మీరు చెప్పంది కరక్టు. తమిళ నాడులో ఎన్ని స్కూళ్ళ్లో తెలుగు నేర్పుతారో అందరికీ తెలుసున్నదే! ఏదో ఒకటీ అరా స్కూల్లో తెలుగు బోధిస్తే మొత్తం అన్ని స్కూళ్ళూ అలాగే ఉంటాయనుకోవడం మన అవివేకం. అంతెందుకూ, బళ్ళారి, హాస్పేట జనాభాలో నలభై శాతం పైగా తెలుగు వాళ్ళున్నారు. కానీ అక్కడ తెలుగు నేర్పే స్కూళ్ళు ఒక్కటీ లేవు. కన్నడం మాత్రం చచ్చినట్లు నేర్చుకోవాలి – ఇష్టం ఉన్నా, లేక పోయినా ! దీనికి కారణం పాలించే ప్రభుత్వాల చలవే !
“ఇతర రాష్ట్రాల నించీ వచ్చిన వారు” అని ఎలా గుర్తు పడతారు? ఇలా గుర్తు పట్టడానికి ఎటువంటి పద్ధతులు అవలంభించినా, అందులో ఎంచడానికి బోలెడు తప్పులుంటాయి. వేరే రాష్ట్రం నించీ వచ్చి పదేళ్ళయినా, వాళ్ళ స్వతంత్ర ప్రతిపత్తి వాళ్ళు పోగొట్టుకోనక్కరలేదు కదా? తరాలు గడిచే కొద్దీ వాళ్ళే ఇష్టపడి, అవసరాల కొద్దీ, లేదా ఇష్టం కొద్దీ స్వేచ్చగా నేర్చుకుంటే, అది వేరే సంగతి. ఇక 90% మనుషులకి మాత్రం ఈ నిబంధన ఎందుకు వుంచాలీ? అందులో కొంత మంచి త్వరలో వేరే రాష్ట్రాలకి పోవచ్చు. కొంత మంది వేరే దేశాలకి పోవచ్చు. అక్కడ వేరే బాషను ఎక్కువగా పట్టించుకోవలసి వుంటుంది కాబట్టి, వారు వేరేలాగా నిర్ణయించుకోవచ్చు. ఎవరి స్వేచ్చను బట్టీ వారు నిర్ణయించుకోవాలి. ఒక విషయంలో మంచి విషయాలను ప్రచారం చెయ్యడం, అవి విడమరిచి అవతలవారికి చెబుతూ వారిని ఎడ్యుకేట్ చెయ్యడం మాత్రమే కరెక్టు పద్ధతి. పబ్లిక్ పరీక్షల్లో ఎక్కువ మార్కులు రావని చాలా మంది తెలుగు వారు హిందీనో, సంస్కృతాన్నో తీసుకునే రోజులు ఇవి. భాష విషయంలో నిర్భంధమే పెద్ద తప్పు.
ఎవరైనా ఆంగ్లం నేర్చుకుంటే, అది తెలుగును నిరసించినట్టు ఎందుకవుతుందీ?
తమిలనాడులో, ముఖ్యంగా మద్రాసులో, తమిళాన్ని 1982-91 వరకూ అన్ని స్కూళ్ళలోనూ రుద్దలేదు. మా కజిన్ అక్కడే పుట్టి, బి.కాం వరకూ తెలుగు సెకండ్ లాంగ్వేజీగా, తమిళం లేకుండా, ఇంగ్లీషు మీడియంలో చదువుకున్నాడు. మిగిలిన వూళ్ళ సంగతి నాకు తెలియదు. నేనొక వుదాహరణ చెప్పానే గానీ, దాంతో మొత్తం తమిళనడుని జనరలైజ్ చెయ్యలేదు. ఒకవేళ తమిళనాడులో తమిళం రుద్దుతూ వుంటే, వాళ్ళకీ ఈ విమర్శలు వర్తిస్తాయి. హిందీ రుద్దినపుడు వాళ్ళు ఎంత గొడవ చేశారో అందరికీ గుర్తే కదా? 1967 సంవత్సరాలలో హిందీ రుద్దడాన్ని వ్యతిరేకించడంలో ఆంధ్రప్రదేశ్ విఫలమయినా, తమిళనాడు సఫలమయింది కదా? రుద్దడం ఎప్పుడూ తప్పే ఇలాంటి విషయాల్లో.
తెలుగు మాట్టాడ్డం చిన్నతనం అనుకునే తెలుగువారి గురించి అస్సలు మాట్టాడ్డమే లేదు ఇక్కడ, అటువంటి వారి మీద ఎన్ని విమర్శలున్నా. మాతృభాషకి ఎవరూ వ్యతిరేకం కాకూడదు అనేదే నా భావం కూడా. ఎటొచ్చీ వాళ్ళని ఎడ్యుకేట్ చెయ్యడం ఒక్కటే కరెక్టు పద్ధతి. అది తప్ప ఏదైనా తప్పు పద్ధతిగానే వుంటుంది. నియంత్రత్వం ఎప్పుడూ మంచిది కాదు.
