చిలక – గోరింక గురించి జె. యు. బి. వి. ప్రసాద్ గారి అభిప్రాయం:
07/10/2007 8:21 am
ఇంటిపనీ, బైటపనీ ఒకే కోవకి చెందినవి కావు. ఇంటిపని అనుత్పాదక శ్రమ – అంటే పెట్టుబడి తిరిగి వెనక్కి తిరిగి రాని శ్రమ. బైటపని (వుద్యోగాలు) ఉత్పాదక శ్రమ – అంటే పెట్టుబడి వెనక్కి వచ్చే శ్రమ. ఇంటిపని తమ కోసం తాము చేసుకునే శ్రమ. సమాజంలో అందరూ బయట ఉత్పత్తి కార్యక్రమంలో పాల్గొనాలి. లేకపోతే అది అసమానతలకి దారి తీస్తుంది. కాబట్టి స్త్రీ,పురుషులందరూ ఇంటిపనీ,బైటపనీ రెండూ చెయ్యాలి. ఇది స్త్రీలకి అదనపు బాధ్యతగా పరిణమిస్తే, దానికి పరిష్కారంగా పురుషులని కూడా ఇంటిపనిలోకి తీసుకురావాలి. అంతేగానీ ఒక మనిషిని ఒక దానికే పరిమితం చేస్తే, అది తప్పు విషయాలకే దారి తీస్తుంది. సామాజిక వుత్పత్తిలో పాలు పంచుకోకపోతే, అది స్త్రీ,పురుష సమానత్వానికి దారి తీయదు. శ్రమలో కూడా rotation వుండాలి. పురుషుల మంచితనం మీద ఆధారపడి స్త్రీల బ్రతుకులు ఎలా వుండకూడదో, స్త్రీల మంచితనం మీద ఆధారపడి పురుషుల బ్రతుకులు కూడా వుండకూడదు.
ఈ కధలో రక్త సంబంధీకుల మధ్య జరిగే పెళ్ళి విషయం వుంది. సైన్సు రీత్యా అది మంచిది కాదు. అమెరికాలో అయితే అది చట్ట రీత్యా నేరం కూడా. ఇటువంటి పెళ్ళిళ్ళ వల్ల పుట్టబోయే పిల్లలు అవకరాల్తో పుట్టొచ్చు. ఒక తరంలో ఈ అవకరం బయట పడకపోయినా, తర్వాత తరాల్లో బయటపడే అవకాశం వుంది. ఇటువంటి పెళ్ళిళ్ళని సమర్ధించడం సమంజసనీయం కాదు.
– ప్రసాద్
రచయితలకు సూచనలు గురించి pallam madhavi latha గారి అభిప్రాయం:
07/10/2007 12:00 am
10/07/2007,
వరంగల్లు,
నమస్కారం,
ఇప్పుదడే ఈ సైటు చూసాను బాగున్నది.భారత దేశం లో ఉన్న రచయితల రచనలు ప్రచురణకు అవకాశం లేదా,తెలుపగలరు.
శ్రవణం లో పంపాలంటే ఏ విధంగా పంపాలో,విధము తెలుపగలరు.
ధన్యవాదాలతో
సాహితీ అభిమాని
పల్లం్ మాధవీ లత
Dear Sir,
Your idea of translating very prominent writers of Telugu into English is splendid. once, to foreigners, India is the land of superstions, necromancy, sanyasis, etc. But today people like you made the people out of Asian continent realize what India is .This is very useful for the readers who don’t have direct connection with the Telugu literature. I, therefore, must not wait without congratulating your studious scholarship.
విప్లవ్ గారూ,
మీరనుకొన్నట్లే జరిగింది. నేనెంతో ఆశించాను గానీ చివరికి ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండానే చేతిలో అవార్డు పెట్టి ఇక దయచేయండి అన్న రీతిలో పంపించేశారు. పోల్చకూడదు కానీ ఆ తర్వాతి రోజు గుమ్మడి గారికిచ్చిన గౌరవం వేల్చేరు గారికి దక్కిందా అన్నది నా సంశయము.
–ప్రసాద్ http://blog.charasala.com
This is a very interesting article. Dr Rajeshwar has made a significant contribution by providing new insights.He has aptly chosen the story written by Sri Ravi Sastry to highlight his views.
It is hoped that this article will be a precursor to more such novel approaches in analysing works of repute.
