు పెద్దగా కన్పించలేదు.

    కవిత బాగుంది.

  5. గాయక గంభీరుడు ఉస్తాద్ అమీర్ ఖాన్ గురించి నాగరాజా గారి అభిప్రాయం:

    07/15/2007 6:45 pm

    చక్కటి వ్యాసం. ఎన్నో కొత్తవిషయాలను తెలుసుకొని, రాగాలను వినే అదృష్టం కలిగింది. కృతజ్ఞతలు మాస్టారు.

  6. Ra.Vi.Sastri’s ‘A Man of No Consequence’ (alpajIvi) గురించి C.S.Rao గారి అభిప్రాయం:

    07/15/2007 8:25 am

    A story or a novel results from the creative imagination and craftsmanship of the writer.In the crucible of his artistic sensibility,the interplay of the inborn nature of characters ,and the events and circumstances to which they are subject fashions out their future developement ,and ,finally ,their denouement ,slowly moving coursed through artistic determinism.

    The interpretation of novel by the author of the article is very heavily burdened with Adler’s Theory of Inferiority .An obsession is always disproportionate just as a reaction always tends to be extreme.The domain of art is not to be colonized by an extraneous theory.

    The taste of the pudding is in the eating.This is how a story or novel is to be judged :Is it readable with intense interest again and again?
    Do its characters elevate our understanding of life and its problems and challenges?Do they seem real,as real as people in flesh and blood,with a character and personality of their own?Does the book leave us with better taste and better accomodative spirit after reading it?Does it give artistic delight as we read it every time we read?

    I do not understand when the writer of the article says,”There is thus certainly innate,and something very”Indian” in him that had subjected him to inferiority complex and made the man he is…….” and the sentence runs to great length with all the contemptible qualifiers that come handy. What does it mean,”something very “Indian”in him”?Don’t we find such people any where else in the world?

    I am very shocked and pleased at the same time by Ra.Vi.Sastry’s honest confession :he says,”while writting the final parts of the novel I felt only disgust for Subbaiah.”A novelist never hates any one of his characters if they are very well drawn ,whether they are good or bad.Suppose a novelist has to draw a meanest character ,and if he draws him well in convincing terms ,there is an artistic beauty about him.We like the character.

    Why should and how could a writer,the creator ,hate his own character unless he has drawn him incompetently,incoherently,
    irrationally and inartistically?

  7. ఆ రోజులు గురించి C.S.Rao గారి అభిప్రాయం:

    07/15/2007 5:57 am

    రఘోత్తమరావు గారూ,
    పాలలో వెన్న కలిసి ఉన్నట్ట్లు తెలుగు లో సంస్కృతం ఉండనే ఉంటుంది.
    మీ మంచి పేరు లో ఉన్నదానికంటే ఎక్కువ సంస్కృతం నా కవిత లో ఉన్నదంటారా ?
    ఒక పదం అవసరమా ,అనవసరమా అన్నది మీ లాంటి రసజ్ఞులైన (ఇలా సంస్కృత పదాలు నిత్యం వాడుతూనే ఉంటాము) పాఠకుల అనుభూతికి సంబంధించిన విషయం.
    ఇక కొత్తదనమంటారా,ఈ విషయమై వచన కవితను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన చాలా గొప్పకవి తిలక్ గారు అన్నట్ట్లు
    “అసలు కవిత లో నే నవత కూడా ఉంది”.
    కవిత సాధించవలసింది అందం,అందించవలసింది ఆనందం.అవి సాధించలేనపుడు అది కవితే కాదు.ఇక అప్పుడు కొత్తదనం అవసరమే ఉండదు.
    “అమృతం కురిసిన రాత్రి” లో అంటారు తిలక్ గారు,
    “చలజ్జీవన దైనందిన కోలాహల పాంసుప రాగం లో
    తనలో తానొక ఏకాంత సౌందర్యం రచించుకున్న స్వాప్నికుడు”.
    సామాన్య ప్రజానీకం మాట్లాడే భాష రచనలో కూడా వాడాలని అవిశ్రాంతం గా పోరాడిన చలం గారు
    “రవి కిరణాంగుళీ నఖక్షతాలతో శ్యామలాకాశం కందింది”
    అని వ్రాస్తే ,గొప్ప రచయిత,విమర్శకుడు,మార్క్సిస్ట్ మేధావి ,సరళ వ్యావహారిక భాషాభిమాని రాచమల్లు రామచంద్రారెడ్డి గారు పులకించిపోయారు.

    వీరి కవితా పంక్తులలో ఏ సంస్కృత పదాన్ని తీసి ,ఏ తెలుగు పదం అతికి వారు సాధించిన సౌందర్యాన్ని పరిరక్షించుకోగలం?

  8. నాకు నచ్చిన పద్యం: తిక్కన భారతంలో ద్రౌపది కోపవర్ణన గురించి Aanamdu గారి అభిప్రాయం:

    07/14/2007 2:31 pm

    ఎంత బాగా చెప్పారండీ. తిక్కన మహాకవి గురించి మరికొంత చెప్పి మా అజ్ఞానాన్ని తొలగించ ప్రార్థన.

    ఆనందు

  9. నామాట: తెలుగు అంతర్జాతీయ భాషగా…! (నిజంగానా?) గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    07/14/2007 8:35 am

    ప్రస్తుతం ఇంగ్లీషులో వెలువడుతున్న సమాచారాన్ని (వార్తలు, సైన్సు వగైరా) ఎంత త్వరగా, ఎంత చక్కగా తెలుగులో రాసి పాఠకులకు అందించగలిగితే తెలుగు భాష పటిమా, ప్రాముఖ్యతా అంతగా పెరిగే అవకాశం ఉంటుంది. అది కేవలం తర్జుమా అయినా సరే. పదేళ్ళ కిందట బొంబాయిలో National Centre for Science Communicators మొదలుపెట్టినప్పుడు ఈ విషయంలో కేరళ అందరికన్నా ముందున్నదని తెలిసింది.

    ప్రస్తుతగా అమెరికా తదితర దేశాల్లో తెలుగువాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగింది కనక తెలుగులో రాసేవారు కూడా తగిన ప్రయత్నాలు చెయ్యాలి. ఈ విషయంలో కథల కన్నా వివిధ అంశాలను గురించిన వ్యాసాలూ, వార్తాకథనాలూ తెలుగు యొక్క పరిధిని ఎక్కువగా విస్తృతం చెయ్యగలవు. తగిన పరిణామాలు కలుగుతూ ఉన్నట్టయితే తెలుగు జాతీయంగానో, అంతర్జాతీయంగానో కొనసాగగలుగుతుంది.

    ఇది కాక ఇంట్లో పిల్లల చేత తెలుగులో మాట్లాడించడం మొదలైన ప్రయత్నాలన్నీ వ్యక్తిగతస్థాయిలో జరగాలి. తెలుగును టీనేజర్లకు సులభపరిచయం చెయ్యడానికి lec dems, power point presentations మొదలైనవి స్థానికంగా ఏర్పాటు చేసుకోవచ్చు.

  10. ఆ రోజులు గురించి Raghothama Rao C గారి అభిప్రాయం:

    07/14/2007 12:38 am

    అనవసరమైన సంస్కృత పదాలను వాడారు. కవితలో కొత్తదనం పై కూడా శ్రద్ధ చూపి ఉండాల్సింది.

« 1 ... 1471 1472 1473 1474 1475 ... 1555 »