తెలుగుదేశములో తెలుగు మాతృభాషగా ఉన్నవారు సుమారు
90% ఐనా ఉంటారు. ఇతర భాషలు మాతృభాషగా గలవారు,
కేంద్ర ప్రభుత్వములో ఉద్యోగము చేసేవాళ్ళు, ఇతర రాష్ట్రాల
నుండి వచ్చినావాళ్ళు 10% ఉంటారేమో. ఈ 90% తెలుగు
వాళ్ళకు తెలుగును తప్పని సరిగా బోధించడములో తప్పేమి
లేదు గదా! వాళ్ళు ఆంగ్లము నేర్చుకోనీ, కాని తెలుగును
ఎందుకు నిరసన చెయ్యాలి? ఇక తమిళనాడులో తమిళమును
రుద్దలేదనుట అతశయోక్తి అవుతుంది. మదరాసు మాత్రమే
కాదు, హొసూరు, సేలం, ఉత్తర ఆర్కాడు, మదురై,
కోయముత్తూరు జిల్లాలలో తెలుగు మాటలాడేవారు చాల
మంది ఉన్నారు. ఎక్కడో తప్ప వారికి తెలుగు బడులు లేవు, ఇతర
భాషల బడులు లేవు, ఒక్క తమిళము తప్ప. మదరాసులోనే
50లలో స్థితికి, ఇప్పటి స్థితికి ఎంతో తేడా ఉంది. అప్పుడులా
ఇప్పుడు తెలుగు తమ మాతృభాష అని జనాలు ప్రకటించుకొనుట
అరుదే! – మోహన
ఇండియాలో ఇంచుమించు ప్రతీ రాష్ట్రానికీ ఒక సొంత భాష వుంది. ఆ రాష్ట్రం ఆ సొంత భాషని తమ అధికార భాషగా చేసుకోవడం కరక్టైన విషయమే. ఎటొచ్చీ పలు రాష్ట్రాలు అనేక విషయాలలో కలిసి వుంటాయి కాబట్టి, అన్ని రాష్ట్రాల మధ్య ఒక లింకు భాష కూడా వుంటుంది. ఒక రాష్ట్ర ప్రజలు ఇంకో రాష్ట్రంలోకి వెళ్ళినపుడు, లింకు భాషలో మేనేజ్ చేస్తారు. తర్వాత కాలంలో రాష్ట్ర భాషని నేర్చుకుంటారా, లేదా అనేది వారి అవసరాల మీద ఆధారపడి వుంటుంది.
పైన చెప్పిన విధంగా ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు అధికార భాషగా వుండటంలో తప్పేమీ లేదు. ప్రతీ స్కూల్లోనూ తెలుగు నేర్పడం, తెలుగులో ప్రాధమిక విద్యా బోధన చెయ్యడం చాలా మంచి పనులే. ఆంధ్రప్రదేశ్‌లో ఒక లింకు భాష కూడా వుండాలి, మిగిలిన రాష్ట్రాలతోటీ, మిగిలిన ప్రపంచంతోటీ సంబంధాలలో వుండటానికి.
ఇదంతా బాగుంది. అభ్యంతరం అల్లా స్కూల్లో తెలుగుని అందరూ నేర్చుకుని తీరాలన్న జీ.వో నిబంధన. ఏ విషయాన్నీ ఎవరి మీదా రుద్దకూడదు. దాని అవసరాన్నీ, దాని లోని మంచినీ వివరించి మనుషులని ఎడ్యుకేట్ చెయ్యాలి. దాని ద్వారా ప్రజలు ఆ భాష నేర్చుకోవడానికి ఇష్టపడాలి.
తమిళనాడులో తమిళ భాషాభివృద్ధి ఎంతగానో జరిగిందంటారు కదా? మేము మద్రాసులో వుండే రోజుల్లో తమిళం మా పిల్లల మీద రుద్దుతారేమోనని భయపడ్డాము. కానీ అలా అప్పుడు జరగలేదు. మేము పిల్లల్ని చేర్చిన స్కూల్లో తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఒక భాష సెలక్టు చేసుకోమన్నారు. అలా తమిళం రుద్దక పోవడం బాగుంది. మిగిలిన రాష్ట్రం అంతా తమిళ బోర్డులూ, తమిళ పోస్టర్లూ, గట్రా చాలా వున్నాయి. అవి చదువుకోవాలంటే తమిళం తప్పని సరి అని గ్రహించి, తమిళం చదవడం కొంచెం నేర్చుకున్నాను. టీవీ అవసరాన్ని గానీ, సినిమాల అవసరాలని గానీ వేరేగా చెప్పక్కరలేదు.
మనిషి తనుండే పరిసరాలను బట్టీ, అందులోని అవసరాలను బట్టీ ఒక భాష నేర్చుకునే పద్ధతి వుండాలి. మనుషులకి తమకి ఏం కావాలో తాము తెలుసుకునే స్వేచ్చ వుండాలి, అది ఎంత తప్పుగా వున్నప్పటికీ. ఎడ్యుకేషన్‌తో మాత్రమే మనుషులని చైతన్యం చేయాలి. బలవంతంతో కాదు. నేను చెప్పే ఈ స్వేచ్చ ప్రతీ విషయానికీ వర్తించదు. భాషకి మాత్రం తప్పకుండా వర్తిస్తుంది.
రాష్ట్ర అధికార భాషగా తెలుగుని అమలుపరచడం పట్ల నాకు వ్యతిరేకత లేదు. దాన్ని సమర్ధిస్తాను కూడా. అది స్కూల్లో ప్రతీ ఒక్కరూ నేర్చుకుని తీరాలన్న జీవో నిబంధన పట్ల మాత్రమే నా వ్యతిరేకత. ట్రాన్సఫర్ల మీద తలో రాష్ట్రం తిరిగే పిల్లలు, రెండేళ్ళకో భాష నేర్చుకోవాలనడంలో అర్థం లేదు. అందుకని స్కూల్లో కూడా తెలుగు గానీ, దాని బదులుగా వేరే భాష గానీ నేర్చుకునే పరిస్థితి వుండాలి. బలవంతంగా రుద్ది మనుషులకి వుండే స్వేచ్చని హరించకూడదు. ఇదీ నా పాయింటు.