యే భాష అయినా అంతజర్జాతీయమో, విశ్వాంతరాళ భాషో అవ్వాలంటే ఎవరో ఒక జీ.ఓ. తేవడమో ఇంకేదో కాదు జరగాల్సింది. భాష వాడుక పెరిగితే పేర్లు లేకున్నా వచ్చే నష్టం లేదు. చలామణిలో లేనప్పుడు ఎన్ని పేర్లున్నా శుధ్ధ దండుగే. అన్ని భాషలలో మంచిని కలిపి అదేదో భాష (పేరు గూడా గుర్తుకు రావట్లేదు వెంటనే) అంతర్జాతీయ భాష తయారు చేశారు. ఏమిటీ ఉపయోగం?
యే భాష అయినా ఎంత ప్రాచీనమైనదో ఏదో ప్రభుత్వం చేత డప్పా కొట్టించుకున్న మాత్రాన ఉపయోగం లేదు. ఇంకా ఎన్ని శతాబ్దాలవరకు నిలిచి ఉండేలా మన భాషను ఎలా పటిష్ట పరచగలమో ఆ పని చేయాలి. అది తక్షణ కర్తవ్యం. అంతర్జాతీయంగా వాడగలిగేలా మన భాషా సంపదను, పదజాలాన్ని పెంపొందిస్తే ఆ ప్రక్రియ మన భాషలో సులువు చేయగలిగితే, దానికి మనమందరమూ ప్రచారం చేస్తే అప్పుడు అంతర్జాతీయమేం ఖర్మ – ఏలియన్సు కూడా మన భాష నేర్చుకోవడానికి ప్రవేశ పరీక్షలు వ్రాసి మరీ వస్తారు ఆంధ్ర దేశానికి.
భాషాభిమానులుగా మన పని మనం చేయకుండా కొంతమంది; మన ఇంట్లోనే మన భాష మాట్లాడ్డం నామర్దా అయిన చాలామంది ఉండటమే మన భాష దుర్గతికి అసలు కారణాం. అసలు పని చేయకుండా గుర్తింపు కోసం వెంపర్లాడితే్ “ఉట్టికెక్కలేనమ్మ స్వర్గనికెగిరింద’న్న సామెత గుర్తుకువస్తుంది. మన పని చేస్తూ పోతుంటే (ఎక్కువ చలామణిలోకి వచ్చేలా ప్రయత్నం చేస్తే) గుర్తింపులు వాటంతట అవే వస్తాయి.
శ్రీ కొడవళ్ళ హనుమంత రావు గారు (మైక్రో సాఫ్ట్ ) కొన్ని మంచి పుస్తకాలు (కొత్తవి, పాతవీ!) ప్రచురించడానికి భూరి విరాళం ఇచ్చారు. మైక్రోసాఫ్ట్ వారు ఆయన విరాళానికి సమంగా మేచింగ్ విరాళం కూడా ఇచ్చారు. కొద్దినెలలలో, ఆ పైకంతో ముందుగా మూడు పుస్తకాలు తానా ఆధ్వర్యంలో ప్రచురించబడతాయి. ఈ పుస్తకాల జాబితాలో నారాయణరావు గారి కవితావిప్లవాల స్వరూపం కూడా ఉన్నది. పాత పుస్తకంలో అచ్చుతప్పులు సరిదిద్దటం పూర్తికాగానే ఆ పుస్తకం, మరొక రెండు పుస్తకాలూ ఈ సంవత్సరాంతం లోగా విడుదల కావచ్చు!
నారాయణరావు గారి అనువాదాలు, ఒకటో రెండో మినహా, మిగిలినవన్నీ కొందామనుకునేవారికి అమెజాన్ డాట్ కాం లో దొరుకుతాయి.
రెండు మౌనాల మధ్య గురించి Atluri Jayasri గారి అభిప్రాయం:
07/11/2007 1:31 am
చాలా బాగుంది. It is a typical fight of couples.
చిలక – గోరింక గురించి జె. యు. బి. వి. ప్రసాద్ గారి అభిప్రాయం:
07/10/2007 8:21 am
ఇంటిపనీ, బైటపనీ ఒకే కోవకి చెందినవి కావు. ఇంటిపని అనుత్పాదక శ్రమ – అంటే పెట్టుబడి తిరిగి వెనక్కి తిరిగి రాని శ్రమ. బైటపని (వుద్యోగాలు) ఉత్పాదక శ్రమ – అంటే పెట్టుబడి వెనక్కి వచ్చే శ్రమ. ఇంటిపని తమ కోసం తాము చేసుకునే శ్రమ. సమాజంలో అందరూ బయట ఉత్పత్తి కార్యక్రమంలో పాల్గొనాలి. లేకపోతే అది అసమానతలకి దారి తీస్తుంది. కాబట్టి స్త్రీ,పురుషులందరూ ఇంటిపనీ,బైటపనీ రెండూ చెయ్యాలి. ఇది స్త్రీలకి అదనపు బాధ్యతగా పరిణమిస్తే, దానికి పరిష్కారంగా పురుషులని కూడా ఇంటిపనిలోకి తీసుకురావాలి. అంతేగానీ ఒక మనిషిని ఒక దానికే పరిమితం చేస్తే, అది తప్పు విషయాలకే దారి తీస్తుంది. సామాజిక వుత్పత్తిలో పాలు పంచుకోకపోతే, అది స్త్రీ,పురుష సమానత్వానికి దారి తీయదు. శ్రమలో కూడా rotation వుండాలి. పురుషుల మంచితనం మీద ఆధారపడి స్త్రీల బ్రతుకులు ఎలా వుండకూడదో, స్త్రీల మంచితనం మీద ఆధారపడి పురుషుల బ్రతుకులు కూడా వుండకూడదు.
