Comment navigation


15547

« 1 ... 1470 1471 1472 1473 1474 ... 1555 »

  1. నామాట: తెలుగు అంతర్జాతీయ భాషగా…! (నిజంగానా?) గురించి జె. యు. బి. వి. ప్రసాద్ గారి అభిప్రాయం:

    07/17/2007 10:31 am

    వేలూరిగారూ,
    మీ సంపాదకీయం చదివాను. నాకు నచ్చింది. అందులో మీరు తెలుగుని ప్రాచీన భాషగా గుర్తించాలన్న వివాదాన్నీ, తెలుగుని అంతర్జాతీయ భాషగా గుర్తించాలన్న వివాదాన్నీ వ్యతిరేకించారు. అంతర్జాతీయ భాష గురించి కొన్ని చక్కటి ప్రశ్నలు వేశారు. భాషా దురభిమానాన్ని వ్యతిరేకించారు. ఇదంతా వుత్త రాజకీయం అని కూడా తేల్చారు. అంతా బాగుంది. అయితే నాకో ప్రశ్న. మనం మన ఈమాట ముందు పేజీలో, “ఇంటర్నెట్టులో తెలుగుకు మొదటి తరగతి పౌరసత్వం కావాలంటే యూనీకోడ్ వాడకం తప్పనిసరి అని మా నమ్మకం” అని రాసుకున్నాం కదా? యూనీకోడ్‌ని నేను కూడా ఇష్టపడతాను లెండి. కానీ ఈ “మొదటి తరగతి పౌరసత్వం” ఏమిటీ? కొన్ని భాషలకి “రెండవ తరగతి పౌరసత్వం”, ఇంకొన్ని భాషలకి “మూడవ తరగతి పౌరసత్వం” వున్నాయా? మొదటి తరవతి గొప్పదనుకుంటే, మూడవ తరగతి అధమం అనేగా అర్థం? భాషకి సంబంధించి ఈ పౌరసత్వ తరగతుల మీద వ్యతిరేకత మనకు లేదా? ఈ ఇంటర్నెట్టు తరగతి పౌరసత్వానికీ, అంతర్జాతీయ భాషకీ ఏదో రక్త సంబంధం కనబడుతోంది. తప్పంటారా?
    మీరు మీ సంపాదకీయంలో, “మొన్న మొన్నటి దాకా, మన పక్కింటి వాడి ధర్మవా అని, తెలుగుని ప్రాచీన భాషగా గుర్తించాలని నానా రకాల వాదాలు, వివాదాలు, నినాదాలు అల్లేశారు, వల్లించేశారు. అది కొంత సద్దుమణిగిందనుకుంటే, దానికి తోడుగా ఇప్పుడొక సరి కొత్త నినాదం తెలుగునాట తయారయ్యింది.” అని స్పష్టంగా తెలుగుని ప్రాచేన భాషగా గుర్తించాలన్న వివాదాన్నీ, తెలుగుని అంతర్జాతీయ భాషగా గుర్తించాలన్న వివాదాన్నీ వ్యతిరేకించారు. కొంత మందికి ఇది అర్థం కాక, మీ సంపాదకీయాన్ని మెచ్చుకుంటూ, సమర్థిస్తూ, “కనీసం ప్రాచీన భాషా ప్రపత్తే మనం సాధించుకోలేక పోయాం” అని వాపోయారు. మీ సంపాదకీయం ప్రకారం ఈ వివాదాలన్నీ వుత్త రాజకీయాలు మాత్రమే అయినప్పుడు, ఇలా వాపోవడంలో అర్థమే లేదు. తెలుగుకి “ప్రాచీన భాషా ప్రపత్తి” ఎందుకు సాధించుకోవాలి? ఆ ప్రపత్తి వల్ల బోలెడు డబ్బు శాంక్షను అవుతుంది. అందుకోసమేనా? మీ సంపాదకీయంలో ఈ డబ్బు సంగతి మీరెత్తలేదు గానీ, అటువంటి ప్రపత్తి గోలని మీరు వ్యతిరేకించారు. అది జనాలకి అర్థం కాకుండా పోయింది.
    భాషని ఒకరి మీద రుద్దడం ఏమిటీ? పాఠశాలల్లో హిందీని బలవంతంగా రుద్దినప్పుడు వ్యతిరేకించలేదా? “నిజంగా అన్ని రాజకీయ పక్షాలు తలుచుకుంటే, తెలుగు ప్రతీ స్కూలులోనూ తప్పని సరి (కనీసం పదవతరగతి వరకూ) అన్న జీ. వో రావడం అంత కష్టమైన విషయం కాదు” అంటూ తెలుగుని అందరి మిదా రుద్దడం ఎందుకు? ఒక రాష్ట్రంలో వేరే రాష్టాల నించీ వచ్చిన పిల్లలు ఎందరో వుంటారు. అంతేకాదు ఏ విషయమూ ఎవరిమీదా రుద్దకూడదు. వాళ్ళకిష్టం అయితే వాళ్ళు తెలుగు నేర్చుకుంటారు. లేకపోతే లేదు. “మాతృభాషలో విద్యాభోదన”లో వున్న మంచి విషయాలు తెలిస్తే నేర్చుకుంటారు. లేకపోతే లేదు. ఈ బలవంతంగా రుద్దడం అనే అభిప్రాయం మీరు మీ సంపాదకీయంలో ఎక్కడా రాయలేదు.
    భాషాభిమానం వుండొచ్చు గానీ, దురభిమానం వుండకూడదు. “దేశ భాషలందు తెలుగు లెస్స” అని గర్వంగా చెప్పుకోవడం మిగిలిన భాషలని కించపరచడమే.
    ఈ రకరకాల హోదాల వల్ల ధన ప్రాప్తి కూడా వుంటుంది మరి. ప్రాచీన భాష అనే ప్రపత్తి వల్ల అనేక లక్షల రూపాయలొస్తాయంట. వాటికోసం బోలెడు మంది తాపత్రయపడటం సహజమే మరి.
    ఇక రాజకీయనాయకుల సంగతి. మన లాంటి “మేధావులు” ఈ రాజకీయ నాయకులని ఎంత తక్కువగా చూస్తామో, వాళ్ళు కూడా మన లాంటి “మేధావుల్ని” అంతే తక్కువగా చూస్తారుట. ఓట్లు వేసి వాళ్ళని గెలిపించేదీ, వాళ్ళకి అధికారం కట్టపెట్టేదీ మన లాంటి వాళ్ళు కాదుట. అందుకే వారు మనలాంటి వారి ఘోష పట్టించుకోరుట. ఇలా అని తెలుగు సంస్కృతి కోసం ఒక తెలుగు సంస్థలో పని చేసే ఆయన అన్నారు. ఆయన మాటలు వింటుంటే, ఇదంతా కంఠ శోషన్న నిరుత్సాహం కలుగుతుంది. ఆయనే మళ్ళీ, “అరకొరగా చదువుకున్న వారిలోనే ఈ విభేదాలన్నీ, బాగా చదువుకున్న వారికిగ్గానీ, బొత్తిగా చదువుకోని వారికిగ్గానీ విభేదాలుండవు” అని అన్నారు. హతోస్మి అనుకోవాలి మరి.