తెలుగు భాషని తెలుగువాళ్ళ మీద ఎందుకు రుద్దాలి (ప్రభుత్వం ప్రజలమీద కాని, బడులు బడి పిల్లలపై కాని, తల్లిదంద్రులు పిల్లలపై కాని) అన్నది చాలా మౌలికమైన ప్రశ్నే (అయినా, చాలా దురదృష్టకరమైన ప్రశ్న)!.
ప్రభుత్వం అధికార భాషగా తెలుగుని సరిగా అమలు చెయ్యడం, ఆ భాషని ప్రజలపై రుద్దడం అవదు.
ఇంగ్లీషుని, అది చదువుకోలేని ప్రజలపై రుద్దకుండా ఉండడమౌతుంది. ఈ మధ్య ఈనాడులో ప్రచురితమైన ఈ వ్యాసం చదివితే అధికారభాషగా తెలుగుని ప్రభుత్వ కార్యాలయాల్లో అమలుపరిస్తే ప్రజలకి కలిగే వెసలుబాటు చక్కగా అర్థం అవుతుంది.
ఇక బడిలోనూ, ఇంటిలోనూ పిల్లలపై రుద్దడం విషయానికి వస్తే:
1. ప్రతి మనిషి తనకి ఇష్తమైన భాషని నేర్చుకోవచ్చనడం సబబుగానే తోస్తుంది. అయితే, సమాజంలో వ్యవహారానికి, ఇతర వ్యక్తులతో సంభాషించడానికి, ఒక సామాన్య భాష అవసరం ఉంది కదా. అది అందరికీ రావాల్సిన అవసరం కూడా ఉంది కదా. అది ఇంట్లో మాట్లాడుకునే భాషకి ఎంత దగ్గరైతే అంత సులువుగా నేర్చుకోవచ్చు. ఎంత ఎక్కువమందికి ఆ భాష ఇంటి భాష అయితే అంత సులువు. ఈ దృష్ట్యా మన రాష్ట్రంలో తెలుగు అందరూ నేర్చుకోవాలి అనుకోవడంలో తప్పేమీ లేదు.
2. పై కారణం కన్నా బలమైనది సాంస్కృతిక కారణం. ఇది ప్రవాసాంధ్రులకి కూడా వర్తించేది. ప్రాణులలోకెల్ల మనిషి పురోగమనానికి ప్రధానమైన కారణాలలో ఒకటి సమాజాలుగా ఏర్పడడం అన్న విషయం శాస్త్రీయమైనది. సమాజాలు ఏర్పడడానికీ, నిలబడడానికీ సంస్కృతి ఒక ప్రధాన సాధనం. భాష సంస్కృతిలో భాగం. అయితే ప్రస్తుత సామాజిక, ఆర్థిక పరిస్థితులలో సంస్కృతిని నిలబెట్టుకోవడం ఎంతవరకూ అవసరం అన్న విషయం శాస్త్రీయంగా ఎవరైనా పరిశోధించారో లేదో నాకు తెలియదు. దాని అవసరం ఇంకా ఉన్నది అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఈ దృష్టితో చూసినా తెలుగు భాషని కాపాడుకోవడం అవసరం.
ఇక, రాజకీయ నాయకులపై మనమందరం చాలా తేలికగా, హాయిగా తప్పు(ల)ను నెట్టేస్తాం.
నిజమే, రాజకీయనాయకులు స్వార్థపరులే (ఏం మనం కామా?)! వాళ్ళకి ఓట్లువేసే జనాలకి తెలుగు భాషాభివృద్ధి ఒక ప్రధాన విషయం అయితే, వాళ్ళు దానిగురించి పట్టించుకోక ఏం చేస్తారు? ఓట్లు వేసే ప్రజలోఅత్యధిక శాతం సామాన్య ప్రజలు (చదువులేనివాళ్ళు, పేద వాళ్ళు). సహజంగా వాళ్ళకి భాషాభివృద్ధి ఒక ప్రధాన విషయం కాదు. కాబట్టి రాజకీయ నాయకులకి దానిగురించి పట్టదు.
అంచేత తెలుగు భాషాభివృద్ధి జరగాలంటే, అవసరమైనవి రెండు పనులు:
1. చదువుకున్నవాళ్ళు ముందు తెలుగు భాషాభివృద్ధి తాలూకు (శాస్త్రీయమైన) అవసరాన్ని గుర్తించి, దాన్ని తమ పరిధిలో అమలు పరచడం.
2. సామాన్య ప్రజకి దీని అవసరాన్ని తెలియజెప్పడం. సామాన్య ప్రజలకి తెలియాలంటే అది శాస్త్రీయ విధానంలో సాధ్యపడదు. ప్రజలలో భాష పట్ల (దుర)అభిమానం కలిగించడమొక్కటే సాధనం. దీనికి ఒక ఉద్యమం అవసరం.
తమిళభాషాభివృద్ధిలో ఈ పై విషయాల పాత్రని గుర్తించవచ్చు.
In this context, I have recently come across a link on “Orality to literacy: Transition in Early Tamil Society” by IRAVATHAM MAHADEVAN. It contains interesting points on Popular versus elitist literacy, comparing Tamil and Upper South India (Telugu and Kannada) in the ancient period.
I find Dr. Rajeshwar’s analysis of Alpajeevi very interesting and enlightening. This article is perhaps the best in the entire Ra.Vi.Sastri critical corpus, among other things because of the detached perspective from which the novel has been studied.