ఈ కధలో రక్త సంబంధీకుల మధ్య జరిగే పెళ్ళి విషయం వుంది. సైన్సు రీత్యా అది మంచిది కాదు. అమెరికాలో అయితే అది చట్ట రీత్యా నేరం కూడా. ఇటువంటి పెళ్ళిళ్ళ వల్ల పుట్టబోయే పిల్లలు అవకరాల్తో పుట్టొచ్చు. ఒక తరంలో ఈ అవకరం బయట పడకపోయినా, తర్వాత తరాల్లో బయటపడే అవకాశం వుంది. ఇటువంటి పెళ్ళిళ్ళని సమర్ధించడం సమంజసనీయం కాదు.
– ప్రసాద్
రచయితలకు సూచనలు గురించి pallam madhavi latha గారి అభిప్రాయం:
07/10/2007 12:00 am
10/07/2007,
వరంగల్లు,
నమస్కారం,
ఇప్పుదడే ఈ సైటు చూసాను బాగున్నది.భారత దేశం లో ఉన్న రచయితల రచనలు ప్రచురణకు అవకాశం లేదా,తెలుపగలరు.
శ్రవణం లో పంపాలంటే ఏ విధంగా పంపాలో,విధము తెలుపగలరు.
ధన్యవాదాలతో
సాహితీ అభిమాని
పల్లం్ మాధవీ లత
Ra.Vi.Sastri’s ‘A Man of No Consequence’ (alpajIvi) గురించి Dr. Avula Venkanna గారి అభిప్రాయం:
07/09/2007 10:20 pm
Dear Sir,
Your idea of translating very prominent writers of Telugu into English is splendid. once, to foreigners, India is the land of superstions, necromancy, sanyasis, etc. But today people like you made the people out of Asian continent realize what India is .This is very useful for the readers who don’t have direct connection with the Telugu literature. I, therefore, must not wait without congratulating your studious scholarship.
నారాయణరావుగారి గురించి నాలుగు మాటలు గురించి ప్రసాద్ గారి అభిప్రాయం:
07/09/2007 10:52 am
విప్లవ్ గారూ,
మీరనుకొన్నట్లే జరిగింది. నేనెంతో ఆశించాను గానీ చివరికి ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండానే చేతిలో అవార్డు పెట్టి ఇక దయచేయండి అన్న రీతిలో పంపించేశారు. పోల్చకూడదు కానీ ఆ తర్వాతి రోజు గుమ్మడి గారికిచ్చిన గౌరవం వేల్చేరు గారికి దక్కిందా అన్నది నా సంశయము.
–ప్రసాద్
http://blog.charasala.com
శంకరాచార్యుల రచనలో ఛందస్సు వైభవము గురించి Sai Brahmanandam Gorti గారి అభిప్రాయం:
07/09/2007 10:18 am
చాలా మంచి పరిశోధనా వ్యాసం. మీరు తెలుగు విశ్వవిద్యాలయం వారికి పంపండి. ఇటువంటి మంచి రచనలు అందరికీ, ముఖ్యంగా విద్యార్థులకి అవసరమవుతాయి.
కాకపోతే రాసిన భాషతోనే సమస్య, ఇబ్బందీ! చదువరుల సహనాన్ని పరీక్షించినట్లుగా ఉంది.
శిష్ట వ్యవహారికంలో రాసి ఉండాల్సిమంది, ఇంకాస్త మంది చదివేవారు.
-సాయి బ్రహ్మానందం గొర్తి
Ra.Vi.Sastri’s ‘A Man of No Consequence’ (alpajIvi) గురించి Dr T.S.Chandra Mouli. గారి అభిప్రాయం:
07/08/2007 10:36 pm
This is a very interesting article. Dr Rajeshwar has made a significant contribution by providing new insights.He has aptly chosen the story written by Sri Ravi Sastry to highlight his views.
