Comment navigation


15547

« 1 ... 1462 1463 1464 1465 1466 ... 1555 »

  1. వాన-పాట గురించి Sai Brahmanandam Gorti గారి అభిప్రాయం:

    09/04/2007 12:35 pm

    కవితా వర్షం వెలిసినా
    పాట తడి ఇంకా అంటిపెట్టుకునే ఉంది.

  2. సాయము శాయరా డింభకా! గురించి riveiv గారి అభిప్రాయం:

    09/04/2007 12:31 pm

    చేసిన సాయం తిరిగి అటువైపుగారాదు
    ఏదో వైపునుంచి వస్తుంది
    సాయం చేయటమే మన ధర్మం
    మనకు అక్కరకు రావటమా? మన కర్మం

  3. సాయము శాయరా డింభకా! గురించి lalitha గారి అభిప్రాయం:

    09/04/2007 11:54 am

    రానారె,

    ఎవరు అక్కరకు వస్తారు అన్నది అనుభవం ద్వారానే తెలుస్తుంది అనే కదా కథ చెప్తున్నది. లేదా నాకు అలా అర్థం అయ్యింది.

    నలుగురితో కలుస్తూ ఉంటాం. కొందరితో అభిప్రాయాలు కలుస్తాయి, కొందరితో అలవాట్లు కలుస్తుంటాయి, కొందరితో అవసరాలు తీరుతాయి, కొందరి అవసరాలకి మనం ఉపయోగపడుతాం. తెలుసుకున్న కొద్దీ సరిపడే వారితో సాన్నిహిత్యం పెరుగుతుంది. అందులో భాగంగా కొన్ని సార్లు భంగ పడాల్సీ వస్తుంది. ఆ మాత్రం కోల్పోకుండా సరి పడే సంబంధాలు ఏర్పడడం కష్టం.

    ఇది రాస్తూ ఉండగానే తెరెసా గారి వ్యాఖ్య చూసాను. ఆమె చెప్పిందీ నిజమే అనిపించింది. వారు courtesy చూపిస్తూ ఉండవచ్చు. అంత మాత్రాన ఆత్మీయత అనుకుని వారి మీదా ఆశలు పెంచేసుకుని ఇంకో రోజు ఇంకోలా అనుకోనక్కరలేదు.

  4. సాయము శాయరా డింభకా! గురించి teresa గారి అభిప్రాయం:

    09/04/2007 11:31 am

    హార్లీ, అండ్రియా నవీన్ ని “మనోడు” అని ఎప్పటికీ అనుకోపోవచ్చు. They were simply returning a favor .

    మనోడు సతీషుకి ఆ మాత్రం courtesy తెలీకపోయింది. ఈ ‘మనోళ్ళు’ వాళ్ళ అక్కరకేగానీ మన అవసరమప్పుడు కాదు!

  5. నాకు నచ్చిన పద్యం: మనుచరిత్రలో సాయంకాల వర్ణన గురించి J K Mohana Rao గారి అభిప్రాయం:

    09/04/2007 10:54 am

    వ్యాసం బాగుంది. ఇట్టి పద్యాలు నెమరువేయడము ఎంతో మంచిది.
    రచయితకు ధన్యవాదాలు.

    మనుచరిత్రనుండి ప్రబంధాలు ఎక్కువగా వ్రాయబడినా అదియే
    మొదటి ప్రబంధము, అంతకు పూర్వము తెలుగులో
    అంత ఖచ్చితమైన ప్రమాణాలతో వ్రాయబడిన కావ్యము లేదని
    చెప్పడానికి వీలులేదు. ఎఱ్ఱాప్రెగడకుగల బిరుదులలో ఒకటి
    ప్రబంధపరమేశ్వరుడని. ఇక పోతే అంతకు ముందే నన్నెచోడుడు
    కుమారసంభవము అనే కావ్యమును వ్రాసినాడు. దీనిని తెలుగులో
    మొట్టమొదటి ప్రబంధముగా భావిస్తారు. ఇందులో ఒక క్రొత్త కథతో
    బాటు కావ్యమునకుండవలసిన వర్ణనలు ఇత్యాదులు కూడ ఉన్నాయి. నన్నెచోడుడు నన్నయ తిక్కనల కాలమునకు
    మధ్యలో ఉన్నాడని చరిత్రకారుల భావన, అంటే పెద్దనకన్న
    సుమారు మూడు నాలుగు శతాబ్దులకుపై ముందు వాడన్నమాట.

    – మోహన

  6. ఒంటరి విహంగం గురించి teresa గారి అభిప్రాయం:

    09/04/2007 10:53 am

    ఇతివృత్తం మంచిదెన్నుకున్నారు. రచనాశైలి కూడ బాగుంది గానీ కథ నిడివి కొంత తగ్గింఛి మూడు పెజీల్లో ముగించి ఉండొచ్చునన్పించింది.

  7. సాయము శాయరా డింభకా! గురించి రానారె గారి అభిప్రాయం:

    09/04/2007 10:42 am

    అంతేమరి! మనకు అక్కరకొచ్చినోడే మనోడు. మనోడెవరో గుర్తించి వాని అక్కరకు మనం పోవడమే సమస్య. ఆ గుర్తించడం ఎలాగో మరి!?