Writers don’t always have to offer fictional ‘chicken soup’ to the troubled ‘souls.’ Being intellectuals who can see things which others can’t and professing a certain sense of social responsibility, they constitute the consciousness of society and constantly strive to improve it by fixing their creative focus on its dark spots. In the process they help the prevalence of a more equitable and egalitarian social order. Ra.Vi.Sastri wrote the way he did and shaped the ‘hero’ of Alpajeevi the way he did entirely because, as a writer, he was keenly aware of his responsibility to society. He was disenchanted with his character perhaps because he was annoyed with Subbaiah’s ready acquiesce to the cultural mores which sought to isolate and harass him, instead of fighting back.
Ra.Vi.Sastri can’t be faulted for being a critical insider and an eloquent commentator on issues affecting the society. A society which can’t criticize itself, through its writers and other spokespersons, and continually evolve into something better than it is at the moment, will cease to be dynamic, and worse still, it may even essentialize itself… Ra.Vi.Sastri did his bit to prevent this possibility for the Telugu society.
రఘోత్తమరావు గారూ,
కవితలో రవంత సంస్కృతం ఉన్నా ఇష్టపడని మీరు,మీరు వ్రాసిన మొదటి అభిప్రాయం లో “శ్రద్ధ” బదులు”పట్టించుకోవలసింది ” అనవచ్చుగా?మీ రెండవ అభిప్రాయం లో”బాదరాయణ సంబంధం” బదులు “ఈ రెంటికీ పోలికేమిటి” అనవచ్చుగా?
తెలుగు, సంస్కృతం అందంగా పెనవేసికొని పోతే ,తెలుగు భాషలోని సరళమైన సంస్కృత పదాలని అంటరాని పదాలు గా చూడాలా?
“ప్రాతఃకాలం” బదులు”తొలి పొద్దు” ,”కపోలాలు” బదులు “చెక్కిళ్ళు” అన్నప్పుడు మరొకరు “తెల్లారగట్ల” ,”చెంపలు” అనవచ్చుగా అని
అడగవచ్చునేమో?
నేనుదహరించిన కవితలలో కూడా ఇలానే ‘దైనందిన” బదులు “రోజువారీ””కోలాహలం” బదులు “సందడి” వగైరా అనవచ్చుగా?
తన ఊహకు తగినట్ట్లుగా ఏ పదం వాడి ఎంత సౌందర్యం సాధించగలడో ,తన కవితావేశం పాఠకులకి అందించగలడో , కవిత వ్రాసే వ్యక్తి నిర్ణయించుకుంటాడు.
పాఠకమహాశయులు తర్కించుకుంటారు,ఆస్వాదిస్తారు.
పోతే,మాటలకు కొత్తదనం ఏముంటుంది?అవి అనాదిగా వస్తున్నవే.మాటల కూర్పులో ,లయబధ్ధమైన నడక లో,అవగాహనా మాధ్యమాలను వాడటం లో సొగసు,కొత్తదనం ఆవిర్భవిస్తవి.
Middleton Murry గారి “Mode of Apprehension” కి “అవగాహనా మాధ్యమం” నా అనువాదం.ఇది”metaphor” కి ఆ గొప్పసాహితీ విమర్శకుని
నిర్వచనం.
రవికిరణ్ గారూ,మీ అభిప్రాయం ద్వారా నాకు ఎన్నో సంవత్సరాలుగా సంబంధం ఉన్న ప్రాంతాల్ని ,వాటి ప్రకృతి సౌందర్యాన్ని,గలగల పారే పంట కాలువల్ని,సోయగంగా ఊగే వరి పొలాల్ని,చల్లగా వీచే గాలుల్ని మనసు ఆర్ద్రమయ్యేలా గుర్తు చేసారు.Thanks.
మరేం లేదు,నా పేరు C.S.Rao
నేనూ, జె యు బి వి ప్రసాద్ గారితో ఏకీభవిస్తాను. వేలూరి గారి వ్యాసం ఏమీ కొత్తగా చెప్పలేదు. ప్రసాద్ గారన్నట్లు కొంతమంది ఏం రాసినా మెచ్చుకుంటారు. మరికొంత మంది మారుపేర్లతో తమకు నచ్చినవి కక్కుతారు. వస్తువునీ, వ్య క్తులనీ వేరు వేరుగా చూడలేని కుహనా మనుష్యులకి ఒక్క తెలుగు భాషేం కర్మ, యావత్ ప్రపంచం తప్పుగానే అనిపిస్తుంది. తెలుగు భాష ఎందుకు నేర్చుకోవాలి? మన పిల్లల బొడ్డూడని వయసులో, వాళ్ళ్ ముందు పప్రంచం్ లో ఉన్న భాషలన్నీ ఉంచుదాం. వాళ్ళకి ఏ భాష నచ్చితే అది నేర్చుకుంటారు. ఈ ఐడియా బాగుంది.
నామాట: తెలుగు అంతర్జాతీయ భాషగా…! (నిజంగానా?) గురించి Sai Brahmanandam Gorti గారి అభిప్రాయం:
07/18/2007 3:22 pm
మోహన రావు గారు,
మీరు చెప్పంది కరక్టు. తమిళ నాడులో ఎన్ని స్కూళ్ళ్లో తెలుగు నేర్పుతారో అందరికీ తెలుసున్నదే! ఏదో ఒకటీ అరా స్కూల్లో తెలుగు బోధిస్తే మొత్తం అన్ని స్కూళ్ళూ అలాగే ఉంటాయనుకోవడం మన అవివేకం. అంతెందుకూ, బళ్ళారి, హాస్పేట జనాభాలో నలభై శాతం పైగా తెలుగు వాళ్ళున్నారు. కానీ అక్కడ తెలుగు నేర్పే స్కూళ్ళు ఒక్కటీ లేవు. కన్నడం మాత్రం చచ్చినట్లు నేర్చుకోవాలి – ఇష్టం ఉన్నా, లేక పోయినా ! దీనికి కారణం పాలించే ప్రభుత్వాల చలవే !