    మొత్తానికి మీ సంపాదకీయంలో ఏ విషయం తేల్చకుండా వదిలేశారు. ఏం చెయ్యాలో స్పష్టంగా చెప్పలేదు. దాంతో కొంతమంది మీరు సంపాదకీయంలో బాధ పడిపోయారని, బాధ పడిపోయారు. ఒక్కో విషయం ఒక్కక్కరికి ఒకలాగా అర్థం అవడంలో ఆశ్చర్యమేమేమీ లేదు. ముందుగా మనమే భాషని సరిగా వుపయోగించుకోవాలీ అనిపిస్తుంది. దీర్ఘాలూ, ఒత్తులూ, కామాలూ, గట్రా లేని జనాలు రాసే తెలుగు చూస్తే నిరుత్సాహం కాక ఏం కలుగుతుందీ? ఒకరైతే ఏది కర్తో, ఏది కర్మో, ఏది క్రియో బొత్తిగా అర్థం కాని వాక్యాలు రాస్తారు. కొంతమంది అకర్మక క్రియలతో కర్మణి వాక్యాలు రాస్తారు. వాడుకలో లేని కర్మణి వాక్యాలు అప్పుడప్పుడు తెచ్చేసుకుని మురిసిపోతూ వుంటారు. ఇంకొకరైతే, మీరేం రాసినా, వాళ్ళకిష్టమైన అర్థం తీసేసుకుంటారు, మీరు రాసింది మెచ్చుకుంటూ. తెలుగు భాషలోనేనా ఇంత గందరగోళం అని అనిపిస్తుంది.