It is hoped that this article will be a precursor to more such novel approaches in analysing works of repute.
నామాట: తెలుగు అంతర్జాతీయ భాషగా…! (నిజంగానా?) గురించి Vamsi Krishna గారి అభిప్రాయం:
07/08/2007 7:59 am
యే భాష అయినా అంతజర్జాతీయమో, విశ్వాంతరాళ భాషో అవ్వాలంటే ఎవరో ఒక జీ.ఓ. తేవడమో ఇంకేదో కాదు జరగాల్సింది. భాష వాడుక పెరిగితే పేర్లు లేకున్నా వచ్చే నష్టం లేదు. చలామణిలో లేనప్పుడు ఎన్ని పేర్లున్నా శుధ్ధ దండుగే. అన్ని భాషలలో మంచిని కలిపి అదేదో భాష (పేరు గూడా గుర్తుకు రావట్లేదు వెంటనే) అంతర్జాతీయ భాష తయారు చేశారు. ఏమిటీ ఉపయోగం?
యే భాష అయినా ఎంత ప్రాచీనమైనదో ఏదో ప్రభుత్వం చేత డప్పా కొట్టించుకున్న మాత్రాన ఉపయోగం లేదు. ఇంకా ఎన్ని శతాబ్దాలవరకు నిలిచి ఉండేలా మన భాషను ఎలా పటిష్ట పరచగలమో ఆ పని చేయాలి. అది తక్షణ కర్తవ్యం. అంతర్జాతీయంగా వాడగలిగేలా మన భాషా సంపదను, పదజాలాన్ని పెంపొందిస్తే ఆ ప్రక్రియ మన భాషలో సులువు చేయగలిగితే, దానికి మనమందరమూ ప్రచారం చేస్తే అప్పుడు అంతర్జాతీయమేం ఖర్మ – ఏలియన్సు కూడా మన భాష నేర్చుకోవడానికి ప్రవేశ పరీక్షలు వ్రాసి మరీ వస్తారు ఆంధ్ర దేశానికి.
భాషాభిమానులుగా మన పని మనం చేయకుండా కొంతమంది; మన ఇంట్లోనే మన భాష మాట్లాడ్డం నామర్దా అయిన చాలామంది ఉండటమే మన భాష దుర్గతికి అసలు కారణాం. అసలు పని చేయకుండా గుర్తింపు కోసం వెంపర్లాడితే్ “ఉట్టికెక్కలేనమ్మ స్వర్గనికెగిరింద’న్న సామెత గుర్తుకువస్తుంది. మన పని చేస్తూ పోతుంటే (ఎక్కువ చలామణిలోకి వచ్చేలా ప్రయత్నం చేస్తే) గుర్తింపులు వాటంతట అవే వస్తాయి.
నారాయణరావుగారి గురించి నాలుగు మాటలు గురించి vrveluri గారి అభిప్రాయం:
07/06/2007 5:42 pm
జయదేవ్ గారూ:
శ్రీ కొడవళ్ళ హనుమంత రావు గారు (మైక్రో సాఫ్ట్ ) కొన్ని మంచి పుస్తకాలు (కొత్తవి, పాతవీ!) ప్రచురించడానికి భూరి విరాళం ఇచ్చారు. మైక్రోసాఫ్ట్ వారు ఆయన విరాళానికి సమంగా మేచింగ్ విరాళం కూడా ఇచ్చారు. కొద్దినెలలలో, ఆ పైకంతో ముందుగా మూడు పుస్తకాలు తానా ఆధ్వర్యంలో ప్రచురించబడతాయి. ఈ పుస్తకాల జాబితాలో నారాయణరావు గారి కవితావిప్లవాల స్వరూపం కూడా ఉన్నది. పాత పుస్తకంలో అచ్చుతప్పులు సరిదిద్దటం పూర్తికాగానే ఆ పుస్తకం, మరొక రెండు పుస్తకాలూ ఈ సంవత్సరాంతం లోగా విడుదల కావచ్చు!
నారాయణరావు గారి అనువాదాలు, ఒకటో రెండో మినహా, మిగిలినవన్నీ కొందామనుకునేవారికి అమెజాన్ డాట్ కాం లో దొరుకుతాయి.
— వేలూరి వేంకటేశ్వర రావు
నారాయణరావుగారి గురించి నాలుగు మాటలు గురించి J K Mohana Rao గారి అభిప్రాయం:
07/06/2007 5:14 pm
తెలుగులో కవితా విప్లవ స్వరూపము Digital library of India సైటునుండి డవున్లోడ్ చేసికొనవచ్చును:
మోహన