-సాయి బ్రహ్మానందం గొర్తి
(This message has been edited. — Editors)
నామాట: తెలుగు అంతర్జాతీయ భాషగా…! (నిజంగానా?) గురించి జె.యు.బి.వి.ప్రసాద్ గారి అభిప్రాయం:
07/18/2007 12:45 pm
“ఇతర రాష్ట్రాల నించీ వచ్చిన వారు” అని ఎలా గుర్తు పడతారు? ఇలా గుర్తు పట్టడానికి ఎటువంటి పద్ధతులు అవలంభించినా, అందులో ఎంచడానికి బోలెడు తప్పులుంటాయి. వేరే రాష్ట్రం నించీ వచ్చి పదేళ్ళయినా, వాళ్ళ స్వతంత్ర ప్రతిపత్తి వాళ్ళు పోగొట్టుకోనక్కరలేదు కదా? తరాలు గడిచే కొద్దీ వాళ్ళే ఇష్టపడి, అవసరాల కొద్దీ, లేదా ఇష్టం కొద్దీ స్వేచ్చగా నేర్చుకుంటే, అది వేరే సంగతి. ఇక 90% మనుషులకి మాత్రం ఈ నిబంధన ఎందుకు వుంచాలీ? అందులో కొంత మంచి త్వరలో వేరే రాష్ట్రాలకి పోవచ్చు. కొంత మంది వేరే దేశాలకి పోవచ్చు. అక్కడ వేరే బాషను ఎక్కువగా పట్టించుకోవలసి వుంటుంది కాబట్టి, వారు వేరేలాగా నిర్ణయించుకోవచ్చు. ఎవరి స్వేచ్చను బట్టీ వారు నిర్ణయించుకోవాలి. ఒక విషయంలో మంచి విషయాలను ప్రచారం చెయ్యడం, అవి విడమరిచి అవతలవారికి చెబుతూ వారిని ఎడ్యుకేట్ చెయ్యడం మాత్రమే కరెక్టు పద్ధతి. పబ్లిక్ పరీక్షల్లో ఎక్కువ మార్కులు రావని చాలా మంది తెలుగు వారు హిందీనో, సంస్కృతాన్నో తీసుకునే రోజులు ఇవి. భాష విషయంలో నిర్భంధమే పెద్ద తప్పు.
ఎవరైనా ఆంగ్లం నేర్చుకుంటే, అది తెలుగును నిరసించినట్టు ఎందుకవుతుందీ?
తమిలనాడులో, ముఖ్యంగా మద్రాసులో, తమిళాన్ని 1982-91 వరకూ అన్ని స్కూళ్ళలోనూ రుద్దలేదు. మా కజిన్ అక్కడే పుట్టి, బి.కాం వరకూ తెలుగు సెకండ్ లాంగ్వేజీగా, తమిళం లేకుండా, ఇంగ్లీషు మీడియంలో చదువుకున్నాడు. మిగిలిన వూళ్ళ సంగతి నాకు తెలియదు. నేనొక వుదాహరణ చెప్పానే గానీ, దాంతో మొత్తం తమిళనడుని జనరలైజ్ చెయ్యలేదు. ఒకవేళ తమిళనాడులో తమిళం రుద్దుతూ వుంటే, వాళ్ళకీ ఈ విమర్శలు వర్తిస్తాయి. హిందీ రుద్దినపుడు వాళ్ళు ఎంత గొడవ చేశారో అందరికీ గుర్తే కదా? 1967 సంవత్సరాలలో హిందీ రుద్దడాన్ని వ్యతిరేకించడంలో ఆంధ్రప్రదేశ్ విఫలమయినా, తమిళనాడు సఫలమయింది కదా? రుద్దడం ఎప్పుడూ తప్పే ఇలాంటి విషయాల్లో.
తెలుగు మాట్టాడ్డం చిన్నతనం అనుకునే తెలుగువారి గురించి అస్సలు మాట్టాడ్డమే లేదు ఇక్కడ, అటువంటి వారి మీద ఎన్ని విమర్శలున్నా. మాతృభాషకి ఎవరూ వ్యతిరేకం కాకూడదు అనేదే నా భావం కూడా. ఎటొచ్చీ వాళ్ళని ఎడ్యుకేట్ చెయ్యడం ఒక్కటే కరెక్టు పద్ధతి. అది తప్ప ఏదైనా తప్పు పద్ధతిగానే వుంటుంది. నియంత్రత్వం ఎప్పుడూ మంచిది కాదు.