    ప్రసాద్

  2. Ra.Vi.Sastri’s ‘A Man of No Consequence’ (alpajIvi) గురించి Dr. Rajeshwar Mittapalli గారి అభిప్రాయం:

    07/17/2007 9:47 am

    This is in response to Mr. CS Rao. The Adlerian theory of ‘Inferiority Complex’ has been frequently referred to in the article only to prove that it is, in the end, inadequate to explain the complexity of the protagonist Subbaiah. It requires much more than a fashionable western psychological theory to make sense of this character. He begins to appear real to us only when he is viewed against the backdrop of his culture, one that seems to be governed by a set of values that are detrimental to hyper-sensitive individuals like himself. He falls far too short of the expectations of this culture, hence the intensity of his suffering. The phrase “something very ‘Indian’” has been used in the article in this context and primarily to mean the ‘discontents,’ such as they are, of this culture. Ra.Vi.Sastri should be complimented for bravely pointing out these shortcomings through Subbaiah, even if he has lost his sympathy for him halfway through. Writers are the conscience keepers of society and they very often provide the necessary corrective when things are not the way they should be. Alpajeevi would mean a lot more when looked at from this angle.

  3. తడిచేతుల సముద్రం గురించి Raghothama Rao C గారి అభిప్రాయం:

    07/17/2007 3:38 am

    చాలా బావుంది

  4. ఆ రోజులు గురించి కొత్త రవికిరణ్ గారి అభిప్రాయం:

    07/17/2007 3:30 am

    భాస్కర్రావు గారూ, జాగర్లమూడి, అంగలకుదురు మధ్య ఊరకే అలా నడుచుకుంటూ వెళ్ళినంత ఆహ్లాదంగా ఉంది మీ కవిత

  5. పువ్వులు.. పువ్వులు.. పువ్వులు .. గురించి mohan గారి అభిప్రాయం:

    07/17/2007 3:13 am

    This poem ,by any standards, is one of the worst poems ever penned by late Sri Seshendra Sarma.

    It is surprising as to why, of all his great works, this was chosen.. Editor Knows!!
    M

  6. Ra.Vi.Sastri’s ‘A Man of No Consequence’ (alpajIvi) గురించి Dr Sonba M Salve గారి అభిప్రాయం:

    07/17/2007 2:10 am

    This article is quite interesting as it shows one of the significant aspects of the bourgeois society of India. The style is simple and abundandantly clear. Dr Rajeshwar takes care of the international readesrship. Indeed, this article is creditable addition in his scholarly pursuits.

  7. గాయక గంభీరుడు ఉస్తాద్ అమీర్ ఖాన్ గురించి Vaidehi Sasidhar గారి అభిప్రాయం:

    07/16/2007 6:06 pm

    బావుంది.ఆసక్తి గా చదివించిన వ్యాసం.