  8. కన్యాశుల్కం మళ్ళీ ఎందుకు చదవాలంటే … గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    09/04/2007 10:30 am

    కన్యాశుల్కం గురించి ఎందరో ఎన్నో రకాల విశ్లేషణలు చేశారు, చేస్తున్నారు. రచయితగా, నాటకకర్తగా ఎంతో ప్రతిభావంతుడైన అప్పారావుగారు ఈ నాటకం చదువుతున్నప్పుడు మనకు సంఘసంస్కర్త రూపంలో కాక తీవ్రమైన విమర్శకుడుగానూ, వ్యాఖ్యాతగానూ కనిపిస్తాడు. ఆయన విమర్శించిన విషయాల్లో సంఘ దురాచారాలూ ఉన్నాయి; సంఘసంస్కర్తలుగా చలామణీ అవుతూ పబ్బం గడుపుకునే దగాకోర్ల వ్యవహారాలూ ఉన్నాయి.

    ఈ రోజుల్లో అనాథాశ్రమాలు నిర్మించి డబ్బులు దండుకునేవాళ్ళున్నట్టే ఆ రోజుల్లోనే వీరేశలింగంగారు సదుద్దేశంతో తలపెట్టిన మంచి పనులను దుర్వినియోగం చేసుకునేవారూ ఉండేవారనే సంగతి ఈ నాటకంవల్ల మనకు తెలుస్తుంది. ఎటొచ్చీ ఇటువంటి ఆషాఢభూతుల వల్ల కలిగే హానికన్నా సంఘంలో ప్రవర్తిల్లుతూ ఉండిన దురాచారాలు ఎక్కువ ప్రమాదకరం కనకనే కన్యాశుల్కం నాటకాన్ని వాటిని ఎత్తిచూపినదిగా అందరూ గుర్తించారు.

    నాటకమంతా డామినేట్ చేసిన గిరీశం కుయుక్తులను ఎవరూ మిస్ అవరు. సంఘసేవను తప్పుదోవ పట్టించ ప్రయత్నించినవాడుగా అతను కనబడుతూనే ఉంటాడు. అయితే అతని వ్యక్తిగత దోషాలూ, బలహీనతలూ సంఘ దురాచారాలంత తీవ్రమైనవిగా అనిపించవు. అందుకే మనం అగ్నిహోత్రావధానులు, లుబ్ధావుధాన్లు, రామప్ప పంతులు తదితరుల వైఖరిని ఎంతో గర్హనీయంగా పరిగణిస్తాం. గిరీశాన్ని చూసినప్పుడు మాత్రం ‘బాగా అయింది శాస్తి’ అని నవ్వుకుంటాం. పై వర్గంతో పోలిస్తే గిరీశం అంతటి దుర్మార్గుడుగా మనకు అనిపించడు. పైగా నాటకంలో గిరీశం ఒక్కడే ఆధునికుడు. అయితే ఆధునికతలోని ఇతర లక్షణాలతో బాటు దాని అవలక్షణాలూ అతనిలో ఉంటాయి. పాతుకుపోయిన దురాచారాలకు ప్రతీకలు వారైతే వారి అవివేకాన్ని ఆసరాగా చేసుకుని లాభం పొందేవారికి ప్రతీక గిరీశం.

    మొత్తం మీద అన్నీ వాస్తవికత ఉట్టిపడే పాత్రలే. సజీవమైనవే. అందుకే కన్యాశుల్కం అందరికీ ప్రీతిపాత్రమైంది. మార్క్సిస్టులు కనాశుల్కాన్ని హైజాక్ చేశారని నేననుకోను. (వారికి నచ్చింది కదా అని దాన్ని మరికాస్త అనుమానంతో చూడాలనీ అనుకోను). ఎవరికి నచ్చిన అంశాలను వారు మెచ్చుకుంటారు. ఈ నాటకానికి వీరాభిమానుల్లో శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, భమిడిపాటి కామేశ్వరరావు వంటి ఉద్దండులుండేవారు. మనకన్నా అప్పటి పరిస్థితులు వారి తరంవారికి మరింత బాగా తెలుసు. తక్కినవన్నీ పక్కన పెట్టినా కేవలం భాష, యాసల విషయంలో కూడా చాలామందికి అదెంతో ఆహ్లాదకరమైన రచన.

    అప్పటి సామాజిక సమస్యలు ఈనాడు లేకపోవచ్చు. ఇప్పటికీ మనలో ఎందరిలో అగ్నిహోత్రావధానులు, లుబ్ధావుధాన్లు, రామప్ప పంతుళ్ళు, లేదా వారి లక్షణాలు, కనబడుతున్నాయనేదే ముఖ్యం. అందువల్లనే ఈనాటికీ కన్యాశుల్కం రెలెవెంట్ గా అనిపిస్తుంది.

  9. నాకు నచ్చిన పద్యం: తిక్కన భారతంలో ద్రౌపది కోపవర్ణన గురించి రానారె గారి అభిప్రాయం:

    09/04/2007 10:21 am

    ఈ పద్యము, మీ వ్యాఖ్యానమూ చదివి చాలా ఆనందం కలిగింది. ఏదైనా రాస్తే దానిచుట్టూ ఎన్నివిషయాలను పరిగణలోకి తీసుకోవాలో ఈ ఉదాహరణ మరొక్కసారి గుర్తుచేసింది. ధన్యవాదాలు.

  10. రచయితగా సత్యజిత్ రాయ్ – నా అభిప్రాయాలు గురించి Aruna Gosukonda గారి అభిప్రాయం:

    09/04/2007 7:58 am

    చాలా బాగుంది.

« 1 ... 1462 1463 1464 1465 1466 ... 1555 »