ప్రసాద్
(This message has been edited. — editors)
నామాట: తెలుగు అంతర్జాతీయ భాషగా…! (నిజంగానా?) గురించి J K Mohana Rao గారి అభిప్రాయం:
07/18/2007 11:38 am
తెలుగుదేశములో తెలుగు మాతృభాషగా ఉన్నవారు సుమారు
90% ఐనా ఉంటారు. ఇతర భాషలు మాతృభాషగా గలవారు,
కేంద్ర ప్రభుత్వములో ఉద్యోగము చేసేవాళ్ళు, ఇతర రాష్ట్రాల
నుండి వచ్చినావాళ్ళు 10% ఉంటారేమో. ఈ 90% తెలుగు
వాళ్ళకు తెలుగును తప్పని సరిగా బోధించడములో తప్పేమి
లేదు గదా! వాళ్ళు ఆంగ్లము నేర్చుకోనీ, కాని తెలుగును
ఎందుకు నిరసన చెయ్యాలి? ఇక తమిళనాడులో తమిళమును
రుద్దలేదనుట అతశయోక్తి అవుతుంది. మదరాసు మాత్రమే
కాదు, హొసూరు, సేలం, ఉత్తర ఆర్కాడు, మదురై,
కోయముత్తూరు జిల్లాలలో తెలుగు మాటలాడేవారు చాల
మంది ఉన్నారు. ఎక్కడో తప్ప వారికి తెలుగు బడులు లేవు, ఇతర
భాషల బడులు లేవు, ఒక్క తమిళము తప్ప. మదరాసులోనే
50లలో స్థితికి, ఇప్పటి స్థితికి ఎంతో తేడా ఉంది. అప్పుడులా
ఇప్పుడు తెలుగు తమ మాతృభాష అని జనాలు ప్రకటించుకొనుట
అరుదే! – మోహన
నామాట: తెలుగు అంతర్జాతీయ భాషగా…! (నిజంగానా?) గురించి జె.యు.బి.వి.ప్రసాద్ గారి అభిప్రాయం:
07/18/2007 9:32 am
ఇండియాలో ఇంచుమించు ప్రతీ రాష్ట్రానికీ ఒక సొంత భాష వుంది. ఆ రాష్ట్రం ఆ సొంత భాషని తమ అధికార భాషగా చేసుకోవడం కరక్టైన విషయమే. ఎటొచ్చీ పలు రాష్ట్రాలు అనేక విషయాలలో కలిసి వుంటాయి కాబట్టి, అన్ని రాష్ట్రాల మధ్య ఒక లింకు భాష కూడా వుంటుంది. ఒక రాష్ట్ర ప్రజలు ఇంకో రాష్ట్రంలోకి వెళ్ళినపుడు, లింకు భాషలో మేనేజ్ చేస్తారు. తర్వాత కాలంలో రాష్ట్ర భాషని నేర్చుకుంటారా, లేదా అనేది వారి అవసరాల మీద ఆధారపడి వుంటుంది.
పైన చెప్పిన విధంగా ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు అధికార భాషగా వుండటంలో తప్పేమీ లేదు. ప్రతీ స్కూల్లోనూ తెలుగు నేర్పడం, తెలుగులో ప్రాధమిక విద్యా బోధన చెయ్యడం చాలా మంచి పనులే. ఆంధ్రప్రదేశ్‌లో ఒక లింకు భాష కూడా వుండాలి, మిగిలిన రాష్ట్రాలతోటీ, మిగిలిన ప్రపంచంతోటీ సంబంధాలలో వుండటానికి.
ఇదంతా బాగుంది. అభ్యంతరం అల్లా స్కూల్లో తెలుగుని అందరూ నేర్చుకుని తీరాలన్న జీ.వో నిబంధన. ఏ విషయాన్నీ ఎవరి మీదా రుద్దకూడదు. దాని అవసరాన్నీ, దాని లోని మంచినీ వివరించి మనుషులని ఎడ్యుకేట్ చెయ్యాలి. దాని ద్వారా ప్రజలు ఆ భాష నేర్చుకోవడానికి ఇష్టపడాలి.
తమిళనాడులో తమిళ భాషాభివృద్ధి ఎంతగానో జరిగిందంటారు కదా? మేము మద్రాసులో వుండే రోజుల్లో తమిళం మా పిల్లల మీద రుద్దుతారేమోనని భయపడ్డాము. కానీ అలా అప్పుడు జరగలేదు. మేము పిల్లల్ని చేర్చిన స్కూల్లో తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఒక భాష సెలక్టు చేసుకోమన్నారు. అలా తమిళం రుద్దక పోవడం బాగుంది. మిగిలిన రాష్ట్రం అంతా తమిళ బోర్డులూ, తమిళ పోస్టర్లూ, గట్రా చాలా వున్నాయి. అవి చదువుకోవాలంటే తమిళం తప్పని సరి అని గ్రహించి, తమిళం చదవడం కొంచెం నేర్చుకున్నాను. టీవీ అవసరాన్ని గానీ, సినిమాల అవసరాలని గానీ వేరేగా చెప్పక్కరలేదు.
మనిషి తనుండే పరిసరాలను బట్టీ, అందులోని అవసరాలను బట్టీ ఒక భాష నేర్చుకునే పద్ధతి వుండాలి. మనుషులకి తమకి ఏం కావాలో తాము తెలుసుకునే స్వేచ్చ వుండాలి, అది ఎంత తప్పుగా వున్నప్పటికీ. ఎడ్యుకేషన్‌తో మాత్రమే మనుషులని చైతన్యం చేయాలి. బలవంతంతో కాదు. నేను చెప్పే ఈ స్వేచ్చ ప్రతీ విషయానికీ వర్తించదు. భాషకి మాత్రం తప్పకుండా వర్తిస్తుంది.
రాష్ట్ర అధికార భాషగా తెలుగుని అమలుపరచడం పట్ల నాకు వ్యతిరేకత లేదు. దాన్ని సమర్ధిస్తాను కూడా. అది స్కూల్లో ప్రతీ ఒక్కరూ నేర్చుకుని తీరాలన్న జీవో నిబంధన పట్ల మాత్రమే నా వ్యతిరేకత. ట్రాన్సఫర్ల మీద తలో రాష్ట్రం తిరిగే పిల్లలు, రెండేళ్ళకో భాష నేర్చుకోవాలనడంలో అర్థం లేదు. అందుకని స్కూల్లో కూడా తెలుగు గానీ, దాని బదులుగా వేరే భాష గానీ నేర్చుకునే పరిస్థితి వుండాలి. బలవంతంగా రుద్ది మనుషులకి వుండే స్వేచ్చని హరించకూడదు. ఇదీ నా పాయింటు.