  8. నారాయణరావుగారి గురించి నాలుగు మాటలు గురించి C.S.Rao గారి అభిప్రాయం:

    07/16/2007 5:46 pm

    వేలూరి గారి ఈ వ్యాసం చాలా చక్కగా ఉంది. అందమైన శైలిలో, ఒక మంచి కధలా, హృదయానికి హత్తుకునే విధంగా వ్యాసం సాగింది.

    వెల్చేరు గారికి సుదీర్ఘమైన, మహాబాహుళ్యమైన తెలుగు సాహిత్యం పైన ఉన్న పట్టు, మక్కువ, దాని సౌందర్యం ప్రపంచానికి చాటి చెప్పాలనే తపన, ఆ దిశగా వారు చేస్తున్న తపస్సు లాంటి కృషి, దాని విస్తృతి, తెలుగువారు ఆనంద పడేలా, గర్వపడేలా వేలూరి గారుచెప్పారు. వెల్చేరు గారు చేస్తున్నది ఒక బ్రహ్మాండమైన కృషి. ఎంత మందో పండితులతో constitute కాబడిన academies చేయవలసిన పని ఎలా వెల్చేరు గారు దాదాపు ఒంటరిగా చేసినది, ఇంకా చేస్తున్నది ఒక పెద్ద కాన్వాసు మీద చూపిస్తున్నట్లుగా వ్యాసం నడిచింది.

    మన తెలుగు భాష చాలా గొప్పది. చాలా Musical Potentialities ఉన్న భాష. మనకు గొప్ప సాహిత్యం ఉన్నది. ఇది ప్రపంచానికి తెలియజేయాలి. దానికి అనువాదాలు అవసరం.

    అసలు మన భారతీయ సాంస్కృతిక సంపద, ప్రాచీన విజ్ఞాన శాస్త్ర వైభవం, సాహిత్యం, శిల్పం, చిత్రలేఖనం, వేదాంతం, తత్వశాస్త్రం, యోగ శాస్త్రం, ఆఖరుకు పాకశాస్త్రం -వీటి వైశిష్ట్యం ప్రపంచానికి తెలియజెప్పాలి. ఇది ఒక బృహత్తర కార్యక్రమం, ఒక యజ్ఞం. ఎందరో మహానుభావులు, ఎన్నో సంస్థలు, ఎంతో అంకిత భావంతో, ఎన్నో సంవత్సరాలు చేయవలసిన మంచిపని, గొప్ప పని.

    వెల్చేరు గారికి, వేలూరి గారికి గౌరవ పూర్వక అభినందనలు.

  9. ఆ రోజులు గురించి Vaidehi Sasidhar గారి అభిప్రాయం:

    07/16/2007 5:15 pm

    రఘోత్తమరావుగారు చెప్పినట్లు పై కవితలో “కపోలాలు” బదులు “చెక్కిళ్ళు”, “ప్రాతఃకాలం” బదులు “తొలిపొద్దు”అనే పదాలు వాడవచ్చు.తెలుగు వంటి సుసంపన్నమైన భాష లో పర్యాయపదాలకి లోటు లేదు.అనేకం ఉన్నాయి.ఆ రకం గా చూస్తే ఈ కవితని (ఏ కవిత నైనా) ప్రతి ఒక్కరూ వారి పంధా లో,వారి కిష్టమైన పదాలు వాడి వ్రాయవచ్చు. కానీ, ఒక రచయిత తన వైయుక్తిక అనుభూతిని ఎలా కవిత్వీకరించాలి అనేది పూర్తిగా ఆ రచయిత నిర్దేశించుకునే విషయం.అయితే ,ఆ ప్రయత్నం లో రచయిత తన అనుభవాన్ని,అనుభూతిని పాఠకుల అనుభవం లోకి సమర్ధవంతంగా, అందించగలిగారా లేదా అన్నది మాత్రమే చర్చనీయాంశమని నా అభిప్రాయం.