ప్రసాద్
నామాట: తెలుగు అంతర్జాతీయ భాషగా…! (నిజంగానా?) గురించి Kameswara Rao గారి అభిప్రాయం:
07/18/2007 7:24 am
తెలుగు భాషని తెలుగువాళ్ళ మీద ఎందుకు రుద్దాలి (ప్రభుత్వం ప్రజలమీద కాని, బడులు బడి పిల్లలపై కాని, తల్లిదంద్రులు పిల్లలపై కాని) అన్నది చాలా మౌలికమైన ప్రశ్నే (అయినా, చాలా దురదృష్టకరమైన ప్రశ్న)!.
ప్రభుత్వం అధికార భాషగా తెలుగుని సరిగా అమలు చెయ్యడం, ఆ భాషని ప్రజలపై రుద్దడం అవదు.
ఇంగ్లీషుని, అది చదువుకోలేని ప్రజలపై రుద్దకుండా ఉండడమౌతుంది. ఈ మధ్య ఈనాడులో ప్రచురితమైన ఈ వ్యాసం చదివితే అధికారభాషగా తెలుగుని ప్రభుత్వ కార్యాలయాల్లో అమలుపరిస్తే ప్రజలకి కలిగే వెసలుబాటు చక్కగా అర్థం అవుతుంది.
ఇక బడిలోనూ, ఇంటిలోనూ పిల్లలపై రుద్దడం విషయానికి వస్తే:
1. ప్రతి మనిషి తనకి ఇష్తమైన భాషని నేర్చుకోవచ్చనడం సబబుగానే తోస్తుంది. అయితే, సమాజంలో వ్యవహారానికి, ఇతర వ్యక్తులతో సంభాషించడానికి, ఒక సామాన్య భాష అవసరం ఉంది కదా. అది అందరికీ రావాల్సిన అవసరం కూడా ఉంది కదా. అది ఇంట్లో మాట్లాడుకునే భాషకి ఎంత దగ్గరైతే అంత సులువుగా నేర్చుకోవచ్చు. ఎంత ఎక్కువమందికి ఆ భాష ఇంటి భాష అయితే అంత సులువు. ఈ దృష్ట్యా మన రాష్ట్రంలో తెలుగు అందరూ నేర్చుకోవాలి అనుకోవడంలో తప్పేమీ లేదు.
2. పై కారణం కన్నా బలమైనది సాంస్కృతిక కారణం. ఇది ప్రవాసాంధ్రులకి కూడా వర్తించేది. ప్రాణులలోకెల్ల మనిషి పురోగమనానికి ప్రధానమైన కారణాలలో ఒకటి సమాజాలుగా ఏర్పడడం అన్న విషయం శాస్త్రీయమైనది. సమాజాలు ఏర్పడడానికీ, నిలబడడానికీ సంస్కృతి ఒక ప్రధాన సాధనం. భాష సంస్కృతిలో భాగం. అయితే ప్రస్తుత సామాజిక, ఆర్థిక పరిస్థితులలో సంస్కృతిని నిలబెట్టుకోవడం ఎంతవరకూ అవసరం అన్న విషయం శాస్త్రీయంగా ఎవరైనా పరిశోధించారో లేదో నాకు తెలియదు. దాని అవసరం ఇంకా ఉన్నది అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఈ దృష్టితో చూసినా తెలుగు భాషని కాపాడుకోవడం అవసరం.
ఇక, రాజకీయ నాయకులపై మనమందరం చాలా తేలికగా, హాయిగా తప్పు(ల)ను నెట్టేస్తాం.
నిజమే, రాజకీయనాయకులు స్వార్థపరులే (ఏం మనం కామా?)! వాళ్ళకి ఓట్లువేసే జనాలకి తెలుగు భాషాభివృద్ధి ఒక ప్రధాన విషయం అయితే, వాళ్ళు దానిగురించి పట్టించుకోక ఏం చేస్తారు? ఓట్లు వేసే ప్రజలోఅత్యధిక శాతం సామాన్య ప్రజలు (చదువులేనివాళ్ళు, పేద వాళ్ళు). సహజంగా వాళ్ళకి భాషాభివృద్ధి ఒక ప్రధాన విషయం కాదు. కాబట్టి రాజకీయ నాయకులకి దానిగురించి పట్టదు.
అంచేత తెలుగు భాషాభివృద్ధి జరగాలంటే, అవసరమైనవి రెండు పనులు:
1. చదువుకున్నవాళ్ళు ముందు తెలుగు భాషాభివృద్ధి తాలూకు (శాస్త్రీయమైన) అవసరాన్ని గుర్తించి, దాన్ని తమ పరిధిలో అమలు పరచడం.
2. సామాన్య ప్రజకి దీని అవసరాన్ని తెలియజెప్పడం. సామాన్య ప్రజలకి తెలియాలంటే అది శాస్త్రీయ విధానంలో సాధ్యపడదు. ప్రజలలో భాష పట్ల (దుర)అభిమానం కలిగించడమొక్కటే సాధనం. దీనికి ఒక ఉద్యమం అవసరం.
తమిళభాషాభివృద్ధిలో ఈ పై విషయాల పాత్రని గుర్తించవచ్చు.
In this context, I have recently come across a link on “Orality to literacy: Transition in Early Tamil Society” by IRAVATHAM MAHADEVAN. It contains interesting points on Popular versus elitist literacy, comparing Tamil and Upper South India (Telugu and Kannada) in the ancient period.
Ra.Vi.Sastri’s ‘A Man of No Consequence’ (alpajIvi) గురించి Dr. V. Rajasekhar గారి అభిప్రాయం:
07/18/2007 3:40 am
I find Dr. Rajeshwar’s analysis of Alpajeevi very interesting and enlightening. This article is perhaps the best in the entire Ra.Vi.Sastri critical corpus, among other things because of the detached perspective from which the novel has been studied.
Writers don’t always have to offer fictional ‘chicken soup’ to the troubled ‘souls.’ Being intellectuals who can see things which others can’t and professing a certain sense of social responsibility, they constitute the consciousness of society and constantly strive to improve it by fixing their creative focus on its dark spots. In the process they help the prevalence of a more equitable and egalitarian social order. Ra.Vi.Sastri wrote the way he did and shaped the ‘hero’ of Alpajeevi the way he did entirely because, as a writer, he was keenly aware of his responsibility to society. He was disenchanted with his character perhaps because he was annoyed with Subbaiah’s ready acquiesce to the cultural mores which sought to isolate and harass him, instead of fighting back.
Ra.Vi.Sastri can’t be faulted for being a critical insider and an eloquent commentator on issues affecting the society. A society which can’t criticize itself, through its writers and other spokespersons, and continually evolve into something better than it is at the moment, will cease to be dynamic, and worse still, it may even essentialize itself… Ra.Vi.Sastri did his bit to prevent this possibility for the Telugu society.
రెండు మౌనాల మధ్య గురించి రాకేశ్వర గారి అభిప్రాయం:
07/17/2007 10:46 pm
అందరూ ఆడవారే వ్యాఖ్యానింస్తున్నారు, కాబట్టి మగవానిగా నేను ఒక వ్యాఖ్య రాద్దామని..
బాగుంది బాగుంది.
ఆ రోజులు గురించి C.S.Rao గారి అభిప్రాయం:
07/17/2007 7:32 pm
రఘోత్తమరావు గారూ,
కవితలో రవంత సంస్కృతం ఉన్నా ఇష్టపడని మీరు,మీరు వ్రాసిన మొదటి అభిప్రాయం లో “శ్రద్ధ” బదులు”పట్టించుకోవలసింది ” అనవచ్చుగా?మీ రెండవ అభిప్రాయం లో”బాదరాయణ సంబంధం” బదులు “ఈ రెంటికీ పోలికేమిటి” అనవచ్చుగా?
తెలుగు, సంస్కృతం అందంగా పెనవేసికొని పోతే ,తెలుగు భాషలోని సరళమైన సంస్కృత పదాలని అంటరాని పదాలు గా చూడాలా?
“ప్రాతఃకాలం” బదులు”తొలి పొద్దు” ,”కపోలాలు” బదులు “చెక్కిళ్ళు” అన్నప్పుడు మరొకరు “తెల్లారగట్ల” ,”చెంపలు” అనవచ్చుగా అని
అడగవచ్చునేమో?
నేనుదహరించిన కవితలలో కూడా ఇలానే ‘దైనందిన” బదులు “రోజువారీ””కోలాహలం” బదులు “సందడి” వగైరా అనవచ్చుగా?
తన ఊహకు తగినట్ట్లుగా ఏ పదం వాడి ఎంత సౌందర్యం సాధించగలడో ,తన కవితావేశం పాఠకులకి అందించగలడో , కవిత వ్రాసే వ్యక్తి నిర్ణయించుకుంటాడు.
పాఠకమహాశయులు తర్కించుకుంటారు,ఆస్వాదిస్తారు.
పోతే,మాటలకు కొత్తదనం ఏముంటుంది?అవి అనాదిగా వస్తున్నవే.మాటల కూర్పులో ,లయబధ్ధమైన నడక లో,అవగాహనా మాధ్యమాలను వాడటం లో సొగసు,కొత్తదనం ఆవిర్భవిస్తవి.
Middleton Murry గారి “Mode of Apprehension” కి “అవగాహనా మాధ్యమం” నా అనువాదం.ఇది”metaphor” కి ఆ గొప్పసాహితీ విమర్శకుని
నిర్వచనం.
ఆ రోజులు గురించి C.S.Rao గారి అభిప్రాయం:
07/17/2007 6:20 pm
రవికిరణ్ గారూ,మీ అభిప్రాయం ద్వారా నాకు ఎన్నో సంవత్సరాలుగా సంబంధం ఉన్న ప్రాంతాల్ని ,వాటి ప్రకృతి సౌందర్యాన్ని,గలగల పారే పంట కాలువల్ని,సోయగంగా ఊగే వరి పొలాల్ని,చల్లగా వీచే గాలుల్ని మనసు ఆర్ద్రమయ్యేలా గుర్తు చేసారు.Thanks.
మరేం లేదు,నా పేరు C.S.Rao
నామాట: తెలుగు అంతర్జాతీయ భాషగా…! (నిజంగానా?) గురించి raavi subbaa rao గారి అభిప్రాయం:
07/17/2007 1:42 pm
నేనూ, జె యు బి వి ప్రసాద్ గారితో ఏకీభవిస్తాను. వేలూరి గారి వ్యాసం ఏమీ కొత్తగా చెప్పలేదు. ప్రసాద్ గారన్నట్లు కొంతమంది ఏం రాసినా మెచ్చుకుంటారు. మరికొంత మంది మారుపేర్లతో తమకు నచ్చినవి కక్కుతారు. వస్తువునీ, వ్య క్తులనీ వేరు వేరుగా చూడలేని కుహనా మనుష్యులకి ఒక్క తెలుగు భాషేం కర్మ, యావత్ ప్రపంచం తప్పుగానే అనిపిస్తుంది. తెలుగు భాష ఎందుకు నేర్చుకోవాలి? మన పిల్లల బొడ్డూడని వయసులో, వాళ్ళ్ ముందు పప్రంచం్ లో ఉన్న భాషలన్నీ ఉంచుదాం. వాళ్ళకి ఏ భాష నచ్చితే అది నేర్చుకుంటారు. ఈ ఐడియా బాగుంది.
– రావి సుబ్బారావు