  10. శంకరాచార్యుల రచనలో ఛందస్సు వైభవము గురించి J K Mohana Rao గారి అభిప్రాయం:

    07/16/2007 8:50 am

    సవరణ –

    వ్యాసములో సుగంధివృత్తమునకు వ్రాసిన పేరాను తొలగించి క్రింది
    విధముగా చదువుకొనవలయును.

    చంచల –
    సుగంధివృత్తమునకు చివర ఒక లఘువును అదనముగా నుంచితే
    మనకు చంచల లేక చిత్రశోభ అను వృత్తము లభించును.
    ఇందులో పాదమునకు ఎనిమిది గ-లములు. తెలుగులో ఈ లక్షణములతో
    నుండు పద్యము తురగవల్గన రగడలోని ఒక విధము. సంస్కృతములో యతి లేదు కనుక చంచలకు అంత్యప్రాస ఉంచితే తురగవల్గనరగడ
    అవుతుంది. ఈ వృత్తమును శివపంచాక్షర నక్షత్రమాలాస్తోత్రములలో
    శంకరులు వాడినారు. శంకరుడు దక్షిణదేశవాసి, అతనికి తమిళ
    కన్నడములు తెలిసియుండవచ్చును. ద్రావిడ భాషలలో ప్రాస నియతము. సంస్కృతములో అవసరము లేదు. శివపంచాక్షర నక్షత్రమాలాస్తోత్రములో గల 27 పద్యాలకు ద్వితీయాక్షరప్రాసను వాడినారు. క్రింద చంచలవృత్తమునకు ఒక ఉదాహరణ-

    జన్మ మృత్యు ఘోర దుఃఖహారిణే నమః శివాయ
    చిన్మయైకరూపదేహధారిణే నమః శివాయ
    మన్మనోరథావపూర్తికారిణే నమః శివాయ
    సన్మనోగతాయ కామవైరిణే నమః శివాయ – శివపంచాక్షరీనక్షత్రమాల (8)

    జననమరణముల వెతలను బాపెడు శివుడా నీకు నమస్సులు
    జ్ఞానమునకు బ్రతిరూపము దాల్చిన శివుడా నీకు నమస్సులు
    నా మన మందలి కోరిక దీర్చెడు శివుడా నీకు నమస్సులు
    సజ్జనచిత్తనివాస స్మరాంతక శివుడా నీకు నమస్సులు

    సుగంధి –
    తెలుగు పద్యాలు చదివేవారికి ఉత్సాహ పరిచితమైనదే. ఉత్సాహలో పాదానికి ఏడు సూర్యగణములు (UI లేక III) చివర ఒక గురువు ఉంటుంది. అన్ని సూర్యగణాలు గ-లమైతే మనకు ప్రాప్తించే వృత్తమునకు సుగంధి అని పేరు. ఈ సుగంధి నిజముగా పంచచామరములోని మొదటి లఘువును తొలగించగా వచ్చిన వృత్తమే. కాలభైరవాష్టకములో సుగంధివృత్తములుగలవు, అందులోనుండి క్రింద ఒక ఉదాహరణ-

    దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం
    వ్యాల యజ్ఞ సూత్ర మిందుశేఖరం కృపాకరం
    నారదాది యోగి వృంద వందితం దిగంబరం
    కాశికాపురాధినాథ కాలభైరవం భజే – కాలభైరవాష్టకము (1)

    http://sanskritdocuments.org/all_pdf/kaalabhairava.pdf

    దేవరాజు సేవజేయు పావనాబ్జపాదునిన్
    పాము జందె మైన సోమశేఖరున్ దయాకరున్
    నారదాది యోగికూట వందితున్ దిగంబరున్
    కాశి భూమి నేలు కాలభైరవున్ నమింతు నేన్

    చంచల 16 అత్యష్టి 43691 (UIUIUIUI) (UIUIUIUI) 9

« 1 ... 1470 1471 1472 1473 1474 ... 1555 »